
వైద్య కళాశాల పనులు పూర్తి చేయాలి
● ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు ● కలెక్టర్‌తో కలిసి పనుల పర్యవేక్షణ
మంచిర్యాలరూరల్(హాజీపూర్): వచ్చే వైద్య విద్యా సంవత్సరం ప్రారంభంలోగా నిర్మాణ పనులు పూర్తి చేసి ప్రభుత్వ వైద్య కళాశాల తరగతులు ఇక్కడే ప్రారంభమయ్యేలా చూడాలని మంచిర్యాల ఎమ్మె ల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు ఆదేశించారు. శని వారం జిల్లా కలెక్టర్ కుమార్‌దీపక్‌తో కలిసి హాజీ పూర్ మండలం గుడిపేటలో ప్రభుత్వ వైద్య కళాశా ల నిర్మాణ పనులను పర్యవేక్షించారు. రూ.216 కో ట్లతో నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లా ప్రజల కు మెరుగైన వైద్య సేవలు అందించడంతోపాటు వై ద్యులు, సిబ్బంది సంఖ్యను పెంచేలా ప్రత్యేక చ ర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. హాస్టల్ భవనా నికి వేసిన గులాబీ రంగు తొలగించాలని ఆర్‌అండ్ బీ అధికారులకు సూచించారు. రోడ్లు, భవనాల శా ఖ డీఈఈ సజ్జత్‌భాషా, ఏఈఈ అనూష, కళాశాల ప్రాజెక్ట్ జనరల్ మేనేజర్ సంపూర్ణరావు, ఇంజనీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు.
పనుల పరిశీలన
లక్సెట్టిపేట: మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ సివిల్ ఆసుప్రతి, జూనియర్ కళాశాల భవనం నిర్మాణ ప నులను ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు, కలెక్టర్ కుమా ర్ దీపక్ శనివారం పరిశీలించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ నాణ్యతతో పనులు చేపట్టాలని తెలిపారు.