‘క్షయ’ నిర్మూలన సామాజిక బాధ్యత | Sakshi
Sakshi News home page

‘క్షయ’ నిర్మూలన సామాజిక బాధ్యత

Published Mon, Mar 25 2024 1:05 AM

మాట్లాడుతున్న డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ వై. ప్రవీణ్‌కుమార్‌  - Sakshi

కర్నూలు(హాస్పిటల్‌): క్షయ వ్యాధి నిర్మూలనను సామాజిక బాధ్యతగా తీసుకోవాలని డీఎంహెచ్‌వో డాక్టర్‌ వై. ప్రవీణ్‌కుమార్‌ పిలుపునిచ్చారు. ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినాన్ని పురస్కరించుకుని ఆదివారం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని క్లినికల్‌ లెక్చర్‌ గ్యాలరీలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్షయ వ్యాధి నిర్మూలనకు అధికారులు స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యం తీసుకోవాలన్నారు. జిల్లా క్షయ నియంత్రణాధికారి డాక్టర్‌ ఎల్‌. భాస్కర్‌ మాట్లాడుతూ క్షయ రోగులకు ఆరు నెలలకు సరిపడే ఖరీదైన మందులు ప్రభుత్వం ఉచితంగా ఇస్తోందన్నారు. డాక్టర్‌ విజయానందబాబు, డాక్టర్‌ శైలజ మాట్లాడారు. ఇటీవల వ్యాసరచన, క్విజ్‌ పోటీల్లో విజేతలైన వైద్య విద్యార్థులకు బహుమతులు, ఆలూరు, ఆదోని, కౌతాళం, కోసిగి, ఎమ్మిగనూరు మెడికల్‌ ఆఫీసర్లు, సూపరింటెండెంట్లు, ల్యాబ్‌టెక్నీషియన్లకు జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో ప్రాంతీయ ప్రభుత్వ కంటి ఆసుపత్రి డాక్టర్‌ పృథ్వీ వెంకటేశ్వర్లు, డీఎంఎంవో డాక్టర్‌ ఉమ, జనరల్‌ మెడిసిన్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ మహేశ్వరరెడ్డి, టీబీసీడీ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ మల్లికార్జునరెడ్డి, అశ్విని హాస్పిటల్‌ అధినేత డాక్టర్‌ శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement