రెండు రోజుల్లో తాగునీరు సరఫరా చేయాలి | Sakshi
Sakshi News home page

రెండు రోజుల్లో తాగునీరు సరఫరా చేయాలి

Published Fri, Mar 29 2024 1:35 AM

మిషన్‌ భగీరథ అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ వెంకటేశ్‌ దోత్రే - Sakshi

● కలెక్టర్‌ వెంకటేశ్‌ దోత్రే ● ‘తాగునీటి కష్టాలు’ కథనానికి స్పందన ● ఎనోలి కొలాంగూడ గ్రామంలో నీటి సమస్యపై ఆరా

వాంకిడి(ఆసిఫాబాద్‌): ఎనోలి కొ లాంగూడలో తాగునీటి సమస్య ను రెండు రోజుల్లో పరిష్కరించి భగీరథ నీటిని సరఫరా చేయాలని కలెక్టర్‌ వెంకటేశ్‌ దోత్రే ఆదేశించారు. ఈ నెల 17న సాక్షి దినపత్రికలో ‘తాగునీటి కష్టాలు’ అనే శీర్షికతో ప్రచురితమైన కథనానికి కలెక్టర్‌ స్పందించి గురువారం అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారితో కలిసి గ్రామంలో పర్యటించారు. మిషన్‌ భగీరథ ట్యాంకు నిర్మించి నాలుగేళ్లవుతున్నా నీటి సరఫరా ఎందుకు ప్రారంభించలేదని అధికారులను ప్రశ్నించారు. లీకేజీలు గుర్తించి మరమ్మతులు చేపట్టాలని, స్థానికంగా నీటి సంపు ఏర్పా టు చేయాలని ఆదేశించారు. అనంతరం స్థానిక ప్ర భుత్వ పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు పలు సమస్యలను కలెక్టర్‌ దృష్టికి తీ సుకెళ్లారు. తమ గ్రామానికి అధికారులెవరూ రార ని, అరకొర వసతులతో కాలం వెల్లదీస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్‌ బెండా ర, వాంకిడి జీపీల్లో చేపడుతున్న ఉపాధిహామీ పనులను అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి, డీఆర్డీవో సురేందర్‌తో కలిసి తనిఖీ చేశారు. పోస్టర్‌ సిబ్బంది అకౌంట్లలో డబ్బులు ఉన్నా ఇవ్వడం లేదని, లాక్‌పడిన ఖాతాలను అన్‌లాక్‌ చేయడం లేదని కూలీలు ఆరో పించారు. సమస్యలు పరిష్కరిస్తామని కలెక్టర్‌ వారి కి హామీ ఇచ్చారు. మిషన్‌ భగీరథ ఈఈ వెంకట పతి, తహసీల్దార్‌ రోహిత్‌, ఎంపీవో ఖాజా అజీజు ద్దిన్‌, ఏపీవో శ్రావణ్‌కుమార్‌ తదితరులు ఉన్నారు.

తాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాలి

ఆసిఫాబాద్‌అర్బన్‌: వేసవిలో తాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాలని కలెక్టర్‌ వెంకటేశ్‌ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలో గురువారం అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి, డీపీవో భిక్షపతిగౌడ్‌తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. చేతిపంపులు, పంపు సెంట్లు, మిషన్‌ భగీరథ పైపులకు మరమ్మతులు చేపట్టి.. అన్ని నివాస ప్రాంతాలకు తాగునీటి సరఫరా చేయాలన్నారు. నీటి ఎద్దడి ఉన్నచోట పంచాయతీ ట్యాంకర్లతో నీటిని సరఫరా చేయాలని సూచించారు. అలాగే ఈ నెల 31లోగా వందశాతం ఇంటి పన్నులు వసూలు చేయాలని ఆదేశించారు. ఉపాధి హామీ కూలీలకు వందరోజుల పని దినాలు కల్పించాలన్నారు.

ఎఫెక్ట్‌

1/1

Advertisement
Advertisement