చేయి విరిగినా.. ‘పది’ పరీక్షకు హాజరు | Sakshi
Sakshi News home page

చేయి విరిగినా.. ‘పది’ పరీక్షకు హాజరు

Published Fri, Mar 29 2024 1:10 AM

మాక్‌డ్రిల్‌ నిర్వహిస్తున్న రెస్క్యూ టీం  - Sakshi

సిరిసిల్లఎడ్యుకేషన్‌: సిరిసిల్లలోని ఓ ప్రైవేటు పాఠశాలలో పదోతరగతి చదువుతున్న మహ్వీన్‌ నిసార్‌కు ప్రమాదవశాత్తు కుడి చేతు విరిగింది. స్థానిక కుసుమ రామయ్య జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలోని కేంద్రానికి పరీక్ష రాసేందుకు వచ్చింది. కుడి చేతు విరగడంతో సహాయకురాలిగా పరీక్షలు రాయడానికి తన కంటే కింద తరగతి విద్యార్థినితో వచ్చింది.

పాఠశాల కిటికీకి నిప్పంటించిన దుండగులు

కరీంనగర్‌రూరల్‌: దుర్శేడ్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల కిటికీకి గురువారం సాయంత్రం దుండగులు నిప్పటించడంతో పాక్షికంగా కాలిపోయింది. వారం రోజుల క్రితం స్కూల్లోని సీలింగ్‌ ఫ్యాన్లు, కరెంటు స్విచ్‌ బోర్డులు, డిజిటల్‌ బోర్డును కొందరు విద్యార్థులు ధ్వంసం చేశారన్న ఆరోపణలున్నాయి. ఈ పాఠశాలలో పదోతరగతి విద్యార్థులు వార్షిక పరీక్షలు రాస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోవడంతో ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. పదోతరగతి పరీక్ష కేంద్రానికి భద్రత కల్పించాలని కోరుతున్నారు.

దాడి కేసులో ఒకరికి జైలు

మంథని: మండలంలోని భట్టుపల్లికి చెందిన దూపం శ్రీనివాస్‌పై గొడ్డలితో దాడి చేసిన కేసులో అదే గ్రామానికి చెందిన గుండ్ల సదయ్యకు మంథని సీనియర్‌ సివిల్‌ జడ్జి భారతి జైలుశిక్ష, జరిమానా విధించారు. వివరాల్లోకి వెళ్తే.. 11.05.2023న శ్రీనివాస్‌పై సదయ్య గొడ్డలితో దాడి చేశాడు. ఈ ఘటనలో శ్రీనివాస్‌కు గాయాలయ్యాయి. చంపాలన్న ఉద్దేశంతోనే ఇలా చేశాడని బాధితుడి భార్య స్వప్న పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు కేసు నమోదు చేసి, దర్యాప్తు పూర్తి చేశారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన జడ్జి గురువారం సదయ్యకు మూడేళ్ల జైలుశిక్ష, రూ.3 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు.

ఆకట్టుకున్న మాక్‌డ్రిల్‌

ఫెర్టిలైజర్‌సిటీ(రామగుండం): రామగుండం ఫెర్టిలైజర్స్‌, కెమికల్స్‌ లిమిటెడ్‌తోపాటు ఐవోసీఎల్‌, ఇతర గ్యాస్‌ ఆధారిత పరిశ్రమలకు జీఎస్‌పీఎల్‌ ఇండియా ట్రాన్స్‌కో లిమిటెడ్‌, కుందనపల్లి నుంచి రామగుండం వరకు పైప్‌లైన్‌ ద్వారా గ్యాస్‌ సరఫరా చేస్తోంది. అయితే, గ్యాస్‌ సరఫరా సమయంలో లీకేజీ సమస్య ఏర్పడితే స్పందించడం, నియంత్రణ చర్యలు తీసుకోవడం తదితర చర్యలపై రెస్క్యూ సభ్యులు గురువారం ఎమర్జెన్సీ మాక్‌డ్రిల్‌ నిర్వహించారు. పైప్‌లైన్‌లో గ్యాస్‌ లీకేజీ, ఎగిసిన మంటలను అదుపు చేయడం, గాయాల పాలైన వారిని ఆస్పత్రికి తరలించడం తదితర విన్యాసాలు ఆకట్టుకున్నాయి. పెద్దపల్లి ఆర్డీవో గంగయ్య, రామగుండం కార్పొరేషన్‌ కమిషనర్‌ శ్రీకాంత్‌, గోదావరిఖని ఏసీపీ రమేశ్‌, జీఐటీఎల్‌ అధికారులు ఎంకే తుతేజ, రాగేశ్‌, నవీన్‌పటేల్‌, ఆనంద్‌, రుషబ్‌, రితుల్‌, ప్రసాద్‌, నితిన్‌, సమీర్‌ తపస్‌ పాల్గొన్నారు.

కాలిపోయిన కిటికీ
1/2

కాలిపోయిన కిటికీ

సహాయకురాలితో 
పరీక్ష రాసిన విద్యార్థిని
2/2

సహాయకురాలితో పరీక్ష రాసిన విద్యార్థిని

Advertisement
Advertisement