నేడు విద్యుత్‌ సరఫరాకు అంతరాయం | Sakshi
Sakshi News home page

నేడు విద్యుత్‌ సరఫరాకు అంతరాయం

Published Sat, Nov 11 2023 1:38 AM

- - Sakshi

భూపాలపల్లి రూరల్‌: భూపాలపల్లి, జంగేడులో 33/11 కేవీ సబ్‌స్టేషన్‌ మరమ్మతుల కారణంగా భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో నేడు (శనివారం) ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్‌ అంతరాయం కలుగుతుందని భూపాలపల్లి అసిస్టెంట్‌ ఇంజనీర్‌ కె.విశ్వాస్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యుత్‌ వినియోగదారులు సహకరించాలని కోరారు.

ఆర్చరీ విభాగంలో

అనయకు రజతం

కాటారం: కాటారం మండల కేంద్రానికి చెందిన రామిళ్ల రాజశేఖర్‌ కూతురు రామిళ్ల అనయ ఆర్చరీలో రజతం సాధించింది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన ఆల్‌ ఇండియా లెవల్‌ స్కూల్‌ చాంపియన్‌ షిప్‌ (ఎస్‌ఎఫ్‌ఏ) స్పోర్ట్స్‌ ఫర్‌ ఆల్‌ నిర్వహించిన అండర్‌–10 ఆర్చరీ విభాగంలో తెలంగాణ రాష్ట్రం నుంచి అనయ ప్రతిభ కనబర్చింది. కాంపౌండ్‌ విభాగంలో అనయ రజత పథకం పొందినట్లు కోచ్‌ శ్రీనివాస్‌ తెలిపారు. అనయ కరీంనగర్‌ పోలీస్‌ కమిషనరేట్‌ ఆధ్వర్యంలో శిక్షణ పొందుతుంది. అనయ రజతం సాధించడం పట్ల పలువురు హర్షం వ్యక్తంచేస్తూ అభినందనలు తెలిపారు.

ముగిసిన

కళా ఉత్సవ్‌ పోటీలు

విద్యారణ్యపురి: హనుమకొండలోని ప్రభుత్వ ప్రాక్టీసింగ్‌ పాఠశాలలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి కళాఉత్సవ్‌ పోటీలు శుక్రవారం ముగిశాయి. పది అంశాల్లో పోటీలు నిర్వహించగా.. 19 మంది విద్యార్థులను ఎంపిక చేశారు. శుక్రవారం సాయంత్రం ముగింపు సభలో జిల్లా క్వాలిటీ కో–ఆర్డినేటర్‌ ఎ.శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. విద్యార్థులు రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభ చాటాలని ఆకాంక్షించారు. సమావేశంలో సోషల్‌ ఫోరం జిల్లా కో–ఆర్డినేటర్‌ అలిగిరెడ్డి మధుసూధన్‌రెడ్డి, పీఎస్‌ హెచ్‌ఎం ఉప్పలయ్య, ఉన్నత పాఠశాల హెచ్‌ఎం జగన్‌, ఉపాధ్యాయులు సతీశ్‌ ప్రకాశ్‌, నవీన్‌కుమార్‌, అశోక్‌, వెంకటయ్య, రేవతి, జయ తదితరులు పాల్గొన్నారు. కాగా.. జిల్లా క్వాలిటీ కో–ఆర్డినేటర్‌ శ్రీనివాస్‌ తదితరులు విజేతలకు ప్రశంసపత్రాలు అందించారు.

సౌత్‌ జోన్‌ టోర్నమెంట్‌కు కేయూ జట్టు

కేయూ క్యాంపస్‌: తిరువనంతపురంలోని యూనివర్సిటీ ఆఫ్‌ కేరళలో ఈనెల 13 నుంచి 18 వరకు నిర్వహించనున్న సౌత్‌ జోన్‌ ఇంటర్‌ వర్సిటీ బాస్కెట్‌ బాల్‌ టోర్నమెంట్‌ పోటీలకు కేయూ బాస్కెట్‌బాల్‌ పురుషుల కేయూ జట్టును ఎంపిక చేసినట్లు స్పోర్ట్స్‌బోర్డ్‌ సెక్రటరీ ప్రొఫెసర్‌ శ్రీనివాస్‌రావు శుక్రవారం తెలిపారు. ఈజట్టులో యశ్వంత్‌ (విశ్వవిద్యాలయ వ్యాయామ కళాశాల), ఎం.తరుణ్‌, టి.కన్నారావు, ఎస్‌.సందీప్‌, కె.సాయితేజ (మహబూబాబాద్‌ ఎస్‌ఆర్‌ కళాశాల), ఎం.దిలీప్‌, టి.విశ్వనాఽథ్‌, (వరంగల్‌ ఎల్‌బీ కళాశాల), బి.నిషాల్‌ (ఖమ్మం కవితా డిగ్రీ కళాశాల), మహ్మద్‌ మొయినుద్దీన్‌ (హనుమకొండ వాగ్దేవి కళాశాల), షేక్‌ ముజమిల్‌ (హనుమకొండ కేడీసీ), జె.అభిషేక్‌ (వరంగల్‌ కిట్స్‌ కళాశాల) ఉన్నారు. ఈజట్టుకు బొల్లికుంట వాగ్దేవి ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ కాలేజీ ఫిజికల్‌ డైరెక్టర్‌ కె.దేవేందర్‌ మేనేజర్‌గా వ్యవహరిస్తారని శ్రీనివాస్‌రావు తెలిపారు.

1/1

Advertisement
Advertisement