బీజేపీ అభ్యర్థి కీర్తిరెడ్డి ఆస్తులివే.. | Sakshi
Sakshi News home page

బీజేపీ అభ్యర్థి కీర్తిరెడ్డి ఆస్తులివే..

Published Sat, Nov 11 2023 1:38 AM

-

భూపాలపల్లి అర్బన్‌: బీజేపీ భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చందుపట్ల కీర్తిరెడ్డి ఆస్తుల వివరాల ఆఫిడవిట్‌ను శుక్రవారం ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి అందజేశారు. కీర్తిరెడ్డి చేతిలో నగదు రూ.90,071వేలు, చరాస్తులు: 84 తులాల బంగారం (విలువ రూ.26,98,269), 12కేజీల వెండి, (విలువ రూ.5.08లక్షలు), బ్యాంకు నిల్వలు రూ.6,56,78,357, భర్త సత్యపాల్‌రెడ్డి వద్ద నగదు రూ.92,501, చరాస్తులు: 12తులాల బంగారం (విలువ రూ.5,83,600), ఇరువురి పేరున పరకాల, శాయంపేట, హనుమకొండ, సింగారం గ్రామాలతో పాటు రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాలో వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, నివాసగృహాలు ఉన్నాయి. వాటి విలువ కీర్తిరెడ్డి పేరున రూ.7,94,93,000, సత్యపాల్‌రెడ్డి పేరున రూ.5,30,06,000 ఉంటాయి. వివిధ బ్యాంకుల నుంచి కీర్తిరెడ్డి రూ.3,16,30,041, సత్యపాల్‌రెడ్డి రూ.12,15.18.654 రుణం తీసుకున్నారు.

Advertisement
Advertisement