Ukrain War Leads Some Countries Famine, Zelenskyy Calls Pope To Mediate: Conflict With Russia - Sakshi
Sakshi News home page

Ukrainian President Zelensky: యుద్ధం ఆపకుంటే ఉక్రెయిన్‌తో పాటు ఆ దేశాల్లో ఆకలి కేకలు తప్పవు!

Mar 22 2022 7:46 PM | Updated on Mar 23 2022 11:25 AM

Ukrain War Leads Some Countries Famine Zelenskyy Calls Pope To Mediate - Sakshi

రష్యా యుద్ధం ఒక ఉక్రెయిన్‌కే కాదు.. మరికొన్ని దేశాల్లో తీవ్ర ఆహార సంక్షోభానికి కారణం కావడం ఖాయంగా కనిపిస్తోంది.

ఉక్రెయిన్‌ ప్రపంచంలోనే అత్యధికంగా ఆహారోత్పత్తులను ఎగుమతి చేసే దేశం. అలాంటి దేశం యుద్ధంతో తల్లడిల్లుతోంది. రష్యా బలగాల దాడుల్లో పంట పండించడం కష్టతరంగా మారడమే కాదు.. ఇప్పటికే ఉన్న పంట నాశనం అయిపోయింది. ఇది ఇలాగే కొనసాగితే.. ఉక్రెయిన్‌తో పాటు కొన్ని దేశాల్లో ఆకలి కేకలను ప్రపంచం చూడాల్సి వస్తుంది. 

ఈ మాటలు అంటోంది ఎవరో కాదు.. ఉక్రెయిన్‌ అధ‍్యక్షుడు వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీ. ఒకవైపు రష్యాకు లొంగిపోయే ప్రసక్తే లేదంటున్న జెలెన్‌స్కీ.. ఏది ఏమైనా శాంతి చర్చల ద్వారానే సమస్య పరిష్కారం కావాలని, అందుకోసం ఎంత దూరమైనా వెళ్తానని అంటున్నాడు. ఉక్రెయిన్‌పై రష్యా బలగాల దాడులు 27వ రోజుకి చేరిన వేళ.. మంగళవారం ఇటాలియన్‌ పార్లమెంట్‌ను ఉద్దేశించి జెలెన్‌స్కీ ప్రసంగించాడు. 

రష్యా దాడులు ఒక్క ఉక్రెయిన్‌ను మాత్రమే సంక్షోభంలో నెట్టేయదని, చాలా దేశాలు ఆహార కొరతతో ఇబ్బందిపడతాయని జెలెన్‌స్కీ అంటున్నాడు. కాబట్టి, ఆక్రమణదారులను ఓడించేందుకు సాయం చేయాలంటూ ఇటలీ ప్రతినిధులను కోరాడాయన. దానికి ఇటలీ కూడా సానుకూలంగానే స్పందించింది. ఇక ఉక్రెయిన్‌ నుంచి గోధుమలు, మొక్కజోన్న, సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ ఉత్పత్తి చేయడంలో ప్రపంచంలోనే మేజర్‌ వాటాదారునిగా ఉంది ఉక్రెయిన్‌. అయితే రష్యా దాడుల నేపథ్యంలో.. నల్ల సముద్ర తీరాలను షిప్పులు దాటే పరిస్థితి లేకపోవడంతో ఎక్కడికక్కడే వాణిజ్యం స్థంభించి పోయింది. పైగా ఉత్పత్తుల్లో చాలావరకు పాడైపోయినట్లు ఉక్రెయిన్‌ అధికారులు చెప్తున్నారు. 

లెబనాన్, ఈజిప్ట్, యెమెన్.. ఇతర దేశాలు ఇటీవలి సంవత్సరాలలో ఉక్రేనియన్ గోధుమలపై ఆధారపడుతున్నాయి.  ఈ యుద్ధం ఎఫెక్ట్‌తోనే గోధుమల ధరలు గత నెలలో 50% మేర పెరిగాయి. ఇదిలా ఉంటే.. పాశ్చాత్య దేశాల అధినేతలను ఉద్దేశించి జెలెన్‌స్కీ ఓ వీడియో లింక్‌ను విడుదల చేశాడు. ఉక్రెయిన్ ఎల్లప్పుడూ అతిపెద్ద ఆహార ఎగుమతిదారులలో ఒకటనే విషయం తెలుసు కదా, అత్యంత భయంకరమైన విషయం ఏమిటంటే.. ఇప్పుడు పరిస్థితుల్లో కొన్ని దేశాలు ఆకలి కేకలు పెట్టొచ్చు.  రష్యన్ ఫిరంగి దాడులతో ఉన్న పంటలు నాశనం అవుతున్నాయి.. ఇంక కొత్త పంటలు ఎలా పండుతాయి? అని నిలదీశాడు.

పోప్‌.. ప్లీజ్‌ జోక్యం చేసుకోండి
ఉక్రెయిన్‌ పరిణామాలపై జెలెన్‌స్కీ, పోప్‌ ఫ్రాన్సిస్‌తో ఫోన్‌లో చర్చించినట్లు సమాచారం. ఈ విషయంలో జోక్యం చేసుకుని.. శాంతి చర్చల ద్వారా ఒక ముగింపు పలకాలని ఆయన్ని జెలెన్‌స్కీ కోరినట్లు సమాచారం. ఈ మేరకు చర్చల సారాంశం తాలుకా సందేశాన్ని ఆయన ట్విట్టర్‌లో సైతం పోస్ట్‌ చేశారు. అయితే పోప్‌-Russian Orthodox Patriarch Kirill మధ్య శాంతి స్థాపన కోసం ఈ నెల మొదట్లోనే చర్చలు జరిగాయి. కానీ, Patriarch Kirill of Moscow మాత్రం.. ఉక్రెయిన్‌ బలగాలను దుష్టశక్తులుగా పేర్కొంటూ యుద్ధానికి ఎగవేస్తుండడం విశేషం. ఇక యుద్ధం మొదలై.. దాదాపు నెలరోజులు కావొస్తున్న చర్చల్లో ఎలాంటి పురోగతి లేకుండా పోవడంతో ఇరు దేశాలు తీవ్రంగా నష్టపోతున్నాయి.

చదవండి: భాష రాక ఉక్రేనియన్ల గోస.. ఆ అంధుడికి సలాం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement