రష్యాలో 6.9 తీవ్రతతో భూకంపం  | Earthquake of 6. 9 magnitude hits near Ozernovskiy in Russia | Sakshi
Sakshi News home page

రష్యాలో 6.9 తీవ్రతతో భూకంపం 

Oct 17 2026 6:30 AM | Updated on Oct 17 2026 6:31 AM

Earthquake of 6. 9 magnitude hits near Ozernovskiy in Russia

మాస్కో: రష్యా, ఓజెర్నోవ్‌స్కీ సమీపంలోని కమ్చట్కాలో శుక్రవారం భారీ భూకంపం సంభవించింది. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3.36 గంటలకు ఒక నిమిషం పాటు భూమి 6.9 తీవ్రతతో కంపించింది. ఇళ్లలోని లైట్లు ఒక్కసారిగా ఊగాయి. తలుపులు మూసుకుపోయాయి. ఇళ్లలోని పరికరాలన్నీ కంపించాయి. దీంతో ఇళ్లలో ఉన్న జన ం భయంతో బయటకు పరుగులు తీశారు.

 కమ్చట్కా పసిఫిక్‌ రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌లోనే ఉండటంతో తరచుగా భూకంపాలు వస్తుంటాయి. 2025 జూలైలో ఈ ప్రాంతం 8.8 తీవ్రతతో భూకంపాన్ని చవిచూసింది, శుక్రవారం నాటి ప్రకంపన భూమి ఉపరితలం కింద చాలా లోతులో సంభవించడంతో ఎలాంటి సుునామీ ముప్పు లేదని రష్యన్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్, జియోఫిజికల్‌ సర్వీస్‌ శాస్త్రవేత్తలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement