పెద్దలే పిల్లలై..! | We the Volunteers | Sakshi
Sakshi News home page

పెద్దలే పిల్లలై..!

Nov 25 2024 11:08 AM | Updated on Nov 25 2024 11:08 AM

We the Volunteers

‘వీ ది వలంటీర్స్‌’ ఆధ్వర్యంలో ‘పెద్దల జాతర’

ఆటలు, పాటలు.. అంటే మనకు పిల్లలే గుర్తొస్తారు. కానీ వృద్ధులు కూడా తమ బాల్యం నాటి రోజులు గుర్తు చేసుకుని ఆడిపాడితే ఎలా ఉంటుంది. అచ్చు అదే ఆలోచన చేసింది వీ ది వలంటీర్స్‌ అనే స్వచ్ఛంద సంస్థ. ఈ సంస్థ ఆధ్వర్యంలో వృద్ధుల కోసం ఆదివారం బౌరంపేటలోని ఓ పాఠశాలలో ‘పెద్దల జాతర’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో 30 వృద్ధాశ్రమాల నుంచి దాదాపు 400 మంది వృద్ధులు పాల్గొన్నారు. ఆడుతూ, పాడుతూ, రంగురంగుల బొమ్మలు వేసి రోజంతా సంతోషంగా గడిపారు. ఈ కార్యక్రమాన్ని ఏటా జరుపుతుంటారు. అయితే తొలిసారిగా హైదరాబాద్‌లో నిర్వహించడం విశేషం. 
 

Advertisement
 
Advertisement
Advertisement