ఆగని ఆగ్రహ జ్వాల | Sakshi
Sakshi News home page

Published Sat, Feb 25 2023 8:58 AM

చింతలపూడిలో ఈనాడు పత్రులను దహనం చేస్తున్న ఎమ్మెల్యే వీఆర్‌ ఎలీజా - Sakshi

చింతలపూడి: ఈనాడులో తప్పుడు వార్తలు ప్రచురించిన రామోజీరావు ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలీజా డిమాండ్‌ చేశారు. టీడీపీ నాయకుడు పట్టాభిని పోలీసులు కొట్టారంటూ పాత ఫొటోలతో ఈనాడులో అసత్య వార్తలు ప్రచురించినందుకు నిరసనగా ఎమ్మెల్యే ఎలీజా ఆధ్వర్యంలో స్థానిక బోసుబొమ్మ సెంటర్‌లో శుక్రవారం ఈనాడు పత్రులను దహనం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎలీజా మాట్లాడుతూ వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంపై, సీఎం జగన్‌పై పచ్చ మీడియా విషపు రాతలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు.

రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వలేక రోజూ అవాస్తవాలను ప్రచురిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబును ఎలాగైనా ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోపెట్టాలని, ప్రజల్లో ప్రభుత్వంపై ఉన్న విశ్వసనీయతను పోగొట్టాలని విషం కక్కుతున్నారని అన్నారు. ఈనాడు పత్రికను ప్రజలు తిరస్కరించాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్‌ సీపీ పట్టణ కన్వీనర్‌ కొప్పుల నాగేశ్వరరావు, సచివాలయాల మండల కన్వినర్‌ త్సల్లాబత్తుల శ్రీనివాసరావు, నగర పంచాయతీ సచివాలయాల కన్వీనర్‌ ఎన్‌.దుర్గారావు, మండల పరిషత్‌ ఉపాధ్యక్షురాలు ఎస్‌వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

ఏలూరులో.. ఫైర్‌స్టేషన్‌ సెంటర్‌లో వైఎస్సార్‌ సీపీ నాయకులు ఈనాడు ప్రతులను దహనం చేసి నిరసన తెలిపారు. చంద్రబాబుకు తొత్తుగా వ్యవహరిస్తున్న రామోజీరావు అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్సార్‌ సీపీ నగర అధ్యక్షుడు బొద్దాని శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మేయర్‌ షేక్‌ నూర్జహాన్‌, ఈడా చైర్మన్‌ మధ్యాహ్నపు ఈశ్వరి, కో–ఆప్షన్‌ సభ్యులు ఎస్‌ఎంఆర్‌ పెదబాబు, మున్నుల జాన్‌ గురునాథ్‌, వైఎస్సార్‌ సీపీ లీగల్‌ సెల్‌ రీజ నల్‌ కో–ఆర్డినేటర్‌ డీవీ రామాంజనేయులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.

నూజివీడులో..ఈనాడు రాసే వార్తలన్నీ తప్పుడు రాతలేనని మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ పగడాల సత్యనారాయణ ధ్వజమెత్తారు. పట్టణంలోని చిన్నగాంధీ బొమ్మ సెంటర్‌లో ఈనాడు పత్రులను దహనం చేసి నిరసన తెలిపారు. వైఎస్సార్‌ సీపీ పట్టణ అధ్యక్షుడు శీలం రాము, వైఎస్సార్‌సీపీ నాయకులు షేక్‌ యూనస్‌పాషా (గబ్బర్‌) తదితరులు పాల్గొన్నారు.

భీమడోలులో.. భీమడోలు మండల వైఎస్సార్‌ సీపీ ఆధ్వర్యంలో స్థానిక గాంధీ సెంటర్‌లో ఈనాడు ప్రతులను దహనం చేసి నిరసన తెలిపారు. రామోజీ డౌన్‌డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. జగన్‌ సేవాదళ్‌ నియోజకవర్గ కన్వీనర్‌ తుమ్మగుంట రంగ, ఎస్సీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి ముళ్లగిరి జాన్సన్‌ మాట్లాడుతూ సీఎం జగన్‌ ప్రభుత్వంపై విషం కక్కేలా ఈనాడు వార్తలను ప్రచురించడం దారుణమన్నారు. వైఎస్సార్‌ సీపీ మండల కన్వీనర్‌ రావిపాటి సత్యశ్రీనివాస్‌, నియోజకవర్గ జగన్‌ సేవాదళ్‌ కన్వీనర్‌ తుమ్మగుంట రంగ తదితరులు పాల్గొన్నారు.

గాలాయగూడెంలో.. దెందులూరు: గాలాయగూడెంలో సర్పంచ్‌ చిలకా వెంకట సుబ్బారావు ఆధ్వర్యంలో ఈనాడు ప్రతులను దహనం చేసి నిరసన తెలిపారు.

నూజివీడు చిన్న గాంధీబొమ్మ సెంటర్‌లో..
1/3

నూజివీడు చిన్న గాంధీబొమ్మ సెంటర్‌లో..

ఏలూరు ఫైర్‌ స్టేషన్‌ సెంటర్‌లో ఈనాడు ప్రతులను దహనం చేస్తున్న దృశ్యం
2/3

ఏలూరు ఫైర్‌ స్టేషన్‌ సెంటర్‌లో ఈనాడు ప్రతులను దహనం చేస్తున్న దృశ్యం

భీమడోలు గాంధీబొమ్మ సెంటర్‌లో నిరసన
3/3

భీమడోలు గాంధీబొమ్మ సెంటర్‌లో నిరసన

Advertisement
Advertisement