
● గోదారి.. ఎర్రబారి..
గోదావరి పరవళ్లు
ధవళేశ్వరం: కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతోంది. పరీవాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో పాటు పోలవరం నుంచి విడుదలవుతున్న నీటితో ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటి ఉధృతి పెరిగింది. బ్యారేజీ నుంచి శనివారం సాయంత్రం 1,89,129 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడిచిపెట్టారు. బ్యారేజీలోని మొత్తం 175 గేట్లకు గానూ 157 గేట్లను 0.40 మీటర్ల మేర పైకి లేపి మిగులు జలాలను వదులున్నారు. ధవళేశ్వరం ఆర్మ్‌లో 66, ర్యాలీ ఆర్మ్‌లో 42, మద్దూరు ఆర్మ్‌లో 20, విజ్జేశ్వరం ఆర్మ్‌లో 29 గేట్లను పైకి లేపారు. బ్యారేజీ వద్ద నీటిమట్టం 10.80 అడుగులుగా నమోదైంది.
రాజమహేంద్రవరం పుష్కర్ ఘాట్ వద్ద ఎర్రబారిన గోదావరి
నిన్నటి వరకూ నీలి రంగు జలాలతో కనువిందు చేసిన గోదావరి.. ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో ఎర్రబారింది. గోదావరికి ఏటా జూన్‌లో వరద రావడం.. నీరు అరుణవర్ణం దాల్చడం ఆనవాయితీ. అయితే, ఈ ఏడాది వరద నీరు రావడం ఆలస్యమైంది. వరద నీటితో కొత్తందాలను సంతరించుకున్న గోదావరిని చూసేందుకు రాజమహేంద్రవరం పుష్కర ఘాట్‌కు శనివారం పెద్ద సంఖ్యలో సందర్శకులు తరలివచ్చారు.
– సాక్షి ఫొటోగ్రాఫర్, రాజమహేంద్రవరం

● గోదారి.. ఎర్రబారి..