సౌర విద్యుత్‌ స్టోరేజ్‌ ప్రాజెక్ట్‌ ఏర్పాటు | Karnataka 1000 MW Solar Power Push 23 Villages Set PM Surya Ghar Model | Sakshi
Sakshi News home page

సౌర విద్యుత్‌ స్టోరేజ్‌ ప్రాజెక్ట్‌ ఏర్పాటు

Oct 21 2026 2:41 PM | Updated on Oct 21 2026 2:42 PM

Karnataka 1000 MW Solar Power Push 23 Villages Set PM Surya Ghar Model

విద్యుత్‌ డిమాండ్‌ వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం భారీ సౌర విద్యుత్‌-స్టోరేజ్‌ ప్రాజెక్టు ఏర్పాటుకు చర్యలు చేపడుతోంది. కర్ణాటక పవర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (కేపీసీఎల్‌) 1,000 మెగావాట్ల గ్రౌండ్‌-మౌంటెడ్‌ సోలార్‌ విద్యుత్‌ సామర్థ్యాన్ని, 2,000 మెగావాట్‌ అవర్‌ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్‌ సిస్టమ్‌ (బీఈఎస్ఎస్‌)తో కలిపి అభివృద్ధి చేసేందుకు టెండర్లు ఆహ్వానించింది. ప్రాజెక్టు అభివృద్ధి, భూసేకరణ/లీజు, నిర్వహణ బాధ్యతలను ఎంపికయ్యే సంస్థ చేపట్టాల్సి ఉంటుంది.

సౌర విద్యుత్‌ ఉత్పత్తి పగటి వేళల్లో ఎక్కువగా ఉండగా, పవర్‌ డిమాండ్‌ సాయంత్రం పెరుతోంది. ఈ నేపథ్యంలో బ్యాటరీ స్టోరేజ్‌ కీలకంగా మారనుంది. రెండు గంటల నిల్వ సామర్థ్యంతో ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టు పీక్‌ డిమాండ్‌ను నిర్వహించడంలో రాష్ట్ర గ్రిడ్‌కు కొంత సౌలభ్యం కల్పించే అవకాశం ఉంది. అయితే వాస్తవ ప్రయోజనం బ్యాటరీ డిశ్చార్జ్‌ షెడ్యూల్‌, గ్రిడ్‌ నిర్వహణపై ఆధారపడి ఉంటుంది.

23 మోడల్‌ సోలార్‌ గ్రామాలు

ఇదే సమయంలో, ప్రధానమంత్రి సూర్య ఘర్‌ ముఫ్త్‌ బిజ్లీ యోజన కింద కర్ణాటకలో 23 మోడల్‌ సోలార్‌ గ్రామాల కోసం కేపీసీఎల్‌ అనుబంధ సంస్థ కేఆర్‌ఈడీఎల్‌ ప్రాజెక్టు నివేదికలు (డీపీఆర్‌) సిద్ధం చేయించేందుకు కన్సల్టెంట్‌ను నియమించనుంది. సదరు గ్రామాల విద్యుత్‌ అవసరాలు, స్థానిక పునరుత్పాదక వనరుల సామర్థ్యాన్ని అంచనా వేసి కమ్యూనిటీ సోలార్‌, ప్రభుత్వ భవనాలపై రూఫ్‌టాప్‌ సోలార్‌, సౌర వీధి దీపాలు, సౌర నీటి పంపులు వంటి వ్యవస్థలను ప్రతిపాదించనున్నారు.

ఒక్కో గ్రామానికి రూ.1 కోటి

అయితే కేంద్ర అధికారిక గణాంకాల ప్రకారం, జులై 20, 2026 నాటికి కర్ణాటకలో 12 జిల్లాల్లో మోడల్‌ సోలార్‌ గ్రామాలు ఇప్పటికే ప్రకటించారు. రాష్ట్రంలో 22,519 రూఫ్‌టాప్‌ సోలార్‌ వ్యవస్థలు ఏర్పాటై 34,180 కుటుంబాలు లబ్ధి పొందగా రూ.163.44 కోట్ల కేంద్ర ఆర్థిక సాయం విడుదలైంది. ప్రధానమంత్రి సూర్య ఘర్‌ పథకానికి దేశవ్యాప్తంగా రూ.75,021 కోట్ల కేటాయింపులు ఉండగా, 2026-27 ఆర్థిక సంవత్సరం వరకు అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ప్రతి జిల్లాలో ఎంపికయ్యే మోడల్‌ సోలార్‌ గ్రామానికి రూ.1 కోటి కేంద్ర సాయం అందుతుంది.

ఇదీ చదవండి: బంగారం కొనేందుకు మంచి సమయం.. ఎందుకంటే?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement