ఎఫ్‌డీ కంటే మెరుగైన రాబడులకు మార్గం ఏది? | Alternatives that balance returns risk and flexibility than FD | Sakshi
Sakshi News home page

ఎఫ్‌డీ కంటే మెరుగైన రాబడులకు మార్గం ఏది?

Jun 23 2025 8:27 AM | Updated on Jun 23 2025 9:01 AM

Alternatives that balance returns risk and flexibility than FD

నా వయసు 74 ఏళ్లు. ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ త్వరలోనే గడువు తీరనుంది. దీని ద్వారా రూ.25 లక్షలు చేతికి రానున్నాయి. ఈ మొత్తాన్ని ఎక్కడ ఇన్వెస్ట్‌ చేసుకుంటే మెరుగైన రాబడులు వస్తాయి? ప్రభుత్వ పథకాలు అయిన సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ (ఎస్‌సీఎస్‌ఎస్‌), పోస్టాఫీసు మంత్లీ ఇన్‌కమ్‌ స్కీమ్‌ (ఎంఐఎస్‌)లో నాకు పెట్టుబడులు ఉన్నాయి.     – నదీమ్‌

మీరు మెరుగైన రాబడుల కోసం ఈక్విటీ సేవింగ్స్‌ ఫండ్స్‌ను పరిగణనలోకి తీసుకోవచ్చు. ఎఫ్‌డీలతో పోలిస్తే ఈక్విటీ ఫండ్స్‌ అస్థిరతలతో ఉంటాయి. కాకపోతే అచ్చమైన ఈక్విటీ ఫండ్స్‌లో అంత అస్థిరతలు ఉండవు. ఇవి 15–30 శాతం వరకు ఈక్విటీల్లో, మిగిలిన మొత్తాన్ని ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్, ఆర్బిట్రేజ్‌ అవకాశాల్లో ఇన్వెస్ట్‌ చేస్తుంటాయి. స్వల్పకాలంలో ఈ ఫండ్స్‌లోనూ రిస్క్‌ ఎక్కువే. కాకపోతే ఐదేళ్లు అంతకుమించిన కాలంలో రిస్క్‌ చాలా తక్కువ. 

ఇదీ చదవండి: ‘19 ఏళ్ల కిందట భూమి అ‍మ్మారు.. నాకేం తెలియదు’

షార్ట్‌ డ్యురేషన్‌ ఫండ్స్‌ మరోక ఆప్షన్‌. ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ మాదిరే షార్ట్‌ డ్యురేషన్‌ ఫండ్స్‌లోనూ రాబడులు ఉంటాయి. వీటిల్లో లిక్విడిటీ ఎక్కువ. పోస్టాఫీసు ఎంఐఎస్, ఎస్‌సీఎస్‌ఎస్‌ పథకాల్లో మీకు ఇప్పటికే పెట్టుబడులు ఉన్నాయి. వీటి నుంచి క్రమం తప్పకుండా ఆదాయం వస్తుంటుంది. ఈ పథకాల నుంచి రాబడిని ఎప్పటికప్పుడు తీసుకుంటూ ఉంటారు కనుక పెట్టుబడి విలువ పెరగదు. కనుక మీకు ఈక్విటీ సేవింగ్స్‌ ఫండ్స్‌ మెరుగైన ఆప్షన్‌ . ఈక్విటీ వద్దనుకుంటే షార్ట్‌ డ్యురేషన్‌ ఫండ్స్‌కు వెళ్లొచ్చు.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement