‘మాధురీ మేడం వడపావ్‌ అదిరింది’.. యాపిల్‌ సీఈవో టిమ్‌కుక్‌ వైరల్‌

Actress Madhuri Dixit Had Shared A Picture Of Herself Eating Vada Pav With Tim Cook - Sakshi

భారత పర్యటనలో ఉన్న యాపిల్‌ సీఈవో టిమ్‌కుక్‌ ముంబైలో సందడి చేశారు. ఏప్రిల్‌ 18న యాపిల్‌ తన మొదటి స్టోర్‌ను ముంబైలో, ఏప్రిల్‌ 20న ఢిల్లీలో రెండో స్టోర్‌ ప్రారంభించనున్నారు. 

ఈ సందర్భంగా ముంబైలోని ప్రముఖ స్వాతీ స్నాక్స్‌ రెస్టారెంట్‌లో భారతీయులు అమితంగా ఇష్టపడే వడపావ్‌ను బాలీవుడ్‌ బ్యూటీ మాధురీ దీక్షిత్‌తో కలిసి యాపిల్‌ సీఈవో టిమ్‌కుక్‌ రుచి చూశారు. వడపావ్‌ చాలా బాగుంది అంటూ ఆ ఫోటోల్ని ట్వీట్‌ చేశారు. 

నటి మాధురీ దీక్షిత్ టిమ్ కుక్‌తో కలిసి వడ పావ్ తింటున్న ఫోటోల్ని నెటిజన్లతో పంచుకున్నారు. “ముంబైకి వడ పావ్ కంటే మెరుగైన స్వాగతం గురించి ఆలోచించలేను!” అని ట్వీట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆఫోటోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top