వర్క్‌ ఫ్రమ్‌ హోంపై ఉద్యోగుల అభిప్రాయం ఇలా..! | Sakshi
Sakshi News home page

Work From Home: వర్క్‌ ఫ్రమ్‌ హోంపై ఉద్యోగుల అభిప్రాయం ఇలా..!

Published Sun, Jan 30 2022 3:11 PM

82 Percent Employees Prefer Working From Home: Study - Sakshi

కోవిడ్‌-19 రాకతో ఐటీ ఉద్యోగులు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌కే పరిమితమైన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగంగా కొనసాగుతుండడంతో, కరోనా తీవ్రత తగ్గిన నేపథ్యంలో ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్‌కు క్రమంగా ఎండ్‌కార్ట్‌ పలకాలని చూస్తోన్న సమయంలో కరోనా వైరస్‌ కొత్త వేరియంట్‌ ఓమిక్రాన్‌ అడ్డుకట్టవేసింది. దీంతో ఉద్యోగుల మళ్లీ ఇంటికే పరిమితమయ్యారు. ఇదిలా ఉండగా ప్రపంచవ్యాప్తంగా టెక్‌ టాలెంట్‌ ఔట్‌లుక్‌ జాబ్‌ సైట్‌ SCIKEY నిర్వహించిన సర్వేలో వర్క్‌ ఫ్రం హోంపై ఉద్యోగుల ఆసక్తికర విషయాలను వెల్లడించారు. 

మెజారిటీ ఉద్యోగులు WFH కే జై...!
జాబ్‌ సైట్‌ సైకీ నివేదిక ప్రకారం..మెజారిటీ ఉద్యోగులు వర్క్‌ ఫ్రం హోంకే జై కొట్టారు. 82 శాతం ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేయడానికి మొగ్గు చూపుతున్నట్లు సర్వేలో  తేలింది.  నాలుగు ఖండాల నుంచి 100 మందికి పైగా సీ-సూట్‌, హ్యూమన్‌ క్యాపిటల్‌ లీడర్ల నుంచి సేకరించిన అభిప్రాయాలను సైకీ తన నివేదికలో పేర్కొంది. వాటితో పాటుగా ఉద్యోగుల సర్వేలు, సోషల్‌ మీడియా ఇన్‌పుట్స్‌, ఇంటర్యూలు, ప్యానెల్‌ చర్చాగోష్టుల ద్వారా స్కైకీ ఈ సమాచారం సేకరించింది.అయితే ఇంటి నుంచే పనిచేయడం ద్వారా ఉత్పాదకత విషయంలో ఒత్తిడి తక్కువగా ఉంటుందని 64 శాతం మంది ఉద్యోగులు తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. 

హెచ్‌ఆర్‌ సిబ్బందిలో కూడా..!
ఆయా కంపెనీల్లోని హెచ్‌ఆర్‌ సిబ్బంది కూడా వర్క్‌ ఫ్రం హోంకే పరిమితమయ్యారు.  80 శాతానికి పైగా హెచ్‌ఆర్‌ మేనేజర్లు ఉద్యోగులు ఫుల్‌టైం ఆఫీసులో ఉండటం చాలా కష్ట సాధ్యంగా ఉందని తెలిపారు.టాలెంటెడ్‌ ఉద్యోగులను వదులుకోకుండా వారికి నచ్చినట్లు రిమోట్‌ వర్క్‌ ఇవ్వడానికి కంపెనీలు కూడా సిద్దమయ్యాయి. 

కొత్త అలవాట్లు..!
కరోనా రాకతో పూర్తిగా వర్క్‌ ఫ్రం హోంకే పరిమితమైన ఉద్యోగుల్లో గత రెండేళ్ల నుంచి గణనీయమైన మార్పులు వచ్చినట్లు సైకీ పేర్కొంది. ఇంటి పట్టే ఉండడంతో కొత్త అలవాట్లు ఉద్యోగులకు అలవాటైనట్లు సైకీ తన నివేదికలో తెలిపింది.ఉద్యోగుల రోజువారీ దినచర్యలో భారీ మార్పులే వచ్చాయి. ఉద్యోగుల హెల్త్‌ను దృష్టిలో ఉంచుకొని పలు కంపెనీలు ఫిట్‌నెస్‌ పాలసీలను కూడా ప్రకటించాయి. 

చదవండి: Work From Home: వర్క్‌ ఫ్రమ్‌ హోం ఉద్యోగులకు బడ్జెట్‌లో భారీ బెనిఫిట్స్‌..!

Advertisement
Advertisement