Horoscope Today: ఈ రాశులవారు శుభవార్తలు వింటారు.. | Sakshi
Sakshi News home page

Horoscope Today: ఈ రాశులవారు శుభవార్తలు వింటారు..

Published Tue, Apr 30 2024 6:22 AM

Daily Horoscope: Rasi Phalalu On April 30-04-2024 Telugu

శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, తిథి: బ.సప్తమి రా.2.52 వరకు, తదుపరి అష్టమి, నక్షత్రం: ఉత్తరాషాఢ రా.1.39 వరకు, తదుపరి శ్రవణం, వర్జ్యం: ఉ.10.13 నుండి 11.45 వరకు, తదుపరి తె.5.28 నుండి 6.56 వరకు (తెల్లవారితే బుధవారం), దుర్ముహూర్తం: ఉ.8.08 నుండి 8.56 వరకు, తదుపరి రా.10.50 నుండి 11.38 వరకు, అమృతఘడియలు: రా.7.25 నుండి 8.46 వరకు; రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు, యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు, సూర్యోదయం: 5.39, సూర్యాస్తమయం: 6.14. 

మేషం: నూతన ఉద్యోగాలు. ఆకస్మిక ధనలాభం. వ్యవహారాలలో విజయం. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు హోదాలు దక్కుతాయి.

వృషభం: ఆదాయానికి మించి ఖర్చులు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసమస్యలు. పనుల్లో అవరోధాలు. మానసిక అశాంతి. వృత్తి, వ్యాపారాలలో అవరోధాలు.

మిథునం: వ్యయప్రయాసలు.. వృథా ఖర్చులు. దూరప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. పనులు ముందుకు సాగవు. వృత్తి,వ్యాపారాలలో మార్పులు.

కర్కాటకం: వ్యవహారాలు అనుకూలిస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు మంచి గుర్తింపు.

సింహం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆకస్మిక ధన, వస్తులాభాలు. ఆహ్వానాలు అందుతాయి. పనులు చకచకా సాగుతాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు అనుకూలత.

కన్య: రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బాధ్యతలు పెరుగుతాయి. దూరప్రయాణాలు. సోదరులు, సోదరీలతో కలహాలు. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు.

తుల: కుటుంబసమస్యలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. మిత్రులతో విభేదాలు. శ్రమాధిక్యం. అనారోగ్య సూచనలు. వృత్తి, వ్యాపారాలు అంతగా అనుకూలించవు.

వృశ్చికం: శుభవార్తలు వింటారు. పాతమిత్రుల కలయిక. విందువినోదాలు. రాబడి పెరుగుతుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఉన్నతస్థితి.

ధనుస్సు: ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. అనారోగ్యం. సోదరులతో కలహాలు. ఆలోచనలు స్థిరంగా సాగవు. దైవదర్శనాలు. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహమే.

మకరం: మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందుకు సాగుతారు.

కుంభం: రాబడి నిరాశ పరుస్తుంది. వ్యవహారాలలో ఆటంకాలు. దూరప్రయాణాలు. బంధువర్గం నుంచి ఒత్తిడులు. ఆరోగ్య సమస్యలు. వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితి.

మీనం: ఆస్తి వివాదాలు పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు సైతం వసూలవుతాయి. వస్తులాభాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు సంతోషకర సమాచారం.
 

 

Advertisement

తప్పక చదవండి

Advertisement