Telugu Horoscope: ఈ రాశి వారికి ఆకస్మిక ధనలబ్ధి | Daily Horoscope July 18-07-2024 | Sakshi
Sakshi News home page

Telugu Horoscope: ఈ రాశి వారికి ఆకస్మిక ధనలబ్ధి

Jul 18 2024 6:48 AM | Updated on Jul 18 2024 8:43 AM

Daily Horoscope July 18-07-2024

శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం, తిథి: శు.ద్వాదశి సా.6.13 వరకు, తదుపరి త్రయోదశి, నక్షత్రం: జ్యేష్ఠ రా.2.19 వరకు, తదుపరి మూల, వర్జ్యం: ఉ.7.07 నుండి 8.46 వరకు, దుర్ముహూర్తం: ఉ.9.56 నుండి 10.48 వరకు తదుపరి ప.3.07 నుండి 3.58 వరకు, అమృత ఘడియలు: సా.5.32 నుండి 6.41 వరకు. 

మేషం....వ్యవహారాలు ముందుకు సాగవు. ఆర్థిక లావాదేవీలు అంతంత మాత్రమే. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారులకు ఒత్తిళ్లు. ఉద్యోగులకు బాధ్యతలు తప్పవు.

వృషభం....కొత్త పనులకు శ్రీకారం. శుభవర్తమానాలు. అదనపు ఆదాయం సమకూరుతుంది. స్థిరాస్తి లాభం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు సంతోషకరమైన విషయాలు తెలుస్తాయి.

మిథునం...పరిస్థితులు అనుకూలిస్తాయి. సేవాకార్యక్రమాలు నిర్వహిస్తారు. విలువైన వస్తువులు కొంటారు. భూలాభాలు. వ్యాపారులకు కొత్త ఆశలు. ఉద్యోగులకు మంచి గుర్తింపు.

కర్కాటకం...ఆదాయం అంతగా కనిపించదు. దూరప్రయాణాలు. పనులు కొన్ని వాయిదా వేస్తారు. ఆలయాల సందర్శనం. అనారోగ్యం. వ్యాపారులకు సమస్యలు. ఉద్యోగులకు విధుల్లో మార్పులు.

సింహం....ఆర్థిక ఇబ్బందులు. అనుకోని ప్రయాణాలు. అనారోగ్యం. ముఖ్య పనులు నిదానంగా సాగుతాయి. వ్యాపారులకు లాభాలు స్వల్పమే. ఉద్యోగులకు కొత్త సమస్యలు.

కన్య..పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కుటుంబంలో సమస్యలు తీరతాయి. వ్యవహారాలలో విజయం. వస్తులాభాలు. వ్యాపారులకు లాభాలు దక్కుతాయి. ఉద్యోగులకు అనుకూల మార్పులు.

తుల...పనులు నెమ్మదిగా పూర్తి చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు. మిత్రులతో విభేదాలు. వ్యాపారులకు స్వల్ప లాభాలు. ఉద్యోగులకు పనిభారం.

వృశ్చికం...నిరుద్యోగులకు ఉద్యోగయోగం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఆస్తి అగ్రిమెంట్లు. అదనపు ఆదాయం. వ్యాపారులకు లాభాలు తథ్యం. ఉద్యోగులకు పనిభారం తగ్గుతుంది.

ధనుస్సు...నూతన వ్యక్తుల పరిచయం. శుభవార్తా శ్రవణం. ఆకస్మిక ధనలబ్ధి. వాహనయోగం. చర్చలు సఫలం. వ్యాపారులకు నూతనోత్సాహం. ఉద్యోగులకు హోదాలు.

మకరం....వ్యవహారాలు నత్తనడనక సాగుతాయి. వృథా ఖర్చులు. ప్రయాణాలు మధ్యలో విరమిస్తారు. శ్రమ పెరుగుతుంది. వ్యాపారులకు చిక్కులు. ఉద్యోగులకు శ్రమాధిక్యం.

కుంభం...యత్నకార్యసిద్ధి. ప్రముఖుల నుంచి పిలుపు. యత్నకార్యసిద్ధి. భూలాభాలు. వ్యాపారులకు లాభాలు ఉత్సాహాన్నిస్తాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు.

మీనం...కొన్ని పనులు నిదానంగా సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసమస్యలు. అనారోగ్యం. వ్యాపారులకు లాభాలు అంతగా కనిపించవు. ఉద్యోగులకు శ్రమ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement