సాక్షి, తాడేపల్లి: స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అనుసరించాల్సిన వ్యూహాలపై వైఎస్సార్‌సీపీ దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో పార్టీ నేతలతో వైఎస్సార్‌సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్లు సజ్జల రామకృష్ణారెడ్డి నేడు సమావేశం కానున్నారు. పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు, వర్కింగ్ ప్రెసిడెంట్లతో పాటు సోషల్ మీడియా రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా అధ్యక్షులతో తాడేపల్లిలోని పార్టీ ఆఫీసులో ఆయన భేటీ కానున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, పార్టీ శ్రేణుల కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.
ఇదీ చదవండి: దుబారా బాబు.. డిజిటల్ డాబు


