విశాఖకు తప్పిన మరో ప్రమాదం | Fire Accident At Visakhapatnam Container Corporation Yard | Sakshi
Sakshi News home page

విశాఖకు తప్పిన మరో ప్రమాదం

Jul 27 2020 4:06 PM | Updated on Jul 27 2020 4:58 PM

Fire Accident At Visakhapatnam Container Corporation Yard - Sakshi

సాక్షి, విశాఖపట్నం: నగరంలోని కంటైనర్ కార్పొరేషన్ యార్డులో సోమవారం రోజున అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు సమీపంలో ఉన్న ఈ యార్డులో ఓ కంటైనర్ నుంచి మంటలు ప్రారంభమై కొద్దిసేపట్లోనే పెద్ద ఎత్తున చెలరేగాయి. అయితే అగ్నిమాపక యంత్రాలు త్వరితగతిన అక్కడికి చేరడంతో పూర్తిగా అదుపులోకి వచ్చాయి. విశాఖ ఎయిర్‌పోర్ట్‌ సమీపంలో ఉన్న ఈ యార్డులోని కంటెయినర్లలో వివిధ రకాల రసాయన నిల్వలు ఉన్న నేపథ్యంలో మంటలు మరింత వ్యాపించే ప్రమాదం ఉందని అందరూ భావించారు. కానీ తక్షణమే స్పందించిన స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పింది. 

Advertisement
 
Advertisement
Advertisement