యలమంచిలి.. ప్రగతి లోగిలి | Sakshi
Sakshi News home page

యలమంచిలి.. ప్రగతి లోగిలి

Published Thu, May 9 2024 7:45 AM

యలమంచ

వసతులపల్లి రాంబిల్లి

ఎన్నో ప్రత్యేకతలున్నా దశాబ్దాలుగా వెనకబడి ఉన్న యలమంచిలి నియోజకవర్గం జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం వచ్చాక దినదినాభివృద్ధి చెందుతోంది. హస్తకళల కాణాచిగా, పరిశ్రమల హబ్‌గా మరింత ప్రగతి సంతరించుకుంది. సంక్షేమానికి, అభివృద్ధికి సమప్రాధాన్యం ఇస్తూ నియోజకవర్గ ఎమ్మెల్యే కన్నబాబు నేతృత్వంలో రూ.కోట్లాది నిధులతో పర్యాటకంగా, మౌలిక వసతుల పరంగా, ఉపాధి పరంగా ముందడుగు వేస్తోంది.

మెలిపాకలో నిర్మించిన రక్షిత మంచినీటి పథకం

అచ్యుతాపురం : సముద్ర తీరానికి ఆనుకొని ఉన్న యలమంచిలి నియోజకవర్గం రూపురేఖలు మారిపోయాయి. మహానేత వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి చలవతో సెజ్‌ ఏర్పాటు చేసిన తర్వాత యలమంచిలి నియోజకవర్గం అందరి దృష్టి ఆకర్షించింది. ఇప్పుడు ఆ మహానేత తనయుడు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో యలమంచిలి ప్రగతిపథంలో విరాజిల్లుతోంది. పర్యాటక పరవళ్లు, ఏటికొప్పాక ఘన వారసత్వానికి గుర్తింపు, తీర ప్రాంత మత్స్యకారులకు ఉపాధి, ఊతమిచ్చే ఫిషింగ్‌ హార్బర్‌తో పాటు అనేక విప్లవాత్మక మార్పులకు సాక్ష్యంగా నిలుస్తోంది. ఈ నియోజకవర్గం పరిశ్రమల హబ్‌గా నిరుద్యోగులకు వరంగా దినదినాభివృద్ధి చెందుతోంది. దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరిస్తూ, నీటి వనరుల్ని ఒడిసిపడుతూ ఇటు రైతులకు, అటు పరిశ్రమలకు నెలవై అభివృద్ధి బాటన పయనిస్తోంది.

నాడు శిథిల మైన సర్కారు బడుల స్థానంలో నేడు కా ర్పొ రేట్‌ హంగులతో చక్కని పాఠశాలలు రూపుదిద్దుకున్నాయి. విద్యా రంగంలో చక్కని మార్పు రాగా, ప్రభు త్వ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపడి ప్రజావైద్యానికి బాసటగా నిలిచాయి. సీఎం జగన్‌ పాలన ఈ నియోజక వర్గంలో ఒక సువర్ణ యుగంగా చెప్పుకోవచ్చనడంలో ఎటువంటి సందేహం లేదు.

యలమంచిలి : యలమంచిలి పట్టణంలో దీర్ఘకాలిక సమస్యగా మారిన ఫ్లై ఓవర్‌ నిర్మాణం దాదాపు పూర్తి అయింది. దీంతో పట్టణ ప్రజలు రైల్వే గేట్‌ వద్ద ఎక్కువ కాలం పాటు నిరీక్షించే సమయం ఇక ఆదా అవుతంది. యలమంచిలి ఆస్పత్రిని మరింత అప్‌గ్రేడ్‌ చేసి అనేక వసతులు కల్పించారు.

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అఽధికారం చేపట్టాక సీఎం వై.ఎస్‌. జగన్‌మోహనరెడ్డి పలు అభివృద్ధి పనులు చేయడమే గాక సంక్షేమ పథకాలను పక్కాగా అమలు చేశారు. అమ్మ ఒడి, రైతు భరోసా, వైఎస్సార్‌ ఆసరా, చేయూత తదితర పథకాల లబ్ధిదారులకు ఎటువంటి అక్రమాలకు తావు లేకుండా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకే జమ చేస్తున్నారు. అంతేగాక నాడు–నేడు పథకంలో పాఠశాలలను కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా అభివృద్ధి చేశారు. పీహెచ్‌సీలను అధునాతనంగా నిర్మించి ఇద్దరేసి వైద్యులను నియమించారు. పూర్తి స్థాయిలో మందులు అందుబాటులో ఉంచారు.

సంక్షేమ పథకాల వివరాలు

అభివృద్ధికి ఏరువాక మునగపాక

మండలంలోని కోట్లాది రూపాయల వ్యయంతో పలు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. మండల వ్యాప్తంగా 21 సచివాలయాలకు గాను రూ.8.8 కోట్లను కేటాయించారు. అలాగే 21 ఆర్‌బీకేలకు ఒక్కో ఆర్‌బీకేకు రూ.22 లక్షలు కేటాయించారు. ప్రస్తుతం 5 ఆర్‌బీకేలు అందుబాటులోకి వచ్చాయి. జల్‌జీవన్‌ మిషన్‌ పథకం ద్వారా 39 పనులకు గాను రూ.17 కోట్ల కేటాయించింది. అలాగే నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా మొదటి విడతగా 24 పాఠశాలలకు గాను రూ.10 కోట్లతో అభివృద్ధి చేశారు. రెండో విడతగా 18 పాఠశాలలకు గాను రూ.8 కోట్లు కేటాయించారు. అలాగే 23 ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధికి రూ.16.5 కోట్లు ఖర్చు చేశారు.

మౌలిక

వసతుల

పెంపు

ఐదేళ్లలో రూ.కోట్లాది

అభివృద్ధి పనులు

రహదారులు,

చెరువుల

అభివృద్ధి

పరిశ్రమల రాకతో

ఉపాధి

అవకాశాలు

యలమంచిలి.. ప్రగతి లోగిలి
1/1

యలమంచిలి.. ప్రగతి లోగిలి

Advertisement
Advertisement