రొమాగ్నా గ్రాండ్‌ప్రిలో.. వెర్‌స్టాపెన్‌కు ఐదో గెలుపు..! | Sakshi
Sakshi News home page

రొమాగ్నా గ్రాండ్‌ప్రిలో.. వెర్‌స్టాపెన్‌కు ఐదో గెలుపు..!

Published Mon, May 20 2024 9:00 AM

Verstappen Won The Emilia Romagna Grand Prix In Italy

ఆద్యంతం ఆధిపత్యం కనబరుస్తూ రెడ్‌బుల్‌ జట్టు డ్రైవర్‌ మాక్స్‌ వెర్‌స్టాపెన్‌ ఫార్ములావన్‌ తాజా సీజన్‌లో ఐదో విజయాన్ని అందుకున్నాడు. ఆదివారం ఇటలీలో జరిగిన ఎమిలియా రొమాగ్నా గ్రాండ్‌ప్రిలో వెర్‌స్టాపెన్‌ విజేతగా నిలిచాడు.

‘పోల్‌ పొజిషన్‌’తో రేసును ఆరంభించిన వెర్‌స్టాపెన్‌ నిర్ణీత 63 ల్యాప్‌లను అందరికంటే వేగంగా ఒక గంటా 25 నిమిషాల 25.252 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. లాండో నోరిస్‌ (మెక్‌లారెన్‌) రెండో స్థానంలో, చార్లెస్‌ లెక్‌లెర్క్‌ (ఫెరారీ) మూడో స్థానంలో నిలిచారు. సీజన్‌లోని తదుపరి రేసు మొనాకో గ్రాండ్‌ప్రి ఈనెల 26న జరుగుతుంది.

ఇవి చదవండి: విన్‌రైజర్స్‌...

Advertisement
 
Advertisement
 
Advertisement