-
ఓటేసిన ప్రముఖులు..
నిర్మల్‌చైన్‌గేట్: లోక్‌సభ ఎన్నికల సందర్భంగా జిల్లాలో అధికారులు, ప్రముఖ నాయకులు సోమవారం ఓటు హక్కు విని యోగించుకున్నారు. కొందరు నాయకులు కు టుంబ సభ్యులతో కలిసి వెళ్లి ఓట్లు వేశారు. జిల్లా ఎన్నికల అధికారి ఆశిష్ సంగ్వాన్ జెడ్పీ కార్యాలయంలోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. నిర్మల్ పట్టణం గాజులపేట్ బూత్ నంబర్ 192లో బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. మామడ మండలం దిమ్మదుర్తిలోని 77 బూత్‌లో జెడ్పీ చైర్పర్సన్ విజ యలక్ష్మి ఓటు వేశారు. డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు ఓటు వేశారు. నిర్మల్ రూరల్ మండలం కొండాపూర్‌లో మాజీ మంత్రి ఐకేరెడ్డి ఓటు వేశారు. కుటుంబసభ్యులతో ఓటు వేసిన మహేశ్వర్‌రెడ్డి భైంసాలో ఓటువేసిన ఎమ్మెల్యే రామారావుపటేల్ -
మూడంచెల భద్రతతో ప్రశాంతంగా పోలింగ్
● ఎస్పీ జానకీషర్మిలనిర్మల్టౌన్: జిల్లాలో పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రత్యేక యాక్షన్ ప్లాన్, పోలింగ్ కేంద్రాల చుట్టూ మూడంచెల భద్రత ఏర్పాటు చేశామని ఎస్పీ జానకీషర్మిల తెలిపారు. జిల్లాలోని పలు పోలింగ్ కేంద్రాలను ఎస్పీ సోమవారం పరిశీలంచారు. పోలీస్ అధికారులు, సిబ్బందికి సూచనలు చేశారు. నిర్మల్, భైంసా, ఖానాపూర్ నియోజకవర్గాల్లో ఎన్నికలు ప్రశాతంగా జరిగినట్లు తెలిపారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద కేంద్ర బలగా లతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. జి ల్లా స్పెషల్ పార్టీ, సెంట్రల్ అర్మడ్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌తో గస్తీ నిర్వహించామన్నారు. ఈవీఎంల తరలింపునకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు. గొడవలు జరిగితే ప్రతిఘటించేలా క్విక్ రియాక్షన్ టీం ఏర్పాటు చేశామని తెలిపారు. పోలీసులు ఎన్నికల విధులు సమర్థవంతంగా నిర్వహించారని పేర్కొన్నారు. సమన్వయంతో పనిచేసి ఎన్నికలు విజయవంతంగా నిర్వహించేలా పనిచేశారని అభినందించారు. ఎస్పీ వెంట నిర్మల్ డీఎస్పీ గంగారెడ్డి, పట్టణ, రూరల్ సీఐలు అనిల్, నవీన్ ఉన్నారు. ఖానాపూర్/సోన్: ఎన్నికల పర్యవేక్షణలో భాగంగా ఎస్పీ జానకీషర్మిల జిల్లాలోని పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. ఖానాపూర్ మండలం గోసంపల్లె, రాజురా, అడవి సారంగాపూర్ గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. సోన్ మండలం సోన్, న్యూవెల్మల్ గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలు తనిఖీ చేశారు. ఆమె వెంట సీఐలు సైదా రావు, నవీన్‌కుమార్, ఎస్సై రవీందర్ ఉన్నారు. -
కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్..
నిర్మల్‌చైన్‌గేట్: పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ జిల్లాలో సోమవారం ప్రశాంతంగా ముగిసింది. మూడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 926 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ సరళిని కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ద్వారా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పరిశీలించారు. కంట్రోల్ రూమ్ ద్వారా పరిశీలించడమే కాక పలు కేంద్రాలను ప్రత్యక్షంగా పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. ఓటు మనకు వరం నిర్మల్‌చైన్‌గేట్: ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రజలందరికీ రాజ్యాంగం కల్పించిన గొప్ప వరమని జిల్లా ఎన్నికల అధికారి ఆశిష్ సంగ్వాన్ అన్నారు. నిర్మల్ పట్టణం జెడ్పీ కార్యాలయంలోని 237వ నంబర్ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. అనంతరం మాట్లాడుతూ ఓటింగ్ శాతం పెంపునకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. న్యూస్‌రీల్ -
‘స్ట్రాంగ్‌రూం’లో భవితవ్యం
నిర్మల్: పార్లమెంట్ ఎన్నికల మహాక్రతువును జిల్లా అధికారులు ప్రశాంతంగా పూర్తిచేశారు. జిల్లావ్యాప్తంగా మూడు నియోజకవర్గాల్లో కలిపి మొత్తం 926 పోలింగ్ కేంద్రాల్లో ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం రాత్రి వరకూ పోలింగ్ సిబ్బంది నిర్విరామంగా శ్రమించారు. ఎట్టకేలకు జిల్లాలో పోలింగ్పర్వాన్ని ప్రశాంతంగా ముగించారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ సమయమిచ్చారు. ఆరుగంటల వరకు పోలింగ్ కేంద్రం లోపల ఉన్నవారికి సమయం దాటినా ఓటువేసే అవకాశమిచ్చారు. దీంతో కొన్ని కేంద్రాల్లో ఆలస్యమైంది. కేంద్రాలలో ఉన్న ఓటర్లతో ఓట్లు వేయించి, తమకు అప్పగించిన పోలింగ్ సామగ్రిని తీసుకుని సిబ్బంది పంపిణీ కేంద్రాలకు వద్దకు వచ్చేసరికి రాత్రయ్యింది. స్వీకరించిన అధికారులు.. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పోలింగ్ సామగ్రి పంపిణీ, స్వీకరణ కేంద్రాలు ఏర్పాటు చేశారు. నిర్మల్‌లోని ఎన్టీఆర్ మినీస్టేడియంలో, ముధోల్‌లో బాలుర గురుకులంలో, ఖానాపూర్‌కు సంబంధించి ఉట్నూర్ కేబీ కాంప్లెక్స్‌లో సిబ్బంది పోలింగ్ సామగ్రిని తిరిగి జాగ్రత్తగా అప్పజెప్పారు. అధికారులు వీరి కోసం పోలింగ్ కేంద్రాల నుంచి స్వీకరణ కేంద్రాల దాకా ప్రత్యేకంగా వాహనాలను ఏర్పాటు చేశారు. సిబ్బంది తీసుకువచ్చిన ఈవీఎంలు, వీవీప్యాట్లు, ఇతర సామగ్రిని సరిచూసుకుని తీసుకున్నారు. రిటర్నింగ్ అధికారులు మళ్లీ వాటిని స్ట్రాంగ్‌రూమ్‌ల్లో పెట్టారు. ఈప్రక్రియను కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, అదనపు కలెక్టర్ ఫైజాన్ అమ్మద్ పరిశీ లిచారు. అర్ధరాత్రి బందోబస్తు మధ్య ఆదిలాబాద్ జిల్లాకేంద్రంలోని స్ట్రాంగ్ రూంకు తరలించారు. ఈవీఎంలు స్వీకరించిన అధికారులు బందోబస్తు మధ్య ఆదిలాబాద్ తరలింపు -
నిర్మల్
మంగళవారం శ్రీ 14 శ్రీ మే శ్రీ 2024నిర్మల్ జూనియర్ కళాశాలలో బారులుతీరిన ఓటర్లు ఓటేసిన ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి కూతుళ్లు మొరాయించిన ఈవీఎంలు.. యథావిధిగా ఈ ఎన్నికల్లోనూ పలుచోట్ల ఈవీఎంలు మొరాయించాయి. చాలా గ్రామాల్లో పొద్దున్నే వచ్చిన ఓటర్ల ఓపికకు పరీక్ష పెట్టాయి. పలుచోట్ల ఓటర్లు నిరీక్షించే ఓపిక లేక వెనుదిరిగి, మళ్లీ వచ్చారు. సమయం వృథా కావడంతో కొంతమంది పోలింగ్ సిబ్బందిపై చిర్రుబుర్రులాడటం కనిపించింది. ● భైంసాలోని 130 పోలింగ్ కేంద్రంలో ఈవీఎం మొరాయించడంతో 15 నిమిషాలు ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. ●ముధోల్ మండలం చించాల గ్రామంలో 30 నిమిషాలపాటు ఈవీఎం మొరాయించింది. ●లక్ష్మణచాంద మండలం పొట్టపల్లిలో ఈవీఎం రెండుసార్లు మొరాయిచింది. టెక్నికల్ అధికారులు వచ్చి, మరో ఈవీఎం ఏర్పాటు చేశారు. ●భైంసాలోని గుజిరిగల్లీ 157 పోలింగ్ కేంద్రంలో సాంకేతిక సమస్యతో గంటపాటు పోలింగ్ నిలిచిపోయింది. ●నిర్మల్‌లోని 238వ పోలింగ్ కేంద్రంలో గంటపాటు ఈవీఎంలు మొరాయించడంతో మరో ఈవీఎంను ఏర్పాటు చేశారు. ●దిలావర్పూర్ మండలం కాల్వ, దిలావర్పూర్ కేంద్రాల్లో కొద్దిసేపు ఈవీఎంలు పనిచేయలేదు. ● లోక్‌సభ ఎన్నికల్లో జిల్లాలో భారీగా పోలింగ్ ● గత ఎన్నికలకంటే అధికంగా నమోదు ● సహకరించిన వాతావరణం ● ఉత్సాహంగా ఓటేసిన యువఓటర్లు ● పలుచోట్ల మొరాయించిన ఈవీఎంలు ● పర్యవేక్షించిన ఉన్నతాధికారులునిర్మల్: లోక్‌సభ ఎన్నికలకు జిల్లా ఓటర్లు పోటెత్తారు. గత ఎన్నికలతో పోలిస్తే.. ఈసారి చైతన్యం పెరిగింది. పోలింగ్ శాతం పెంచేందుకు అధికారుల చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఇక తొలి ఓటు వేసేందుకు యువతరం ఆసక్తిగా తరలివచ్చింది. సోమవారం ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 69.59 శాతం పోలింగ్ నమోదైంది. 2019 ఎన్నికల్లో 64.61శాతం కాగా, ఈసారి ఆరు శాతం పెరిగింది. అక్కడక్కడా ఈవీఎంల మొరాయింపు, అల్లంపల్లి, బాబానాయక్తండావాసుల ఆందోళనలు మినహా.. మొత్తంమీద లోక్‌సభ ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. జిల్లా అధికారులు పక్కాగా ఏర్పాట్లు చేయడంతోపాటు పకడ్బందీగా బందోబస్తు, అనుక్షణం పర్యవేక్షణ చేయడం కనిపించింది. నిండు వేసవిలోనూ పోలింగ్‌రోజు ఎండ ప్రభావం కూడా లేకపోవడంతో ఓటర్లు రోజంతా ఓటేశారు. ఈసారి కూడా పట్టణ ఓటర్ల కంటే పల్లెవాసులే నయమనిపించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆదర్శ పోలింగ్ కేంద్రాలు ఓటర్లను ఆకట్టుకున్నాయి. రోజంతా పోలింగ్.. జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో పోలింగ్ సరళి రోజంతా ఒకేరీతిన కొనసాగింది. ఎండ ఎక్కువగా లేకపోవడం, వాతావరణం చల్లగా ఉండటంతో ఓటర్లు ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఓట్లు వేస్తూ వచ్చారు. గతంలో మధ్యాహ్నం ఓటింగ్ తక్కువగా నమోదయ్యేది. ఈసారి అలాకాకుండా రోజంతా ఒకేలెక్కన నమోదయ్యింది. వేకువజామున 5 గంటల నుంచి 7 గంటల వరక సిబ్బంది మాక్‌పోలింగ్ చేపట్టారు. అప్పటికే చాలా గ్రామాల్లో క్యూలైన్లు నిండిపోయాయి. సరిగ్గా 7 గంటలకు పోలింగ్ ప్రారంభించారు. మొదటి రెండు గంటల్లోనే 13 శాతం ఓట్లు నమోదయ్యాయి. ఉదయం 11 గంటల వరకే దాదాపు 32 శాతం పోలింగ్ పూర్తయింది. ఇక ఒంటిగంటకే జిల్లాలో 50 శాతం ఓట్లు పడటం విశేషం. ప్రతీ రెండు గంటలకు 10–12శాతం చొప్పున పోలింగ్ నమోదవుతూ వచ్చింది. సాయంత్రం 5 గంటల వరకు జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 69.59 శాతం పోలింగ్ నమోదైంది. చివరిగంటలోనూ చాలా గ్రామాల్లో పోలింగ్ శాతం పెరిగింది. పల్లెలే నయం.. మరోసారి పట్టణ ఓటర్లు ఓటు వేయడంలో కాసింత నిరాసక్తతనే కనబర్చారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో ముందుంటామని ప్రల్లె ప్రజలు మరోసారి చాటారు. జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే.. సాయంత్రం 5 గంటల వరకు ఖానాపూర్ నియోజకవర్గంలో 67.02 శాతం నమోదుకాగా, ముధోల్‌లో ఏకంగా 72.73 శాతం పోలింగ్ నమోదైంది. పట్టణ ఓటర్లు ఎక్కువగా ఉండే నిర్మల్ నియోజకవర్గంలో 69.03 శాతం నమోదైంది. వృద్ధులు, దివ్యాంగులు కూడా పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చారు. వసతులు భేష్.. లోక్‌సభ ఎన్నికలకు జిల్లా అధికారులు కల్పించిన వసతులు పర్వాలేదనిపించాయి. ఎండలో వచ్చిన ఓటర్లకు పోలింగ్ కేంద్రాల వద్ద నీడ కల్పించేందుకు టెంట్లు ఏర్పాటు చేశారు. కొన్నిచోట్ల మినహా చాలా కేంద్రాల్లో చల్లని తాగునీరు అందుబాటులో ఉంచారు. వృద్ధులు, గర్భిణులు, దివ్యాంగుల కోసం వాహనాలను, వీల్చైర్లను ఏర్పాటు చేశారు. ఓటు వేసేందుకు వచ్చేవారికి సులువుగా ఓటు చూసుకునేలా ఓటర్ హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రంలో ఏఎన్‌ఎంతోపాటు దివ్యాంగులకు సహకరించడానికి వలంటీర్లను, ఎన్ఎస్ఎస్ విద్యార్థులను నియమించారు. అధికారుల పర్యవేక్షణ.. జిల్లాలో ప్రశాంతంగా ఎన్నికను పూర్తిచేసేందుకు కలెక్టర్ ఆశిష్సంగ్వాన్, ఎస్పీ జానకీషర్మిల నేతృత్వంలోని జిల్లా అధికారబృందం, సిబ్బంది సమష్టిగా శ్రమించారు. పోలింగ్‌రోజు జిల్లా ఉన్నతాధికారులు విస్తృతంగా పర్యవేక్షించారు. ఎస్పీ జానకీషర్మిల సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టిపెట్టారు. కలెక్టర్ కంట్రోల్‌రూమ్ నుంచి అన్ని కేంద్రాలనూ పర్యవేక్షించారు. -
బీజేపీతో భరోసా
● బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డిసారంగపూర్: కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తేనే అందరూ భరోసాగా ఉంటారని, నిరుపేదల బతకులు బాగుపడతాయని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మళ్లీ కష్టాలు తప్పవని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మండలంలోని స్వర్ణ గ్రామంలో శనివారం ఉపాధిహామీ కూలీలను కలిసి బీజేపీకి ఓటు వేయాలని కోరారు. పదేళ్లు అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేసిందని అన్నారు. మళ్లీ అధికారంలోకి వస్తే దేశాన్ని మరింత అభివృద్ధి చేస్తారని పేర్కొన్నారు. బీజేపీ కమలం పువ్వు గుర్తు కు ఓటువేసి ఎంపీగా గోడం నగేశ్‌ను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు గంగారెడ్డి, రాజేందర్‌రెడ్డి, అబ్దుల్ హదీ, విలాస్, తిరుమలచారి, చెన్న రాజేశ్వర్, రాంశంకర్‌రెడ్డి, మధు, ఆయా గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
కాంగ్రెస్‌తోనే అభివృద్ధి
● ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపటేల్ ఖానాపూర్/కడెం: కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు గెలి స్తేనే రాష్ట్రంతోపాటు దేశం అభివృద్ధి చెందుతుందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. పట్టణంతోపాటు మండలంలోని పలు గ్రామాల్లో, కడెం మండలం అంబారిపేట్ గ్రామం నుంచి పాండ్వపూర్, కొండుకూర్, కడెం మీదుగా ఖానాపూర్ వరకు బైక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణతో కలిసి శనివారం ర్యాలీ, రోడ్‌షో నిర్వహించారు. బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. రాజ్యాంగం పరిరక్షించాల న్నా, రిజర్వేషన్లను కాపాడుకోవాలన్నా కాంగ్రెస్‌ను గెలిపించాలని కోరారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించి,రాహుల్‌గాంధీని ప్రధానిని చేయాలన్నారు. అంతకుముందు క్యాంపు కార్యాలయంలో మండలంలోని గోసంపల్లె పంచాయతీ పరిధిలో గల నడింపల్లె గ్రామానికి చిప్ప దేవన్నతోపాటు పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వేర్వేరుగా జరిగిన కార్యక్రమాల్లో కడెం మండల అధ్యక్షుడు మల్లేశ్, యూత్‌కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు సతీశ్‌రెడ్డి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు దుర్గాభవాని, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు రమేశ్, నాయకులు భూషణ్, వెంకటేశ్, శంకర్, లచ్చన్న, చిన్నం సత్యం, దయానంద్, నిమ్మల రమేశ్, షబ్బీర్‌పాషా, కావలి సంతోష్, శంకర్, సత్యం, వెంకాగౌడ్, రాజేందర్, రాజేశ్వర్, శ్రీనివాస్, గంగాధర్, గంగనర్సయ్య, అమానుల్లాఖాన్, సత్యనారాయణ, సురేశ్, సచిన్, జహీర్ అహ్మద్, లక్ష్మీపతి, జహీర్ తదితరులు పాల్గొన్నారు. -
తడిసిన ధాన్యం కొంటాం
ఖానాపూర్: పట్టణంలోని వ్యవసాయ మార్కె ట్ యార్డులో వరి కొనుగోలు కేంద్రాన్ని అడిషనల్ కలెక్టర్ కిషోర్‌బాబు శనివారం సందర్శించారు. ఇటీవల కురిసిన అకాల వర్షంతో తడిసి న ధాన్యాన్ని పరిశీలించారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని, తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రైతులు పలు సమస్యలను విన్నవించారు. కొనుగోలు కేంద్రం నిర్వహణ సక్రమంగా లేదని, నిర్వాహకులు పట్టించుకోవ డం లేదని తెలిపారు. కార్యక్రమంలో పీఏసీఎస్ సీఈవో ఆశన్నతోపాటు రైతులు పాల్గొన్నారు. -
పోలింగ్ కేంద్రాల్లో వసతులు కల్పించాలి
కుంటాల/నర్సాపూప్(జి): లోకసభ ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలని డీపీవో శ్రీనివాస్ సూచించారు. కుంటాల మండలం అంబకంటి, కుంటాల గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను, నర్సాపూర్(జి) మండల కేంద్రంలోని 299, 300, 303, బమ్ని(బి) గ్రామంలోని 79 పోలింగ్ కేంద్రాన్ని శనివారం సందర్శించారు. విద్యుత్, తాగు నీరు, మూత్ర శాలలు, ర్యాంప్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆయన వెంట ఎంపీడీవో రహీం, పంచాయతీ కార్యదర్శులు ఉత్తం, రాజబాపు, రమ్య, వీణారెడ్డి, గంగాజల ఉన్నారు. అసత్య ప్రచారం చేయొద్దు ● ఎస్పీ జానకీషర్మిల నిర్మల్‌టౌన్: సమాజంలో అలజడి సృష్టించేందుకు అసత్య ప్రచారం చేయొద్దని, ఎవరైనా అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ జానకీషర్మిల హెచ్చరించారు. ఈనెల 9న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భైంసాలో నిర్వహించిన రోడ్ షోలో కొందరు ప్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలిపినట్లు చెప్పారు. కేటీఆర్ వెళ్లిపోయిన తర్వాత జన సమూహంలో ఇద్దరిపై కర్రలతో, ప్లకార్డుకు ఉన్న ఇనుప రాడ్లతో దాడి జరిగిందని పేర్కొన్నారు. ఒక వ్యక్తికి తీవ్రమైన రక్తస్రావం కావడంతో ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. గాయపడిన వ్యక్తి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు భైంసా పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశామన్నారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దాడి చేసిన వ్యక్తులను గుర్తించి 23 మందిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. దాడి చేసిన వారిలో హనుమాన్ మాలధారులు ఉన్నట్లు తెలిపారు. దీనిపై అస త్య ప్రచారం చేయొద్దని సూచించారు. కేటీఆర్ పై దాడి చేయడంతో అరెస్టు చేసినట్లు కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. -
నిర్మల్
మమతల తల్లీ... ‘అమ్మ’ తన ఆయుష్షును తనయుల కోసమే దారబోస్తుంది. నేడు ‘అంతర్జాతీయ మాతృదినోత్సవం’ సందర్శంగా కథనం. నిస్వార్థ సేవకులు ఆస్పత్రిలో రోగులకు వైద్యసేవలు అందించే నిస్వార్థ సేవకులు నర్సులు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం. ఆదివారం శ్రీ 12 శ్రీ మే శ్రీ 20242లోu ఎన్నికల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి నిర్మల్‌చైన్‌గేట్: పార్లమెంట్ ఎన్నికల విధులు నిర్వర్తించే సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో పార్లమెంట్ ఎన్నికల విధుల్లో పాల్గొనే నిర్మల్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని అధికారులకు నియమ నిబంధనలపై శనివారం అవగహన కల్పించారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా నిర్వహించే అన్నిరకాల రిజిస్టర్లు, ఫారాల గురించి తెలియజేశారు. ఆదివారం ఉదయం ఈవీఎంల పంపిణీ కేంద్రానికి వచ్చి అన్నిరకాల ప్రక్రియలు పూర్తిచేసి మధ్యాహ్నం పోలింగ్ కేంద్రాలకు బయలుదేరాలని ఆదేశించారు. పోలింగ్ జరిగే సమయంలో నిర్దేశించిన డేటా ఎంట్రీ యాప్‌లో పోలింగ్ శాతానికి సంబంధించిన వివరాలు పంపాలన్నారు. ఈవీఎం యంత్రాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తి పోలింగ్ నిలిచిపోతే పోలింగ్‌ను తిరిగి త్వరితగతిన ప్రారంభించేందుకు అన్ని చర్యలు చేపట్టాలన్నారు. పంచాయతీ కార్యదర్శులు పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లను పర్యవేక్షించాలన్నారు. అనంతరం మాస్టర్ ట్రైనర్లు, సిబ్బందికి ఎన్ని కల విధులపై అవగహన కల్పించారు. సమావేశంలో ఆర్డీవో రత్నకళ్యాణి, మాస్టర్ ట్రైనర్లు శ్రీనివాస్‌రెడ్డి, శ్రీనివాస్, సెక్టార్ అధికారులు, రూట్ అధికారులు, ఎంపీడీవోలు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. నిర్మల్: ఢిల్లీ పీఠం కోసం జరుగుతున్న పార్లమెంట్ పోరులో ప్రచారపర్వం శనివారం సాయంత్రంతో ముగిసింది. సోమవారం నిర్వహించే ఓట్లపండుగకు ఆదివారం ఉదయం నుంచే అసలు కథ మొదలవుతోంది. పార్టీలు, అభ్యర్థులు జోరుగా తిరగడం, ప్రచారాన్ని హోరెత్తించడం ఒకెత్తయితే.. ఆదివారం, సోమవారం ఈ రెండురోజులపాటు ఓపికతో, ప్రశాంతంగా ఎన్నికల సిబ్బంది పనిచేయడం మరో ఎత్తు. అభ్యర్థులు, నాయకులు విజయం కోసం శ్రమిస్తే.. అధికారులు, సిబ్బంది ఎన్నికలు విజయవంతంగా పూర్తిచేసేందుకు రెండురోజులు నిర్విరామంగా పనిచేస్తారు. ఎన్నికల నిర్వహణకు కావాల్సిన పోలింగ్ సామగ్రిని, ఈవీఎంలను అందించడానికి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఇప్పటికే పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 926 పోలింగ్ కేంద్రాలు.. లోక్‌సభ ఎన్నికల కోసం జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 926 పోలింగ్ కేంద్రాలు ఏర్పా టు చేశారు. ఇందులో 149 సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. ఇక్కడ పీవో, ఏపీవో, ఓపీవోలతోపాటు అదనంగా 106 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించారు. అదనపు పోలీసు బలగాల పర్యవేక్షణ కూడా ఉండనుంది. ప్రతీ పోలింగ్ కేంద్రంలో వంద శాతం వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేస్తున్నారు. 7,37,416 మంది ఓటర్లు.. జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 7,37,416 మంది ఓటర్లు ఉన్నారు. మహిళా ఓటర్లు 3,82,107 మంది, పురుషులు 3,55,259 మంది, ఇతరులు 50 మంది ఉన్నారు. జిల్లాలో పురుషుల కంటే 26,848 మంది మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. నేడు పోలింగ్ సామగ్రి పంపిణీ.. జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఆదివారం ఉదయం నుంచే పోలింగ్ సామగ్రి పంపిణీకి ఏర్పాట్లు పూర్తిచేశారు. నిర్మల్ నియోజకవర్గానికి సంబంధించి స్థానిక ఎన్టీఆర్ మినీస్టేడియంలో, ముధోల్‌లో గురుకుల విద్యాలయంలో, ఖానాపూర్ నియోజకవర్గానికి సంబంధించి ఉట్నూరు కేబీకాంప్లెక్స్లో పోలింగ్ సామగ్రి పంపిణీ, స్వీకరణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. గత ఎన్నికల్లో ఎదురైన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈసారి పోలింగ్ సామగ్రినంతా ఒకే బ్యాగ్‌లో పెట్టి సిబ్బందికి అందించే ఏర్పాట్లు చేశారు. నియోజకవర్గాల వారీగా ఈవీఎంలు, వీవీ ప్యాట్లను పంపిణీకి సిద్ధం చేశారు.న్యూస్‌రీల్ జిల్లాలో 926 పోలింగ్ కేంద్రాలు.. అందులో సమస్యాత్మకం.. 149 జిల్లాలో ఓటర్ల సంఖ్య..7,37,416 సన్నద్ధమవుతున్న పోలింగ్ సిబ్బంది నేడు నియోజకవర్గకేంద్రాల్లో ‘సామగ్రి’ పంపిణీ వివరాలు: మొత్తం ఓటర్లు: 7,37,416 పురుషులు: 3,55,259 మహిళలు: 3,82,107 ఇతరులు: 50 పంపిణీ/స్వీకరణ కేంద్రాలు : 03(ముధోల్, నిర్మల్, ఉట్నూర్) మొత్తం పోలింగ్ కేంద్రాలు: 926(నిర్మల్:306 ముధోల్:311 ఖానాపూర్ :309) సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు: 149మహిళా పోలింగ్ కేంద్రాలు : 03మోడల్ పోలింగ్ కేంద్రాలు : 03పీఓ, ఏపీఓ, ఓపీఓలు : 4,436మైక్రో అబ్జర్వర్లు : 106 ప్రశాంతంగా పూర్తిచేసేలా.. జిల్లాలో లోక్‌సభ ఎన్నికలనూ సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం. పోలింగ్ కేంద్రాలలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేశాం. ఈ ఎన్నికలను ప్రశాంతంగా పూర్తిచేసేందుకు జిల్లా ప్రజలూ సహకరించాలి. ఓటుహక్కును సద్వినియోగం చేసుకోవాలి. –ఆశిష్సంగ్వాన్, కలెక్టర్పకడ్బందీగా బందోబస్తు.. జిల్లా మొత్తం ఇప్పటికే పోలీసుల రక్షణ వలయంలో ఉంది. జిల్లా అంతటా పోలీసు బలగాలను సిద్ధం చేశాం. పోలింగ్ ప్రక్రియకు ఎక్కడా ఎలాంటి ఆటంకం కలుగకుండా పోలీసులను మోహరిస్తున్నాం. ప్రజలు కూడా ప్రశాంత పోలింగ్‌కు సహకరించాలని కోరుతున్నాం. –జానకీషర్మిల, ఎస్పీరెండురోజులు.. నిర్విరామంగా.. జిల్లాలో మొత్తం 1,109 మంది చొప్పున పీవోలు, ఏపీవోలు, 2,218 ఓపీఓలు ఉన్నారు. వీరంతా ఆదివారం ఉదయం కచ్చితంగా తమకు కేటాయించిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలకు చేరుకోవాలని కలెక్టర్ ఆశిష్సంగ్వాన్ ఆదేశించారు. ఇక ఈ ఎన్నికల యుద్ధాన్ని ప్రశాంతంగా నిర్వహిస్తూ.. విజయవంతంగా పూర్తిచేసే బాధ్యత పోలింగ్ సిబ్బందిపైనే ఉంటుంది. వీరంతా ఆదివారం సామగ్రి తీసుకోవడం, పరిశీలన చేసుకోవడం, అనంతరం తమ బృందంతో కలిసి పోలింగ్ కేంద్రాలకు వెళ్లడం, అక్కడ ఏ రాత్రయినా.. ఏర్పాట్లు చేసుకోవడం చేయాల్సి ఉంటుంది. సోమవారం ఉదయం 5 గంటలకే మాక్‌పోలింగ్ చేపట్టాలి. ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ను సజావుగా పూర్తిచేయాల్సి ఉంటుంది. అనంతరం అన్నీ సరిచూసుకుని మళ్లీ ఈవీఎంలతో పాటు పోలింగ్ సామగ్రిని తిరిగి కేంద్రాల్లో అప్పజెప్పాలి. ఏరాత్రయినా.. ఓపికతో ఈ పనులన్నీ పూర్తిచేయాల్సి ఉంటుంది. ఇందుకోసం సిబ్బంది కూడా మానసికంగా సన్నద్ధమవుతున్నారు. -
పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్
● కేంద్రాల వారీగా కేటాయింపు ● పార్లమెంట్’ పరిధిలో 10,548 మందికి విధులు కై లాస్‌నగర్: ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎన్నికల విధులు నిర్వహించే పీవో, ఏపీవో, ఓపీవోలు, మైక్రోఅబ్జర్వర్స్ లోకేషన్ చివరి ర్యాండమైజేషన్ ప్రక్రియ శనివారం చేపట్టారు. సాధారణ పరిశీలకులు రాజేంద్ర విజయ్, రిటర్నింగ్ అధికారి రాజర్షి షా, ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేష్ దోత్రే , నిర్మల్ అదనపు కలెక్టర్ కిశోర్ కుమార్ సమక్షంలో ఆన్లైన్లో ఈ ప్రక్రియ పూర్తి చేశారు. పార్లమెంట్ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 2,200 పోలింగ్ కేంద్రాల్లో విధులు నిర్వహించేలా ఈ కేటాయింపులు చేశారు. 2,637 మంది పీవోవోలు, 2,637 మంది ఏపీవోలు, 5,274 మంది ఓపీవోల చొప్పున మొత్తం 10,548 మందిని ఆ యా నియోజకవర్గాలకు నియమించారు. ఇందులో ఆదిలాబాద్ నియోజకవర్గానికి 1,400 మందిని కేటాయించగా, బోథ్ నియోజకవర్గానికి 1,468, ఆసిఫాబాద్‌కు 1,708, సిర్పూర్‌కు 1,536, నిర్మల్‌కు 1,468, ఖానాపూర్‌కు 1,476, ముధోల్‌కు 1,492 మందిని కేటాయించారు. కార్యక్రమంలో మూడు జిల్లాల ఎన్నికల అధికారులు, ఈడీఎంలు పాల్గొన్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా వివరాలు.. నియోజకవర్గం పోలింగ్‌కేంద్రాలు పీవోలు ఏపీవోలు ఓపీవోలు ఆదిలాబాద్ 292 350 350 700 బోథ్ 306 367 367 734 ఆసిఫాబాద్ 356 427 427 854 సిర్పూర్ 320 384 384 768 నిర్మల్ 306 367 367 734 ఖానాపూర్ 309 369 369 738 ముధోల్ 311 373 373 746 -
ప్రతీ హామీ అమలు చేస్తాం
● డీసీసీ అధ్యక్షుడు కూచాడి శ్రీహరిరావుమామడ: కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేస్తామని డీసీసీ అధ్యక్షుడు కూచాడి శ్రీహరిరావు అన్నారు. మండలంలోని పరిమండల్, పొన్కల్, పోతారం, బండలఖానాపూర్ గ్రామాలలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ తరఫున ప్రచారం నిర్వహించారు. ఇప్పటికే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిమితి రూ.10 లక్షలకు పెంచామన్నారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నట్లు తెలిపారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఉపాధిహామీ కూలీలకు రోజు వేతనం రూ.400 చెల్లిస్తామని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు జైసింగ్, సంతోష్, రమణారెడ్డి, లింగారెడ్డి, శేఖర్, లింగన్న, గంగారెడ్డి, నర్సారెడ్డి, అజాం, బాపయ్య, రఫీ తదితరులు పాల్గొన్నారు. సీపీఐఎంఎల్ ఆధ్వర్యంలో.. మండలంలోని నల్దుర్తి, దిమ్మదుర్తి, కప్పన్‌పల్లి, పొన్కల్ గ్రామాల్లో సీపీఐఎంఎల్ న్యూ డెమోక్రసీ డివిజన్ కార్యదర్శి రాజేశ్ ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థి ఆత్రం సుగుణను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో సత్తన్న, చిన్నరాజన్న, రవి, రాజమణి, బక్కన్న పాల్గొన్నారు. -
శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు
● ఎస్పీ జానకీషర్మిలభైంసాటౌన్: శాంతి భద్రతలకు విఘాతం కలిగించేవారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ జానకీషర్మిల హెచ్చరించారు. భైంసాలో శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ.. గురువారం భైంసాలో కేటీఆర్‌పై దాడి ఘటనకు సంబంధించి వీడియో ఫుటేజ్ ఆధారంగా 23 మందిని గుర్తించామన్నారు. ఈ మేరకు వారిని అరెస్ట్ చేశామని తెలిపారు. నలుగురిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. భైంసాలో ప్రశాంత వాతవరణం ఉందని, నిరంతర పోలీస్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నామన్నారు. రెచ్చగొట్టే పుకార్లను నమ్మొద్దని, సంయమనం పాటించాలని సూచించారు. సమావేశంలో పట్టణ సీఐ డి.రాజారెడ్డి ఉన్నారు. ‘హనుమాన్ స్వాముల అరెస్ట్ సరికాదు’ కేటీఆర్ రోడ్‌షో సందర్భంగా శాంతియుతంగా నిరసన తెలిపిన హనుమాన్ స్వాములను అరెస్ట్ చేయడాన్ని బీజేపీ పట్టణ అధ్యక్షుడు మల్లేశ్వర్ ఖండించారు. పట్టణంలోని ఎస్ఎస్ కాటన్లో శుక్రవారం మాట్లాడారు. హిందువుల మనోభావాలు దెబ్బతీయడంతోపాటు, పోలీసులను కించపరిచేలా మాట్లాడిన కేటీఆర్‌పై చర్య తీసుకోకుండా, మాలధారణలో ఉన్న స్వాములను అర్ధరాత్రి అరెస్ట్ చేయడమేంటని ప్రశ్నించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని బీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీలకు భయం పట్టుకుందన్నారు. సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రవిపాండే, అసెంబ్లీ సంయుక్త కన్వీనర్ సుమన్, నాయకులు బాలాజీ సూత్రావే, రావుల పోశెట్టి, దశరథ్ ఉన్నారు. -
ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి
● జిల్లా ఎన్నికల అధికారి ఆశిష్ సంగ్వాన్ నిర్మల్ రూరల్: పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ కోసం జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు. రాష్ట్ర ప్రధాన ఎన్ని కల అధికారి వికాస్‌రాజ్ ఎన్నికల నిర్వహణ, పో లింగ్ ఏర్పాట్లపై కలెక్టర్లు, అధికారులతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. పోలింగ్ కోసం ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. అన్నిరకాల స్క్వాడ్ సిబ్బందిని మరింత అప్రమత్తంగా చేయాలన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో రాజకీయ ప్రకటనలకు మీడియా మానిటరింగ్ అండ్ సర్టిఫికేషన్ కమిటీ (ఎంసీఎంసీ) అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని ఆదేశించారు. నిర్దేశించిన మార్గాల్లో మాత్రమే రూట్ ఆఫీసర్ల సమక్షంలో ఈవీఎం యంత్రాల తరలించాలాన్నారు. వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున పోలింగ్ సామగ్రి తరలింపులో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పోలింగ్ శాతం రిపోర్టులను సమయానికి పంపాలన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వంద శాతం వెబ్ కాస్టింగ్ చేయనున్నట్లు తెలిపారు. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ, జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఎన్నిక ల నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ఎన్నికల నోడల్ అధికారులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించామన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఫైజాన్అహ్మద్, డీఆర్వో భుజంగరావ్, ఆర్డీవో రత్నాకళ్యాణి, డీఈవో రవీందర్‌రెడ్డి, డీఆర్డీవో విజయలక్ష్మి, డీపీఆర్వో విష్ణువర్ధన్, డీపీవో శ్రీనివాస్, ఇతర జిల్లా నోడల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. స్ట్రాంగ్ రూంల వద్ద పటిష్ట నిఘా ఈవీఎం స్ట్రాంగ్ రూంల వద్ద నిరంతరం పటిష్ట నిఘా ఉంచాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. వివిధ రాజకీయ పార్టీల నాయకుల సమక్షంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో స్ట్రాంగ్ రూం తలుపులు తెరిచి, ఖానాపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన ఈవీఎంలను కలెక్టరేట్ సమీపంలోని ఈవీఎం గోదాంలోకి పోలీసు బందోబస్తుతో తరలించారు. అనంతరం వివిధ రాజకీ య పార్టీల నాయకుల సమక్షంలో ఈవీఎం గోదాంకు సీల్ వేశారు. స్ట్రాంగ్ రూంల వద్ద విధులు నిర్వర్తించే సిబ్బంది ప్రతీక్షణం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అదనపు కలెక్టర్ కిశోర్‌కుమార్, ఎన్నికల పర్యవేక్షకులు శ్రీనివాస్, నాయకులు శ్రావణ్‌రెడ్డి, రవికుమార్, గండ్రత్ రమేశ్, సిరికొండ రమేశ్, ఎంబడి రాజేశ్వర్ పాల్గొన్నారు. -
జిల్లాకు చేరుకున్న పోలీసు బలగాలు
నిర్మల్‌టౌన్: ఈనెల 13న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీస్ బలగాలు జిల్లాకు చేరుకున్నాయి. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లికి చెందిన బీఎస్ఎఫ్ బలగాలు శుక్రవారం రాత్రి నిర్మల్‌కు చేరుకున్నాయి. అంతేకాకుండా పలు జిల్లాల నుంచి సుమారు 1000 మంది సిబ్బంది ఎన్నికల్లో విధులు నిర్వహించనున్నారు. స్థానిక డీఎస్పీ కార్యాలయంలో ఎన్నికల విధులపై డీఎస్పి గంగారెడ్డి, పట్టణ సీఐ అనిల్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. పోలీసుల ఫ్లాగ్ మార్చ్ జిల్లా కేంద్రంలో శుక్రవారం రాత్రి పోలీసులు ఫ్లాగ్‌మార్చ్ నిర్వహించారు. డీఎస్పీ గంగారెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించడానికి అన్ని రకాల చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఎవరైనా శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇందులో పట్టణ సీఐ అనిల్, బీఎస్ఎఫ్ బలగాలు పాల్గొన్నాయి. -
కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి
నిర్మల్/సారంగపూర్: అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆరుగ్యారంటీల హామీ ఇచ్చి, ఐదింటిని నెరవేర్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే దేశం అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించిందని పేర్కొన్నారు. పదేళ్లలో బీజేపీ చేసిందేమీ లేదని విమర్శించారు. నిర్మల్ ఎంఎస్ ఫంక్షన్హాల్లో అర్భన్ కార్యకర్తలతో, సారంగాపూర్‌లోని అల్లోల మురళీధర్‌రెడ్డి కాంప్లెక్స్‌లో మండల కార్యకర్తలు, ముఖ్య నాయకులతో శుక్రవారం వేర్వేరుగా సమావేశం నిర్వహించారు. బీజేపీ ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేసి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకుండా చేసి సంపదను బహుళజాతి కంపెనీలకు దోచిపెడుతోందని ఆరోపించారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పేదల బతుకులు బాగుపడతాయన్నారు. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ఓనిరుపేద గిరిజన మహిళ ఆత్రం సుగుణను పార్టీ అభ్యర్థిగా నిలబెట్టామని తెలిపారు. ఆశీర్వదించాలని కోరారు. ఇచ్చిన గ్యారంటీలతోపాటు అభివృద్ధికిపాటుపడే కాంగ్రెస్ పార్టీని పార్లమెంట్ ఎన్నికల్లోనూ గెలిపించాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ పత్తిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి, నాయకులు అల్లూరి మల్లారెడ్డి, రామలింగం, ధర్మాజీ రాజేందర్, పాకాల రాంచందర్, అయిర నారాయణరెడ్డి, నల్ల వెంకట్రామిరెడ్డి, మోకుదెబ్బ నాయకులు నర్సాగౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దశరథ రాజేశ్వర్, ప్రముఖ పారిశ్రామికవేత్త అల్లోల మురళీధర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ మహిపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ● మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి -
● ఆడబిడ్డను ఆశీర్వదించండి..
ఆదిలాబాద్ పార్లమెంట్ నుంచి తొలిసారి పోటీచేస్తున్న ఆదివాసీ ఆడబిడ్డ, కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణను గెలిపించాలని జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క కోరారు. కాంగ్రెస్ బైక్ ర్యాలీ జిల్లాకేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియం నుంచి ప్రారంభమైంది. మధ్యలో పాల్గొన్న మంత్రి సీతక్క మాట్లాడుతూ మాటలు చెప్పే మోదీ సర్కారు వద్దని, ఇక చేతల్లో అభివృద్ధిని చూపే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపిద్దామన్నారు. తాము సాయంత్రం 6 నుంచి 9 గంటల వరకు ర్యాలీకి అనుమతి తీసుకున్నామన్నారు. బీజేపీ పోటీగా ర్యాలీ తీయడం దారుణమని పేర్కొన్నారు. ఆదిలాబాద్ నుంచి ఆడబిడ్డకు అవకాశం ఇచ్చిన కాంగ్రెస్‌కు ఓటేయాలని కోరారు. ర్యాలీలో మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, మాజీ చైర్మన్ అప్పాల గణేశ్‌చక్రవర్తి, పలువురు కౌన్సిలర్లు, నాయకులు, అధికసంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.ర్యాలీని ఉద్దేశించి మాట్లాడుతున్న మంత్రి సీతక్క -
● బీజేపీకి ఓటేద్దాం.. మోదీని గెలిపిద్దాం..
కేంద్రంలో మళ్లీ నరేంద్రమోదీ ప్రభుత్వం రావా లంటే బీజేపీకి ఓటేద్దామని ఎంపీ అభ్యర్థి నగేశ్, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి పిలుపునిచ్చారు. జిల్లాకేంద్రంలోని బస్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి మహేశ్వర్‌రెడ్డి ర్యాలీని ప్రారంభించి మాట్లాడారు. దేశంలో అవినీతిరహిత ప్రభుత్వం కోసం మళ్లీ కమలం గుర్తుకు ఓటేయాలని వారు పిలుపునిచ్చారు. బీజేపీ అధికారంలో ఉన్నంతకాలం రిజర్వేషన్లకు ఢోకా ఉండదన్నారు. రాష్ట్రంలో మెజార్జీ స్థానాలు గెలిచి ముఖ్యమంత్రి మెడలు వంచి పనులు చేయిస్తామన్నారు. ర్యాలీలో పార్టీ జిల్లా అధ్యక్షుడు అంజుకుమార్‌రెడ్డి, పార్లమెంట్ కన్వీనర్ అయ్యన్నగారి భూమయ్య, పెద్దపల్లి ఇన్చార్జి రావుల రాంనాథ్, సీనియర్‌నేత సత్యనారాయణగౌడ్, భారీసంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.ర్యాలీలో ఎంపీ అభ్యర్థి నగేశ్, ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి -
ఖానాపూర్‌లో రాత్రి భోజనం చేసిన కేటీఆర్
ఖానాపూర్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ గురువారం భైంసా, నిర్మల్‌లో నిర్వహించిన కార్నర్ మీటింగ్‌ల అనంతరం తిరుగుప్రయాణంలో ఖానాపూర్‌లో బీఆర్ఎస్ క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి బుక్యా జాన్సన్నాయక్తోపాటు బోథ్ ఎమ్మెల్యే అనిల్‌జాదవ్ స్వాగతం పలికారు. కాసేపు ఎన్నికలపై చర్చించారు. అనంతరం ఇక్కడే రాత్రి భోజనం చేసి 11 గంటల ప్రాంతంలో హైదరాబాద్ వెళ్లిపోయారు. కేటీఆర్ కోసం ఆయన మిత్రుడు జాన్సన్‌నాయక్ ప్రత్యేక వంటకాలు చేయించారు. -
పనులు త్వరగా పూర్తి చేయండి
సోన్: అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని జెడ్పీ సీఈవో గోవింద్ సూచించారు. సోన్ మండలం పాక్పట్ల గ్రామంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలలో జరుగుతున్న పనులను శుక్రవారం పరిశీలించారు. ఉన్నత పాఠశాలలో మూత్రశాలలు, విద్యుత్ మరమ్మత్తు పనులు పూర్తి చేశామని తెలిపారు. మిగిలిన పనులు ఎన్నికల అనంతరం పూర్తి చేయాలని ఆదేశించారు. ఆయన వెంట ఎంపీడీవో సురేశ్, ఏపీవో మంజులారెడ్డి, కార్యదర్శి సంధ్యారెడి, గోపిగౌడ్, అమ్మ ఆదర్శ కమిటీ చైర్పర్సన్లు అనుప లక్ష్మి, కొమిరే స్వప్న ఉన్నారు. -
నిర్మల్
కమలం జోరు.. కాంగ్రెస్ హోరు..ఓటుకు సెలవివ్వొద్దు..! లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఈనెల 13న పోలింగ్ రోజు సెలవు దినంగా భావించకుండా ఓటెయ్యాలని ప్రజాస్వామ్యవాదులు సూచిస్తున్నారు. 2లోu శనివారం శ్రీ 11 శ్రీ మే శ్రీ 2024ఽధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి నర్సాపూర్(జి): ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని డీఏవో అంజిప్రసాద్ సూచించారు. మండలంలోని డొంగురుగావ్, చాక్పల్లిలోని డీసీఎంఎస్ కేంద్రాలను శుక్రవారం పరిశీలించారు. నిబంధనల మేరకు ధాన్యం తూకం వేయాలని తెలిపారు. అకాల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపినందున ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా రైతులు గన్నీ బ్యాగులు, లారీల కొరత లేకుండా చూడాలని డీఏవోను కోరారు. ఆయన వెంట క్లస్టర్ ఏఈవో రమ్య, సెంటర్ నిర్వాహకుడు జంగిపల్లి సంతోష్, రైతులు ఉన్నారు.ర్యాలీలో పాల్గొన్న బీజేపీ నాయకులు, కార్యకర్తలు నిర్మల్/నిర్మల్‌టౌన్: పార్లమెంట్ పోరు జిల్లాలో శుక్రవారం ఒక్కసారిగా హీటెక్కింది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీలు చేపట్టడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. శుక్రవారం సాయంత్రం రెండు పార్టీలు ర్యాలీ తీశాయి. పురవీధులు రెండు పార్టీల నినాదాలతో హోరెత్తాయి. ప్రచారానికి ఇంకా కొన్ని గంటలే ఉండడంతో రెండు పార్టీలూ భారీ ర్యాలీలతో బల ప్రదర్శన చేశాయి. ఈక్రమంలో ఒకచోట రెండు ర్యాలీలూ ఎదురు పడడంతో ఉద్రిక్తంగా మారింది. కాంగ్రెస్, కమలం పార్టీల కార్యకర్తలు పోటాపోటీ నినాదాలు చేసుకున్నారు. అప్రమత్తమైన పోలీసులు ఇరువర్గాలను అదుపు చేశారు. ఉద్రిక్తత తగ్గించారు. బీజేపీ ర్యాలీలో ఎంపీ అభ్యర్థి నగేశ్, బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్‌రెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ బైక్‌ర్యాలీలో మంత్రి సీతక్క, పార్టీ నేతలు బెల్లయ్యనాయక్, రాములునాయక్, డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు ఉన్నారు.న్యూస్రీల్కాంగ్రెస్ ప్రచార ర్యాలీలో నాయకులు, కార్యకర్తలు -
మౌలిక వసతులు కల్పిస్తాం
● టీవీవీపీ కమిషనర్ అజయ్‌కుమార్ నిర్మల్‌చైన్‌గేట్: తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆస్పత్రుల్లో మౌలిక వసతులు కల్పిస్తామని టీవీవీపీ కమిషనర్ డాక్టర్ అజయ్‌కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని డీసీహెచ్ఎస్ కార్యాలయంలో టీవీ వీపీ ఆస్పత్రుల మెడికల్ ఆఫీసర్లతో గురువారం రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా ఆస్పత్రుల్లో అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నా రు. మెరుగైన వైద్యం అందించేందుకు కావాల్సిన సౌకర్యాలపై చర్చించారు. పేషెంట్ సర్వీస్ విషయంలో ఇనిస్టిట్యూట్ పరిధిలోని సివిల్, శానిటేషన్, ప్లంబింగ్ పనులకు సంబంధించి సమస్యలు పరిష్కరిస్తామన్నారు. రోగులకు ఇబ్బందులు కలుగకుండా వైద్యవిధాన పరిషత్ ఆస్పత్రుల్లో మెరుగైన సేవలు అందిస్తామన్నా రు. సమావేశంలో డీసీహెచ్ఎస్ దేవేందర్‌రెడ్డి, భైంసా ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ కాశీనాథ్, ఖానాపూర్ సీహెచ్‌సీ సూపరింటెండెంట్ వంశీమాధవ్, ముధోల్ సీహెచ్‌సీ సూపరింటెండెంట్విజయానంద్ పాల్గొన్నారు. వర్క్ ఆర్డర్ ఇప్పించాలని వినతి నిర్మల్‌చైన్‌గేట్: తెలంగాణ వైద్యవిధాన పరిషత్ ఆధ్వర్యంలో విధులు నిర్వహించిన ఔట్సో ర్సింగ్ సిబ్బందికి డీఎంయూ పరిధిలోని జిల్లా ప్రధాన ఆసుపత్రిలో పనిచేయడానికి వర్క్ ఆర్డర్ ఇప్పించాలని తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. 17 ఏళ్లుగా జిల్లా, మెటర్నిటీ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న తమ వర్క్ ఆర్డర్ మార్చితో ముగిసిందని తెలిపారు. -
ఎన్నికలకు సర్వం సిద్ధం
● జిల్లా ఎన్నికల అధికారి ఆశిష్ సంగ్వాన్నిర్మల్చైన్గేట్: ప్రశాంత వాతావరణంలో పార్లమెంటు ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు. కలెక్టరేట్లోని సమావేశం మందిరంలో పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ, పోలింగ్ ఏర్పాట్లపై గురువారం మాట్లాడారు. 926 పోలింగ్ కేంద్రాలు.. జిల్లాలో మొత్తం 926 పోలింగ్ కేంద్రాలు సిద్ధం చేశామని కలెక్టర్ తెలిపారు. నిర్మల్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 306, ఖానాపూర్ పరిధిలో 309, ముధోల్‌లో 311 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని వివరించారు. ప్రతీ పోలింగ్ కేంద్రంలో వంద శాతం వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. జిల్లాలో మూడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 149 సమస్యాత్మక, నక్సల్ ప్రభావిత, వల్న రబుల్ పోలింగ్ కేంద్రాలను గుర్తించామని పేర్కొన్నారు. ఇక్కడ అదనపు బందోబస్తు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. అసెంబ్లీ సె గ్మెంట్లలో ఒక్కో నమూనా పోలింగ్ కేంద్రం(మోడ ల్ పోలింగ్ కేంద్రం) మహిళా పోలింగ్ కేంద్రం ఏ ర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఎండలు అధికంగా ఉన్నందున పోలింగ్ కేంద్రాల్లో టెంట్లు, షా మియానా, తాగునీరు, ఫ్యాన్లు, బెంచీలు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అత్యవసర మందులు, వైద్య సిబ్బంది, దివ్యాంగ ఓటర్ల కోసం వీల్చైర్లు, వలంటీర్లు, ర్యాంప్ ఏర్పాటు చేశామని వివరించారు. 609 మంది హోమ్ ఓటింగ్... 85 ఏళ్లు పైబడిన వృద్ధులు, పోలింగ్ కేంద్రాలకు రాలేని దివ్యాంగులు మొత్తం 636 మందికి హోం ఓటింగ్ కోసం దరఖాస్తు చేసుకోగా, 609 మంది హోం ఓటింగ్ సౌకర్యాన్ని వినియోగించుకున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు సీవిజిల్ యాప్ లో 14 ఫిర్యాదులు రాగా వాటిని పరిష్కరించామన్నారు. 1950 టోల్ ఫ్రీ నంబర్‌కు వచ్చిన ఫిర్యాదులను కూడా పరిష్కరించామన్నారు. ఎన్నికల కోడ్‌ను పకడ్బందీగా అమలు చేస్తున్నామని తెలిపారు. రూ.3.81 కోట్ల మద్యం స్వాధీనం... జిల్లాలో ఇప్పటి వరకు ఎటువంటి అనుమతులు లేకుండా తరలిస్తున్న రూ.3.81 కోట్ల మద్యం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో తక్కువ ఓటింగ్ శాతం నమోదవుతున్నందున ఓటర్లకు అవగాహన పెంచడం కోసం స్వీప్ (సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోర్రల్ పార్టిసిపేషన్) ఆధ్వర్యంలో 5కే రన్, కళాజాత వంటి అవగాహన కార్యక్రమాలు చేపట్టామన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిశోర్‌కుమార్, డీపీఆర్వో విష్ణువర్ధన్ పాల్గొన్నారు. కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించాలి రైతులకు ఇబ్బందులు కలుగకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో ధాన్యం కొనుగోళ్లు, అకాల వర్షాలకు నష్టం జరుగకుండా తీసుకోవాల్సిన చర్యలుపై సంబంధిత అధికారులతో గురువారం సమీక్ష నిర్వహించారు. అకాల వర్షాలు కురుస్తున్నందున కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడవకుండా టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. రానున్న రోజుల్లో మరింత వర్షాలు కురిసే అవకాశం ఉందన్న అప్రమత్తంగా ఉండాలన్నారు. ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని సూచించారు. కొనుగోలు చేసిన వెంటనే మిల్లులకు తరలించాలన్నారు. ప్యాడీ క్లీనింగ్ యంత్రాల ద్వారా ధాన్యం శుభ్రపరిచేలా చూడాలన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో కేంద్రాలను పరిశీలించి రోజువారీ రిపోర్టులను సమర్పించాలని ఆదేశించారు. డీఎస్ వో నందిత, సివిల్ సప్లయ్ డీఎం శ్రీకళ, డీఏవో అంజిప్రసాద్, మార్కెటింగ్ ఏడీ అశ్వాక్ పాల్గొన్నారు. -
ఫోన్ పోతే ఆందోళన వద్దు
● ఎస్పీ డాక్టర్ జానకీషర్మిలనిర్మల్ టౌన్: మొబైల్ ఫోన్ పొతే ఆందోళన వద్దని, సంబధిత పోలీస్ స్టేషన్లో లేదా మీసేవ ద్వారా ఫిర్యాదు చెయాలని ఎస్పీ డాక్టర్ జానకీషర్మిల సూ చించారు. https://www.ceir.gov.in/ వెబ్ పోర్టల్ ద్వారా ఫోన్ ఆచూకీ తెలుసుకోవడం సులభమన్నారు. వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో పోగొట్టుకున్న 87 మొబైల్ ఫోన్లను సీఈఐఆర్ వెబ్సైట్ ద్వారా గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వాటిని బాధితులకు ఎస్పీ కార్యాలయంలో గురువారం అందజేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడు తూ.. మార్కెట్లో చౌకగా వస్తుందని, సెకండ్ హాండ్ ఫోన్లు కొనేముందు సీఈఐఆర్ వెబ్సైట్లో ఆ ఫోన్ ఐఎంఈఐ నంబర్ నమోదు చేసుకోవాలన్నా రు. దొంగతననికి లేదా ఫోన్లను వెతికి పెట్టడానికి జిల్లా పోలీస్ యంత్రాంగం ఇప్పటికే పలు రకాల సాంకేతిక అంశాలను ఉపయోగిస్తుందని తెలిపారు. ఇప్పటి వరకు 697 ఫోన్లను రికవరీ చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఐటీ కోర్, వివిధ పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు. -
అకాల వర్షం.. అన్నదాతకు నష్టం
ఖానాపూర్/కుంటాల: జిల్లాలో గురువారం సాయంత్రం వడగళ్ల వర్షం కురిసింది. ఖానాపూర్, కుంటాల మండలాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కురిసిన అకాల వర్షానికి రైతులు ఇబ్బంది పడ్డారు. మామిడి కాయలు నేలరాలాయి. కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఆరబెట్టిన ధాన్యం తడిసింది. కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యాన్ని కప్పేందుకు టార్పాలిన్లు లేకపోవడంతో రైతులు ధాన్యం కాపాడుకునేందుకు తిప్పలు పడ్డారు. ఖానాపూర్ మార్కెట్ యార్డులో వరదకు ధాన్యం కుప్పలు కొట్టుకుపోయాయి. కుంటాల మండలం కల్లూర్, అందాకూర్, అంబకంటి, ఓలా, కుంటాల,లింబా(కె) తదితర గ్రామాల్లో జొన్న, మొక్కజొన్న పంటలు తడవకుండా రైతులు జాగ్రత్త పడ్డారు. రైతులు ఆందోళన చెందొద్దు ఖానాపూర్: అకాల వర్షం కారణంగా ధాన్యం తడిసిన రైతులు ఆందోళన చెందొద్దని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు అన్నారు. పట్టణంలోని మార్కెట్ యార్డులో వరి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే గురువారం పరిశీలించారు. పంట తడిసి నష్టపోయిన రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని తెలిపారు. ఎమ్మెల్యే వెంట నాయకులు, రైతులు ఉన్నారు.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్‌పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కోనసీమ: ఉడుమూడిలో ఘోర రోడ్డు ప్రమాదం
త్రినయని సీరియల్ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్ (ఫోటోలు)
స్టార్ హీరో గొప్పమనసు.. రూ. కోటి చెక్ విరాళం!
ఎరక్కపోయి ఇరుక్కుపోయి
మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
కేఎల్ రాహుల్ మాస్టర్ ప్లాన్.. మెక్ గర్క్ సిల్వర్ డక్! వీడియో
Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్‌గా మళ్లీ కోహ్లినే!
రామ్- పూరి కాంబో.. డబుల్ మాస్ అప్డేట్ వచ్చేసింది!
స్వాతి మలివాల్‌పై దాడి నిజమే.. అంగీకరించిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్
'ఆ రూలే ఐపీఎల్‌ను మార్చేసింది.. వారు పునరాలోచనలో పడ్డారు'
తప్పక చదవండి
- తెలంగాణ లోక్‌సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్‌పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్‌కుమార్ ఆగ్రహం
Advertisement