-
యువతులను వేధిస్తున్న సైకో అరెస్ట్
సాక్షి, నల్గొండ : సోషల్ మీడియా ద్వారా మహిళలను, యువతులను వేధిస్తున్న సైకోనూ నల్గొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాలు.. నల్గొండకు చెందిన ఒక యువకుడు యువతుల పట్ల కరుడుగట్టిన సైకోలా మారాడు. వంద మందికి పైగా మహిళలు, యువతులకు ఫోన్‌కాల్స్ చేసి బెదిరించేవాడు. అంతేగాక వీడియో కాలింగ్‌ను రికార్డ్ చేసి మార్ఫింగ్ చేసేవాడు. అనంతరం యువతులకు, మహిళలకు ఫోన్ చేసి లైంగికంగా లొంగకపోతే ఆ వీడియోలన్నింటిని తన స్నేహితులకు పంపిస్తానటూ బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడేవాడు. తాజాగా సైకో వేధింపులు తట్టుకోలేక ఓ యువతి నల్గొండ పోలీసులను ఆశ్రయించింది. యువతి ఫిర్యాదు మేరకు సైకోనూ అరెస్ట్ చేసిన పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. -
సైకో సూరి అరెస్ట్
సాక్షి, కోవూరు: కోవూరులో అలజడి రేపి జిల్లాలో సంచలనం సృష్టించిన సైకోను ఎట్టకేలకు పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేయడంతో కథ సుఖాంతం అయింది. స్థానిక సీఐ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నెల్లూరురూరల్ డీఎస్పీ కేవీ రాఘవరెడ్డి సైకో వివరాలను వెల్లడించారు. నెల్లూరు వెంకటేశ్వరపురం గాంధీజన గిరిజనకాలనీకి చెందిన పాత నేరస్తుడు ఇండ్ల సూరి ప్రస్తుతం మకాంను కోవూరు నాగులకట్టకు మార్చాడు. ఈ ఏడాది మార్చి 1న జలదంకి విజయమ్మ (55) మహిళ ఇంట్లోకి చొరబడి అత్యాచారయత్నం చేశాడు. డబ్బులు ఇవ్వకపోవడంతో కత్తితో పొడిచి, తలపై రోకలిబండతో మోది రక్తమోడేలా చేశాడు. బంధువులు వచ్చి తలుపులు తెరవగా నెట్టుకుంటూ నగ్నంగా పారిపోయాడు. అదే రోజు తెల్లవారుజామున 3 గంటల సమయంలో లైబ్రరీ సెంటర్ వద్ద టిఫిన్ అంగడి పెట్టుకుని నివాసముంటున్న ఒంటేరు అంకమ్మ (65) ఇంట్లో ప్రవేశించి డబ్బు, బంగారం ఇవ్వమని బెదిరించాడు. ఇవ్వకపోవడంతో తలపై గెరిటతో కొట్టాడు. దీంతో ఆ మహిళ తన వద్ద రూ.400 చిల్లర డబ్బులను ఇచ్చింది. అక్కడి నుంచి పరారైన సూరి అదే రోజు తెల్లవారు జామున 4 గంటల సమయంలో దేసూరివారి వీధిలో నివాసముంటున్న ఇమ్మడిశెట్టి సుభాషిణి ఇంట్లోకి చొరబడ్డాడు. బీరువాలోని రూ.6 వేల నగదు, రెండు జతల వెండి కాళ్ల పట్టీల గొలుసులు చోరీ చేసి పరారవుతుండగా సుభాషిణి చూసి కేకలు వేయడంతో ఆమె తలను గోడకేసి కొట్టి పరారయ్యాడు. అనంతరం 5.30 గంటలకు పూనూరువారి వీధిలో నివాసముంటున్న చేజర్ల నాగమణి అనే మహిళ ఇంటి ముందు ముగ్గు వేస్తుండగా మెడలోని గొలుసును లాగేందుకు ప్రయత్నించాడు. ఆమె గట్టిగా అరచి ప్రతిఘటించింది. అదే సమయంలో ఇద్దరు యువకులు వస్తుండగా వారిని నెట్టుకుంటూ పారిపోయాడు. సూరిని పట్టుకునేందుకు జిల్లా ఎస్పీ రామకృష్ణ ఆదేశాల మేరకు సబ్ డివిజన్ పరిధిలో కోవూరు సీఐ ఐ.వెంకటేశ్వర్లురెడ్డి పర్యవేక్షణలో కోవూరు, సంగం ఎస్సైలు అళహరి వెంకట్రావు, వేణు సహకారంతో పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. సూరిబాబును శుక్రవారం తెల్లవారుజామున కోవూరు నాగలకట్ట వద్ద నివాసముంటున్న ఇంట్లో ఉండగా అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. సూరిబాబును అరెస్ట్ చేయడానికి అహర్నిశలు కృషి చేసిన 51 మంది పోలీసులకు ఎస్పీ ప్రత్యేక రివార్డులు ప్రకటించారన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ వెంకటేశ్వరరెడ్డి, కోవూరు, సంగం ఎస్సైలు వెంకట్రావు, వేణు, హెడ్‌కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు, విజయభాస్కర్, రఘనాథ్, కానిస్టేబుళ్లు ప్రసాద్, సతీష్, సుబ్బారావు, శ్రీనివాసులురెడ్డి, మురళీ పాల్గొన్నారు. 51 కేసుల్లో నిందితుడు సూరి గతంలో కూడా అనేక నేరాలకు పాల్ప డ్డాడు. 2014 అక్టోబరు 20న ఆటో నడుపుకుం టున్న ఇండ్ల సూరి చల్లా అంకమ్మ అనే వృద్ధురాలిని ఆటో ఎక్కించుకుని జొన్నవాడకు వెళ్లాడు. రాత్రి అంగన్వాడీ భవనంలో నిద్రి స్తున్న అంకమ్మ వద్ద ఆభరణాలు దొంగిలించేందుకు ప్రయత్నిం చాడు. ఆమె గట్టిగా అరుస్తుండటంతో పక్కనే ఉన్న సన్నతా డుతో మెడకు బిగించి హత్య చేశాడు. ఆమె చెవిలో ఉన్న క మ్మలను తెంచుకుని పారిపోయాడు. సూరిబాబు గతంలో కోవూ టరు, నెల్లూరు, నెల్లూరు రూరల్, బుచ్చిరెడ్డిపాళెం, నాయుడుపేట, గూడూరు, చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి, తిరుపతి, ఎంఆర్‌పల్లి, అలిపిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో 2003 నుంచి ఇప్పటి వరకు సుమారు 51 కేసుల్లో నిందితుడు. తిరుపతికి సంబం«ధించిన ఓ కేసులో 11 నెలల పాటు చిత్తూరు, కడప జైలులో శిక్ష అనుభవించి బయటకు వచ్చాడు. సూరి ఒంటరిగా ఉన్న మహిళలపై అత్యాచారం చేయడం వారి వద్ద వస్తువుల్ని దౌర్జన్యంగా తీసుకువెళ్లడం అతని నైజం. -
సైకో వీరంగం.. 8 మందికి గాయాలు
విశాఖపట్నం: విశాఖ జిల్లాలో ఓ సైకో వీరంగం చేశాడు. జిల్లాలోని కంచరపాలెంలో చేతిలో కత్తితో సైకో వీర విహారం చేస్తూ.. శుక్రవారం చాలా మందిపై దాడికి పాల్పడ్డాడు. కత్తితో సైకో దాడికి పాల్పడటంతో దాదాపు ఎనిమిది మంది గాయపడ్డారు. దీంతో భయాందోళనలకు గురైన కంచరపాలెం గ్రామస్తులు సైకో గురించి పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు సైకోను అదుపులోకి తీసుని విచారణ చేస్తున్నారు. అతడి వద్ద నుంచి కత్తిని స్వాధీనం చేసుకున్నారు. ఆ వ్యక్తి ఉద్దేశపూర్వకంగానే దాడి చేశాడా.. లేక అతడు నిజంగానే సైకోనా అని అన్నికోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్‌పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- ధాన్యానికి ‘తేమ’ కొర్రీ
- కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం
- కొత్త గణేశునిపాడులో బీభత్సకాండ
- 13 సీట్లు మాకే!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- తెలంగాణ లోక్‌సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- స్వాతిమలివాల్‌పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్‌కుమార్ ఆగ్రహం
Advertisement