breaking news
World Athletics Day
-
ఆట.. టైమ్ పాస్ కాదు!
అమ్మ ఎలాగో ఆటలు అలాగే! అమ్మ మన దగ్గర ఉంటే వంద పండుగల సంతోషం. వెయ్యి ఏనుగుల బలం. అమ్మలాగే ఆటలను ప్రేమిస్తే...గుండెల్లో పెట్టుకుంటే...ఎంతో ఆరోగ్యంగా ఉంటాం... ఎంతో యాక్టివ్‌గా ఉంటాం...ఎన్నో లైఫ్‌స్కిల్స్ తెలుస్తాయి. ఫ్రెండ్స్, మీకు వీడియో గేమ్స్... ‘రెసిడెంట్ ఈవిల్’ ‘డ్రాగన్ క్వెస్ట్’ ‘మౌస్ ఫర్ హైర్’ ‘మారియో టెన్నిస్ ఫీవర్’ ... తెలుసా? మీలో చాలామంది చెప్పే జవాబు... ‘యస్!’మరి ఇప్పుడు చెప్పండి....చిర్రె గోనె/ బిళ్లంగోడు, చెండాట/ గిల్లాయిలు, నేల బండ, గుడు గుడు గుంజం, నాలుగు స్తంభాల ఆట, కప్ప గంతులు.... ఈ ఆటల గురించి మీకు తెలుసా? మీలో చాలామంది చెప్పే జవాబు... ‘సారీ....తెలియదు’‘తెలియదు’ అనే మాట మీ నోటి నుంచి వచ్చిందంటే మీరు చా...లా మిస్ అవుతున్నారన్నమాట. వీడియో గేమ్స్ మాత్రమే కాదు బయట గ్రౌండ్లో ఆడుకోవడానికి చాలా గేమ్స్ ఉన్నాయి. ఈ ఆటలు ‘వోన్లీ టైమ్‌పాస్’ కోసం కాదు. మీకు శారీరకంగా (ఫిజికల్‌గా), మానసికంగా (మెంటల్‌గా) చాలా ఉపయోగపడతాయి.మీ క్లోజ్‌ఫ్రెండ్స్ ఎవరంటే...‘మా అబ్బాయి ఎవరితో కలవడు. ఎప్పుడూ ఒంటరిగా ఉంటాడు’ బాధతో వచ్చే ఈ మాట పెద్దల నోటి నుంచి వినే ఉంటారు. వారు ఎందుకు బాధపడుతుంటారో తెలుసా? పిల్లలు అంటేనే యాక్టివ్... యాక్టివ్. చురుకుదనానికి కేరాఫ్ అడ్రస్. వారికి ఫ్రెండ్సే లోకం. మరి అలాంటి పిల్లలు ఒంటరిగా ఉండడం ఏ తల్లిదండ్రులకైనా బాధే కదా! గ్రౌండ్లో ఆడే ఆటలు ఉన్నాయి కదా...అవి ఏం చేస్తాయంటే మీలో ఒంటరితనాన్ని పోగొట్టి ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండేలా, స్నేహితుల మధ్య సందడిగా ఉండేలా చేస్తాయి. చెప్పకుండానే ఆటలు మనకు ఎన్నో మంచి విషయాలు చెబుతాయి.‘గెలుపు ఓటములు సహజం’‘ఓడిపోయినప్పుడు బాధ పడుతూ కూర్చుంటే బాధే మిగులుతుంది. చివరికి అది నీకు క్లోజ్‌ఫ్రెండ్ అవుతుంది. గెలుపు దూరం అవుతుంది’‘ఓడిపోయినా సరే... వచ్చేసారి నేను కచ్చితంగా గెలవగలను అనే పట్టుదల మీలో ఉంటే పట్టుదల, ఆశ, కష్టం అనేవి మీకు క్లోజ్ ఫ్రెండ్స్ అవుతాయి. ఈ ఫ్రెండ్స్ మీకు తోడుంటే హండ్రెడ్ పర్సెంట్ ఎప్పుడూ గెలుపు మీదే! మీ కలలకు పేదరికం అడ్డుకాదుఫ్రెండ్స్, మనం ఇప్పుడు రాజస్థాన్‌కు చెందిన పూజా బిష్ణోయి గురించి తెలుసుకుందాం. ఈ పాప గురించి వింటే మీకు చా...లా ఇన్స్పైరింగ్గా ఉంటుందన్నమాట. ‘పూజాలా నేను కూడా సాధిస్తాను. ప్రపంచాన్ని చూస్తాను’ అనే కల మీలో తప్పకుండా మొలకెత్తుతుంది. ఆ మొలక చాలు కదా... రేపు చెట్టు కావడానికి.... ఆ నీడలో మీరు పెద్ద పేరు తెచ్చుకోవడానికి!పదమూడు సంవత్సరాల పూజ వరుస విజయాలతో అథ్లెటిక్స్‌లో సెన్సేషన్ సృష్టిస్తోంది. వేగం, ఓర్పుకు పేరుగాంచిన పూజ 800 మీ, 1500 మీ, 300 మీ, 4 కిలోమీటర్ల ఈవెంట్లలో గోల్డ్ మెడల్స్ గెలిచింది. అండర్–19 ఐపీఎస్సీ అథ్లెటిక్స్ టోర్నమెంట్లో రికార్డ్ క్రియేట్ చేసి ‘బెస్ట్ అథ్లెట్’గా నిలిచింది. అయిదేళ్ల వయసులోనే అథ్లెటిక్స్ ప్రపంచంలోకి అడుగపెట్టిన పూజ, ఎనిమిదేళ్ల వయసులో 3 కిలోమీటర్ల పరుగును 10 నిమిషాల 50 సెకన్లలో పూర్తిచేసి రికార్డ్ సృష్టించింది.శిక్షణ ప్లస్ క్రమశిక్షణ‘స్టేట్, నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడాలంటే చాలా డబ్బులు కావాలి. అందుకే వాటి గురించి సీరియస్‌గా తీసుకోవడం లేదు’ అనే మాట కొందరు తల్లిదండ్రుల నుంచి వినబడుతుంటుంది. ‘డబ్బు లేకపోతే ఆటలు లేవు’ అనే మాట నిజమైతే రాజస్థాన్‌లోని ఒక చిన్న గ్రామానికి చెందిన పూజ నేషనల్ లెవెల్లో పేరు తెచ్చుకునేది కాదు. ఆమె తండ్రి చిన్న రైతు. పెద్దగా డబ్బులు లేవు. అంతమాత్రాన పూజ తల్లిదండ్రులు ఊరుకోలేదు.‘ఎన్ని ఇబ్బందులు వచ్చినా మా అమ్మాయిని ఆటల్లో తీర్చిదిద్దాలి’ అనుకున్నారు. వారు అనుకున్నట్లుగానే జరిగింది. అథ్లెటిక్స్‌లో పూజ పెద్ద పేరు తెచ్చుకుంది. పూజ మరిన్ని విజయాలు సాధించడానికి ‘నీకు మేమున్నాం’ అంటూ ముందుకు వచ్చింది విరాట్ కోహ్లి ఫౌండేషన్. ఈ ఫౌండేషన్ పూజకు ట్రైనింగ్ ఇప్పించడం, ప్రయాణ ఖర్చులు, పోషకాహారం...మొదలైనవి సమకూరుస్తోంది.‘శిక్షణ’కు ‘క్రమశిక్షణ’ తోడైతే ఎన్ని విజయాలు సాధించవచ్చో పూజా బిష్ణోయి నిరూపించింది. యూత్ ఒలింపిక్స్‌లో మెడల్ గెల్చుకోవాలని కలలు కంటోంది.పారిపోయిన వారు...పరుగెత్తుకుంటూ వచ్చారు!ఫ్రెండ్స్, మీరు రోజూ స్కూల్‌కు వెళతారు కదా, కొందరు పిల్లలు మాత్రం స్కూల్ అంటేనే ‘అయ్య బాబోయ్’ అని దూరంగా పారిపోతారు. అలాంటి పిల్లలు కూడా ఇష్టంగా స్కూల్‌కు వెళ్లేలా చేసే శక్తి ఆటలకు ఉంది. ముంబైలోని ఒక స్లమ్ ఏరియాలో తరచుగా బడికి బంక్ కొట్టే పిల్లలని చూశారు అశోక్ రాథోడ్. ఈయన ఫుట్‌బాల్ కోచ్. ఫుట్‌బాల్ మ్యాచ్‌లతో పిల్లలకు చాలా క్లోజ్ అయ్యారు. మెల్లగా పిల్లలను బడికి తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు. స్కూల్‌కు వెళ్లడమే కాదు....ఇప్పుడు ఆ పిల్లలలో క్రమశిక్షణ పెరిగింది. ఫుట్‌బాల్ గేమ్‌లో ‘వావ్’ అనిపిస్తున్నారు.– యాకుబ్ -
నేడు ప్రపంచ అధ్లెటిక్స్ దినోత్సవం: ‘హర్డిల్స్’ దాటి...
డబ్బు ఉంటేనే పెద్ద పెద్ద కలలను సాధించవచ్చు అనుకునే నేటి తరానికి అది సరికాదని, కృషి, పట్టుదల ఉంటే అన్ని హర్డిల్స్‌ను దాటవచ్చునని నిరూపిస్తోంది. విశాఖపట్టణవాసి జ్యోతి యర్రాజి. తండ్రి సూర్యనారాయణ సెక్యూరిటీ గార్డుగా చేస్తుంటే తల్లి కుమారి కుటుంబపోషణకు ఇళ్లలో పనులు చేసేది. తన తలరాతను తనే మార్చుకుంటానని తెలియని వయసులోనే స్కూల్లో గ్రౌండ్లో పరుగులు మొదలు పెట్టింది జ్యోతి. సీనియర్ అథ్లెట్ల పరుగులు గమనిస్తూ, తన మార్గాన్ని తనే వేసుకుంది. ఆ పరుగులు జాతీయ స్థాయికే కాదు ఒలింపిక్స్ వరకు వెళ్లేలా... ఫోర్బ్స్ జాబితాలో చేరేలా చేశాయి.దక్షిణ కొరియాలో ఈనెల 27 నుంచి జరగబోయే ఆసియన్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్కిపోటీ పడటానికి సిద్ధపడుతోంది జ్యోతి. అందుకు ముంబయ్‌లోని రిలయెన్స్ అ«థ్లెటిక్స్ హై పెర్ఫార్మెన్స్ సెంటర్లో శిక్షణ పొందుతోంది. ‘పతకాన్ని సాధించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నా’ను అని తెలిపింది.తన రికార్డుల్ని తానే తిరగరాస్తూ...స్కూల్ వయసులో గ్రౌండ్లో తోటి పిల్లలతో పరుగులు తీసేది.పాఠశాలకు చేరువలోనే విశాఖపోర్ట్ స్టేడియం ఉండటం, అక్కడ సీనియర్ అథ్లెట్ల్ల ప్రాక్టీస్‌ను పరిశీలించడం దినచర్యగా ఉండేది. తొలుత సబ్ జూనియర్ స్థాయిలో అంతరపాఠశాలల అథ్లెటిక్స్ మీట్లో పతకం సాధించింది. అలా ప్రారంభమైన జ్యోతి ఎర్రాజీ ట్రాక్ ఒలింపిక్స్లోపాల్గొన్న తొలి భారతీయ ఉమెన్ హార్డిలర్గా ఖ్యాతి దక్కించుకుంది. ట్రాక్‌లో గాయపడటం, జాతీయ రికార్డు నమోదును గుర్తించకపోవడం లాంటి సమస్యలనూ అధిగమించింది. పసిడి పతకాలతో జాతీయ రికార్డును తిరగరాయడమే కాదు 100 మీటర్ల హార్డిల్స్‌లో అర్దశతాబ్దపు భారత్ కలను నెరవేర్చింది. మరెవ్వరూ పొటీపడలేనంతగా తన రికార్డులను తనే తిరగరాసుకుంది. కిందటేడాది ఫిబ్రవరిలో ప్రముఖ పత్రిక ఫోర్బ్స్ 30 అండర్ 30 జాబితాలో జ్యోతి ఎర్రాజి పేరు చేరింది. కలను లక్ష్యంగా మలుచుకొని, ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తోంది జ్యోతి. – డా. సూర్యప్రకాష్ మాడిమి, సాక్షి స్పోర్ట్స్, విశాఖపట్నం -
ప్రపంచ అథ్లెటిక్స్ డే.. ఎలా మొదలైదంటే!
మానవ మనుగడ మొదలైందే అథ్లెట్‌గా అంటే అతిశయోక్తి కాదు. మానవ పరిణామక్రమంలో మనిషి రెండు కాళ్లతో నడవడం ప్రారంభించాడు. మెరుగైన జీవనం కోసం పరుగెత్తాడు. ఆహార అన్వేషణలో భాగంగా విసిరాడు.. దుమికాడు. ఇవన్నీ మనిషి జీవన గమనాన్ని ఊహించలేని స్థితికి చేర్చాయి. నడవడం, పరుగెత్తడం, దుమకడం, విసరడం అనేవి అథ్లెటిక్ ట్రాక్, ఫీల్డ్ అంశాలైనా.. ప్రతి క్రీడలోనూ ప్రాథమిక అంశాలు. క్రీడాకారుడి(అథ్లెట్)గా ఎదిగేందుకు శిక్షణలో శారీరక బలం, చురుకుదనం, నైపుణ్యం ప్రధాన పాత్ర పోషిస్తాయి. అలాంటి అథ్లెట్‌గా పిల్లలు, యువతలో ఫిట్నెస్ ప్రాముఖ్యం, ఆరోగ్యంపై అవగాహన కల్పించడానికి ఏటా మే 7న ప్రపంచ అథ్లెటిక్స్ దినోత్సవం జరుపుకుంటారు. అథ్లెటిక్ ఫర్ ఏ బెటర్ వరల్డ్.. మనిషి ఆరోగ్యంగా ఉంటే ప్రపంచం ఆరోగ్యంగానే ఉంటుంది అనే నానుడిని నిజం చేయాలని 1996లో తొలిసారిగా ప్రపంచ అథ్లెటిక్స్ డే ను అంతర్జాతీయ అథ్లెటిక్ అమెచ్యూర్ సమాఖ్య ప్రారంభించింది. చిన్నాపెద్ద వయోభేదం లేకుండా సర్వమానవాళి ఆరోగ్యంగా ఉండాలనేది ఈ డే ప్రధాన లక్ష్యం. అథ్లెటిక్స్ ఫర్ ఏ బెటర్ వరల్డ్ అనేది ఐఏఏఎఫ్ ప్రధాన నినాదం. (క్లిక్: భారతీయులు గర్వపడేలా చేసిన సచిన్ ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే..?) యువత, క్రీడ, పర్యావరణం ఏ దేశానికైనా యువతే ప్రధాన వనరు. అలాంటి యువత ఆరోగ్యం, ఆలోచనా విధానాన్ని తీర్చిదిద్దేదే క్రీడ. ఏ క్రీడలోనైనా ప్రావీణ్యం సాధించడానికైన మౌలికంగా అవసరమయ్యే శక్తి, సామర్థ్యాలకు పర్యావరణ పరిరక్షణ తోడైతే ఆ దేశ ఖ్యాతి ఇనుమడిస్తుంది. పురాతన ఒలింపిక్ క్రీడల్లో అగ్రభాగం జంప్, జావెలిన్, డిస్కస్లతో పాటు పరుగుదే. బాక్సింగ్, రథాల పోటీలతో పాటు మల్లయుద్ధం ఉండేవి. ప్రపంచ క్రీడా వేదికైన ఆధునిక ఒలింపిక్స్‌లో పతకం సాధించడం ప్రతి క్రీడాకారుడి కల. ఒలింపిక్స్‌లో సైతం అత్యధిక పతకాలు(48 బంగారు పతకాలు) అథ్లెటిక్స్‌లోనే అందిస్తారు.


