breaking news
video add
-
ప్రకటనలు గుర్తుండట్లేదు..!
యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్.. వేదిక ఏదైనా ఈ సామాజిక మాధ్యమాల్లో విహరిస్తున్నవారే ఎక్కువ. స్మార్ట్‌ఫోన్ యూజర్లు గంటల తరబడి వీడియోలను వీక్షిస్తున్నారు. దీంతో డిజిటల్ వీడియోలు భారత్‌లో అత్యంత ప్రధాన వినోద మాధ్యమంగా మారాయి. అయినప్పటికీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ను ముంచెత్తుతున్న ప్రకటనలు వీక్షకుల మదిలో నమోదు కాకపోవడం ఆసక్తికరం. ఆర్కే స్వామి సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ ఇండియన్ మార్కెట్స్ (సీఎస్ఐఎం), హన్స రీసెర్చ్ గ్రూప్ సంయుక్తంగా చేపట్టిన సర్వేలో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. పది ప్రధాన నగరాల్లో ముఖాముఖి ఇంటర్వ్యూల ఆధారంగా నిర్వహించిన ఈ అధ్యయనంలో 3,000 మందికి పైగా ఆన్లైన్ కస్టమర్లు పాలుపంచుకున్నారు. వీరంతా కలిసి 600 పైచిలుకు బ్రాండ్ల పేర్లను వెల్లడించారు.సగటున ఒక్కో యూజర్ 1.5 బ్రాండ్స్‌ను మాత్రమే గుర్తు పెట్టుకున్నారు. పదకొండు బ్రాండ్స్ మాత్రమే 3 శాతం మందికి పైగా గుర్తున్నాయి. జెప్టో, జొమాటో, మీషో, నెస్కఫే, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, స్విగ్గీ, బ్లింకిట్, కంట్రీ డిలైట్, రమ్మీ సర్కిల్, డ్రీమ్11 వీటిలో ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తుంటే ప్రధానంగా ఆన్లైన్ బ్రాండ్స్, గేమింగ్ ప్లాట్‌ఫామ్స్‌కు మాత్రమే బ్రాండ్స్ రీకాల్ ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. నాలుగింట మూడొంతులు..వాట్సాప్‌లో వచ్చిన నాలుగు వీడియోలలో మూడింటిని యూజర్లు వీక్షించడమే కాదు వాటిని ఇతరులకు ఫార్వార్డ్ చేస్తున్నారు. సామాజిక భాగస్వామ్యం ఎక్కువ ప్రభావాన్ని కలిగి ఉందనడానికి ఇది సూచిక అని నివేదిక తెలిపింది. వీక్షకులు ఎక్కువగా ఉండే ప్లాట్‌ఫామ్‌లలో కూడా వీడియో యాడ్స్‌ను మ్యూట్ చేయడం, దాటవేయడం (స్కిప్) వల్ల ప్రకటనల ప్రభావాన్ని గణనీయంగా దెబ్బ తీస్తున్నాయని వివరించింది. భారత్‌లో ఎక్కువగా ఉపయోగించే వీడియో ప్లాట్‌ఫామ్ అయిన యూట్యూబ్‌లో యూజర్లు అధిక సమయం గడిపినప్పటికీ ఈ వేదికపైనా బ్రాండ్ రీకాల్ (గుర్తు పెట్టుకోవడం) పేలవంగా ఉందని తెలిపింది. ⇒ 600 బాండ్స్‌లో ప్రతీ బ్రాండ్ రీకాల్ మార్క్ 1 శాతం లోపే ఉంది. ⇒ యూజర్లు రోజూ సగటున 2.17 గంటలపాటు వీడియోలను చూస్తున్నారు. ⇒ 93% మంది మొబైల్ ఫోన్లోనే వీడియో కంటెంట్‌ను వీక్షిస్తున్నారు.⇒ యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ప్రధాన ప్లాట్‌ఫామ్స్. ⇒ తమ మొబైల్ తెరపై వచ్చిన ప్రకటనలు స్కిప్ చేస్తున్నట్టు 78% మంది తెలిపారు. ⇒ యాడ్స్ అసంబద్ధంగా ఉంటున్నాయని 57% మంది వెల్లడించారు. ⇒ తప్పనిసరిగా చూడాల్సిన పరిస్థితి ఉంటే ప్రకటనలను మ్యూట్ చేస్తామని 50% మంది చెప్పారు.⇒ ప్రకటనలను చూడటానికి అభ్యంతరం లేదని, రెండుసార్లు వీక్షించాల్సి వస్తే ఇష్టపడడం లేదని 8% మంది వెల్లడించారు.పేర్లు చెప్పాలేక.. డిజిటల్ ప్రకటనల కోసం భారత్‌లో కంపెనీలు ఏటా రూ.22,000 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్టు సమాచారం. ఇంత భారీ స్థాయిలో వెచ్చిస్తున్నప్పటికీ బ్రాండ్స్ పేర్లు జనం మదిలో పెద్దగా లేకపోవడమేకాదు.. వాటితో తక్కువ మమేకం కావడం ప్రకటనదారులకు ఆందోళన కలిగిస్తోంది. ఈ కారణంతో వీక్షకులు నిర్దిష్ట బ్రాండ్స్ పేర్లను చెప్పలేకపోయారు. బ్రాండ్ పేరుకు బదులుగా ‘మొబైల్ ప్రకటన’, ‘దుస్తుల ప్రకటన’అని వర్ణించారని నివేదిక తెలిపింది. యూజర్లు చెప్పిన చాలా బ్రాండ్స్ ఫుడ్ డెలివరీ, ఈృకామర్స్, కాఫీ, కిరాణా సామగ్రి వంటి విభాగాలకు చెందినవి. ప్రకటనల ప్రభావం కంటే రోజువారీ వినియోగం ఈ బ్రాండ్లకు గుర్తింపు తెచ్చిపెడుతున్నాయి. బ్రాండ్ రీకాల్: ఉత్పత్తులు, సేవల గురించి ఆలోచించేటప్పుడు ఎటువంటి క్లూ లేకుండా ఒక బ్రాండ్‌ను వెంటనే గుర్తు చేసుకోవడం, లేదా గుర్తించగల సామర్థ్యమే బ్రాండ్ రీకాల్. వినియోగదారు మదిలో ఒక బ్రాండ్ ఎంత బాగా పాతుకుపోయింది, కొనుగోలు నిర్ణయాలను ఏ స్థాయిలో ప్రభావితం చేస్తోంది, ఏ మేరకు కస్టమర్ విశ్వాసాన్ని చూరగొన్నదీ తెలిపే కొలమానం ఇది. ఉదాహరణకు సాఫ్ట్ డ్రింక్ అనగానే కోకాృకోలా, పెప్సీ గుర్తుకొస్తాయి. అధిక బ్రాండ్ రీకాల్ కలిగి ఉండడమే ఇందుకు కారణం. -
కాంగ్రెస్ ఎంపీ రజనీపై సస్పెన్షన్ వేటు
న్యూఢిల్లీ: నిబంధనలకు విరుద్ధంగా రాజ్యసభ కార్యకలాపాలను ఫోన్లో చిత్రిస్తున్న కాంగ్రెస్ ఎంపీ రజనీ అశోక్‌రావ్ పాటిల్‌ను సభాధ్యక్షుడు జగదీప్ ధన్‌ఖడ్ శుక్రవారం సస్పెండ్ చేశారు. బడ్జెట్ సమావేశాలయ్యే దాకా సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఎంపీలపై ఆయన చర్యలు తీసుకోవడం ఇదే ప్రథమం. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానానికి ప్రధాని మోదీ సమాధానమిస్తుండగా విపక్ష సభ్యుల నిరసనను పాటిల్ వీడియో తీశారు. ఆమెను సస్పెండ్ చేయాలంటూ రాజ్యసభ నేత, కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ తీర్మానం ప్రవేశపెట్టారు. అనంతరం ధన్‌ఖడ్ అన్ని పార్టీల నేతల అభిప్రాయం కోరారు. ఆమెపై చర్య తీసుకునే ముందు విచారణ జరిపితే బాగుంటుందని వారన్నారు. -
రైతుల ఆత్మహత్యలతో ఏం సంబంధం?
న్యూఢిల్లీ: దేశంలో ఎప్పుడు ఎక్కడ వర్షం పడుతుంది, ఎక్కడ పడదు? పడితే ఎన్ని మిల్లీ మీటర్లు పడుతుంది, ఎన్ని సెంటీమీటర్లు పడుతుందీ.. అనే విషయాన్ని భారత వాతావరణ శాఖ (ఐఎండీ)కన్నా కచ్చితంగా లెక్కేసి చెప్పగలమని చెప్పుకుంటున్న భారత వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనావేసే కంపెనీ 'స్కైమెట్' తాజాగా తీసిన వీడియో యాడ్‌పై వివాదం రాజుకుంటోంది. కంపెనీ వాణిజ్య ప్రకటన కోసం రైతుల ఆత్మహత్య సంఘటనలను సందర్భ శుద్ధిలేకుండా వాడుకుందన్నది ప్రధాన విమర్శ. అందులో బడికెళ్లే ఓ పాప ప్రతి రోజు తండ్రి వెనకాలే ఆయనకు తెలియకుండా పొలందాక వెళ్లి తండ్రి పొలం పనులు చేసుకుంటున్నాడా లేక ఉరేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడా? అన్న విషయాన్ని గమనిస్తుంటుంది. తండ్రి పొలం పనుల్లో నిమగ్నమయ్యాక అమ్మయ్యా, ఈ రోజుకు ఏంకాదులే అనుకొని బడికి వెళ్తుంది. ఇంట్లో తాడు కనిపిస్తే తండ్రి ఎక్కడ ఉరేసుకుంటాడేమోనని దాన్ని తీసి దాచి పెడుతుంది. ఓ రోజు స్కూల్ నుంచి వచ్చేసరికల్లా తాను దాచి పెట్టిన తాడు కనిపించదు. అనుమానంతో పొలానికి పరుగెత్తుకెళుతోంది. అక్కడ చెట్టుకు తాడు కడుతూ తండ్రి కనిపిస్తాడు. ఆపుకోలేని దు:ఖంతో పరుగెత్తి తండ్రి ఒల్లో వాలుతుంది. చివరకు ఆ తాడును తనకోసం కట్టిన ఊయలగా గ్రహించి ఊపిరి పీల్చుకుంటుంది. దేశంలో గత 20 ఏళ్ల కాలంలో మూడు లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారనే లెక్కలతో ఆ యాడ్ ముగుస్తుంది. ఆ యాడ్‌లో తన తండ్రి ఏ రోజున ఆత్మహత్య చేసుకుంటాడో అన్న భయాందోళనల మధ్య ఆ పాప ప్రతి రోజు బతుకుతుందన్నదే ప్రధానాంశంగా కనిపిస్తుంది. ఏ ప్రేక్షకులను లక్ష్యంగా పెట్టుకుని ఈ యాడ్ రూపొందించారన్న విషయం అర్థం కాదు. వర్షాలు పడక, పంటలు ఎండిపోతే, అకాల వర్షాల వల్ల పంటనష్టం జరిగితే.. అందుకు ఎవరు బాధ్యులు? వాతావరణ పరిస్థితులను తెలుసుకోకపోవడం వల్లనే ఈ నష్టం జరిగిందా? అకాల వర్షాలు పడతాయన్నది ముందే తెలిస్తే రైతులు సరైన ముందస్తు చర్యలు తీసుకునే అవకాశం ఈ దేశంలో ఉందా? ఈ 20 ఏళ్ల కాలంలో మూడు లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణం ఎప్పటికప్పుడు వాతావరణ పరిస్థితులను అంచనా వేయకపోవడమే కారణమా ?


