breaking news
tightens rules
-
ఎస్ఎంఈ ఐపీఓలు అంత ఈజీ కాదు
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా చిన్న, మధ్యతరహా సంస్థ(ఎస్ఎంఈ)ల పబ్లిక్ ఇష్యూలకు నిబంధనలను కఠినతరం చేసింది. వీటిలో భాగంగా లాభదాయకత అంశాన్ని ప్రవేశపెట్టింది. ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) పరిమితిని 20 శాతానికి పరిమితం చేసింది. ఇన్వెస్టర్లకు రక్షణ కల్పిస్తూనే పటిష్ట పనితీరు సాధిస్తున్న ఎస్ఎంఈల నిధుల సమీకరణకు అండగా నిలిచే లక్ష్యంతో సంస్కరణలకు సెబీ తెరతీసింది. గత క్యాలెండర్ ఏడాదిలో ఎస్ఎంఈ ఐపీఓలు, ఇన్వెస్టర్ల పార్టిసిపేషన్ భారీగా పెరిగిన నేపథ్యంలో సెబీ తాజా చర్యలకు ప్రాధాన్యత ఏర్పడింది. లాభదాయకత అంశానికివస్తే పబ్లిక్ ఇష్యూ ప్రణాళికల్లో ఉన్న ఎస్ఎంఈ గత మూడేళ్లలో కనీసం రెండేళ్ల పాటు రూ. కోటి చొప్పున నిర్వహణ లాభం(ఇబిటా) ఆర్జించి ఉండాలి. మొత్తం ఇష్యూ పరిమాణంలో 20 శాతానికి మించి వాటాదారులు షేర్లను విక్రయించేందుకు అనుమతించరు. ఇదేవిధంగా వాటాదారుల హోల్డింగ్స్‌లో 50 శాతానికి మించి ఆఫర్ చేసేందుకు వీలుండదు.నిధుల వినియోగమిలాసంస్థాగతేతర ఇన్వెస్టర్లకు షేర్ల కేటాయింపులో మెయిన్ బోర్డ్ ఐపీఓ నిబంధనలే ఎస్‌ఎంఈలకూ వర్తించనున్నాయి. కనీస దరఖాస్తు పరిమాణాన్ని రెండు లాట్లకు సెబీ కుదించింది. తద్వారా అనవసర స్పెక్యులేషన్‌కు చెక్ పెట్టనుంది. సాధారణ కార్పొరేట్ అవసరాలకు ఐపీఓ నిధుల్లో 15 శాతం లేదా రూ. 10 కోట్లవరకూ(ఏది తక్కువైతే) మాత్రమే కేటాయించేందుకు అనుమతిస్తారు. ప్రమోటర్లు, ప్రమోటర్ గ్రూప్ సంస్థలు, సంబంధిత పార్టీల నుంచి తీసుకున్న రుణ చెల్లింపులకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఐపీఓ నిధులు వెచ్చించేందుకు అనుమతి ఉండదు. ప్రమోటర్ల కనీస వాటాకుపైన గల ప్రమోటర్ హోల్డింగ్‌కు దశలవారీ లాకిన్ గడువు వర్తిస్తుంది. అధికంగా ఉన్న ప్రమోటర్ వాటాలో ఏడాది తరువాత 50 శాతం, రెండేళ్ల తదుపరి మిగిలిన 50 శాతానికి గడువు ముగుస్తుంది. పబ్లిక్కు అందుబాటుఎస్ఎంఈలు సెబీకి దాఖలు చేసిన ఐపీఓ ప్రాస్పెక్టస్(డీఆర్‌హెచ్‌పీ)ను 21 రోజులపాటు పబ్లిక్కు అందుబాటులో ఉంచాలి. వార్తా పత్రికల్లో ప్రకటనల ద్వారా తెలియజేయాలి. సులభంగా తెలుసుకునేందుకు క్యూఆర్ కోడ్‌ను సైతం వినియోగించాలి. ఎస్ఎంఈ ఎక్సే్ఛంజ్, కంపెనీ వెబ్సైట్, మర్చంట్ బ్యాంకర్.. సంబంధిత డీఆర్హెచ్పీపై పబ్లిక్ స్పందనకు వీలు కల్పించాలి. ఎస్ఎంఈలు ఐపీఓ తదుపరి మెయిన్ బోర్డులోకి చేరకుండానే నిధుల సమీకరణ చేపట్టాలంటే సెబీ(ఎల్‌వోడీఆర్) నిబంధనలు పాటించవలసి ఉంటుంది. చెల్లించిన మూలధనం రూ. 25 కోట్లకు మించవలసి ఉంటుంది. రైట్స్, ప్రిఫరెన్షియల్ కేటాయింపులు, బోనస్ షేర్ల జారీ తదితరాలు ఈ విభాగంలోకి వస్తాయి. గత రెండేళ్లలో ఎస్ఎంఈ ఐపీఓలు భారీగా ఎగసిన నేపథ్యంలో సెబీ నిబంధనలు మరింత కఠినతరం చేసేందుకు ఉపక్రమించింది. 2024లో ఐపీఓల ద్వారా 240 చిన్న, మధ్యతరహా సంస్థలు రూ. 8,700 కోట్లు సమీకరించాయి. అంతక్రితం 2023లో సమకూర్చుకున్న రూ. 4,686 కోట్లతో పోలిస్తే ఇవి రెట్టింపుకావడం ప్రస్తావించదగ్గ అంశం!! -
తప్పుడు సలహాలు ఇక కుదరవు!! సెబీ కొత్త రూల్స్
ముంబై: సెక్యూరిటీస్ లావాదేవీలపై అనియంత్రిత ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్లు (ఫిన్ఫ్లుయెన్సర్లు) ఇచ్చే తప్పుడు సలహాలతో తలెత్తే రిస్కులపై ఆందోళన పెరుగుతున్న నేపథ్యంలో మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఈ అంశంపై దృష్టి సారించింది. ఫిన్ఫ్లుయెన్సర్లను నియంత్రణ పరిధిలోకి తెస్తూ నిబంధనలను ఆమోదించింది.వీటి ప్రకారం ప్రతిఫలం తీసుకుని కచ్చితమైన రాబడులు వస్తాయంటూ సలహాలిచ్చే వ్యక్తులతో సెబీ నియంత్రణలోని వ్యక్తులు (బ్రోకర్లు మొదలైనవారు) కలిసి పని చేయకూడదు. సాధారణంగా కమీషన్ ప్రాతిపదికన పని చేసే ఫిన్‌ఫ్లుయెన్సర్లకు కొన్నాళ్లుగా తమ ఫాలోయర్ల ఆర్థిక నిర్ణయాలను గణనీయంగా ప్రభావితం చేస్తున్నారు. తామిచ్చే సలహాల విషయంలో ఫిన్ఫ్లుయెన్సర్లు జవాబుదారీతనంతో వ్యవహరించేందుకు తాజా సెబీ నిబంధనలు ఉపయోగపడనున్నాయి.మరోవైపు, తరచుగా ట్రేడయ్యే షేర్లను డీలిస్ట్ చేయడానికి సంబంధించి ఫిక్సిడ్ ధర ప్రక్రియను ప్రవేశపెట్టాలని సెబీ నిర్ణయించింది. అలాగే, ఇన్వెస్ట్మెంట్, హోల్డింగ్ కంపెనీల (ఐహెచ్సీ) డీలిస్టింగ్ ఫ్రేమ్‌వర్క్‌ను కూడా ఆవిష్కరించింది. ఫిక్స్డ్ ధర విధానంలో డీలిస్టింగ్‌కు ఫ్లోర్ ధర కంటే కనీసం 15 శాతం ప్రీమియంతో ఆఫర్‌ను చేపట్టవలసి ఉంటుంది. డెరివేటివ్స్ నిబంధనలు కఠినతరం.. ఇండివిడ్యువల్ స్టాక్స్‌ను డెరివేటివ్స్ సెగ్మెంట్లో చేర్చడం, తీసివేయడానికి సంబంధించిన నిబంధనలను సెబీ కఠినతరం చేసింది. క్యాష్ మార్కెట్లో పనితీరును బట్టి వాటిని చేర్చడం లేదా తీసివేయడమనేది ఉంటుందని పేర్కొంది. తక్కువ టర్నోవరు ఉన్న స్టాక్స్‌ను ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ సెగ్మెంట్ నుంచి తప్పించేందుకు ఇవి ఉపయోగపడనున్నాయి. మరోవైపు, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ కేటగిరీని పరిశీలించేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఇది సెకండరీ మార్కెట్ అడ్వైజరీ కమిటీకి తన నివేదికను సమర్పిస్తుందని సెబీ చీఫ్ మాధవి పురి బచ్ తెలిపారు. -
సీఎం యోగి మరో కీలక చర్య
లక్నో: ఉత్తరప్రదేశ్ లో నేరాలు నియత్రించే దిశగా యోగి ఆదిత్యనాథ్ సర్కారు కీలక చర్య తీసుకుంది. యాసిడ్ అమ్మకాలు, నిల్వ విధానాలను కఠినతరం చేసింది. యాసిడ్ దాడులు పెరిగిన నేపథ్యంలో సీఎం యోగి నిర్ణయం తీసుకున్నారు. యాసిడ్ అమ్మకాలు, స్టోరేజీకి సంబంధించిన నిబంధనలను కఠినంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాహుల్ భట్నానగర్ ఈ మేరకు ఆదివారం ఉత్తర్వులు వెలువరించారు. యాసిడ్ విక్రయించే వ్యాపారులు తమ దగ్గరున్న స్టాక్ వివరాలను ప్రతి 15 రోజులకొకసారి సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్(ఎస్డీఎం)లకు తెలపాలి. ‘తప్పుడు వివరాలు సమర్పిస్తే మొత్తం స్టాక్ సీజ్ చేయడంతో పాటు, 50 వేల రూపాయల జరిమానా విధిస్తామ’ని భట్నానగర్ హెచ్చరించారు. ప్రతి నెలా ఏడో రోజు కలెక్టర్లు తప్పనిసరిగా యాసిడ్ విక్రయ దుకాణాలను తనిఖీ చేయాలని ఆదేశించారు. విక్రయదారులు యాసిడ్ అమ్మకాలకు సంబంధించిన వివరాలు కచ్చితంగా నమోదుచేయాలన్నారు. కొనుగోలు చేసిన వారి పేరు, చిరునామాతో పాటు ఎంతమొత్తంలో యాసిడ్ కొన్నారనే వివరాలు తప్పనిసరిగా ఉండాలని చెప్పారు.