రూ. 444కే స్పైస్‌జెట్ టికెట్
న్యూఢిల్లీ: ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ టికెట్ ధరల డిస్కౌంట్ ఆఫర్లకు తెరలేపింది. సంస్థ తాజాగా ‘మాన్సూన్ బొనాంజా సేల్’ స్కీమ్ పేరుతో దేశీ మార్గంలో ప్రయాణించే వారి కోసం ఒకవైపునకు మాత్రమే సంబంధించి రూ.444ల ప్రారంభ ధరతో (పన్నులు మినహా) విమాన టికెట్‌ను ఆఫర్ చేస్తోంది. బుధవారం ప్రారంభమైన ఈ ఆఫర్ జూన్ 26 వరకు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుం దని సంస్థ తెలిపింది. తాజా ఆఫర్లో భాగంగా టికెట్లను బుక్ చేసుకున్నవారు జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 మధ్యకాలంలో ఎప్పుడైనా ప్రయాణించవచ్చని పేర్కొంది.
ఈ ఆఫర్ కేవలం దేశీ మార్గంలో ప్రయాణించే నాన్‌స్టాప్, వయా ఫ్లైట్స్‌కు మాత్రమే వర్తిస్తుందని తెలిపింది. జమ్మూ-శ్రీనగర్, అహ్మదాబాద్-ముంబై, ముంబై-గోవా, ఢిల్లీ-డెహ్రాడూన్, ఢిల్లీ-అమృత్సర్ రూట్లలో ప్రయాణించే వారికే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని పేర్కొంది. టికెట్ ధర బుకింగ్ టైమింగ్, ప్రయాణ దూరం వంటి తదితర అంశాలపై ఆధారపడి మారుతూ ఉంటుందని తెలిపింది.