చెట్టును ఢీకొన్న బైక్.. ఒకరు మృతి
బోయినిపల్లి (సిరిసిల్ల రాజన్న జిల్లా): బోయినిపల్లి మండలం శభాష్పల్లిలో మంగళవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ బైక్ అదుపుతప్పి రోడ్డు పక్కనున్న చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తోన్న ఒకరు మృతిచెందగా.. మరొకరికి గాయాలయ్యాయి.
మృతుడు వేములవాడ మండలం మర్రిపల్లివాసిగా గుర్తించారు. గాయపడిన వ్యక్తిని దగ్గరలోని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.