breaking news
ravinder goud
-
అప్పులు తీర్చేందుకు సూడో నక్సల్ అవతారమెత్తి..
హైదరాబాద్: పారిశ్రామిక వేత్త కూన రవీందర్ గౌడ్‌ను బెదిరించి రూ. 50 లక్షలు డిమాండ్ చేసిన కేసులో జీడిమెట్ల పోలీసులు ఇద్దరు సూడో నక్సలైట్లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించాడు. బుధవారం జీడిమెట్ల పోలీస్‌స్టేషన్‌లో బాలానగర్ ఏసీపీ పింగళి నరేష్ రెడ్డి, ఇన్స్పెక్టర్ గడ్డం మల్లేష్ డీఐ కనకయ్యలతో కలిసి వివరాలు వెల్లడించారు. విజయవాడ, గన్నవరానికి చెందిన యర్రంశెట్టి రాజు అక్కడ చోరీలకు పాల్పడి జైలుకు వెళ్లివచ్చాడు. వ్యసనాలకు బానిసైన అతను అప్పులు చేసి జల్సా చేశాడు. అప్పు ఇచ్చిన వారు ఒత్తిడి చేస్తుండటంతో ఎలాగైనా పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు.ఈ నేపథ్యంలో షాపూర్‌నగర్‌లో తాను నివాసం ఉంటున్న ఇంటి యజమాని కూన రవీందర్‌గౌడ్‌ను బెదిరించి డబ్బు లాగాలని పథకం వేశాడు. ఇందులో భాగంగా గన్నవరానికి చెందిన తన స్నేహితుడు కందురెల్లి రాజు(24)ను నగరానికి రప్పించుకున్నాడు. ఈనెల 21న రాత్రి పథకం ప్రకారం కందురెల్లి రాజును కూన రవీందర్‌గౌడ్ ఇంటికి పంపించాడు. స్నేహితుడు చెప్పినట్లుగానే అతను మెయిన్ గేట్లోనుంచి ఇంట్లోకి ప్రవేశించాడు. మొదటి అంతస్తులోకి వెళ్లి కిందికి వచ్చాడు. అక్కడ ఉన్న తులసి మొక్కను పీకేశాడు. అనంతరం ఎర్రరంగు టవల్లో ఓ లేఖను ఉంచి కారుపై పెట్టి వెళ్లిపోయాడు. మర్నాడు ఉదయం రవీందర్‌గౌడ్ కారుపై ఉన్న లేఖను చదివిన రవీందర్ గౌడ్ జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసును సవాల్ తీసుకున్న పోలీసులు ఏసీపీ నరేష్ రెడ్డి నేతృత్వంలో జీడిమెట్ల ఇన్స్పెక్టర్ గడ్డం మల్లేష్, డీఐ కనకయ్య, ఎస్సై ప్రేమ్‌సాగర్ రంగంలోకి దిగారు. దాదాపు 500 సీసీ కెమరాలను పరిశీలించి రవాందర్గౌడ్ ఇంట్లో అద్దెకు ఉంటున్న యర్రంశెట్టి రాజును నిందితుడిగా గుర్తించారు.దీంతో యర్రంశెట్టి రాజు, అతని స్నేహితుడు కందురెల్లి రాజులను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించారు. వారి నుంచి 13నాటు బాంబులు, 4 సెల్ఫోన్లు, ఒక బెదిరింపు ఉత్తరాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు. ఈ కేసును చేదించిన ఇన్స్పెక్టర్ మల్లే‹Ù, డీఐ కనకయ్య, ఎస్సై ప్రేమ్‌సాగర్, పీసీలు నరేష్, రవినాయక్, వెంకటే‹Ùలను ఏసీపీ అభినందించి రివార్డులు అందజేశారు. కాగా నాటు బాంబులు ఎలా వచ్చాయనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టినట్లు సమాచారం. -
నిర్ల ‘క్షయ’ వార్డు
సంగారెడ్డి అర్బన్, న్యూస్‌లైన్: జిల్లా ప్రభుత్వ ఆసుపత్రులోని క్షయవార్డులో బెడ్లు కూడా సరిగా లేక పోవడంతో రోగులు వార్డులో ఉండి చికిత్స చేయించుకునేందుకు నిరాకరిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న బెడ్లు తుప్పుపట్టి పోవడంతో తమ వెంట తెచ్చుకున్న బెడ్షీట్లతో నేలపై నిద్రిస్తున్నారు. వార్డు మొత్తం కంపు కొడుతోంది. వార్డులోని ఫ్లోరింగ్ పూర్తిగా దెబ్బతిన్నది. వార్డు పరిసరాలలో శానిటేషన్, గార్డెనింగ్ లోపించడంతో పిచ్చిమొక్కలు పెరిగి పందులు తిరుగుతున్నాయి. వార్డులో ప్రస్తుతం ఆరుగురు రోగులు ఉన్నారు. ఆస్పత్రిలో కనీస వసతులు లేక పోవడంతో డాక్టర్లు రోగులను చేర్చుకోకుండా ఇంటి వద్దనే ఉంటూ మందులు వాడుకోవాలని సూచిస్తున్నారు. గత కొన్ని నెలలుగా వార్డులో ఉంటూ చికిత్స పొందుతున్న వారిని ప్రశ్నించగా మందులు, భోజనం తప్ప మిగతా సేవలు అందడం లేదన్నారు. తీవ్ర సమస్యతో బాధపడుతున్న వారికి ఏదైనా అత్యవసర వైద్యం అందించాల్సి వచ్చినప్పుడు కనీసం స్ట్రెచర్ కూడా వార్డులో అందుబాటులో లేదని రోజు ఇద్దరు వైద్య సిబ్బంది మాత్రమే అందుబాటులో ఉంటున్నారని, వారు కూడా ఉదయం మాత్రమే అందుబాటులో ఉంటున్నారన్నారు. సాయంత్రం వేళల్లో కూడా వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటే బాగుంటుందని రోగులు కోరుతున్నారు. ఇక్కడికి వచ్చిన రోగులకు రోగం తగ్గక పోగా మరింత పెరిగే విధంగా పరిసరాలు తయారయ్యాయి. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యమే వార్డు దుస్థితికి కారణమని ప్రజలు అంటున్నారు. మా బాధ్యత నెరవేర్చాం క్షయ వార్డుకు సంబంధించి మేము మందులు మాత్రమే అందించగలం. డాక్టర్ల సేవలు సరిగానే అందుతున్నాయి. వార్డుకు సంబంధించిన సమస్యలు పరిష్కరించాల్సింది ఏపీ వైద్య విధాన పరిషత్ అధికారులే. ఈ విషయాన్ని గతంలో వారి దృష్టికి తీసుకవెళ్లాం. రోగులకు సరైన వాతావరణం కల్పిస్తే మరిన్ని సేవలు అందిస్తాం. - జిల్లా క్షయ నియంత్రణ అధికారి పద్మ వార్డులో చాలా సమస్యలు ఉన్నాయి క్షయ రోగులను వ్యాధి తీవ్రతను బట్టి ప్రత్యేక అవసరాలు కలిగిన వారికి కుటుంబ సభ్యుల నుంచి నిరాదరణకుగురైన వారిని వార్డుల్లో ఉంచి వ్యాధి పూర్తిగా నయమయ్యే వరకు మా పర్యవేక్షణలో ఉంచాల్సిన అవసరం ఉంది. రోగికి ప్రతి రోజు అరగంటపాటు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నాం. పరీక్షలు చేసి వ్యాధి నయమయ్యే వరకు ఇక్కడే ఉంచుకుంటాం. వారిని బయటకు పంపితే ఇతరులకు సోకే ప్రమాదం ఉంది. వార్డులో వారికి కావాల్సిన బెడ్లు, ఇతర సామగ్రిని ప్రభుత్వం వెంటనే మంజూరు చేస్తే మరిన్ని సేవలు అందించే అవకాశం ఉంది. పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉండేలా సిబ్బందిని నియమించాలి. వార్డుకు మరో నలుగురు సిబ్బందిని నియమించాల్సి ఉంది. - డాక్టర్ రవీందర్‌గౌడ్, మెడికల్ ఆఫీసర్