ఐశ్వర్యారాయ్‌కి ఎన్టీఆర్ హెల్త్‌కార్డు..!
బొల్లాపల్లి(శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు): బాలీవుడ్ నటి ఐశ్యర్యరాయ్ ఫొటోతో ఎన్టీఆర్ హెల్త్‌కార్డు జారీ అయింది. ఈ సంఘటన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బొల్లాపల్లి మండలం గంగుపల్లి తండాలో వెలుగుచూసింది. తండాకు చెందిన బాణావతు బాలేసు బాయి పేరున ఎన్టీఆర్ హెల్త్ కార్డు జారీ చేశారు.
కుటుంబసభ్యులు ఆ కార్డును పరిశీలించగా ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు ఫొటో, మరోవైపు హాలీవుడ్ స్టార్ అభిషేక్ బచ్చన్ భార్య ఐశ్వర్యరాయ్ బచ్చన్ ఫొటో ఉంది. ఆరోగ్య శ్రీ కార్డును రెవెన్యూ అధికారులకు అందజేసినట్లు బాలేసు బాయి తెలిపారు. కుటుంబ సభ్యుల పేర్లు ఉన్నాయి. కానీ ఫొటోలు లేవని చెప్పారు.