breaking news
no fly zone
-
Tirumala: ఇక ఫ్లయింగ్ జోన్‌గానే తిరుమల?
తిరుపతి, సాక్షి: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరుడు కొలువైన చోట.. పదే పదే అపచారం జరుగుతోంది. ఆనంద నిలయం మీదుగా మళ్లీ విమానాలు వెళ్తుండడంతో భక్తులు ఒకింత ఆందోళన.. అదే సమయంలో ఆగ్రహానికి లోనవున్నారు. ఇంత జరుగుతున్నా కనీసం పట్టించుకోరా? అని ప్రభుత్వాలను నిలదీస్తున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంపై విమానాల రాకపోకలు ఈ మధ్యకాలంలో ఇది మరీ ఎక్కువైపోయాయి. ఆగమ నిబంధనలకు విరుద్ధంగా దాదాపు ప్రతిరోజు శ్రీవారి ఆలయం మీద నుంచి విమానాలు వెళ్తుండడం పట్ల భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే.. తిరుమలను నో ఫ్లయింగ్ జోన్‌గా ప్రకటించాలనే డిమాండ్ కొత్తేం కాదు. ఈ అంశంపై కేంద్రానికి పలుమార్లు తిరుమల తిరుపతి దేవస్థానం, ప్రభుత్వాలు లేఖలు రాసినా స్పందన లేకుండా పోయింది. తిరుపతిలో విమానాల రాకపోకలకు అంతరాయం కలగొచ్చంటూ కేంద్రం అప్పట్లో వివరణ ఇచ్చుకుంది. అంతెందుకు గతంలో టీడీపీ తరఫున అశోక గజపతిరాజు విమానయాన శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కూడా చర్చ జరిగింది. కానీ, అడుగులు ముందుకు పడలేకపోయాయి. అయితే.. ప్రస్తుతం కేంద్రంలోని ఎన్డీయే కూటమిలో టీడీపీ కీలక భాగస్వామి కావడం, పైగా రాష్ట్రానికి చెందిన రామ్మోహన్నాయుడు విమానయానశాఖ మంత్రిగా ఉన్న నేపథ్యంలో సానుకూల స్పందన రావొచ్చని భక్తులు భావించారు. కానీ, అదీ జరగడం లేదు.తాజాగా విమానయాన శాఖ మంత్రికి టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఓ లేఖ రాశారు. తిరుమలపై విమాన రాకపోకలు నిషేధించాలని లేఖలో కోరారు. ఈ లేఖకు మంత్రి రామ్మోహన్నాయుడు స్పందించారు. తిరుమలకు నో ఫ్లయింగ్ జోన్ ఇవ్వడం సాధ్యం కాదని, అలాంటి హోదా ఇవ్వడానికి నిబంధనలు లేవని అన్నారు. పైగా దేశంలో ఇప్పటికే చాలా ఆధ్యాత్మిక ప్రాంతాల నుంచి ఇలాంటి వినతులు వస్తున్నాయని చెప్పారు. అయితే తిరుమల గగనతలంపైకి విమానాలు రాకుండా, ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లేలా తిరుపతి విమానాశ్రయంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, నావిగేషన్ విభాగాలతో చర్చించి చర్యలు తీసుకుంటాం అని మాత్రం హామీ ఇచ్చారు. ఆ హామీ ఇచ్చినా.. ఇప్పుడు మళ్లీ విమానాలు తిరుగుతున్నాయి. ఇంతటి అపచారం జరుగుతున్నా.. తిరుమలను ఫ్లయింగ్ జోన్‌గానే కొనసాగిస్తారా? అని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అగమశాస్త్రం ఏం చెబుతోందంటే.. దేవాలయాలపైన ఎవరూ సంచరించకూడదని అగమశాస్త్రం చెబుతోంది. ఆలయాలు ఉన్నత ప్రాంతాలు. భగవంతుడి కంటే ఎత్తులో ఎలాంటి నిర్మాణాలు ఉండకూడదు. దైవానికి నివేదన చేసేటప్పుడు.. గంటానాదం, ఢమరుకం, వాయిద్యాలు తప్పించి.. మరేయితర శబ్ధాలు వినిపించకూడదు. అలా జరిగితే అది అపచారం. కావున అగమశాస్త్రం ప్రకారం విమానాలు, రాకెట్లు ఆలయం మీదుగా వెళ్లకూడదని పండితులు చెబుతున్నారు. పైగా తిరుమలలాంటి స్వయంవ్యక్త క్షేత్రం కోట్లాదిమంది భక్తుల విశ్వాసాలకు ప్రతీక కాబట్టి సముచితమైన రీతిలో కాపాడుకోవాలని పిలుపు ఇస్తున్నారు. -
తిరుమల శ్రీవారి ఆలయంపై హెలికాఫ్టర్ చక్కర్లు
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంపై సోమవారం ఉదయం ఓ హెలికాఫ్టర్ చక్కర్లు కొట్టడం కలకలం రేపుతోంది. ఆగమ శాస్త్రం ప్రకారం తిరుమల కొండపై విమానాలు, హెలికాప్టర్లు ఎగరడం విరుద్దం. కానీ ఇటీవల తిరుమలలో అధికంగా విమానాలు, హెలికాప్టర్లు తిరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అయితే సంఘ విద్రోహ శక్తుల నుంచి తిరుమలకు ముప్పు ఉన్నట్లు ఇంటలిజెన్స్ వర్గాలు హెచ్చరికలు అందాయికాగా శ్రీవారి ఆలయం పరిసర ప్రాంతాలను నో ఫ్లైజోన్ గా ప్రకటించారు. కానీ తరచుగా తిరుమల కొండ మీదుగా విమానాలు, హెలికాప్టర్లు చక్కర్లు కొడుతున్నాయి. -
మూడో పక్షం జోక్యాన్ని సహించం
లెవివ్: ఉక్రెయిన్ గగనతలాన్ని నో–ఫ్లై జోన్‌గా ప్రకటిస్తే తాము ఎంతమాత్రం అంగీకరించబోమని రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పష్టం చేశారు. ఈ విషయంలో ఏదైనా మూడో పక్షం జోక్యం చేసుకుంటే ప్రస్తుత యుద్ధంలో ఆ పక్షాన్ని కూడా భాగస్వామిగానే పరిగణిస్తామని హెచ్చరించారు. ఉక్రెయిన్–రష్యా వ్యవహారం లో మూడో పక్షం తలదూర్చవద్దంటూ పరోక్షంగా తేల్చిచెప్పారు. పుతిన్ శనివారం రష్యా మహిళా పైలట్లతో సమావేశమయ్యారు. నో–ఫ్లై జోన్ దిశగా ఎవరైనా ముందడుగు వేస్తే వారిని తమ భద్రతా దళాలకు ముప్పుగానే భావిస్తామని, తగిన రీతిలో ప్రతిస్పందిస్తామని తెలిపారు. ఎంతటివారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. ఉక్రెయిన్‌లోని తాజా పరిస్థితికి అక్కడి నాయకులే బాధ్యులని చెప్పారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఒక స్వతంత్ర దేశంగా ఉన్న ఉక్రెయిన్ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందన్నారు. మరోవైపు తమ గగనతలాన్ని నో–ఫ్లై జోన్‌గా గుర్తించాలని నాటో దేశాలపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఒత్తిడి పెంచుతున్నారు. ఇప్పటినుంచి తమ దేశంలో ఎవరైనా మరణిస్తే నాటో కారణంగానే మరణించినట్లు భావిస్తామని చెప్పారు. మూడో దఫా చర్చలకు సిద్ధం ఉక్రెయిన్‌తో మూడో దఫా చర్చలకు సిద్ధంగా ఉన్నామని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావరోవ్ శనివారం చెప్పారు. తమ వైఖరి స్పష్టంగానే ఉందని, ఉక్రెయిన్ వైఖరే నమ్మదగిన విధంగా లేదని తప్పుపట్టారు. రష్యాతో 3వ విడత సోమవారం చర్చలు జరిపాలని ఉక్రెయిన్ భావిస్తున్నట్లు సమాచారం. ఉక్రెయిన్‌లో ఆహార సంక్షోభం! గోధుమల ఎగుమతిలో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉండే ఉక్రెయిన్‌లో ఇప్పుడు ఆహార కొరత తలెత్తింది. అత్యవసరంగా తమకు 10 బిలియన్ డాలర్లు అందజేయాలని ఆమెరికాను జెలెన్స్కీ అభ్యర్థించారు. ఉక్రెయిన్‌లో ఆహార సంక్షోభం ముంచుకొస్తోందని ఐరాస ఆందోళన వ్యక్తం చేసింది. -
తాజ్‌మహల్ పైనుంచి విమానాలు వెళ్లలేవు, ఎందుకో తెలుసా?
ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కుట్రతో కూల్చివేసి, ఆ ప్రజలపైనే దాడులకు తెగబడుతున్న మయన్మార్ నియంత పాలకుల మారణహోమం మొత్తానికి భూతలం నుంచి గగనతలానికి చేరుకుంది! కుట్రకు వ్యతిరేకంగా వీధులలోకి వచ్చి నిరసన ప్రదర్శనలు జరుపుతున్న పౌరులపై సొంత సైన్యమే జరిపిన కాల్పులలో ఫిబ్రవరి 1 నుంచి (ప్రభుత్వాన్ని సైన్యం హస్తగతం చేసుకున్న రోజు) ఇంతవరకు వెయ్యిమందికి పైగా మరణించారు. వీరు కాక, మయన్మార్‌లోని కొన్ని ప్రాంతాలపై సైనిక విమానాలు నిన్న, మొన్న జరిపిన బాంబు దాడుల వల్ల మరణించినవారిలో వంద మందికి పైగా పౌరులు, చిన్నారులు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో శనివారం నాడు ఐక్యరాజ్య సమితిలో మయన్మార్ రాయబారి క్యాఉమో తున్ మయన్మార్‌ను నిర్వైమానిక మండలం (నో–ఫ్లయ్ జోన్) గా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. మయన్మార్ గగనతలాన్ని నో–ఫ్లయ్ జోన్‌గా ప్రకటిస్తే వెంటనే అక్కడ విమానాలు ఎగరడం ఆగిపోవాలి. లేకుంటే అది అంతర్జాతీయ ఆదేశాలకు విరుద్ధం అవుతుంది. అసలు నో–ఫ్లయ్ జోన్‌ను ఏయే పరిస్థితుల్లో ప్రకటిస్తారు? నో–ఫ్లయ్ జోన్ విధింపును ఉల్లంఘిస్తూ ఒక విమానం గాల్లోకి లేస్తే ఆ విమానాన్ని కూల్చివేయవచ్చా? ప్రస్తుతం మయన్మార్ ప్రభుత్వం మిలటరీ చేతుల్లో ఉంది. మిలటరీనే పౌరులపై వైమానిక దాడులకు పాల్పడుతోంది కనుక వారి విమానాలను ఎవరు నేలకు ‘దించుతారు’? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఈ కింది ఏడు నో–ఫ్లయ్ జోన్స్‌లో దొరుకుతాయి. ఇంకొక విషయం. కేవలం యుద్ధ వాతావరణంలో మాత్రమే నో–ఫ్లయ్ జోన్స్‌ని ప్రకటిస్తారనేం లేదు. కొన్ని ప్రత్యేక కారణాల వల్ల కూడా ప్రత్యేక ప్రాంతాలలో విమానాలను ఎగరనివ్వరు. ఉత్తర కొరియా ఈ దేశం ఎప్పుడు, ఎక్కడ, ఏ మిస్సయిల్ను పరీక్షించి చూసుకుంటుందో ఎవరికీ తెలియదు. చిన్న హెచ్చరికైనా జారీ చేయకుండా తరచు జపాన్ సముద్రం మీదుగా ఉత్తర కొరియా తన క్షిపణుల పని తీరును ప్రయోగాత్మకంగా పరీక్షిస్తూ ఉంటుంది! అందుకే ప్రపంచంలోని అనేక దేశాలకు ఉత్తర కొరియా గగనతలం నో–ఫ్లయింగ్ జోన్. చివరికి ఐక్యరాజ్య సమితికి కూడా. తాజ్‌మహల్, ఇండియా భారత ప్రభుత్వం 2006లో తాజ్‌మహల్ గగనతలాన్ని నిర్వైమానిక మండలంగా ప్రకటించింది. తాజ్‌మహల్ పైన విమానాలు ఎగిరేందుకు లేదు. కట్టడాన్ని విమానాల శబ్దం నుంచి కాపాడేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. విమానాల రాకపోకల వల్ల జనించే కాలుష్యం నుంచి ఆ పాలరాతి భవనాన్ని సంరక్షించే ప్రయత్నం కూడా అది. బకింగ్‌హామ్ ప్యాలెస్, లండన్ బ్రిటన్ రాచకుటుంబాలు నివాసం ఉంటే ఈ భవంతుల గగనతలాలు నో–ఫ్లయ్ జోన్స్. రాణిగారి కుటుంబ సభ్యుల భద్రత, రక్షణల కోసం వీటిపై విమానాలు ఎగరకుండా ఏళ్ల నుంచే నిషేధాజ్ఞలు ఉన్నాయి. ఉత్తర భాగం, ఉక్రెయన్ 2014లో ఇక్కడ జరిగిన ఘోర దుర్ఘటనలో మలేషియా విమానం ఎంహెచ్–17 కూలిపోయింది. లోపల ఉన్న ప్రయాణికులంతా మరణించారు. దాంతో విమానాలు ఎగిరేందుకు యోగ్యం కాని అత్యంత ప్రమాదకరమైన ప్రాంతంగా దీనిని పరిగణించి, నో–ఫ్లయ్ జోన్‌గా ప్రకటించారు. అంతేకాదు, రష్యా, ఉక్రెయిన్ల మధ్య నడిచే అన్ని విమానాలూ ఒక దాని గగనతలం మీద ఒకటి (కొన్ని ప్రాంతాల మీదుగా) ఎగిరేందుకు లేదు. సరిహద్దు వివాదాలు అందుకు కారణం. వాల్ట్ డిస్నీ వరల్డ్, యు.ఎస్.ఎ. ఈ థీమ్ పార్క్‌కు మూడు మైళ్ల పరిధిలో, 3000 అడుగుల లోపు ఎత్తులో విమానాలు ఎగిరేందుకు లేదు. విమానాల ధ్వనులు అత్యంత సున్నితమైన తమ నిర్మాణాలకు పడవని డిస్నీ అంటుంది! ఆ ధ్వనులు.. ప్రశాంతమైన డిస్నీకి కొత్తగా వచ్చినవాళ్లను భయపెట్టే ప్రమాదం ఉందని కూడా యాజమాన్యం ఆందోళన వ్యక్తం చేయడంతో ప్రభుత్వం ఆ గగనతలాన్ని నో–ఫ్లయ్ జోన్‌గా ప్రకటించింది. అయితే ‘ఫ్లయింగ్ అడ్వరై్టజ్మెంట్లు’ ఇచ్చేందుకు వీల్లేకుండా తమను నివారించడానికే డిస్నీ ఆ ప్లాన్ వేసిందని పోటీదారుల ఆరోపణ. ఏరియా 51, యు.ఎస్.ఎ. నెవడా రాష్ట్రంలోని ఎడారి వంటి ఈ ప్రాంతం అమెరికా రక్షణదళం అధీనంలో ఉంది. అమెరికా సైన్యం నిరంతరం ఇక్కడ మిలటరీ టెక్నాలజీకి సంబంధించిన రహస్య కార్యకలాపాలు నిర్వహిస్తుంటుంది. 1950 లు, 60 లలో ‘యు–2 స్పై ప్లేన్’ను ఇక్కడే తయారు చేశారు. యు.ఎస్. రాజధాని వాషింగ్టన్‌పై ఎంత గట్టి నిఘా ఉంటుందో ఈ ‘ఏరియా 51’ చుట్టూ, లోపల మానవ కదలికలపై అంతకుమించిన నిఘా, ఆంక్షలు ఉంటాయి. ఏరియా 51 గగనతలంపై చిన్న పిట్టలాంటి విమానం కూడా ఎగరడానికి లేదు. అది స్వదేశీ విమానమే అయినా.. నేల కూల్చేస్తారు. తియానన్మెన్ స్క్వేర్, చైనా చైనా గగనతలంలో ఏ ప్రాంతంలోనైనా అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉన్నాయంటే అది తియానన్మెన్ స్క్వేరే. ఆ స్క్వేర్ మీదుగా విమానాలు వెళ్లకూడదు. ఒకప్పుడు పావురాలు, ద్రోణ్‌లు, బెలూన్లు కూడా పైన ఎగరడం నిషిద్ధం. వెంటనే షూట్ చేసి పడగొట్టేసేవారు. ఈ స్క్వేర్‌లోనే అమూల్యమైన పురావస్తుశాలల భవంతులు, చైనా చారిత్రక యోధుల స్మరణ మందిరాలు ఉన్నాయి. వాటికి తాకిడి లేకుండా ఉండేందుకే నో–ఫ్లయ్ జోన్ చేశారు. బ్రిటన్ రాచకుటుంబాలు నివాసం ఉంటే ఈ భవంతుల గగనతలాలు నో–ఫ్లయ్ జోన్స్. రాణిగారి కుటుంబ సభ్యుల భద్రత, రక్షణల కోసం వీటిపై విమానాలు ఎగరకుండా ఏళ్ల నుంచే నిషేధాజ్ఞలు ఉన్నాయి. -
తిరుమలకొండపై నో ఫ్లై జోన్ కుదరదు
– తేల్చి చెప్పిన కేంద్రం.. – చొరవ చూపని టీడీపీ కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజు? – ఆందోళనలో ఆలయ శ్రీవారి భద్రత – తలపట్టుకున్న టీటీడీ, భద్రతా విభాగాలు – సబబుకాదంటూనే మౌనం దాల్చిన టీటీడీ ఆగమ సలహాదారులు సాక్షి,తిరుమల: శ్రీవారి ఆలయ గగనతలంపై విమానాలు ఎగరకూడదని పురాణాలు చెబుతున్నాయి. శ్రీవారి ఆలయానికి రెండువేల సంవత్సరాలకుపైగా చరిత్ర ఉంది. వైఖానస ఆగమ నిబంధనలకు లోబడి నిత్యపూజలతో అలరారే స్వామివారి ఆలయ పవిత్రత చాలా ముఖ్యం. ఏటా 450కిపైగా నిత్యసేవలు,పూజలు,ఉత్సవాలతో స్వామివారు భక్తకోటికి దర్శనమిస్తూ సాక్షాత్కరిస్తుంటారు. సాక్షాత్తూ దేవతలు సైతం నిత్యం ఆకాశమార్గం నుంచి గర్భాలయమూర్తిని అరూపంగా దర్శించి సేవిస్తున్నారని ఆగమం చెబుతోంది. వైఖానస ఆగమ నిబంధనల ప్రకారం ఆలయ గగనతలంపై ఇతర లోహ పరికరాలు(విమానాలు, హెలికాఫ్టర్లు, ద్రోణ్) ఎగరకూడదని పండితులు ఎప్పటి నుంచో చెబుతున్నారు. పార్లమెంటరీ భద్రతా కమిటీ హామీ బుట్టదాఖలు ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద చర్యలు పెరిగిపోయాయి. అగ్రరాజ్యమైన అమెరికాలోని ట్విన్ టవర్స్‌పైనే ఏకంగా విమానాలతో జరిగిన ఉగ్రదాడితో ప్రపంచమే తెల్లబోయింది. ఆ మేరకు దేశవ్యాప్తంగా భద్రతా విభాగం అప్రమత్తమైంది. రక్షణ చర్యలు రెట్టింపు చేసింది. ముష్కరుల టార్గెట్‌లో తిరుమల కూడా ఉందని 2009లోనే అప్పటి కేంద్ర హోంమంత్రి చిదంబరం వెల్లడించారు. ఆలయ పవిత్రతోపాటు భద్రతా పరంగా విమానాలు విమానాల రాకపోకల్ని నిషేధించాలని సంకల్పించారు. తర్వాత 2010లో కేంద్ర మాజీ మంత్రి అద్వానీ నేతృత్వంలోని పార్లమెంటరీ భద్రతా కమిటీ తిరుమల పర్యటనలో భాగంగా శ్రీవారి ఆలయంపై విమానాలు తిరగకుండా చట్టం తీసుకొస్తామని హామీ ఇచ్చింది. తర్వాత టీటీడీ ధర్మకర్తల మండలి కూడా విమానాలపై తీర్మానం చేసి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి చెందిన అశోక్‌గజపతి రాజు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కూడా దీనిపై హామీ ఇచ్చారు. దీంతో తిరుమలకొండ మీద విమానాల నిషేధం ఖాయమని అందరూ భావించారు. ఈ తరుణంలో మంగళవారం రాజ్యసభలో ఆశాఖ సహాయమంత్రి జయంత్ సిన్హా ‘నిషేధం కుదరదు’ అని తేల్చేసి నిరాశపరిచారు. తిరుమలకొండ కిందే అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్న కారణంగా నిషేధించడానికి సాధ్యంకాదని, దీనివల్ల జాతీయ, అంతర్జాతీయ సర్వీసుల రాకపోకలకు ఇబ్బంది కలుగుతుందని రాతపూర్వంగా వివరణ ఇచ్చారు. దీంతో రాష్ట్రంలో అధికార పార్టీకి చెందిన కేంద్ర మంత్రి ఉండి కూడా నో ఫై జోన్ తీసుకురావడంలో విఫలమయ్యారని విమర్శలు వెల్లువెత్తాయి తలపట్టుకున్న టీటీడీ, భద్రతా విభాగాలు కేంద్రం చేతులెత్తేయడం టీటీడీ, భద్రతా విభాగాలకు తలనొప్పిగా మారింది. తరచూ విమానాలు ఆలయ గగనతలంపై సమీపంలోనే చక్కర్లు కొడుతున్నాయి. తాజా నిర్ణయంతో టీటీడీ, భద్రతాధికారుల్లో ఆందోళన రెట్టింపైంది. గత ఏడాది తిరుమలలో రెక్కీ జరిగినట్టు ఉగ్రవాద సానుభూతిపరులు వెల్లడించడం, తిరుమలలో అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని తరచూ కేంద్ర, నిఘా వర్గాలు పదేపదే హెచ్చరిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం నిర్ణయం ఎంతవరకు సబబు అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటు ఆలయ పవిత్రత, అటు భద్రతా లోటును ఏ విధంగా పూడ్చాలనే అంశంపై టీటీడీ, భద్రతా విభాగాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. సబబుకాదంటూనే మౌనందాల్చిన టీటీడీ ఆగమ సలహాదారులు శ్రీవారి ఆలయంతోపాటు టీటీడీ అనుబంధ ఆలయాల్లో ఆగమ పరంగా పూజా కైంకర్యాలు, ఆలయ పవిత్రతకు సంబంధించిన అంశాల్లో సలహాలిచ్చేందుకు ప్రత్యేకంగా ఆగమ సలహాదారులున్నారు. వీరిలో ప్రధాన అర్చకులు ఏవీ రమణ దీక్షితులు, ఏకే సుందరవరదన్, తిరుపతికి చెందిన విష్ణుభట్టాచార్యులు, తమిళనాడుకు చెందిన అప్పికట్ల దేశికాచార్యులు, ద్వారకా తిరుమలకు చెందిన రాంబాబు ఉన్నారు. తిరుమలతో ముడిపడిన కేంద్రం తీసుకున్న నిర్ణయంపై పరిపాలన పరమైన నిర్ణయమైనా ఆలయపరంగా సబబు కాదని స్పష్టం చే శారు. దీనిపై బహిరంగంగా మాట్లాడేందుకు నిరాకరించడం గమనార్హం. -
శ్రీవారి ఆలయంపై విమానం
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయ ఆలయం పై విమానం ప్రయాణించింది. బుధవారం ఉదయం తిరుమల కొండపై వచ్చిన విమానం శ్రీవారి ఆలయం పై నుంచి వెళ్లింది. విమానం తిరుమలలో ఆలయం పై నుంచి వెళ్లడం కలకలం సృష్టిస్తోంది. ఆలయంపై విమానాలు వెళ్లడం ఆగమ విరుద్ధమని పండితులు చెబుతున్నారు. తిరుమల గర్భ ఆలయంపై విమానాలు ప్రయాణంపై నిషేదం ఉన్నా విమానయాన శాఖ పట్టించుకోవడంలేదని, ఇలా జరగడబ అరిష్టమంటున్నారు. కాగా టీటీడీ ఛైర్మన్ చదలవాడి కృష్ణమూర్తి అప్పట్లో పౌరవిమానయాన మంత్రిత్వ శాఖకు లేఖ రాసి.. తిరుమల పుణ్యక్షేత్రాన్ని నో ఫ్లైయింగ్ జోన్‌గా ప్రకటించాలని కోరారు. తిరుమలను నో ఫ్లైయింగ్ జోన్ గా ప్రకటించడం రక్షణ శాఖ పరిధిలో ఉందని, అయితే ఆలయంపై నుంచి విమానాలు వెళ్లకుండా చూడాలని అధికారులకు సూచించినట్టు కేంద్ర మంత్రి అశోకగజపతి రాజు ఇటీవలే చెప్పారు. కాగా, గడచిన పది రోజులలో ఆలయం మీదుగా విమానం వెళ్లడం ఇది రెండోసారి కావడం గమనార్హం. -
తిరుమలలో మళ్లీ అపచారం
-
తిరుమలలో మళ్లీ అపచారం
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమలలో శ్రీవారి ఆలయ గోపురం పైనుంచి వారం రోజుల్లో రెండు సార్లు విమానాలు రాకపోకలు సాగించాయి. శనివారం కూడా ఆలయ ప్రధాన గోపురం పైనుంచి విమానం వెళ్లింది. నో ఫ్లయింగ్ జోన్‌గా ఉన్న ప్రదేశంలో విమానాల రాకపోకలను నిషేధించినప్పటికీ ఇలా జరగడంపై వేదపండితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆగమ శాస్త్రం ప్రకారం ఇది అపచారమని వారు వెల్లడించారు.