breaking news
Monsoon Process
-
జీడీపీ గణాంకాలపై ఫోకస్
ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లు పలు అంశాల ఆధారంగా కదలనున్నాయి. ప్రధానంగా యూఎస్, భారత్ జీడీపీ గణాంకాలు ప్రభావం చూపనున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఫెడరల్ రిజర్వ్ గత పాలసీ వివరాలు, రుతుపవనాల తీరు తదితర పలు అంశాలు సైతం ట్రెండ్‌ను నిర్దేశించనున్నట్లు తెలియజేశారు. వివరాలు చూద్దాం.. న్యూఢిల్లీ: ఇటు దేశీ, అటు విదేశీ అంశాలు ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లకు కీలకంగా నిలవనున్నాయి. ప్రధానంగా పలు ఆర్థిక గణాంకాలు ఈ వారం వెలువడనున్నాయి. దేశీయంగా చూస్తే ఏప్రిల్ నెలకు పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ), త యారీ రంగ గణాంకాలను ప్రభుత్వం బుధవారం(28న) ప్రకటించనుంది. 2025 మార్చిలో ఐఐపీ, తయారీ రంగాలు 3% చొప్పున పుంజుకున్నాయి. ఈ బాటలో జనవరి –మార్చి2025 కాలానికి దేశ ఆర్థిక వ్యవస్థ(జీడీపీ) పురోగతి గణాంకాలు శుక్రవారం(30న) వెల్లడికానున్నాయి. 2024 అక్టోబర్–డిసెంబర్లో దేశ జీడీపీ 6.2 శాతం ఎగసింది. వీటిపై ఇన్వెస్టర్లు దృష్టిపెట్టనున్నట్లు మోతీలాల్ ఓస్వాల్ వెల్త్ మేనేజ్మెంట్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా తెలియజేశారు. విదేశీ అంశాలు ఏప్రిల్ నెలకు యూఎస్ మన్నికైన వస్తు ఆర్డర్లు 27న, కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్(ఎఫ్‌వోఎంసీ) గత పాలసీ సమీక్ష వివరాలు(మినిట్స్) 28న విడుదలకానున్నాయి. 29న క్యూ1 జీడీపీ రెండో అంచనాలు వెలువడనున్నాయి. ఇదే రోజు మే నెలకు జపాన్ కన్జూమర్ కాని్ఫడెన్స్ ఇండెక్స్ వెల్లడికానుంది. 30న యూఎస్ ఏప్రిల్ పీసీఈ ధరల ఇండెక్స్ విడుదలకానుంది. కాగా.. చైనాసహా ఇతర దేశాలతో యూఎస్ వాణిజ్య చర్చలకు ప్రాధాన్యమున్నట్లు జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయిర్ తెలియజేశారు. కొద్ది రోజులుగా మళ్లీ విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు దేశీ స్టాక్స్‌లో పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నప్పటికీ కొన్ని సెషన్లలో అమ్మకాలకూ ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో విదేశీ ఇన్వెస్టర్ల తీరు సైతం సెంటిమెంటును ప్రభావితం చేయగలదని నిపుణులు పేర్కొన్నారు. క్యూ4 ఫలితాలు ఇప్పటికే క్యూ4(జనవరి–మార్చి2025) ఫలితాల సీజన్ ముగింపునకురాగా.. ఈ వారం మరికొన్ని దిగ్గజాల పనితీరు వెల్లడికానుంది. జాబితాలో బజాజ్ ఆటో, ఐఆర్సీటీసీ, అరబిందో ఫార్మా తదితరాలున్నాయి. ఈ ఏడాది అంచనాలకంటే ముందుగానే రుతుపవనాలు కేరళను తాకడం, కేంద్ర ప్రభుత్వానికి ఆర్బీఐ అత్యధిక డివిడెండ్ చెల్లింపు సానుకూల అంశాలుకాగా.. యూఎస్ ట్రెజరీ బాండ్ల ఈల్డ్స్‌తోపాటు, ప్రభుత్వ రుణ భారం అధికమవుతుండటం ఇన్వెస్టర్లలో ఆందోళనలు పెంచవచ్చని రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్వీపీ అజిత్ మిశ్రా పేర్కొన్నారు. గత వారాంతాన ఆర్బీఐ ప్రభుత్వానికి రూ. 2.69 లక్షల రికార్డ్ డివిడెండ్ చెల్లించిన సంగతి తెలిసిందే. సాంకేతికంగా గత వారం మార్కెట్లు స్వల్పంగా డీలా పడ్డాయి. బీఎస్ఈ సెన్సెక్స్ నికరంగా 610 పాయింట్లు(0.75 శాతం) క్షీణించి 81,721 వద్ద నిలిచింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 167 పాయింట్లు(0.7 శాతం) నష్టంతో 24,853 వద్ద ముగిసింది. బీఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.3 శాతం నీరసించగా.. స్మాల్ క్యాప్ మాత్రం 0.95 శాతం ఎగసింది. సాంకేతికంగా ఈ వారం నిఫ్టీకి 24,950–25,000 పాయింట్ల వద్ద అవరోధాలు(రెసిస్టెన్స్) ఎదురుకావచ్చని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఈ బాటలో సెన్సెక్స్‌కు 82,500–83,000 పాయింట్లవద్ద రెసిస్టెన్స్ కనిపించవచ్చని అంచనా వేశారు. -
రైతన్నకు తీపి కబురు
సాక్షి, న్యూఢిల్లీ: దేశానికి వెన్నెముకైన రైతన్నలకు సంతోషాన్నిచ్చే కబురును భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం చెప్పింది. ఈ ఏడాది రుతుపవనాలు సాధారణ వర్షపాతాన్ని తెస్తాయని వెల్లడించింది. ఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఐఎండీ డైరెక్టర్ జనరల్ కేజే రమేశ్ వాతావరణ విభాగం తొలివిడత అంచనాలను విడుదల చేశారు. రెండో అంచనాలను జూన్ ప్రారంభంలో, రుతుపవనాల ప్రారంభాన్ని మే మాసంలో వెల్లడిస్తారు. సాధారణంగా జూన్ 1కి నాలుగు రోజులు అటుఇటుగా రుతుపవనాలు కేరళలోకి ప్రవేశిస్తాయి. రమేశ్ మాట్లాడుతూ ‘2018 నైరుతి రుతుపవనాల కాలంలో జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య వర్షపాతం సాధారణంగా ఉంటుంది. 2016, 2017 సీజన్లలాగే విస్తృతంగా వర్షాలు పడి రైతులకు ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నాం. దీర్ఘకాలిక సగటు వర్షపాతంతో పోలిస్తే ఈ ఏడాది 97 శాతం వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఈ అంచనా వాస్తవంలో ఐదు శాతం తగ్గొచ్చు లేదా పెరగొచ్చు. 1951 నుంచి 2000 వరకు చూస్తే దీర్ఘకాలిక సగటు వర్షపాతం 890 మి.మీ.’ అని చెప్పారు. వాన రోజులు తగ్గుతున్నాయి జాగ్రత్త! గ్లోబల్ వార్మింగ్ కారణంగా గత కొన్నేళ్లుగా వర్షాలు పడే రోజులు తగ్గుతున్నాయనీ, నీటి సంరక్షణ, నిల్వ సామర్థ్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందని రమేశ్ సూచించారు. ‘ఒక ఏడాదిలో వర్షం కురిసే రోజుల సంఖ్య గతంలో కంటే తగ్గుతోంది. ఈ పరిస్థితుల్లో వాననీటిని ఒడిసిపట్టుకునేందుకు నీటి సంరక్షణ పద్ధతులను మెరుగ్గా పాటించాలి. నిల్వ సామర్థ్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. దీర్ఘకాల సగటులో 96% వర్షం కురుస్తుందని గతేడాది మేం అంచనా వేసినా మధ్య భారతంలో కొన్ని రోజులు వర్షాలు పడలేదు. సెప్టెంబరు ఆఖరు వరకు చూస్తే 95% వర్షపాతమే నమోదైంది. అయితే అక్టోబరు మొదటి వారంలో మరికొంత వర్షం పడటంతో మా అంచనాలు నిజమయ్యాయి. గత సంవత్సరం కంటే ఈ ఏడాది ఒక శాతం ఎక్కువగానే మా అంచనాలు ఉన్నాయి’ అని రమేశ్ వివరించారు. పరిస్థితులు అనుకూలం: గత ఏడాది ఓ మోస్తరుగా ఉన్న లా నినా పరిస్థితులు ఈ ఏడాది ప్రారంభంలో బలహీనపడ్డాయనీ, రుతుపవనాల సీజన్ ప్రారంభమయ్యే నాటికి తటస్థ పరిస్థితికి వచ్చే అవకాశం ఉందని ఐఎండీ డైరెక్టర్ జనరల్ తెలిపారు. ‘ఈ ఏడాది రుతుపవనాలు ప్రారంభమయ్యేనాటికి లా నినా తటస్థంగా ఉండే అవకాశం ఉంది. ఎల్‌నినో పరిస్థితులకు అవకాశం లేదు’ అని చెప్పారు. ఈ అంచనాలు నిజమైతే దేశ ఆర్థిక వ్యవస్థకూ మేలు జరుగుతుందనీ, జీడీపీ వృద్ధిరేటు కూడా పెరుగుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ ఏడాది రికార్డు స్థాయిలో 27.75 కోట్ల టన్నుల ధాన్యాల దిగుబడి జరగ్గా.. వర్షాలు బాగా కురిస్తే వచ్చే ఏడాది ఉత్పత్తి అంతకు దాటి పోవచ్చని వ్యవసాయ శాఖ కార్యదర్శి పట్నాయక్ చెప్పారు. 50 శాతానికిపైగా రైతులు వర్షాధారిత సాగు చేస్తుండటంతో వారి దిగుబడి పెరిగి తద్వారా కొనుగోలు శక్తి కూడా పెరిగి ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుందని అంటున్నారు. -
రుతుపవనం లో తటస్థంగా లానినా
న్యూఢిల్లీ: ఈ ఏడాది రుతుపవనాల కాలంలో ‘లానినా’ తటస్థంగా ఉంటుందనీ, దేశంలో సాధారణ వర్షపాతం నమోదవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుందని భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజీవన్ సోమవారం చెప్పారు. ఎల్ నినో ప్రభావం వల్ల పసిఫిక్ మహా సముద్ర జలాలు వేడెక్కితే, లానినా వల్ల చల్లబడతాయి. సాధారణంగా ఎల్ నినో వల్ల తక్కువ వర్షాలు కురిస్తే, లానినా వల్ల మంచి వానలు పడతాయి. ‘ప్రస్తుతం లానినా ఓ మాదిరిగా ఉంది. రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించే సమయానికల్లా అది తటస్థంగా ఉంటుంది. సముద్రంపై ఉష్ణోగ్రతలకు సంబంధించిన ఇండియన్ ఓషన్ డైపోల్ (ఐవోడీ) ఈసారి ఆశాజనకంగా ఉండే అవకాశం ఉంది’ అని రాజీవన్ వెల్లడించారు. -
భారతదేశ శీతోష్ణస్థితి
రుతుపవన ప్రక్రియ చాలా సంక్లిష్టమైంది. రుతుపవన ప్రక్రియ ఆవిర్భావాన్ని కింది సిద్ధాంతాల ద్వారా వివరించవచ్చు. అవి * థర్మల్ సిద్ధాంతం * ఫ్లాన్ సిద్ధాంతం * జెట్‌స్ట్రీమ్ సిద్ధాంతం * టిబెటన్ హీట్ ఇంజిన్ * ఎల్‌నినో సిద్ధాంతం * ఈక్వినో, ఐవోడీ దృక్పథం థర్మల్ సిద్ధాంతం ప్రకారం.. నైరుతి రుతుపవనాలు సముద్ర పవనాల లాంటివి. ఖండ-సముద్ర భాగాల ఉష్ణ ప్రవర్తనలో వ్యత్యాసం వల్ల ఇవి ఏర్పడతాయి. నైరుతి రుతుపవనాలను భారత ఉపఖండంలోకి ఆకర్షించే అల్పపీడన మండలం వేసవిలో అధిక ఉష్ణోగ్రతల వల్ల ఏర్పడిందని ఈ సిద్ధాంతం ప్రతిపాదిస్తుంది. ఫ్లాన్ సిద్ధాంతం ప్రకారం ఆగ్నేయ రుతుపవనాలు దక్షిణాసియాలో రూపాంతరం చెంది.. నైరుతి రుతుపవనాలుగా భారత్‌లో ప్రవేశిస్తాయి. సూర్యుడి సాపేక్ష గమనం వల్ల భూమధ్యరేఖా అల్పపీడన మండలం కర్కటక రేఖ వద్దకు స్థానభ్రంశం చెంది నైరుతి రుతుపవనాలను ఆకర్షిస్తుంది. వేసవిలో టిబెట్ పీఠభూమి దాదాపు కొలిమిగా మారుతుంది. పర్వత పరివేష్టిత పీఠభూమి కావడంతో ఇక్కడ ఉపరితల ఉష్ణోగ్రతలు బాగా పెరుగుతాయి. దీంతో టిబెటన్ పీఠభూమి నుంచి సంవహన వాయువులు దక్షిణంగా వీచి దక్షిణ హిందూ మహాసముద్రంలో అవనతం చెందుతాయి. దాంతో దక్షిణ హిందూ మహాసముద్రంలో అధిక పీడనం ఏర్పడుతుంది. దక్షిణ హిందూ మహాసముద్రానికి వాయవ్య భారతదేశానికి మధ్య పీడన ప్రవణత ఏర్పడటంతో దక్షిణ హిందూ మహాసముద్రం నుంచి కవోష్ణ ఆర్ధ్ర పవనాలు భారత్‌లో ప్రవేశిస్తాయి. ఉప ఆయనరేఖా పశ్చిమ జెట్‌స్ట్రీమ్ జూన్ మొదటి వారంలో హిమాలయాలకు ఉత్తరంగా స్థానభ్రంశం చెందడం వల్ల నైరుతి రుతుపవనాలు ఉద్ధృతంగా భారతదేశంలోకి ప్రవేశిస్తాయి. ఆఫ్రికా తూర్పు తీరంలోని సోమాలియా నుంచి అరేబియా సముద్రం మీదుగా.. కేరళ తీరం వైపు వీచే సోమాలియా నిమ్న స్థాయి జెట్‌స్ట్రీమ్ నైరుతి రుతుపవనాలను బలోపేతం చేస్తుంది. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడే ఎల్‌నినో నైరుతి రుతుపవనాలను బలహీనపరుస్తుందని వాతావరణ నిపుణుల అభిప్రాయం. ఈ కారణంతోనే రుతుపవనాల భవిష్యత్తు నమూనాలో ఎల్‌నినో చలనరాశులకు పెద్దపీట వేశారు. అయితే గ్లోబల్ వార్మింగ్ వల్ల ఇటీవల ఎల్‌నినో నైరుతి రుతుపవన వ్యవస్థల మధ్య సంబంధం బలహీనపడుతున్నట్లు శాస్త్రవేత్తలు నిర్ధారించారు. రుతుపవన పూర్వకాలాన్ని నడివేసవిగా పరిగణిస్తాం. ఈ కాలంలో పగటి ఉష్ణోగ్రతలు గరిష్టంగా ఉంటారుు. ముఖ్యంగా వాయవ్య భారతదేశం, దక్కన్ పీఠభూమి అంతర్భాగాల్లో పగటి ఉష్ణోగ్రతలు గరిష్టంగా 45నిఇలకు పైగా నమోదవుతారుు. ఈ కాలంలో సంవహన ప్రక్రియ వల్ల మధ్యాహ్నం గాలిదుమ్ములు, చిరుజల్లులతో కూడిన స్థానిక పవనాలు వీస్తారుు. వీటిని దేశంలోని వివిధ ప్రాంతాల్లో వేర్వేరు పేర్లతో పిలుస్తారు. ఉదాహరణకు ఆంధీలు(ఉత్తరప్రదేశ్), లూ (పంజాబ్, హర్యానా), కాల బైశాఖి(బిహార్, పశ్చిమబెంగాల్), మామిడి జల్లులు(దక్షిణ భారతదేశం). నైరుతి రుతుపవన కాలంలో దేశమంతటా విస్తారంగా వర్షాలు కురుస్తారుు. వార్షిక సగటు వర్షపాతంలో సుమారు మూడింట రెండొంతులు ఈ నాలుగు నెలల కాలంలోనే సంభవిస్తుంది. బంగాళాఖాతం, అరేబియూ సముద్రం నుంచి వీచే ఆర్ధ్ర రుతుపవనాలు విస్తారంగా వర్షాన్నిస్తాయి. పశ్చిమ తీరమైదానం, దక్షిణ షిల్లాంగ్ పీఠభూమి ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం కురుస్తుంది. ఇక్కడ సగటు వర్షపాతం 250 సెం.మీ.కు పైగా నమోదవుతుంది. ఈ మండలానికి చెందిన చిరపుంజి, మాసిన్రామ్లలో ప్రపంచంలోకెల్లా అత్యధిక వర్షపాతం నమోదవుతుంది. ఈ కాలంలో వర్షపాత విస్తరణలో ప్రాంతీయ అసమానతలు స్పష్టంగా కనిపిస్తారుు. సహ్యాద్రి పర్వతాలకు పవన పరాన్ముఖ దిశలో ఉన్న దక్కన్ పీఠభూమి అంతర్భాగాల్లో వర్షపాతం 50-70 సెం.మీ. ఉంటుంది. ఇది వర్షచ్ఛాయూ ప్రాంతం కావడంతో పాక్షిక శుష్క మండలంగా ఏర్పడింది. రుతుపవనాల తిరోగమనం సెప్టెంబర్ 15 కల్లా భారతదేశం నుంచి నైరుతి రుతుపవనాల తిరోగమనం ప్రారంభమవుతుంది. తిరోగమన రుతుపవనాలు శీతల శుష్కఖండ వాయురాశులతో కూడి ఉంటారుు. ఇవి బంగాళాఖాతం మీదకు రాగానే సముద్ర నీటిఆవిరిని పీల్చుకొని ఆర్ధ్రంగా తయూరవుతారుు. ఇదే సమయంలో బంగాళాఖాతంలో ఈశాన్య వ్యాపార పవనాలు బలంగా వీస్తుంటాయి. వీటి ప్రభావం వల్ల తిరోగమన రుతుపవనాలు, ఈశాన్య రుతుపవనాల రూపంలో తమిళనాడు, దక్షిణ కోస్తా ఆంధ్ర తీరాన్ని తాకుతాయి. ఈ ప్రాంతంలో ఈశాన్య రుతుపవనాల ప్రభావం వల్ల విస్తారంగా వర్షాలు కురుస్తాయి. ఈ కాలంలో దేశమంతటా ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గిపోతాయి. హిమాలయ ప్రాంతంలో మంచు విస్తారంగా కురుస్తుంది. పశ్చిమ పవనాల ప్రభావం వల్ల మధ్యధరా సముద్రం, ఎర్ర సముద్రం ప్రాంతాల నుంచి వచ్చే బలహీనకవోష్ణ సమశీతోష్ణ మండల చక్రవాతాలు, వాయవ్య భారత్‌లో ప్రవేశిస్తాయి. వీటి వల్ల పంజాబ్, హర్యానా, రాజస్థాన్, జమ్మూకశ్మీర్, పశ్చిమ ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో జల్లులు కురుస్తాయి. వీటిని పశ్చిమ అలజడులుగా పిలుస్తారు. ఇదే కాలంలో.. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడే స్థానిక అల్పపీడన ద్రోణులు మరింత తీవ్రమై వాయుగుండాలు తుఫాన్లుగా రూపాంతరం చెంది దేశ తూర్పు తీరాన్ని తాకుతాయి. ఆయనరేఖా రుతుపవన శీతోష్ణస్థితి భారతదేశం వైవిధ్య శీతోష్ణస్థితిని కలిగి ఉంది. స్థూలంగా భారతదేశ శీతోష్ణస్థితిని ‘ఆయనరేఖా రుతుపవన శీతోష్ణస్థితి’గా అభివర్ణిస్తారు. ఇక్కడ సంవత్సరాన్ని ఆరు రుతువులుగా విభజించడం సంప్రదాయం. అంటే.. ప్రతి రెండు నెలలకొకసారి శీతోష్ణస్థితిలో గుణాత్మక మార్పులు సంభవిస్తాయి. అరుుతే శాస్త్రీయంగా భారతదేశ శీతోష్ణస్థితి సంవత్సరాన్ని నాలుగు రుతువులుగా విభజిస్తారు. అవి : రుతుపవన పూర్వకాలం: మార్చి 15 - జూన్ 15 నైరుతి రుతుపవన కాలం: జూన్ 15 - సెప్టెంబర్ 15 ఈశాన్య రుతుపవన కాలం: సెప్టెంబర్ 15 - డిసెంబర్ 15 రుతుపవన అనంతర కాలం: డిసెంబర్ 15 - మార్చి 15 రుతుపవనాలు: భారతదేశ వాతావరణాన్ని రుతుపవనాలు సంవత్సరం పొడవునా ప్రభావితం చేస్తాయి. దక్షిణ హిందూ మహాసముద్ర ప్రాంతంలో నిమ్న ట్రోపో ఆవరణంలో ఏర్పడే విశిష్టమైన పవన వ్యవస్థను రుతుపవన వ్యవస్థగా అభివర్ణిస్తారు. ఇది దక్షిణాసియా, ఆగ్నేయాసియా ప్రాంతాల శీతోష్ణస్థితిని ప్రభావితం చేస్త్తుంది. శీతాకాలంలో భారత ఉపఖండంపై విస్తరించి ఉన్న శీతల, శుష్క ఖండ వాయురాశిని జూన్-సెప్టెంబర్ మధ్యకాలంలో కవోష్ణ, ఆర్థ్ర సముద్ర వాయురాశి స్థానభ్రంశం చెందిస్తుంది. రుతుపవనాలు-ముఖ్య లక్షణాలు * రుతువులను అనుసరించి పవన దిశలో సుమారు 180 డిగ్రీల మార్పు. వేసవి, శీతాకాలాల్లో పరస్పర విరుద్ధ లక్షణాలున్న వాయురాశులు * దేశంలోకి అకస్మాత్తుగా ప్రవేశించడం * క్రమపద్ధతిలో దేశమంతటా విస్తరించడం * క్రమపద్ధతిలో తిరోగమించడం. అనిశ్చితత్వం - గురజాల శ్రీనివాసరావు, జాగ్రఫీ సబ్జెక్టు నిపుణులు