breaking news
land transactions
-
‘భూదాన్’ స్వాహాకు కుట్ర
సాక్షి, హైదరాబాద్: భూదాన్ భూముల స్వాహాకు అక్రమార్కులు కుట్రపన్నారు.. ఫోర్జరీ పత్రాలు, తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించారు.. తద్వారా డీ నోటీఫై చేసిన భూదాన్, గైరాన్ (ప్రభుత్వ) భూములను విక్రయించారు.. దీనికి సబ్ రిజిస్ట్రార్ నుంచి కలెక్టర్ వరకు అంతా సహకరించారు.. డాక్యుమెంట్లు, కోర్టు ఉత్తర్వులను కనీస పరిశీలన చేయకుండానే డీనోటీఫైకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశారు.. ఆ వెంటనే అక్రమార్కులు భూములను విక్రయించేశారు.. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలోని సర్వే నంబర్ 181, 182లోని సర్కార్ భూముల స్వాహాపై విచారణ సందర్భంగా ఈమేరకు బహిర్గతమైందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది.న్యాయస్థానం ఆదేశిస్తే పూర్తిస్థాయిలో విచారణ చేపడతామని చెప్పింది. సర్వే నం. 181, 194, 195లో భారీ భూ కబ్జాలపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ అంబర్‌పేట్‌కు చెందిన బిర్లా మహేశ్ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈడీ తరఫున అసిస్టెంట్ డైరెక్టర్ గజ్రాజ్ సింగ్ ఠాకూర్ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. ఈడీ కౌంటర్లోని ముఖ్యాంశాలివీ...ఖదీరుసా సహా పలువురిపై కేసు‘సర్వే నం. 181, 194, 195లోని భూమికి సంబంధించి మోసపూరిత కార్యకలాపాలపై పిటిషనర్ మహేశ్ పేర్కొన్నారు. ఇప్పటికే సర్వే నంబర్ 181, 182లోని భూముల అక్రమ విక్రయంపై కేసు నమోదైంది. ఖదీరున్సిసా, మునావర్, బొబ్బిలి విశ్వనాథ్, సంతోష్‌కుమార్, దామోదర్‌రెడ్డితో పాటు ఈఐపీఎల్ నిర్మాణ సంస్థపై దర్యాప్తు కొనసాగుతోంది. పిటిషనర్ ఇచ్చిన ఫిర్యాదును ఎఫ్ఐఆర్ నమోదు నిమిత్తం డీజీపీ కార్యాలయానికి పంపించాం. అక్కడి నుంచి మాకు ఎలాంటి బదులురాలేదు. నవాబ్ హాజీఖాన్కు 779.77 ఎకరాల భూమి ఉంది. ఇందులో 103 ఎకరాలను కుమారులకు బహుమతి (హిబ్బా)గా, ఏపీ భూదాన్ యజ్ఞ బోర్డుకు విరాళంగా ఇచ్చారు.దీనికి అంగీకరిస్తూ నాటి తహసీల్దార్ 1995, నవంబర్ 26న ఉత్తర్వులిచ్చారు. సర్వే నం. 181లోని మిగిలిన భూమిని ప్రభుత్వం గైరాన్ భూమిగా ప్రకటించింది. కుమారులు తమ భూమిని 2005లో దస్తగిర్ షరీఫ్, ముజాఫర్ హుస్సేన్‌కు విక్రయించారు. అయితే, 2006లో సర్వే నం. 181లోని మొత్తం భూమి సర్కార్‌దిగా పేర్కొంటూ నోటిఫికేషన్ జారీ చేసింది. దీనిపై దస్తగిరి హైకోర్టును ఆశ్రయించి స్టే పొందారు. చట్టప్రకారం 181లోని 95 ఎకరాల్లో 50 ఎకరాలు భూదాన్‌గా, 45 ఎకరాలు గైరాన్ భూమిగా పేర్కొంటూ ఎంఆర్వో 2012లో నిషేధిత జాబితాలో చేర్చి నోటిఫై చేశారు’తప్పుడు పత్రాలతో సేల్ డీడ్లు‘తప్పుడు పత్రాలతో తన భూమిని కబ్జా చేశారంటూ షరీఫ్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మహేశ్వరం పోలీస్‌స్టేషన్‌లో 2023, మార్చిలో ఖదీరునిసా, మునావర్ ఖాన్, బొబ్బిలి దామోదర్‌రెడ్డి, బొబ్బిలి విశ్వనాథ్‌రెడ్డి, ఎన్.సంతోష్, కొండపల్లి శ్రీధరర్‌రెడ్డిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 2004లో తన తండ్రి 51 ఎకరాలను హిబ్బాగా ఇచ్చారంటూ ఖదీరునిసా, ఆమె కుమారుడు మునావర్ 2014లో తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించినట్లు ఈడీ విచారణలో తేలింది.అక్రమంగా పొందిన పట్టా పాస్‌పుస్తకాలు, భూ విక్రయాలు కోర్టు ఆదేశాలతో రద్దయ్యాయి. మళ్లీ 2021లో ఖదీరున్నీసా.. విశ్వనాథ్‌రెడ్డి, సంతోష్‌కుమార్‌కు 40 ఎకరాలు విక్రయించారు. ప్రభుత్వ భూమి అని తెలిసినా నాటి సబ్ రిజిస్ట్రార్ జ్యోతి, నిందితులతో కలసి కుట్రకు పాల్పడ్డారు. ప్రభుత్వ భూమిగా నోటిఫై చేసిన భూములను మోసపూరితంగా బదిలీ చేసుకోవడంతోపాటు సేల్ డీడ్లు సృష్టించారు.’డీనోటిఫైలో అధికారుల పాత్ర‘హజీ అలీకి తాను ఏకైక కుమార్తెనని ఖదీరునిసా పేర్కొంది. కానీ, అప్పటికే రెవెన్యూ రికార్డుల్లో అలీఖాన్ ఇద్దరు కుమారుల పేర్లున్నాయి. తప్పు డు పత్రాలు సృష్టించేందుకు రెహమాన్, అక్తర్, షుకూర్, చంద్రయ్య, మరికొందరు సహకరించారు. నకిలీ లేఖతో నిషేధిత జాబితాలోని భూ మిని డీ–నోటిఫై చేయించారు. డీనోటిఫైకి భూదాన్ యజ్ఞ బోర్డుతోపాటు కలెక్టర్, ఆర్డీవో, తహశీల్దార్, సబ్ రిజిస్ట్రార్‌కు భాగస్వామ్యం ఉంది. అబ్దుల్ షుకూర్ బంధువులు 1992లో నవాబ్ హాజీ అలీఖాన్ నుంచి సర్వే నం. 194లోని భూమిని కొనుగోలు చేసినట్లు దర్యాప్తులో తేలింది.నకిలీ పత్రాలతో భూ కబ్జా చేసినందుకు షుకూర్‌పై రెండు కేసులు నమోదయ్యాయి. 1992లో కొనుగోలు చేసినట్లు చూపిస్తున్న డాక్యు మెంట్లపైనా అనుమానాలున్నాయి. ఎందుకంటే.. 1992 కంటే ముందే హాజీఖాన్ భూ మంతా విక్రయించారు. నకిలీ పత్రాల వాడకం, రెవెన్యూ రికార్డులను తారు మారు చేయడం లాంటి వాటితో విలువైన ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమయ్యాయి. అధికారుల పాత్రపైనా దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటివరకు మా దృష్టికి వచ్చిన వ్యక్తులు, ప్రభుత్వ అధికారుల పాత్రపై మరికొన్ని వాస్తవాలు బయటపడే అవకాశం ఉంది.’ -
‘గోల్డెన్’ బజార్!.. గజం ధర రూ.10 లక్షలు
హోల్‌సేల్ మార్కెట్లకు కేంద్రమైన బేగంబజార్ స్థల యజమానులకు మాత్రం గోల్డెన్ బజార్‌గా మారింది. కోకాపేటలో ఎకరం భూమి రూ.100 కోట్లు పలికితేనే అంతా ఆశ్చర్యపోయారు. కానీ తాజాగా పాతబస్తీని ఆనుకుని ఉన్న బేగంబజార్ ఫీల్ఖానాలోని 101 గజాల స్థలం రూ.10 కోట్లకు అమ్ముడుపోయింది. తద్వారా తెలంగాణలోనే అత్యంత ఖరీదైన ప్రాంతంగా బేగంబజార్ నిలిచిందని స్థిరాస్తి రంగ నిపుణులు చెబుతున్నారు. – అబిడ్స్ (హైదరాబాద్)ఎందుకింత డిమాండ్?తెలుగు రాష్ట్రాల్లో హోల్‌సేల్ మార్కెట్లకు కేరాఫ్ అడ్రస్ బేగంబజార్. వాణిజ్య మార్కెట్లో దేశ ఆర్థిక రాజధాని ముంబైతో పోటీపడుతోంది. ఉత్తర్‌ప్రదేశ్, రాజస్తాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలకు చెందిన హోల్‌సేల్ వ్యాపారస్తులు బేగంబజార్‌లో స్థిరపడ్డారు. ఇక్కడ సుమారు 5–6 వేల హోల్‌సేల్ దుకాణాలుంటాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లతో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి నిత్యం దాదాపు లక్ష మంది రిటైల్ వ్యాపారస్తులు వస్తుంటారు. దీంతో కొత్తగా మౌలిక వసతుల అభివృద్ధి లేకపోయినప్పటికీ దుకాణాలు, వాణిజ్య సముదాయాలకు అవసరమైన స్థలాలకు డిమాండ్ విపరీతంగా ఉంటోంది. కొన్నిచోట్ల భూమి అందుబాటులో లేకపోవడంతో పాత భవనాలను కూల్చి కొత్త వాటిని నిర్మిస్తుండటం గమనార్హం. ఇక ఎక్కడైనా కొద్దిపాటి స్థలం అందుబాటులో ఉంటే పదుల సంఖ్యలో వ్యాపారస్తులు పోటీ పడుతున్నారు. దీంతో ఏ గల్లీలో అయినా స్థల యజమానులకు కాసుల వర్షం కురుస్తోంది. కొనుగోలుదారుల నుంచి ఉన్న డిమాండ్ కారణంగా భూ యజమానులు రాత్రికి రాత్రే ధరలను పెంచేస్తున్నారు. అత్యధికంగా ఉత్తరాది రాష్ట్రాల వ్యాపారులు భూ లావాదేవీలు నిర్వహిస్తున్నారు. -
ఇమ్రాన్ ఖాన్ ముమ్మాటికీ దోషే
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధాని, పీటీఐ అధినేత ఇమ్రాన్ ఖాన్ (70)ను వరుసగా కష్టాలు చుట్టుముడుతున్నాయి. అక్రమ భూ బదలాయింపు కేసులో అరెస్టయిన ఆయనను 8 రోజులపాటు నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో (ఎన్ఏబీ) రిమాండ్‌కు తరలిస్తూ కోర్టు బుధవారం ఆదేశాలిచ్చింది. మరోవైపు తోషఖానా కేసులో ఇమ్రాన్‌ను ఇస్లామాబాద్ సెషన్స్ కోర్టు దోషిగా తేల్చింది. ఆయన ముమ్మాటికీ దోషేనని న్యాయమూర్తి హుమాయూన్ దిలావర్ నిర్ధారించారు. కాగా తనకు ప్రాణభయం ఉందని ఇమ్రాన్ ఒక ప్రకటన విడుదల చేశారు. 24 గంటలుగా వాష్‌రూమ్‌కు కూడా వెళ్లలేదని చెప్పారు. తన వైద్యున్ని కలిసే అవకాశమివ్వాలని కోర్టును కోరారు. ప్రధాని షహబాజ్ షరీఫ్ భాగస్వామిగా ఉన్న మనీ లాండరింగ్ కేసులో సాక్షి ‘గుండెపోటు’తో మరణించాడని, తనకూ అదే గతి పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రణరంగంగా పాక్ ఇమ్రాన్ అరెస్టును ఖండిస్తూ పీటీఐ నేతలు, కార్యకర్తలు దేశవ్యాప్తంగా ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు చేప ట్టారు. మంగళవారం ప్రా రంభమైన ఆందోళనలు బుధవారమూ కొనసా గాయి. 144 సెక్షన్‌ను సైతం లెక్కచేయకుండా ఆందోళనకారులు వీధుల్లోకి వచ్చారు. లాహోర్, పెషావర్, క్వెట్టా, కరాచీ, రావల్పిండి తదితర నగరాల్లో విధ్వంసానికి పాల్పడ్డారు. వాహనాలను దహనం చేశారు. దాంతో దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. అదనపు బలగాలను మోహరించారు. అన్ని విద్యాసంస్థలను మూసేశారు. పరీక్షలను వాయిదా వేశారు. -
అక్షరాలా పది లక్షల ఎకరాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వివాదాస్పద భూముల లెక్క ఎట్టకేలకు తేలింది. భూరికార్డుల ప్రక్షాళన అనంతరం రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న భూముల్లో పది లక్షల ఎకరాలు వివాదాల్లో ఉన్నాయని రెవెన్యూ యంత్రాంగం నిర్థారించింది. కోర్టు కేసులు, అటవీ శాఖతో ఉన్న వివాదాలు, భూబదలాయింపు క్రమబద్ధీకరణ, వ్యక్తిగత వివాదాలున్న భూములను కేటగిరీల వారీగా లెక్కగట్టి ఇటీవల జరిగిన కలెక్టర్ల సమావేశంలో ఈ గణాంకాలను ప్రభుత్వానికి సమర్పించింది. రెవెన్యూ శాఖ లెక్క ప్రకారం 5 లక్షలకుపైగా ఎకరాలకు వ్యక్తిగత వివాదాలుండటం గమనార్హం. ఆరు నెలలకు పైగానే.. భూరికార్డుల ప్రక్షాళన ప్రక్రియలో భాగంగా రెవెన్యూ రికార్డుల సవరణలు, మార్పులు, చేర్పులు జరిగాయి. గ్రామాలు, మండలాలు, జిల్లాల వారీగా ఈ సవరణల గణాంకాలను కూర్పు చేసి ఆరునెలలకుపైగా సమయం తీసుకున్న తర్వాత వివాదాస్పద భూములను రెవెన్యూ యంత్రాంగం నిర్థారించింది. ఈ గణాంకాల ప్రకారం.. సివిల్ కోర్టుల్లో 1,11,196 ఎకరాలు, రెవెన్యూ కోర్టుల్లో 42,318 ఎకరాలకు సంబంధించి భూవివాదాలు పెండింగ్‌లో ఉన్నాయి. ఇక, ఇలా అటవీ–రెవెన్యూ శాఖల మధ్య పంచాయితీ ఉన్న భూమి 2,04,729 ఎకరాలని తేలింది. వీటికి తోడు భూబదలాయింపు క్రమబద్ధీకరణ(ఎల్టీఆర్)æ(ఒకరి చేతిలో ఉన్న భూమి ఇంకొకరికి బదలాయింపు చేసి దానిని క్రమబద్ధీకరించడం) కింద రాష్ట్రవ్యాప్తంగా 95,214 ఎకరాలు వివాదాల్లో ఉన్నాయి. అన్నింటికన్నా ఎక్కువగా అన్నదమ్ములు, వారసులు, బంధువులు, సరిహద్దుల్లో భూములున్న వారితో వివాదాలున్న భూములు 5,84,527 ఎకరాలున్నాయని తేలింది. ఆ నాలుగు జిల్లాల్లోనే ఎక్కువ జిల్లాలవారీగా చూస్తే నల్లగొండ, రంగారెడ్డి, ఖమ్మం, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో వివాదాస్పద భూములు ఎక్కువగా ఉన్నాయి. నల్లగొండ జిల్లాలో అత్యధికంగా 33,121 ఎకరాల్లో అటవీశాఖతో వివాదం ఉన్న భూములు తేలాయి. మంచిర్యాల, కామారెడ్డి, మహబూ బాబాద్, వికారాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో అటవీశాఖతో వివాదాలున్న భూములు ఎక్కు వగా ఉన్నాయని తేలింది. కోర్టు కేసుల విష యానికి వస్తే రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 17,118 ఎకరాల వివాదాలు సివిల్ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయి. జగిత్యాల జిల్లాలో సివిల్ కోర్టుల్లో ఉన్న భూములు 243 ఎకరాలే. ఎల్టీఆర్ కేటగిరీలో రాష్ట్రవ్యాప్తంగా 95 వేల ఎకరాలకుపైగా వివాదాలుంటే.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే 75,987 ఎకరాలుండటం విశేషం. రాష్ట్రంలోని 30 గ్రామీణ జిల్లాలకుగానూ 19 జిల్లాల్లో ఎల్టీఆర్ కేసులు ఒక్కటీ నమోదు కాలేదు. వ్యక్తిగత వివాదాలున్న భూముల విషయానికి వస్తే కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 53,033 ఎకరాలు, రంగారెడ్డి జిల్లాలో 41,463 ఎకరాల్లో వివాదాలున్నాయి. వివాదాస్పద భూములన్నింటినీ పార్ట్–బీ కేటగిరీలో చేర్చిన రెవెన్యూ యంత్రాంగం.. కోర్టుల్లో ఉన్న భూములు మినహా మిగిలిన వాటిని ఒక్కొక్కటిగా పరిష్కరించాలని నిర్ణయించింది. -
రాజధాని రైతుల్లో గుబులు
► నోట్ల రద్దుతో రైతుల్లో కలవరం ► 4 వేల ఎకరాలకు పైగా అమ్మకాలు.. లాకర్లలో భారీగా నగదు ► తాజా భూ లావాదేవీల అడ్వాన్సలు వెనక్కి ఇచ్చేస్తామంటున్న రైతులు సాక్షి, అమరావతి: నల్లధనాన్ని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.500, రూ.వెయ్యి నోట్లను రద్దు చేసిన నేపథ్యంలో రాజధాని ప్రాంత రైతుల్లో గుబులు బయలుదేరింది. తమ భూముల్ని అమ్మి రూ.కోట్లలో బ్యాంకు లాకర్లలో రైతులు భద్రపరచడమే వారి అభద్రతకు కారణమైంది. రాజధాని ప్రకటన సమయం లో ఆ ప్రాంతంలోని భూములు రేట్లు అమాంతం పెరిగాయి. 4 వేల ఎకరాలకు పైగా లావాదేవీలు జరిగాయి. ఎకరా సగటున రూ.1.25 కోట్లకు విక్రయించారని అంచనా. ఇందులో సగం మంది రైతులు రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేశారు. కొందరు రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టారు. ఇంకొందరైతే అధునాతన కార్లు, బైకులు కొనుగోలు చేశారు. మిగిలిన సొమ్మును దాచుకునేందుకు మార్గాలు అన్వేషిస్తున్న సమయంలో ఈ ప్రాంత రైతుల నుంచి డిపాజిట్లు స్వీకరించేందుకు దాదాపు అన్ని వాణిజ్య బ్యాంకులు ఇక్కడ పుట్టగొడుగుల్లా వెలిశాయి. అవి ఆశించిన మేర డిపాజిట్లు స్వీకరణ సాగలేదు. అయితే రైతుల్లో అధిక శాతం మంది లాకర్లను తీసుకున్నారు. రాజధాని ప్రాంతంలో అప్పట్లో జరిగిన భూ లావాదేవీలపై ఆదాయపు పన్ను శాఖ కూడా దృష్టి సారించింది. ఇప్పుడు హఠాత్తుగా రూ.500, రూ.1000 నోట్ల రద్దుతో ఆ రైతులు కుదేలయ్యారు. బ్యాంకుల్లోని లాకర్లలో భద్రపరిచిన నగదును ఇప్పుడు ఎలా చలామణీలోకి తేవాలని అంతర్మథనంలో ఉన్నారు. నిడమర్రుకు చెందిన ఓ రైతు వారం క్రితం తనకున్న ఎకరం పొలాన్ని రూ.1.25 కోట్లకు అమ్మగా వచ్చిన డబ్బు తన వద్దే ఉంచుకున్నాడు. మంగళవారం రాత్రి పెద్ద నోట్ల రద్దుతో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నాడు. పెనుమాకకు చెందిన ఓ వ్యాపారి ఇటీవలే ఉండవల్లిలో జరీబు పొలం కొనుగోలు చేశారు. ఇందుకు గాను ఉండవల్లి రైతుకు రూ.40 లక్షలు అడ్వాన్సగా ఇచ్చాడు. మరో రెండు రోజుల్లో రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు సిద్ధం చేసుకుంటుం డగా, నోట్ల రద్దు నిర్ణయంతో రైతు హతాశుడై, వ్యాపారి తనకిచ్చిన అడ్వాన్‌సను వెనక్కు తీసుకెళ్లాలని బతిమాలుతున్నాడు. ఇలా ఏ రైతును కదిలించినా నోట్ల రద్దుపై బోరుమంటున్నాడు. -
రాబర్ట్ వాద్రా భూముల లావాదేవీలపై ఢిల్లీ హైకోర్టులో పిల్
న్యూఢిల్లీ: ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు చెందిన కంపెనీలు హర్యానాలోని గుర్గావ్లో జరిపిన భూముల లావాదేవీలపై సీబీఐతో దర్యాప్తు జరింపిచాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్)దాఖలైంది. వ్యవసాయ భూములను ప్రతిపాదిత అవసరాల కోసం కాకుండా వేరే అవసరాలకువాడుకోవడానికి అనుమతించడంపైన కూడా విచారణ జరపాలని పిటిషన్లో కోరారు. ప్రియాంకాగాంధీ భర్త అయిన వాద్రాకు చెందిన స్కైలైట్ హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్, దాని అనుబంధం కంపెనీలు రాజస్థాన్‌లో నిర్వహించిన భూముల లావాదేవీలపైనా దర్యాప్తు జరపాలని విజ్ఞప్తి చేశారు. కోర్టు ఈ పిటిషన్‌ను ఈ నెల 23న విచారించనుంది.