breaking news
IMF estimate
-
ఎన్నడూ లేనంత ఆర్థిక అనిశ్చితి
ప్రపంచ ఆర్థిక వృద్ధి అంచనాలను అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) గణనీయంగా తగ్గించేసింది. కరోనా సమయం కంటే అధిక అనిశ్చితి నెలకొన్నట్టు పేర్కొంది. ప్రపంచ జీడీపీ 2025లో 2.8 శాతం, 2026లో 3 శాతం చొప్పున వృద్ధి సాధిస్తుందని తాజాగా అంచనా వేసింది. యూరో ప్రాంతంలో వృద్ధి 2025లో 0.8 శాతం, 2026లో 1.2 శాతంగా ఉండొచ్చని పేర్కొంది. ఈ ఏడాది జనవరిలో ఐఎంఎఫ్ విడుదల చేసిన గణాంకాలతో పోల్చి చూస్తే ప్రపంచ వృద్ధి అంచనా 0.5 శాతం తగ్గగా, యూరో ప్రాంతం వృద్ధి అంచనా 0.2 శాతం తక్కువ కావడం గమనార్హం. మూడు నెలల క్రితంతో పోలి్చతే మరింత అనిశ్చితుల్లో నేడు ప్రపంచం ఉన్నట్టు ఐఎంఎఫ్ తాజా నివేదిక పేర్కొంది. టారిఫ్‌లు, అనిశ్చితి..అమెరికా టారిఫ్ విధానాలను ఊహించలేకుండా ఉన్నామని ఐఎంఎఫ్ తెలిపింది. 2025 ఏప్రిల్ 2 లిబరేషన్ డే అన్నది ఆధునిక ప్రపంచంలో అతిపెద్ద టారిఫ్‌ల పెంపుగా నిలిచిపోతుందని పేర్కొంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్‌ల పెంపునకు 90 రోజుల విరామం ఇవ్వడాన్ని ప్రస్తావిస్తూ.. ఆ తర్వాత పరిస్థితి ఏంటన్న సందేహాన్ని వ్యక్తం చేసింది. వచ్చే డిసెంబర్, రెండేళ్ల తర్వాత పరిస్థితి ఏంటి? చైనా–అమెరికా మధ్య టారిఫ్‌ల పోరు ఎంత కాలం పాటు కొనసాగుతుంది? వీటికి సమాధానాలు ఎవరికీ తెలియవంటూ ఐఎంఎఫ్ నిట్టూర్చింది. ఐఎంఎఫ్ ప్రపంచ వాణిజ్య అశ్చితి సూచీ 2024 అక్టోబర్ నాటితో పోలిస్తే ఏడు రెట్లు అధికంగా ఉండడం గమనార్హం. ఇది కరోనా విపత్తు నాటితో పోల్చినా గరిష్టానికి చేరింది. టారిఫ్‌ల కారణంగా కంపెనీలు తమ తయారీ చైన్‌ను పునర్వ్యవస్థీకరించుకోవాల్సి ఉంటుందని, వినియోగదారులు ప్రత్యామ్నాయ ఉత్పత్తుల వైపు చూడొచ్చని ఐఎంఎఫ్ నివేదిక తెలిపింది. ఆర్థిక అస్థిరత..టారిఫ్‌లు, ప్రణాళికలు తరచూ మారిపోతుండడం ఫైనాన్షియల్ మార్కెట్లలో పెద్ద ఎత్తున అస్థిరతకు దారితీస్తుందని ఐఎంఎఫ్ ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా నాటి స్థాయి అనిశ్చితులను ఫైనాన్షియల్ మార్కెట్లు ప్రస్తుతం ఎదుర్కొంటున్నట్టు తెలిపింది. ‘ఐదేళ్ల క్రితం అమెరికా రుణ భారంతో అనిశ్చితులు పెరిగాయి. రక్షణాత్మక ధోరణితో ఇన్వెస్టర్లు అధిక రిస్క్‌తో కూడిన సాధనాల్లో (ఈక్విటీ) అమ్మకాలు చేసి, బంగారం, ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడులకు ఆసక్తి చూపించారు. ఇప్పుడు దీనికి పూర్తి విరుద్ధమైన పరిస్థితిని చూస్తున్నాం. యూఎస్ బాండ్ల ధరలు లిబరేషన్ డే నాటి నుంచి తగ్గిపోయాయి. అంటే ఇన్వెస్టర్లు వాటిని విక్రయిస్తున్నారు. అమెరికా ప్రభుత్వ రుణ పత్రాలను సురక్షిత పెట్టుబడి సాధనంగా మార్కెట్లు భావించడం లేదు. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్, అమెరికా రుణానికి ఉన్న పాత్రను దృష్టిలో పెట్టుకుని చూస్తే, భవిష్యత్తులో మరింత ఆర్థిక అస్థిరతకు దారితీయవచ్చు’ అని ఐఎంఎఫ్ తెలిపింది.ఇదీ చదవండి: అనిశ్చితిని ఎలా ఎదుర్కోవాలి?కరోనా సమయంలో ఉత్పత్తి కార్యకలాపాలను బలవంతంగా నిలిపివేయాల్సి రావడంతో అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలో అవరోధాలు ఏర్పడగా.. నేడు టారిఫ్‌ల కారణంగా అదే పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చినట్లు పేర్కొంది. నేడు ప్రపంచ ఆర్థిక మార్కెట్లలో అనిశ్చితులకు ఎలాంటి వైరస్ కారణం కాదంటూ.. ట్రంప్ సలహాదారులు అమెరికా ఆర్థిక ప్రయోజనాల కోణంలో వీటికి కారణమవుతున్నట్టు తెలిపింది. -
చైనా కన్నా భారత్ మిన్న!
2016 జీడీపీ వృద్ధి రేటుపై ఐఎంఎఫ్ అంచనా వాషింగ్టన్: భారత్ వృద్ధిరేటు 2016లో చైనాను అధిగమిస్తుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అంచనావేసింది. 2015లో భారత్ వృద్ధి రేటు 6.3 శాతం ఉంటుందని, ఇది 2016కు 6.5 శాతానికి మెరుగుపడుతుందని ఐఎంఎఫ్ తన ‘వరల్డ్ ఎకనమిక్ రిపోర్ట్’లో పేర్కొంది. 2016లో చైనా వృద్ధి రేటు 6.3 శాతం ఉంటుందని అంచనావేసింది. మరికొన్ని అంశాలు ఇలా... ⇒ భారత్‌లో కొత్త ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణాత్మక చొరవలు దేశాభివృద్ధికి కారణం ⇒ 2014లో భారత్ వృద్ధిరేటు 5.8 శాతం. చైనా విషయంలో ఈ రేటు 7.4 శాతం. ⇒ 2015, 2016ల్లో గ్లోబల్ వృద్ధి రేటు వరుసగా 3.5 శాతం, 3.7%గా ఉంటుంది. అక్టోబర్ 2014లో వేసిన అంచనాలకన్నా ఇది 30 బేసిస్ పాయింట్లు తక్కువ. చైనా, రష్యా, యూరో, జపాన్లలో ఆర్థిక అనిశ్చితి అంచనాలను స్వల్పంగా తగ్గించడానికి కారణం. కాగా 2014లో ఈ రేటు 3.3 శాతం. ⇒ అభివృద్ధి చెందిన దేశాల్లో వృద్ధి అంచనాలు బాగున్న ఒకేఒక్కదేశం అమెరికా. 2015-16లో భారత్ వృద్ధి 6.4%: ఐరాస వచ్చే ఆర్థిక సంవత్సరం (2015-16)లో భారత్ వృద్ధి రేటు 6.4 శాతమని ఐక్యరాజ్యసమితి(ఐరాస) అంచనా వేసింది. దక్షిణాసియా ఆర్థిక వృద్ధి 2015లో నాలుగేళ్ల గరిష్ట స్థాయిలో 5.4 శాతానికి, 2016లో 5.7 శాతానికి మెరుగుపడుతుందని వివరించింది. 3వ క్వార్టర్లో వృద్ధి 5.5 శాతం: డీఅండ్‌బీ భారత్ అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో 5.5% వృద్ధిరేటు సాధిస్తుందని డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ (డీ అండ్ బీ) అంచనావేసింది. సేవల రంగం నుంచి మద్దతు దీనికి కారణమని తెలిపింది. చైనా వృద్ధిరేటు 24 ఏళ్ల కనిష్టం బీజింగ్: చైనా గత ఏడాది 7.4 శాతం వృద్ధి రేటు సాధించింది. గడచిన 24 సంవత్సరాల్లో ఇంత తక్కువ స్థాయిలో ఎప్పుడూ చైనా వృద్ధి రేటు నమోదుకాలేదు. ప్రభుత్వ అంచనాలకన్నా ఒకశాతం తక్కువగా వృద్ధి నమోదయినట్లు మంగళవారం విడుదలైన గణాంకాలు వెల్లడించాయి. హౌసింగ్ రంగం, దేశీయ డిమాండ్లలో నెలకొన్న మందగమన ధోరణి, అంతర్జాతీయ ఆర్థిక రంగంలో అనిశ్చితి వంటి అంశాలు తక్కువ స్థాయి చైనా వృద్ధి రేటుకు కారణమని అధికార వర్గాలు తెలిపాయి. చైనా జీడీపీ విలువ రూపంలో 63.65 ట్రిలియన్ యువాన్లని (దాదాపు 10.4 ట్రిలియన్ డాలర్లు) నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ పేర్కొంది. మూడవ క్వార్టర్ తరహాలోనే, నాల్గవ త్రైమాసికంలో కూడా వృద్ధి రేటు 7.3 శాతంగా ఉంది. 2013లో చైనా వృద్ధి రేటు 7.7 శాతం.