చైనా కన్నా భారత్ మిన్న! | India's growth rate to surpass China's in 2016: IMF | Sakshi
Sakshi News home page

చైనా కన్నా భారత్ మిన్న!

Jan 21 2015 1:58 AM | Updated on Aug 13 2018 3:30 PM

చైనా కన్నా భారత్ మిన్న! - Sakshi

చైనా కన్నా భారత్ మిన్న!

భారత్ వృద్ధిరేటు 2016లో చైనాను అధిగమిస్తుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అంచనావేసింది.

2016 జీడీపీ వృద్ధి రేటుపై ఐఎంఎఫ్ అంచనా
వాషింగ్టన్: భారత్ వృద్ధిరేటు 2016లో చైనాను అధిగమిస్తుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అంచనావేసింది. 2015లో భారత్ వృద్ధి రేటు 6.3 శాతం ఉంటుందని, ఇది 2016కు 6.5 శాతానికి మెరుగుపడుతుందని ఐఎంఎఫ్ తన ‘వరల్డ్ ఎకనమిక్ రిపోర్ట్’లో పేర్కొంది. 2016లో చైనా వృద్ధి రేటు 6.3 శాతం ఉంటుందని అంచనావేసింది. మరికొన్ని అంశాలు ఇలా...
     
భారత్‌లో కొత్త ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణాత్మక చొరవలు దేశాభివృద్ధికి కారణం
2014లో భారత్ వృద్ధిరేటు 5.8 శాతం. చైనా విషయంలో ఈ రేటు 7.4 శాతం.
2015, 2016ల్లో గ్లోబల్ వృద్ధి రేటు వరుసగా 3.5 శాతం, 3.7%గా ఉంటుంది. అక్టోబర్ 2014లో వేసిన అంచనాలకన్నా ఇది 30 బేసిస్ పాయింట్లు తక్కువ. చైనా, రష్యా, యూరో, జపాన్‌లలో ఆర్థిక అనిశ్చితి అంచనాలను స్వల్పంగా తగ్గించడానికి కారణం. కాగా 2014లో ఈ రేటు 3.3 శాతం.
అభివృద్ధి చెందిన దేశాల్లో వృద్ధి అంచనాలు బాగున్న ఒకేఒక్కదేశం అమెరికా.
 
2015-16లో భారత్ వృద్ధి 6.4%: ఐరాస
 వచ్చే ఆర్థిక సంవత్సరం (2015-16)లో భారత్ వృద్ధి రేటు 6.4 శాతమని ఐక్యరాజ్యసమితి(ఐరాస) అంచనా వేసింది. దక్షిణాసియా ఆర్థిక వృద్ధి 2015లో నాలుగేళ్ల గరిష్ట స్థాయిలో 5.4 శాతానికి, 2016లో 5.7 శాతానికి మెరుగుపడుతుందని వివరించింది.
 
3వ క్వార్టర్‌లో వృద్ధి 5.5 శాతం:
డీఅండ్‌బీ
భారత్ అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో 5.5% వృద్ధిరేటు సాధిస్తుందని డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ (డీ అండ్ బీ) అంచనావేసింది. సేవల రంగం నుంచి మద్దతు దీనికి కారణమని తెలిపింది.
 
చైనా వృద్ధిరేటు 24 ఏళ్ల కనిష్టం

బీజింగ్: చైనా గత ఏడాది 7.4 శాతం వృద్ధి రేటు సాధించింది. గడచిన 24 సంవత్సరాల్లో ఇంత తక్కువ స్థాయిలో ఎప్పుడూ చైనా వృద్ధి రేటు నమోదుకాలేదు. ప్రభుత్వ అంచనాలకన్నా ఒకశాతం తక్కువగా వృద్ధి నమోదయినట్లు మంగళవారం విడుదలైన గణాంకాలు వెల్లడించాయి. హౌసింగ్ రంగం, దేశీయ డిమాండ్‌లలో నెలకొన్న మందగమన ధోరణి, అంతర్జాతీయ ఆర్థిక రంగంలో అనిశ్చితి వంటి అంశాలు తక్కువ స్థాయి చైనా వృద్ధి రేటుకు కారణమని అధికార వర్గాలు తెలిపాయి. చైనా జీడీపీ విలువ రూపంలో 63.65 ట్రిలియన్ యువాన్‌లని (దాదాపు 10.4 ట్రిలియన్ డాలర్లు) నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ పేర్కొంది. మూడవ క్వార్టర్ తరహాలోనే, నాల్గవ త్రైమాసికంలో కూడా వృద్ధి రేటు 7.3 శాతంగా ఉంది.   2013లో చైనా వృద్ధి రేటు 7.7 శాతం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement