breaking news
Enquiries
-
ఏబీ వెంకటేశ్వరరావుకు కూటమి ప్రభుత్వ కానుక
సాక్షి,విజయవాడ: ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుపై కూటమి ప్రభుత్వం అన్ని విచారణలు నిలిపివేసింది. విచారణలు నిలిపివేస్తూ చీఫ్ సెక్రటరీ నీరబ్‌కుమార్ ప్రసాద్ శనివారం(డిసెంబర్21) ఉత్తర్వులు జారీ చేశారు. 2014 నుంచి 2019 దాకా టీడీపీ అధికారంలో ఉన్నపుడు ఏబీ వెంకటేశ్వర్రావుపై ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పనిచేసిన ఏబీ వెంకటేశ్వర్రావుపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలపై వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విచారణకు ఆదేశించారు. ఈ విచారణలన్నింటిని ఎత్తివేస్తున్నట్లు ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఉత్తర్వులివ్వడంపై విస్మయం వ్యక్తమవుతోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే ఏబీ వెంకటేశ్వర్రావు ఐపీఎస్ అధికారిగా రిటైర్ అయ్యారు. -
ఎన్నికల కోడ్‌తో.. సొంతడబ్బు అయినా లెక్క చూపాల్సిందే! లేకుంటే జప్తే!
ఆదిలాబాద్: రానున్న సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఎవరైనా పెద్ద మొత్తంలో నగదుతో బయటకు వెళ్లినా ప్రయాణాలు చేసినా తస్మత్ జాగ్రత్త.. నేటి నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. అధిక మొత్తంలో డబ్బులతో పోలీసులకు దొరికితే జప్తు.. లేదా పేకాట పేరుతో కేసులు నమోదు చేయనున్నారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీస్ యంత్రాంగం ఇప్పటికే ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రధానంగా ఎన్నికల నేపథ్యంలో పెద్దమొత్తంలో డబ్బు, మద్యం, ఆయుధాలు అక్రమ రవాణా జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పోలీస్‌శాఖ పకడ్బందీ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి అంతర్జిల్లా ఎస్పీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని, నిరంతరం వాహనాలు తనిఖీ చేయాలని సూచించారు. ఆధారాలు లేకుంటే జప్తే.. ఎన్నికల సమయంలో నగదు, బంగారం, మద్యం పెద్ద మొత్తంలో తీసుకెళ్లకూడదు. సొంతడబ్బు అయినా లెక్క చూపాల్సిందే. రూ.50 వేలకు పైగా డబ్బులు తీసుకెళ్లాల్సి వస్తే వాటికి తగిన ఆధారాలు చూపించాలి. లేదంటే జప్తు చేయక తప్పదు. ఎక్కువ మాట్లాడితే పేకాట పేరుతో కేసులు నమోదు చేయడం ఖాయం. రికవరీ ఏజెంట్లు.. ఏదైనా సంస్థలో రికవరీ ఏజెంట్లుగా పనిచేసేవారైతే పనిచేస్తున్న కంపనీ గుర్తింపుకార్డు, కలెక్షన్ చేయాల్సిన బాధితుడి పేరు, సెల్‌నంబర్‌తో కూడిన లిస్టు, ఆరోజు ఎవరెవరు ఎంత కలెక్షన్ ఇచ్చారో వారి సంతకంతో కూడిన వివరాలు అధికారులకు చూపించాలి. అప్పుగా తీసుకుంటే.. అవసరం నిమిత్తం ఎవరి వద్దనైనా అప్పుగా తీసుకుని వెళ్తుండగా పోలీసులకు పట్టుబడితే ఎవరివద్ద తీసుకున్నారు? ఎప్పుడు తీసుకున్నారు? ఎంత తీసుకున్నారు? తదితర వివరాలతో పాటు ప్రామిసరీ నోటు వెంట ఉంచుకోవాలి. ఒకవేళ ఆస్పత్రి బిల్లులు కట్టాల్సివస్తే పేషెంట్ పేరు, ఆస్పత్రికి సంబంధించిన బిల్లులు వెంట ఉంచుకోవాలి. నిబంధనలు తప్పనిసరి.. ఆదాయ పన్ను చట్టం 1961 సెక్షన్ 69–ఏ ప్రకారం ఎవరైనా తమవద్ద ఉన్న డబ్బు, బంగారం, ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులను ఒకచోట నుంచి మరోచోటుకు తరలించే ముందు ఎన్నికల కమిషన్ నిబంధనలు పాటించడం తప్పనిసరి. ఆధారాలు లేకుంటే అంతే.. రానున్న సాధారణ ఎన్నికల దృశ్యా సరిహద్దు ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేయనున్నారు. ఇలాంటి సమయంలో పెద్దమొత్తంలో నగదు పట్టుబడితే తగిన ఆధారాలు చూపించని పక్షంలో డబ్బు జప్తు చేయబడుతుంది. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం రూ.50 వేలకు మించి డబ్బు తీసుకెళ్తే స్వాధీనం చేసుకుంటారు. ఆధారాలు చూపించకుంటే వాటిని ఆదాయపుపన్ను శాఖ ఖాతాలో వేస్తారు. అక్కడి నుంచి డబ్బు పొందాలంటే చుక్కలు లెక్క పెట్టాల్సిందే. లేదంటే ఎన్నికలు పూర్తయిన తర్వాత ఆధారాలు సరిగా లేకపోతే 30 శాతం పన్నుకింద తీసుకుని మిగతా డబ్బులు ఇస్తారు. ఈ నిబంధనలు తెలియక చాలామంది పెద్ద మొత్తంలో నగదు తీసుకెళ్తూ చెక్‌పోస్టుల వద్ద పట్టుబడుతుంటారు. బ్యాంకు నుంచి విత్‌డ్రా చేస్తే.. బ్యాంకు నుంచి రూ.50 వేలకంటే ఎక్కువగా విత్‌డ్రా చేస్తే ఆధారాలు అవసరం. బ్యాంకు అధికారి ఇచ్చిన ఓచర్ స్లిప్ విధిగా వెంట ఉంచుకోవాలి. సెల్ఫ్ చెక్ ద్వారా అయితే సంబంధిత చెక్ జిరాక్స్ కాపీ, ఏటీఎం ద్వారా డ్రా చేస్తే మిషన్ ద్వారా వచ్చిన స్లిప్ వెంట ఉంచుకోవాలి. ఒకవేళ బ్యాంకులో డిపాజిట్ చేయాలనుకుంటే వ్యక్తిగత డిక్లరేషన్, బ్యాంకు పాస్‌బుక్ వెంట ఉంచుకోవాలి. -
ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టేలా పోస్టులు
-
బేబీ ఫ్యాక్టరీలు బోలెడు!
► పిల్లల అమ్మకాల వ్యవహారంలో వెలుగు చూస్తున్న వాస్తవాలు ► ఫ్లాట్ తనిఖీ చేసిన ఏపీ వైద్య ఆరోగ్యశాఖ, ఐసీడీఎస్ అధికారులు ► విచారణ జరపాల్సిందిగా పోలీస్ కమిషనర్‌కు ఏపీ మంత్రి కామినేని ఆదేశం ► బండారం బయటపడటంతో పరారైన నిర్వాహకులు సాక్షి, విశాఖపట్నం: కడుపు పండించుకోవాలని తపించే తల్లిదండ్రులకు వలవేసి.. పేద మహిళల గర్భమే పెట్టుబడిగా.. పసికందుల వ్యాపారం నిర్వహిస్తున్న ముఠా కార్యకలాపాలు విశాఖ నగరంలోని అనేక ప్రాంతాల్లో సాగిస్తున్నట్లు తెలుస్తోంది. పసి పిల్లలను విక్రయిస్తున్న దారుణ ఉదంతాన్ని ‘విశాఖ తీరాన బేబీ ఫ్యాక్టరీ’ అన్న శీర్షికతో ‘సాక్షి’ బట్టబయలు చేయడంతో డొంకంతా కదులుతోంది. నగరంలో ఇటువంటి వ్యాపారం ఆరు ఫ్లాట్లలో జరుగుతున్నట్లు సమాచారం అందింది. అవి కూడా బీచ్‌రోడ్డు పరిసరాల్లోనే ఉన్నట్లు స్థానికుల ద్వారా తెలిసింది. వెలుగు చూస్తున్న వాస్తవాలు ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చిన అపార్ట్మెంట్లోని 101వ ఫ్లాట్‌లో 2011 నుంచీ చిన్న పిల్లల విక్రయాలు జరుగుతున్నట్లు సమాచారం. ఇందులో ఫ్లాట్ యజమానురాలికి కూడా సంబంధం ఉన్నట్లు భావిస్తున్నారు. బ్రోకర్ వెంకట్, నర్సు సుజాతలతో పాటు మరో బ్రోకర్ కీలక పాత్రధారులుగా వ్యవహరిస్తున్నారు. కృత్రిమ అండాలను పేద మహిళల గర్భంలో ప్రవేశపెట్టినప్పటి నుంచి వారిని అద్దె ఫ్లాట్లలోనే ఉంచి ప్రసవం అయిన తర్వాత పసికందులను తీసుకుని, మహిళలను పంపివేస్తున్నట్లు చెబుతున్నారు. ఇదే అపార్ట్మెంట్లో 103వ ఫ్లాట్‌ను కూడా అద్దెకు తీసుకుని కొన్నాళ్లు సరోగసి తల్లులను ఉంచారని, అయితే అనుమానం వచ్చిన ఫ్లాట్ యజమానులు ఖాళీ చేయించారని ఇరుగుపొరుగు చెప్పారు. ఆరు నెలలుగా పలువురు గర్భిణులు వరండాల్లో తిరుగుతుంటే అనుమానం వచ్చి ఇలా ఎవరుబడితే వారు వస్తే కుదరదని నిర్వాహకులను హెచ్చరించి, ఫ్లాట్ ఖాళీ చేయించారని అధికారుల విచారణలో వెల్లడించినట్లు సమాచారం. ఈ అపార్ట్మెంటుకు వెల్ఫేర్ అసోసియేషన్ లేదు. దీంతో ఎవరు వచ్చినా, ఎవరు వెళ్లినా పట్టించుకునే వారు లేకపోవడంతో ఈ ముఠా కార్యకలాపాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఫ్లాట్ యజమానురాలు విజయలక్ష్మి స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా. ఆమె కుమారుడు విదేశాల్లో ఉంటున్నాడని తెలిసింది. అతను నగరానికి వచ్చినప్పడు మాత్రం నెల రోజుల పాటు ఇక్కడ ఎలాంటి కార్యకలాపాలు లేకుండా జాగ్రత్తపడుతుంటారని అపార్ట్మెంట్ వాసులు తెలిపారు. గుర్తింపు రద్దుకు సిఫార్సు చేస్తాం.. కైకలూరు: విశాఖ తీరంలో పిల్లల అమ్మకాలపై ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ స్పందించారు. గురువారం కృష్ణాజిల్లా కలిదిండి మండలం తాడినాడ గ్రామానికి వచ్చిన మంత్రి ‘సాక్షి’తో మాట్లాడారు. ఇలాంటి ఐవీఎఫ్ సెంటర్ల గుర్తింపును రద్దుచేయాలని రాష్ట్ర మెడికల్ కౌన్సిల్‌కు సిఫారసు చేస్తామని తెలిపారు. సుమోటోగా కేసు సాక్షి కథనంపై రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ విభాగం (ఏపీ స్టేట్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్) స్పందించింది. సుమోటోగా కేసు నమోదుకు ఆదేశించింది. పిల్లల విక్రయాలతో సంబంధమున్న ఆస్పత్రులు, సంస్థలు, ఏజెంట్లపై తక్షణమే కేసు నమోదు చేసి విచారణ జరిపించాలని విశాఖ జిల్లా కలెక్టర్‌కు లేఖ రాసింది. ఈ నెల 7వ తేదీలోపు తమకు నివేదిక సమర్పించాల ని కమిషన్ సభ్యులు ఎస్.బాలరాజు, ఎస్.మురళీధర్‌రెడ్డి, ఎం.సుమిత్రలు ఆదేశించారు. కదిలిన యంత్రాంగం అసాధారణ రీతిలో పసికందులను విక్రయిస్తున్న ముఠా వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం, అధికార యంత్రాంగం స్పందించింది. ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ విశాఖ సీపీ అమిత్గార్గ్తో గురువారం ఫోన్లో మాట్లాడారు. దీనిపై విచారణ జరిపి దోషులను పట్టుకోవాలని ఆదేశించారు. జిల్లా అదనపు డీఎంహెచ్‌వో పి.ఎస్.సూర్యనారాయణ, ఉమెన్ హెల్త్ ఆఫీసర్ చంద్రలేఖ, స్త్రీ,శిశు సంక్షేమ శాఖ లైజన్ ఆఫీసర్ నాగమణి, శిశు గృహ ప్రత్యేక దత్తత స్వచ్ఛంద సంస్థ సభ్యురాలు పద్మలు ‘బేబీ ఫ్యాక్టరీ’ నడుపుతున్న అపార్ట్‌మెంట్‌ను తనిఖీ చేశారు. స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. అపార్ట్మెంట్ వ్యవహారాలు చూస్తున్న ఓ లాయర్‌తో, చుట్టుపక్కల వారితో మాట్లాడామని, నివేదికను జిల్లా కలెక్టర్ ఎన్.యువరాజ్‌కు అందించామని సూర్యనారాయణ ‘సాక్షి’కి వెల్లడించారు. అయితే పత్రికలో తమ బండారం బయటపడటంతో అప్పటికే ఫ్లాట్‌కు తాళం వేసి నిర్వాహకులు పరారయ్యారు. -
మృత్యు బేహరి
వ్యాపమ్ స్కామ్‌లో 42 మరణాలు అంతుచిక్కని రీతిలో అనుమానాస్పదంగా చనిపోతున్న నిందితులు, సాక్షులు ఇదీ భారతీయులకు అలవాటైన, సాధారణమైపోయిన కుంభకోణాల్లాంటిదే. కోట్ల రూపాయల గోల్మాల్.. పెద్దల హస్తం.. పెద్దన్నల పాత్ర.. ఆరోపణలు, ప్రత్యారోపణలు, దర్యాప్తు, విచారణ.. అన్నీ కామనే. ఇందులోనూ అవన్నీ ఉన్నాయి. వాటితో పాటు ఈ స్కామ్‌లో ఉన్నవి భయం గొలిపే అసాధారణ, అసహజ, అనుమానాస్పద మరణాలు.. వ్యవస్థ లోలోతుల్లోకి వెళ్లిన మాఫియా మూలాలు. ఏకంగా గవర్నర్ కొడుకు నుంచి శనివారం టీవీ విలేకరి ఆకస్మిక మృతి దాకా.. వ్యాపమ్ కుంభకోణం, ఆ స్కామ్ నిందితులు, సాక్షుల అనుమానాస్పద మరణాలపై ‘సాక్షి’ ఫోకస్... - నేషనల్ డెస్క్ వ్యాపమ్ అంటే? ‘వ్యవసాయిక్ పరీక్షా మండల్(వ్యాపమ్)’. దీనికే మరోపేరు ‘ప్రొఫెషనల్ ఎగ్జామినేషన్ బోర్డ్(పీఈబీ)’. మధ్యప్రదేశ్‌లో మెడికల్ కాలేజీల్లో ప్రవేశాల పరీక్షల నిర్వహణ కోసం 1970లో ‘ప్రి మెడికల్ టెస్ట్ బోర్డ్’గా ఇది ఏర్పడింది. 1981లో ప్రీ ఇంజనీరింగ్ ఎంట్రెన్స్ పరీక్షల నిర్వహణ కోసం ‘ప్రి ఇంజనీరింగ్ బోర్డ్’ను ఏర్పాటు చేసి, అనంతరం 1982లో ఈ రెండింటినీ విలీనం చేసి వ్యాపమ్ లేదా పీఈబీగా మార్చారు. ఆ తరువాత రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరిధిలో లేని ప్రభుత్వ ఉద్యోగాల నియామక పరీక్షల నిర్వహణను కూడా దీనికే అప్పగించారు. పోలీస్, రెవెన్యూ, ఎక్సైజ్ సర్వీసుల్లోని ఉద్యోగాలతో పాటు టీచర్లు, ఫుడ్ ఇన్స్పెక్టర్లు, ఆయుర్వేద డాక్టర్లు.. తదితర ప్రభుత్వ ఉద్యోగాల నియామక బాధ్యతను వ్యాపమ్‌కు అప్పగించారు. కుంభకోణం విస్తృతి ఎంత? ఈ స్కాంకు పాల్పడిన మాఫియా మూలాలు చాలా లోతు ఉన్నాయి. ప్రభుత్వంలో, అధికారుల్లో, పోలీసుల్లో, రాజకీయ నేతల్లో.. ప్రతీ రంగంలో, ప్రతీ స్థాయిలో వీరికి ప్రతినిధులున్నారు. ఏజెంట్లున్నారు. 2007 - 2013 మధ్య రాష్ట్రంలో నిర్వహించిన ఏ పరీక్షను.. చివరకు బ్యాంకు పరీక్షలైన ఎస్బీఐ, ఐబీపీఎస్‌లను సైతం వీరు వదల్లేదు. ఇప్పటివరకు తెలిసిన వివరాల మేరకే ఈ కుంభకోణం విలువ రూ.2 వేల కోట్ల పైమాటే. అయితే, అసలు కుంభకోణంలో ఈ 2 వేల కోట్లు కనీసం 5% కూడా కాదని పరిశీలకులు అంటున్నారు. నిజానికి 2004 నుంచే రాష్ట్రంలో ఈ మాఫియా కార్యకలాపాలు ప్రారంభమయ్యాయని చెబుతున్నారు. ఏయే పరీక్షల్లో అవినీతికి పాల్పడ్డారు? 2013లో జరిగిన ప్రి మెడికల్ టెస్ట్(పీఎంటీ), 2012లో జరిగిన మెడికల్ ప్రి పీజీ టెస్ట్, ఫుడ్ ఇన్స్పెక్టర్ సెలక్షన్ టెస్ట్, సుబేదార్- సబ్ ఇన్స్పెక్టర్ అండ్ ప్లాటూన్ కమాండర్ సెలక్షన్ టెస్ట్, మిల్క్ ఫెడరేషన్ టెస్ట్, పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ టెస్ట్, కాంట్రాక్ట్ టీచర్ సెలక్షన్ టెస్ట్. ఇవి అవినీతి జరిగినట్లు బయటపడిన పరీక్షలు మాత్రమే. వీటిలో పీఎంటీలో అవకతవకలు 2008 నుంచే ప్రారంభమయ్యాయని తేలింది. ఇంకా బయటపడని అవినీతి పరీక్షలు మరెన్నో ఉన్నాయన్నది సాక్షాత్తూ దర్యాప్తు అధికారులే చెబుతున్నారు. 2008- 2013 మధ్య 1,087 మంది అనర్హ విద్యార్థులు మెడికల్ కాలేజీల్లో సీట్లు సంపాదించారు. వారి అడ్మిషన్లను తరువాత రద్దు చేశారు. వేలాది మంది అనర్హులు డబ్బులు పెట్టి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. దాంతో అర్హులైన, సమర్ధులైన విద్యార్థులు, అభ్యర్థులు తమ ఉజ్వల భవిష్యత్తును కోల్పోయారు. ఎలా బయట పడింది? 2013లో ఇండోర్‌కు చెందిన విజిల్ బ్లోయర్ డాక్టర్ ఆనంద్ రాయ్ ప్రి మెడికల్ టెస్ట్ స్కామ్‌ను బయటపెట్టారు. గ్వాలియర్‌కు చెందిన సామాజిక కార్యకర్త ఆశిష్ చతుర్వేది ఈ స్కామ్‌లో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ బంధువుల పాత్రను బయటపెట్టారు. దాంతో, ఈ కుంభకోణం దర్యాప్తును స్పెషల్ టాస్క్‌ఫోర్స్(ఎస్టీఎఫ్)కు అప్పగిస్తున్నట్లు ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అసెంబ్లీలో ప్రకటించారు. ఎస్టీఎఫ్ దర్యాప్తును పర్యవేక్షించేందుకు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ఒక ప్రత్యేక విచారణ బృందం(సిట్)ను మధ్యప్రదేశ్ హైకోర్టు ఏర్పాటు చేసింది. ఆ తరువాత ఇతరపరీక్షల్లోనూ అవకతవకలు జరిగిన విషయం బయటపడింది. ఇప్పటికే 2 వేల మంది అరెస్ట్ తక్షణమే రంగంలోకి దిగిన ఎస్టీఎఫ్ వేర్వేరు పరీక్షలకు సంబంధించి వేర్వేరు కేసులు నమోదు చేసి.. అరెస్టుల పర్వం ప్రారంభించింది. ఇప్పటివరకు దాదాపు 2 వేల మందిని అరెస్ట్ చేసింది. ఇంకా 8 వందల మందిని అదుపులోకి తీసుకోవాల్సి ఉందని పేర్కొంది. అరెస్టయిన ప్రముఖుల్లో మాజీ బీజేపీ నేత, విద్యా శాఖ మాజీ మంత్రి లక్ష్మీకాంత్ శర్మ, ఆయన ఓఎస్డీ ఓపీ శుక్లా, ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు సన్నిహితుడైన మైనింగ్ దిగ్గజం సుధీర్ శర్మ, గవర్నర్ రామ్ నరేశ్ యాదవ్ ఓఎస్డీ ధన్‌రాజ్ యాదవ్, డీఐజీ ఆర్కే శివహరి, వ్యాపమ్ అధికారులు పంకజ్ త్రివేదీ, సీకే మిశ్రా, నితిన్ మహేంద్ర, అజయ్ సేన్ తదితరులున్నారు. వీరే కాకుండా పదుల సంఖ్యలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, డజన్ల సంఖ్యలో దళారులు, వందలాదిగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అక్రమంగా ఉద్యోగాలు సంపాదించిన వారు అరెస్టైన వారిలో ఉన్నారు. మృత్యుహేల... అన్నీ స్కాముల్లోనూ దర్యాప్తులు, విచారణలు, అరెస్టులు మామూలే. కాని ఈ కుంభకోణం మాత్రం ప్రజాస్వామ్య వ్యవస్థలోని భయానక కోణాన్ని బయటపెట్టింది. ఈ కుంభకోణంలో ప్రమేయమున్న నిందితులు, సాక్షులు వరుసగా చనిపోతున్నారు. దాదాపు అవన్నీ ‘అసహజ మరణాలే’ కావడం పలు అనుమానాలకు తావిస్తోంది. అవి సాధారణ మరణాలు కావని, అనుమానాస్పద మరణాలేనని ఎస్టీఎఫ్ సైతం ఒప్పుకుంది. ఇప్పటివరకు అలా 25 మంది చనిపోయారని అధికారిక ఒప్పుకోలు కాగా.. మొత్తం 42 మంది అసహజ మరణం పాలయ్యారనేది అనధికార సమాచారం. చనిపోయినవారిలో కొందరు పోలీస్ కస్టడీలో మరణించగా, కొందరు బెయిల్‌పై బయట ఉండగా ప్రాణాలు కోల్పోయారు. కుంభకోణంలో తమ పాత్ర బయటపడకూడదని భావిస్తున్న ‘పెద్దలు’ చేయిస్తోన్న హత్యలే ఇవని ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు ఆరోపిస్తున్నాయి. గవర్నర్, ముఖ్యమంత్రి బంధువులు, ఇద్దరు ఆరెస్సెస్ నేతలు, డజన్ల సంఖ్యలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పేర్లు ఈ కుంభకోణంతో జతపడి ఉండటంతో వారి ఆరోపణలకు బలం చేకూరుతోంది. ఈ కుంభకోణాన్ని బయటపెట్టిన ఆనంద్ రాయ్, ఆశిశ్ చతుర్వేది సహా బెయిల్‌పై బయటకు వచ్చిన నిందితులెందరో తమకు ప్రాణ హాని ఉందని, చంపేస్తామని బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, తమకు రక్షణ కల్పించాలని కోర్టును ఆశ్రయించడం కుంభకోణం వెనకున్న పెద్దల బలాన్ని, స్కామ్ తీవ్రతను తెలియచేస్తుండగా.. ‘పుట్టినవారు గిట్టక తప్పద’ంటూ రాష్ట్ర హోంమంత్రి బాబూలాల్ గౌర్ మెట్ట వేదాంతం చెబుతుండటం ప్రభుత్వ నిష్క్రియా పరత్వాన్ని, దళసరి చర్మతత్వాన్ని తేటతెల్లం చేస్తోంది. స్కామ్ ఏంటి? భారీ ఎత్తున డబ్బులు తీసుకుని మెడిసిన్, పీజీ మెడికల్ కాలేజీల్లో వందలాదిగా అనర్హులకు ప్రవేశం కల్పించారు. కానిస్టేబుల్, కాంట్రాక్ట్ టీచర్, ఫుడ్ ఇన్స్పెక్టర్.. తదితర ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లోనూ విస్తృత స్థాయిలో అవినీతికి పాల్పడి పెద్ద ఎత్తున సొమ్ము చేసుకున్నారు. ఒకరి స్థానంలో మరొకరితో పరీక్ష రాయించడం, పరీక్ష హాల్లో అభ్యర్థుల సీటింగ్ స్థానాల్లో మార్పులు చేయడం(మధ్యలో తెలివైన అభ్యర్థిని కూర్చోబెట్టి.. అతని వెనక, ముందు, తమ అభ్యర్థులుండేలా చూసుకుని, చూసి రాసే అవకాశం కల్పించడం) , బయటే జవాబు పత్రాలు రాయించడం, ఓఎంఆర్ షీట్లను మార్చడం.. ఇలా ఏ పద్ధతిలో వీలైతే ఆ పద్ధతిలో అనర్హులకు మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలు, కనీస విద్యార్హతలు కూడా లేనివారికి ప్రభుత్వోద్యోగాలు కల్పించారు. గవర్నర్ హస్తం ఉందా? ఫారెస్ట్ గార్డుల నియామకం కోసం ఐదుగురి నుంచి లంచం తీసుకున్నారన్న ఆరోపణలపై గవర్నర్ రామ్ నరేశ్ యాదవ్ పైనా కేసు నమోదైంది. కానీ గవర్నర్‌కున్న రాజ్యాంగ హక్కులను పేర్కొంటూ ఆ ఎఫ్ఐఆర్ను హైకోర్టు కొట్టేసింది. చనిపోయిన నిందితులు, సాక్షుల్లో ముఖ్యులు.. శైలేశ్యాదవ్ గవర్నర్ రామ్ నరేశ్ యాదవ్ కుమారుడు. ఈ స్కామ్‌లో నిందితుడు. 2015, మార్చి 25న లక్నోలోని తమ బంగళాలో చనిపోయి కనిపించాడు. ఆయనకు మధుమేహం ఉందని, బ్రెయిన్ హెమరేజ్‌తో చనిపోయాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే మరణానికి కారణమేమిటనేది తెలియలేదని పోస్ట్‌మార్టమ్ నివేదిక పేర్కొనడం గమనార్హం. చనిపోయే ముందురోజు రాత్రి వరకు మామూలుగానే ఉన్నారు. నమ్రత దామర్ ఇండోర్ మెడికల్ కాలేజ్ విద్యార్థిని. 2010లో మెడికల్ ఎంట్రన్స్‌లో అవకతవకలకు పాల్పడి... వైద్యసీటు పొందిన వారి జాబితాలో ఈమె పేరు కూడా ఉంది. కాలేజీ హాస్టల్ నుంచి కనిపించకుండా పోయింది. ఎటువెళ్లింది, ఎవరు తీసుకెళ్లారు, ఎక్కడుంది... వీటికి సమాధానాల్లేవు. అంతా మిస్టరీ. అదృశ్యమైన ఏడురోజులకు జనవరి 7, 2012న ఉజ్జయిని జిల్లాలోని కేతా గ్రామసమీపాన రైల్వే ట్రాక్‌పై ఆమె మృతదేహం కనిపించింది. రామేంద్రసింగ్ భడోరియా ఈ ఏడాది జనవరిలో ఈయనపై ఎఫ్ఐఆర్ నమోదైంది. కొద్దిరోజులకే రామేంద్రసింగ్ (30) ఉరివేసుకొని చనిపోయాడు. కుంభకోణంతో సంబంధమున్న వారు ఎలాంటి విషయాలూ వెల్లడించవద్దని రామేంద్రసింగ్పై తీవ్ర ఒత్తిడి తెచ్చారని, దీన్ని తట్టుకోలేకే ప్రాణాలు తీసుకున్నాడని కుటుంబం ఆరోపించింది. రామేంద్ర చనిపోయిన వారం రోజులకే అతని తల్లి యాసిడ్ తాగి బలవన్మరణం పొందింది. విజయ్ సింగ్ ఈ స్కామ్‌లో కీలక నిందితుడు. పలువురు పెద్దల తరఫున ప్రధాన దళారీ అని సమాచారం. ఈ సంవత్సరం ఏప్రిల్ 28న ఛత్తీస్‌గఢ్‌లోని కాంకెర్ జిల్లాలోని ఒక లాడ్జిలో అనుమానాస్పద స్థితిలో ఆయన మృతదేహం కనిపించింది. ఆ లాడ్జి ఒక బీజేపీ ఎమ్మెల్యేది. డాక్టర్ రాజేంద్ర ఆర్య వ్యాపమ్ స్కాంలో అరెస్టవగా ఏడాది కిందటే బెయిల్ వచ్చింది. డాక్టర్ రాజేంద్ర (40) వ్యక్తిగత పనిమీద కోటాకు వెళ్లివస్తుండగా... ఒక్కసారిగా ఆరోగ్యం విషమించింది. జూన్ 28న గ్వాలియర్‌లోని బిర్లా ఆసుపత్రిలో కన్నుమూశారు. డాక్టర్ తోమర్, డాక్టర్ రాజేంద్ర ఆర్యలు కేవలం 24 గంటల వ్యవధిలో అనూహ్యంగా మృతి చెందడం గమనార్హం. డాక్టర్ డీకే సకాలే స్కామ్ నిందితుడు. జబల్పూర్ మెడికల్ కాలేజీ డీన్. అక్రమపద్ధతిలో సీట్లు పొందిన వారిని కోర్సు నుంచి తొలగించగా... వారు సకాలేను నిలదీశారు. వీరి ఒత్తిడి నుంచి తప్పించుకునేందుకు 30 రోజుల మెడికల్ లీవుపై వెళ్లారు. 2014 జులైలో కాలిన గాయాలతో చనిపోయాడు. డాక్టర్ నరేంద్ర సింగ్ తోమర్ అసిస్టెంట్ వెటర్నరీ ఆఫీసర్. స్కామ్‌లో భాగంగా, అభ్యర్థుల బదులు పరీక్షలు రాసేందుకు సమర్థులైన వారిని ఏర్పాటు చేసేవాడని ఆరోపణ. ఇండోర్ జైల్లో ఉండగా, కిందటినెలలో (జూన్ 27న) గుండెపోటుతో చనిపోయాడు. పోలీసులు చిత్రహింసలకు గురిచేయడం వల్లనే చనిపోయాడని తోమర్ తండ్రి ఆరోపణ. 27న మధ్యాహ్నం తాము కలిసినపుడు ఆరోగ్యంగా ఉన్నాడని, తీవ్రంగా హింసిస్తున్నారని మొరపెట్టుకున్నాడని కుటుంబీకులు చెప్పారు. అదే రాత్రి మహరాజా యశ్వంత్‌రావు ఆసుపత్రికి తరలించగా... ఆసుపత్రికి తెచ్చేసరికే తుదిశ్వాస విడిచాడని డాక్టర్లు ప్రకటించారు. విమర్శలు వెల్లువెత్తడంతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించింది. అయితే వరుసపెట్టి జరుగుతున్న అనుమానాస్పద, అసహజ మరణాలపై సీబీఐ చేత విచారణ చేయించాలని కాంగ్రెస్ గట్టిగా డిమాండ్ చేస్తోంది.