breaking news
charter plane
-
విమానాల కిటికీలు మూయండి!
న్యూఢిల్లీ: కొన్నిసార్లు తప్పనిసరి పరిస్థితుల్లో రక్షణశాఖ పరిధిలోని విమానాశ్రయాల నుంచి రాకపోకలు సాగించే ప్రైవేట్ విమానాల, చార్టర్, ప్రైవేట్ జెట్ నిర్వహణ సంస్థలు కచ్చితంగా తమ విమానాల కిటికీలను మూసే ఉంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) శనివారం ఒక ప్రకటన విడుదలచేసింది. డిఫెన్స్ స్థావరాలు, విమానాశ్రయాల పూర్తి వివరాలు బహిర్గతం కావొద్దనే ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. కిటికీల నుంచి ఫొటోలు, వీడియోలు తీయకుండా నివారించే ఉద్దేశ్యంతో కిటికీలను మూసే ఉంచాలని, కిటికీల షేడ్స్ తొలగించకూడదని ప్రైవేట్ విమానయాన సంస్థలకు డీజీసీఏ పంపిన ఉత్తర్వులో స్పష్టంచేసింది. మొత్తంగా 32 ఎయిర్‌పోర్ట్‌లలో ఈ నిబంధనను అమలుచేయనున్నట్లు తెలుస్తోంది. లేహ్, శ్రీనగర్, జమ్మూ, పఠాన్‌కోట్, ఆదంపూర్, చండీగఢ్, బఠిండా, జైసల్మేర్, నాల్, జో«ద్పుర్, హిండన్, ఆగ్రా, కాన్పూర్, బరేలీ, మహారాజ్‌పూర్, గోరఖ్‌పూర్, భుజ్, లొహెగావ్, డాబోలిమ్(గోవా), విశాఖపట్నంలోని విమానాశ్రయాలు ఈ ఆదేశాలను కచ్చితంగా పాటించాల్సి ఉంది. ఆర్మీ, నేవీ విమానాల రాకపోకలతోపాటు సాధారణ ప్రయాణికుల విమానాల రాకపోకలు సాగించే ఎయిర్‌పోర్ట్‌లలో ముఖ్యంగా ఈ నిబంధనను అమలుచేయనున్నారు. అక్కడి నుంచి రాకపోకలు సాగించే ప్రైవేట్ విమానాలు, చార్టర్, ప్రైవేట్ జెట్లలో ప్రయాణించే వాళ్లు కిటికీల గుండా కెమెరా, స్మార్ట్ఫోన్లతో ఎయిర్‌బేస్‌ల ఫొటోలు, వీడియోలు తీసే ఆస్కారముందని గ్రహించి ప్రభుత్వం కొత్తగా పలు పశ్చిమ తీర ఎయిర్‌పోర్టుల్లో ఈ నిబంధనను అమల్లోకి తెస్తోంది. విమానం టేకాఫ్ అయ్యాక 10,000 అడుగుల ఎత్తుకు వెళ్లేదాకా విండో షేడ్స్ తొలగించకూడదు. 10,000 అడుగుల కంటే ఎత్తులో ప్రయాణిస్తున్నప్పుడు విమానం ల్యాండింగ్‌కు సిద్ధమైతే ఆ ఎత్తులో విండో షేడ్స్ తెరుచుకోవచ్చు. కానీ ల్యాండింగ్ కోసం 10,000 అడుగుల దిగువకు దిగిరాగానే మళ్లీ విండో షేడ్స్‌ను మూసేయాల్సిందే. ఎమర్జెన్సీ కిటీకీలకు మాత్రం ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చారు. విండోషేడ్స్ తెరిచి ఫొటోలు, వీడియోలు తీసే ప్రయాణికులు తగు పర్యావసనాలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్న విషయాన్ని వారికి తెలియజేయాలని విమానయాన సంస్థలకు డీజీసీఏ సూచించింది. సాధారణంగా ఏదైనా ప్రయాణికుల విమానం టేకాఫ్, ల్యాండింగ్ సమయాల్లో అగ్నిప్రమాదం లాంటివి ఏమైనా జరిగితే అత్యవసర పరిస్థితుల్లో తప్పించుకునేందుకు వీలుగా విండోషీట్స్ను తెరచే ఉంచుతారు. -
విమానం దారి మళ్లింపు... వారణాసిలో కోల్‌కతా జట్టు
న్యూఢిల్లీ: కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆటగాళ్లకు సోమవారం రాత్రి కునుకు లేకుండా గడిచింది. క్రికెటర్లు ప్రయాణించిన విమానం లక్నో నుంచి కోల్‌కతాకు బయలుదేరాల్సి ఉండగా... ప్రతికూల వాతావరణంతో పలుమార్లు దారి మళ్లించారు. వారి చార్టర్ ఫ్లయిట్‌ను తొలుత గువాహటికి మళ్లించారు. అక్కడి నుంచి కోల్‌కతాకు క్లియరెన్స్ రావడంతో టేకాఫ్ అయిన విమానానికి మళ్లీ వాతావరణం ఏమాత్రం అనుకూలించలేదు. దీంతో ఉన్నపళంగా ఫ్లయిట్‌ను వారణాసి ఎయిర్‌పోర్ట్‌కు మళ్లించాల్సి వచి్చంది. అలా తీవ్రమైన ప్రయాణ బడలిక, క్లిష్టమైన వాతావరణ పరిస్థితుల మధ్య ఆటగాళ్లు సోమవారమంతా వారణాసిలోని హోటల్లో గడపాల్సి వచ్చింది. మంగళవారం మధ్యాహ్నం తర్వాత తమ విమాన ప్రయాణం ఉండటంతో ఈలోపు కోల్‌కతా జట్టు క్రికెటర్లు వారణాసిలో కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని సందర్శించుకున్నారు. ఎట్టకేలకు మంగళవారం సాయంత్రం తర్వాత నైట్‌రైడర్స్ జట్టు కోల్‌కతాకు చేరుకోగలిగింది. ఈ నెల 11న సొంతగడ్డపై కోల్‌కతా నైట్‌రైడర్స్ తమ తదుపరి లీగ్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో తలపడుతుంది. -
హైదరాబాద్ విమానం పాకిస్థాన్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్.. ఏం జరిగింది?
ఇస్లామాబాద్: భారత్‌కు చెందిన 12 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఓ చార్టర్ ఫ్లైట్ పాకిస్థాన్, కరాచీలోని జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ అయింది. ఆ విమానం హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరినట్లు తెలిసింది. సోమవారం మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో కరాచీలో దిగినట్లు అంతర్జాతీయ మీడియాలు వెల్లడించాయి. ఎయిర్‌పోర్ట్‌లో దిగగానే 12 మంది ప్రయాణికులను మరో ప్రత్యేక విమానంలో తీసుకెళ్లారు. అయితే, కరాచీలో విమానం అత్యవసరంగా ల్యాండింగ్ చేసేందుకు గల కారణాలు తెలియరాలేదు. విమానం ల్యాండింగ్‌ను భారత పౌర విమానయాన సంస్థ(సీఏఏ) ధ్రువీకరించింది. అంతర్జాతీయ ఛార్టర్ ఫ్లైట్ భారత్ నుంచే వెళ్లిందని, ఆ తర్వాత సంబంధాలు తెగిపోయినట్లు పేర్కొంది. గత నెలలో సాంకేతిక సమస్యలతో రెండు విమానాలు కరాచీలో దిగిన తర్వాత ఈ ఛార్టర్ విమానం ల్యాండింగ్ అయింది. అంతకు ముందు స్పైస్‌జెట్ ఢిల్లీ-దుబాయ్ విమానం జులై 5న కరాచీకి మళ్లించారు. అలాగే.. షార్జా నుంచి హైదరాబాద్‌కు వస్తున్న మరో విమానం జులై 17న కరాచీలో దిగింది. ఇదీ చదవండి: భారత్ హెచ్చరికలు బేఖాతరు.. శ్రీలంక చేరిన చైనా ‘స్పై షిప్’ -
ప్రైవేట్ జెట్లు, చార్టర్ విమానాలకు గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ : కరోనా లాక్డౌన్ కారణంగా నిలిచిపోయిన విమాన సర్వీసులు సోమవారం నుంచి పున: ప్రారంభమైన సంగతి తెలిసిందే. తాజాగా దేశీయ మార్గాల్లో ప్రైవేట్ జెట్లు, చార్టర్ విమానాల రాకపోకలకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర విమానయాన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వాటిలో ప్రయాణించే వారికి సంబంధించిన మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది.(చదవండి : ఏపీలో ప్రారంభమైన దేశీయ విమాన సర్వీసులు) చార్టర్ విమానాల్లో రాకపోకలు సాగించే ప్రయాణికులు.. ప్రయాణ సమయానికి కనీసం 45 నిమిషాల ముందు ఎయిర్‌పోర్టులో గానీ, హెలీప్యాడ్ వద్ద గానీ రిపోర్టు చేయాలని ఆదేశించింది. వృద్ధులు, గర్భిణిలు, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు విమాన ప్రయాణాలకు దూరంగా ఉండాలని కోరింది. విమాన ఆపరేటర్లు, ప్రయాణికుల మధ్య పరస్పరం అంగీకరించిన నిబంధనల ప్రకారం చార్టర్ విమాన ప్రయాణ చార్జీలు ఉండాలని తెలిపింది. కాగా, కరోనా లాక్డౌన్ కారణంగా.. దేశవ్యాప్తంగా కార్గో సేవలు తప్ప మిగిలిన అన్ని రకాల విమాన రాకపోకలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. (చదవండి : 630 విమానాలు రద్దు) -
‘నేను పేదోడ్ని.. చార్టర్ విమానాల స్థోమతెక్కడిది?’
న్యూఢిల్లీ: తాను చాలా పేదవాడినని, చార్టర్ విమానాల వ్యయాన్ని భరించే స్థోమత తనకు లేదని శివసేన పార్టీ వివాదాస్పద ఎంపీ రవీంద్ర గైక్వాడ్ అన్నారు. ఆయన గురువారం పార్లమెంటుకు హాజరవుతున్నారు. ఎయిర్ ఇండియా ఉద్యోగిపై చేయి చేసుకున్న నేపథ్యంలో విమానమే ఎక్కనివ్వకుండా ఆయనపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఇప్పటికీ అదే విషయంపై వివాదం రేగుతున్న నేపథ్యంలో ఆయన గురువారం పార్లమెంటుకు హాజరై లోక్‌సభలో ఈ విషయంపై సమాధానం ఇవ్వనున్నారు. ఇప్పటికే ఆయన తన తప్పే లేదని, అందరికీ తెలిసింది కొంతేనని, తెలియాల్సింది తాను గురువారం సభలో అనంతరం మీడియాలో చెబుతానని అన్నారు. ప్రస్తుతం విమానాల్లో నిషేధం ఉన్న ఆయన చార్టెడ్ ఫ్లైట్‌లో మహారాష్ట్ర నుంచి బయలుదేరి పార్లమెంటుకు హాజరవుతారని వార్తలు వచ్చాయి. ఇదే విషయాన్ని మీడియా ఆయనను ప్రశ్నించగా ‘నేనొక పేదవాడిని. చార్టర్ విమానాన్ని భరించే స్థోమత నాకు లేదు’ అని చెప్పారు.