సైకిల్ రేస్ ప్రారంభించిన ఎస్పీ భూపాల్
కాలుష్య నివారణకు, ఆరోగ్యానికి సైకిల్ తొక్కడం చాలా అవసరమని నెల్లూరు జిల్లా ఎస్పీ గజరావ్ భూపాల్ అన్నారు. ఆదివారం ఉదయం జిల్లాలోని ముత్తుకూరు సమీపంలో జెన్కో రోడ్డులో బీపీసీఐఎల్ థర్మల్ పవర్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో సైకిల్ రేస్‌ను ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... పారిశ్రామికంగా అభివృద్ది చెందుతున్న ఈ దశలో మన దేశంలో సైకిల్ వినియోగం అవసరమన్నారు.