breaking news
AP Budget 2023
-
ప్రగతి శీల బడ్జెట్
-
అసెంబ్లీలో టీడీపీ చిల్లర చేష్టలు
-
Ap Budget: నీటి వనరుల అభివృద్ధికి 11,908 కోట్ల కేటాయింపులు
సాక్షి, అమరావతి: సంక్షేమమే తమ ధ్యేయమంటూ జన రంజక బడ్జెట్ ప్రవేశపెట్టి వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కార్ నీటి వనరుల అభివృద్ధికీ ప్రాధాన్యమిచ్చింది. ఏపీ వార్షిక బడ్జెట్ 2023-24 ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతు శ్రేయస్సు దిశగా చేస్తున్న కృషిని వెల్లడించారు. మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజీ, నెల్లూరు బ్యారేజీలను పెన్నార్ డెల్టా సిస్టం, కావలి కెనాల్, కనుపూరు కాలువల క్రింద ఆయకట్టును స్థిరీకరించడానికి సీఎం జగన్ పెన్నా నదిపై పనులను సెప్టెంబర్ 6, 2022 న ప్రారంభించారు. కర్నూలు, నంద్యాల జిల్లాల నందు 68 చెరువుల ప్రాజెక్టు పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ఈ ప్రాజెక్టు ద్వారా కరువు పీడిత ప్రాంతంలో గల సుమారు 100 గ్రామాలకు సాగునీరు, తాగునీరు అందుబాటులోకి రానుండటంతో ప్రజల చిర కాలస్వప్నం నెరవేరనున్నది. పోలవరం సాగునీటి ప్రాజెక్టును పూర్తి చేయడానికి ఏపీ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతను ఇస్తోంది. ఇప్పటి వరకు ప్రధాన ఆనకట్ట, కాలువ పనులు 79.07 శాతం పూర్తయ్యాయి. పునర్నిర్మాణ, పునరావాస పనులు ఏక కాలంలో పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టుతో పాటు అన్ని జిల్లాలలో జలయజ్ఞం కింద సత్వర సాగునీటి సౌకర్యానికి భరోసాతో కూడిన తాగునీరు అందించడానికి, పరిశ్రమలకు నీరు అందించేందుకు చేపట్టిన అన్ని ప్రధాన ప్రాజెక్టులను పూర్తి చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. శ్రీకాకుళం జిల్లాలో మెరుగైన నీటిపారుదల సౌకర్యాన్ని అందించే దిశగా, నాగావళి మరియు వంశధార నదుల అను సంధానాన్ని, 2023 మార్చి నాటికి మరియు వంశధార ప్రాజెక్ట్ రెండవ దశలోని స్టేజ్-2 పనులను 2023 జూన్ నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నల్లమల సాగర్ నీరందించేందుకుగాను పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశ ఈ ఆర్థిక సంవత్సరంలో పూర్తి కానుంది. హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్ట్ మొదటి దశ, రెండవ దశలను డిసెంబర్ 2023 నాటికి పూర్తి చేయడానికి ప్రణాళిక రూపొందించాంమని, గాలేరు నగరి సుజల స్రవంతి ప్రాజెక్ట్ మొదటి దశను మార్చి 2025 నాటికి, రెండవ దశను మార్చి 2026 నాటికి పూర్తి చేయడానికి తమ ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి బుగ్గన తెలిపారు. పంట కోత సమయంలో ఎదురయ్యే ప్రతికూల విపత్తులను నివారించడానికి చాలా సంవత్సరాల తరువాత మొదటిసారిగా గోదావరి డెల్టాకు జూన్ 1, 2022న కృష్ణా డెల్టాకు జూన్ 10, 2022న నీటిని విడుదల చేశాం. జూలై 31, 2022న నాగార్జున సాగర్ ప్రాజక్టు కాలువలకు ముందస్తుగా నీటిని విడుదల చేయడం వలన రైతులు ఖచ్చితమైన పంట దిగుబడిని సాధించగలిగారని మంత్రి అన్నారు. ► 2023-24 ఆర్థిక సంవత్సరానికి నీటి వనరుల అభివృద్ధికి 11,908 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్టు మంత్రి పేర్కొన్నారు. -
పేదలకు ఇళ్లు.. 4.4 లక్షల గృహ నిర్మాణాలు పూర్తి.. మరో రూ.5,600 కోట్లు..
సాక్షి, అమరావతి: పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం కింద 2023 సంవత్సరం చివరి నాటికి 30.2 లక్షల శాశ్వత గృహాలను అర్హులైన లబ్దిదారులందరికీ అందించడానికి సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కట్టుబడి ఉంది. 18.63 లక్షల ఇళ్లకు గాను, మొదటి దశలో 16.91 లక్షల ఇళ నిర్మాణం ప్రారంభంకాగా, వీటిలో 4.4 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయింది. మిగిలిన ఇళ్ల నిర్మాణం వివిధ దశలలో ఉంది. వైఎస్సార్ జగనన్న కాలనీలను నీటి సరఫరా, విద్యుత్, రోడ్లు, మురుగు కాల్వల ఏర్పాటు వంటి అన్ని మౌలిక సదుపాయాలతో ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. భారాన్ని తగ్గించడానికి, ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ ప్రక్రియ, ఇ-ప్రొక్యూర్మెంట్ వేదికల ద్వారా టెండర్లను ఖరారు చేసిన మార్కెట్ ధర కంటే ధరకు 20 మెట్రిక్ టన్నుల ఇసుక, 5 మెట్రిక్ టన్నుల సిమెంట్, స్టీల్, 12 ఇతర నాణ్యమైన భవన నిర్మాణ సామగ్రిని ఉచితంగా అందిస్తోంది. ► 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం కింద 5,600 కోట్ల రూపాయలను కేటాయించింది. చదవండి: ఏపీ వార్షిక బడ్జెట్.. మహిళా సాధికారతే ధ్యేయంగా.. -
సభలో సరదాగా..
-
AP Budget: మహిళా సాధికారతే ధ్యేయంగా..
సాక్షి, అమరావతి: మహిళా సాధికారత కోసం బడ్జెట్లో వేల కోట్ల రూపాయలు కేటాయించింది వైఎస్సార్సీపీ ప్రభుత్వం. పేద మహిళలు ఆర్థికంగా బలపడేందుకు, స్వయం సమృద్ధి సాధించేందుకు ప్రత్యేక పథకాలను అమలు చేస్తోంది. మహిళా పాడిరైతులను ఏకీకృతం చేయడానికి అదే విధంగా వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలతో సమానంగా మహిళా పాల సహకార సంఘాలను(ఎండీఎస్‌ఎస్) ప్రోత్సహించడానికి జగనన్న పాల వెల్లువ ప్రాజెక్టును వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. 17 జిల్లాలలో సుమారు 2.5 లక్షల మంది మహిళా పాడి రైతుల కోసం ఈ ప్రాజెక్టును అమలు చేసింది. దళారులను తొలగించి పాడి రైతుల నుంచి నేరుగా 561 లక్షల లీటర్ల పాలను కొనుగోలు చేసి రూ.250 కోట్లు నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు చెల్లించింది. ఈ విధానం ద్వారా పాల నాణ్యతను బట్టి గతంలో లభించే ధర కంటే లీటరుకు రూ.5-20 వరకు మెరగైన ధర లభిస్తోంది. వైఎస్సార్ ఆసరా.. స్వయం సహాయక సంఘాలలోని గ్రామీణ, పట్టణ పేద మహిళలకు ఏప్రిల్ 4, 2019 నాటికి బకాయి ఉన్న బ్యాంకు రుణాల మాఫీ కోసం వైఎస్సార్ ఆసరా పథకం కింద 4 విడతలుగా చెల్లిస్తామని ప్రభుత్వ ప్రకటించింది. ► దీని కోసం బడ్జెట్లో రూ.6,700 కోట్లు కేటాయించింది. వైఎస్సార్ సున్నా వడ్డీ సకాలంలో రుణాలను తిరిగి చెల్లించే సంస్కృతిని ప్రోత్సహించడానికి 3 లక్షల రూపాయల వరకు బ్యాంకు రుణాలను కలిగి ఉన్న అన్ని స్వయం సహాయక సంఘాలపై వడ్డీ భారాన్ని తగ్గించడానికి సీఎం జగన్ ప్రభుత్వం వైఎస్సార్ సున్నా వడ్డీ పథకాన్ని అమలు చేస్తోంది. దీనికి గాను 2019 సంవత్సరం నుండి గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలను కలుపుకొని స్వయం సహాయక సంఘాలకు చెందిన 1.02 కోట్ల మహిళలకు 3,615 కోట్ల రూపాయలు చెల్లించింది. ఈ చర్య మహిళా సాధికారత ప్రయత్నాలను బలోపేతం చేసి స్వయం సహాయక సంఘాలకు చెందిన పేద మహిళల ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేసింది. ► 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కోసం 1,000 కోట్ల రూపాయలు కేటాయించింది. ( ఫైల్ ఫోటో ) వైఎస్సార్ చేయూత ప్రభుత్వం షెడ్యూలు కులాల, షెడ్యూలు తెగల, వెనుకబడిన తరగతుల మరియు అల్పసంఖ్యాక వర్గాలకు చెందిన 45 నుండి 60 సంవత్సరాల మధ్య వయస్సు గల 25 లక్షల మంది మహిళలకు సంవత్సరానికి 18,750 రూపాయల చొప్పున గత నాలుగేళ్లలో 75,000 వేల రూపాయలను ఇచ్చింది. ఈ మొత్తాన్ని లబ్దిదారులు తమ ఎంపిక ప్రకారం ప్రస్తుత జీవనోపాధి కార్యకలాపాలలోను లేదా కొత్త సంస్థల స్థాపనకు పెట్టుబడిగా పెట్టుకోవడంలోను ఉపయోగిస్తున్నారు. ఇప్పటి వరకు 26.7 లక్షల మంది మహిళా సభ్యులకు 3 విడతలుగా 14,129 కోట్ల రూపాయలను అందజేయడం జరిగింది. ► 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను వైఎస్సార్ చేయూత పథకం కోసం 5,000 కోట్ల రూపాయల కేటాయించింది. ఉజ్జావల, స్వధార్ గృహ పథకం మహిళలకు సహాయం అందించడం కోసం 'ఉజ్జావల', 'స్వధార్ గృహ పథకం' క్రింద నడిచే గృహాలు, వన్ స్టాప్ సెంటర్లు, మహిళా ఉద్యోగినిల వసతి గృహాలు, సేవాగృహములు, ఉచితంగా పనిచేసే మహిళా హెల్ప్ లైన్ నెంబర్లు పనిచేస్తున్నాయి. సమీకృత మహిళా సాధికారత కార్యక్రమం అమలును పర్యవేక్షించేందుకు మిషన్ శక్తి పథకం కింద రాష్ట్ర కమిటీని వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ► 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను మహిళా అభివృద్ధి, పిల్లల సంక్షేమం కోసం 3,951 కోట్ల రూపాయలు కేటాయించింది. చదవండి: ఏపీ వార్షిక బడ్జెట్.. సంక్షేమ పథకాలకు పెద్దపీట -
CM Jagan Photos: జన రంజక ఏపీ వార్షిక బడ్జెట్ 2023-24 (ఫొటోలు)
-
AP Budget 2023-24: రూ.2,79,279 కోట్లతో జన రంజక వార్షిక బడ్జెట్
Live Updates రూ.2 లక్షల 79వేల 279 కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్ అన్ని వర్గాల సంక్షేమంతో పాటు సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం జనరంజక బడ్జెట్‌ను గురువారం అసెంబ్లీలో ప్రవేశ పెట్టింది. 2023–24 ఆర్థిక ఏడాదికి మొత్తం రూ.2 లక్షల 79 వేల 279 కోట్ల రూపాయలతో వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ శాసనసభలో ప్రవేశ పెట్టారు. ►రెవిన్యూ వ్యయం రూ.2,28,540 కోట్లు ►మూలధన వ్యయం రూ.31,061 కోట్లు ►రెవిన్యూ లోటు రూ.22,316 కోట్లు ►ద్రవ్య లోటు రూ.54,587 కోట్లు ►జీఎస్డీపీలో రెవిన్యూ లోటు 3.77 శాతం ►ఏపీ ద్రవ్యలోటు 1.54 శాతం 2023 బడ్జెట్ కేటాయింపులు.. ►వైఎస్సార్ పెన్షన్ కానుక- రూ.21,434.72 కోట్లు ►వైఎస్సార్ రైతు భరోసా రూ.4,020 కోట్లు ►జగనన్న విద్యాదీవెన రూ.2,841.64 కోట్లు ►జగనన్న వసతి దీవెన- రూ.2,200 కోట్లు ►వైఎస్సార్- పీఎం బీమా యోజన- రూ.1600 కోట్లు ►డ్వాక్రా సంఘాలకు వడ్డీలేని రుణాల కోసం రూ.1,000 కోట్లు ►రైతులకు వడ్డీలేని రుణాలు రూ.500 కోట్లు ►వైఎస్సార్ కాపు నేస్తం- రూ. 550 కోట్లు ►జగనన్న చేదోడు-రూ.350 కోట్లు ►వైఎస్సార్ వాహనమిత్ర-రూ.275 కోట్లు ►వైఎస్సార్ నేతన్న నేస్తం-రూ.200 కోట్లు ►వైఎస్సార్ మత్స్యకార భరోసా-రూ.125 కోట్లు ►మత్స్యకారులకు డీజీల్ సబ్సీడీ-రూ.50 కోట్లు ►రైతు కుటుంబాలకు పరిహారం-రూ.20 కోట్లు ►లా నేస్తం-రూ.17 కోట్లు ►జగనన్న తోడు- రూ.35 కోట్లు ►ఈబీసీ నేస్తం-రూ.610 కోట్లు ►వైఎస్సార్ కల్యాణమస్తు-రూ.200 కోట్లు ►వైఎస్సార్ ఆసరా-రూ.6700 కోట్లు ►వైఎస్సార్ చేయూత-రూ.5000 కోట్లు ►అమ్మ ఒడి-రూ.6,500 కోట్లు ►మొత్తంగా డీబీటీ స్కీంలకు రూ.54,228.36 కోట్లు ►ధర స్థిరీకరణ నిధి-రూ.3,000 కోట్లు ►వ్యవసాయ యాంత్రీకరణ- రూ. 1,212 కోట్లు ►మనబడి నాడు-నేడు రూ.3,500 కోట్లు ►జగనన్న విద్యా కానుక రూ.560 కోట్లు ►పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి రూ.15,873 కోట్లు ►పురపాలక,పట్టణాభివృద్ధి రూ.9,381 కోట్లు ►స్కిల్ డెవలప్మెంట్ రూ. 1,166 కోట్లు ►యువజన అభివృద్ధి, పర్యాటక, సాంస్కృతిక శాఖ రూ. 1,291 కోట్లు ►షెడ్యూల్ కులాల సంక్షేమం-రూ.20,005 కోట్లు ►షెడ్యూల్ తెగల సంక్షేమం-రూ. 6,929 కోట్లు ►వెనుకబడిన తరగతుల సంక్షేమం- రూ. 38,605 కోట్లు ►కాపు సంక్షేమం- రూ.4,887 కోట్లు ►మైనార్టీల సంక్షేమం- రూ. 4,203 కోట్లు ►పేదలందరికీ ఇళ్లు రూ.5,600 కోట్లు ►పరిశ్రమలు, వాణిజ్యం- రూ.2,602 కోట్లు ►రోడ్లు, భవనాల శాఖ- రూ.9,118 కోట్లు ►నీటి వనరుల అభివృద్ధికి(ఇరిగేషన్)- రూ.11,908 కోట్లు ►పర్యావరణం, అటవీ శాస్త్ర సాంకేతిక శాఖ- రూ.685 కోట్లు ►ఎనర్జీ- రూ.6,456 కోట్లు ►గ్రామ, వార్డు సచివాలయ శాఖ- రూ.3,858 కోట్లు ►గడపగడకు మన ప్రభుత్వం రూ.532 కోట్లు ♦ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా 4.25 కోట్ల మందికి ప్రయోజనం: మంత్రి బుగ్గన ♦సరుకుల పంపిణీ 84 శాతం నుంచి 94 శాతానికి పెరుగుదల ♦దరఖాస్తు చేసిన 21 రోజుల్లోనే రేషన్ కార్డుల జారీ ♦ఇప్పటి వరకు 48.75 లక్షల దరఖాస్తుల పరిష్కారం ♦రాష్ట్రంలో 55,607 అంగన్వాడీ కేంద్రాలు ♦ప్రభుత్వ పాఠశాలలకు సమీపంలోనే అంగన్వాడీ కేంద్రాలు ♦విద్యార్థులకు మెరుగైన భోజనం కోసం అదనంగా రూ.వెయ్యి కోట్లు ♦మహిళా అభివృద్ధి, పిల్లల సంక్షేమానికి రూ. 3,951 కోట్లు ♦సుస్థిర అభివృద్ధి, సుపరిపాలన ఇవే ప్రభుత్వ లక్ష్యాలు ♦వైఎస్సార్ ఆసరా కింద రూ.6,700 కోట్లు కేటాయింపు ♦17 జిల్లాల్లో 2.50 లక్షల మంది మహిళా పాడి రైతులు ఉన్నారు. ♦లీటర్‌కు రూ.5 నుంచి రూ.20 వరకు ధర లభిస్తుంది ♦వైఎస్సార్ సున్నా వడ్డీ కింద రూ.వెయ్యి కోట్లు కేటాయింపు: మంత్రి బుగ్గన ♦వైఎస్సార్ చేయూత కింద రూ.5వేల కోట్లు కేటాయింపు ♦విద్యకు పేదరికం అడ్డుకాకూడదనే అమ్మఒడి పథకం ♦టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్‌ను విద్యార్థులకు అందిస్తున్నాం ♦నాడు-నేడు కింద ప్రభుత్వ స్కూళ్ల అభివృద్ధి ♦స్థూలవృద్ధిలో రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది ♦ఆంధ్రప్రదేశ్ వృద్ధి 11.43 శాతం ♦సుస్థిర అభివృద్ధిలో నవరత్నాలు ప్రతిబింబిస్తున్నాయి ♦2022-23 ఆర్థిక సంవత్సరంలో సవరించిన అంచనాల ప్రకారం స్థూల ఉత్పత్తి రూ.13,17,728 కోట్లు ♦2023-24 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.14,49,501 కోట్లతో 10 శాతం వృద్ధిగా అంచనా ♦రాష్ట్రంలో 62 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడ్డారు ♦రైతు లేనిదే రాజ్యం లేదని విశ్వసించే ప్రభుత్వం మాది ♦పాల ఉత్పత్తిలో 5వ స్థానంలో ఏపీ ♦16 ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకుంటూ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం అమలు చేస్తున్నాం ♦గతేడాది 18.39 కోట్ల పనిదినాలు కల్పించాం ♦వైఎస్సార్ జలకళ కింద 17,047 బోరు బావులు తవ్వాం ♦కుళాయి కనెక్షన్ల ద్వారా 65 లక్షల ఇళ్లకు మంచినీరు ♦మౌలిక వసతులు, సేవలు మెరుగుపరిచే మోడల్ పట్టణాలుగా మంగళగిరి, తాడేపల్లి ♦విశాఖలో మౌలిక సదుపాయాల అభివృద్ధి ♦175 నియోజకవర్గాల్లో 192 నైపుణ్య కేంద్రాలు ♦ఐటీఐలో నైపుణ్యాభివృద్ధి కోసం మౌలిక సదుపాయాల అభివృద్ధి ♦చురుగ్గా 67 క్రీడా వికాస కేంద్రాల నిర్మాణ పనులు ♦పర్యాటక రంగంలో రూ.22 వేల కోట్లతో ఒప్పందాలు ♦విజయవాడ స్వరాజ్ మైదానంలో అంబేద్కర్ స్మృతివనం ♦125 అడుగుల అంబేద్కర్ కాంస్య విగ్రహ ప్రతిష్ఠాపన ♦జీఐఎస్ ద్వారా 13.42 లక్షల కోట్ల పెట్టుబడులు: మంత్రి బుగ్గన ♦సమ్మిట్ ద్వారా 6 లక్షలకు పైగా ఉద్యోగాలు ♦378 ఎంవోయూలు కుదుర్చుకున్నాం అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్ టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్‌ను అడ్డుకోవడం సరికాదన్నారు. ఇష్టం లేకుంటే సభ నుంచి వాకౌట్ చేయాలని స్పీకర్ సూచించారు. బడ్జెట్‌కు పదేపదే అడ్డు తగలడంతో ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులను స్పీకర్ సస్సెండ్ చేశారు. Time: 10: 11 AM ►బడ్జెట్ ప్రసంగాన్ని రాష్ట ప్రజలంతా చూస్తున్నారు: సీఎం జగన్ ►బడ్జెట్ ప్రసంగానికి టీడీపీ అడ్డుపడటం సరికాదు: సీఎం జగన్ Time: 10:07 AM ► బడ్జెట్లో పోతన భగవత పద్యాన్ని చదివిన మంత్రి బుగ్గన ► రవీంద్రనాథ్ ఠాగూర్ కవితను ఉదహరించిన మంత్రి రాజేంద్రనాథ్ Time: 10:04 AM ► అసెంబ్లీలో 2023-24 ఏపీ వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రవేశపెట్టారు. Time: 9:05 AM ►మూడో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కాసేపట్లో బడ్జెట్‌ను ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రవేశపెట్టనున్నారు. రూ.2.79 లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్ ఉండే అవకాశముంది. ►ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం.. 2023-24 వార్షిక బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం. ►ఉదయం 10 గంటలకు బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి బుగ్గన. ►రూ. 2. 79 లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్ ఉండే అవకాశం. ►నవరత్నాలకు నిధుల కేటాయింపుల్లో అధిక ప్రాధాన్యం. ►మహిళా సాధికారతకు ప్రాధాన్యతనిస్తూ జెండర్ బేస్డ్ బడ్జెట్ ►మహిళలు, పిల్లల కోసం ప్రత్యేకంగా కేటాయింపులు. ►వ్యవసాయం, విద్య, వైద్యం, సంక్షేమ, పేదల ఇళ్లకు పెద్దపీట ►వ్యవసాయ బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ►మండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న డిప్యూటీ సీఎం అంజాద్ భాషా Time: 8:26 AM బడ్జెట్లో పేదలు, బలహీన వర్గాలకు ప్రాధాన్యం: మంత్రి బుగ్గన పేదలు, బలహీన వర్గాలకు బడ్జెట్లో ప్రాధాన్యం ఉంటుందని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. విద్య, వైద్యం,మౌలిక సదుపాయాలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. పరిపాలనాపరమైన మార్పులు చేసిన వాటికి కేటాయింపులు చేశామన్నారు. Time: 8:11 AM ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సచివాలయానికి బయల్దేరారు. కాసేపట్లో క్యాబినెట్ భేటీ జరగనుంది. సీఎం అధ్యక్షతన రాష్ట్ర మంత్రిమండలి సమావేశమై బడ్జెట్‌కు ఆమోదం తెలపనుంది. అనంతరం ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ 2023–24 వార్షిక బడ్జెట్‌ను ఉదయం 10 గంటలకు అసెంబ్లీకి సమర్పించనున్నారు. Time: 07:41 AM బడ్జెట్ ప్రతులకు ప్రత్యేక పూజలు బడ్జెట్ కాపీతో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సచివాలయానికి చేరుకున్నారు. బడ్జెట్ ప్రతులకు మంత్రి, అధికారులు పూజలు చేశారు. Time: 07:33 AM బడ్జెట్ కాపీతో సచివాలయానికి బయలేర్దిన మంత్రి బుగ్గన బడ్జెట్ కాపీతో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సచివాలయానికి బయలేర్దారు. బడ్జెట్ ప్రతులకు పుజలు నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు బడ్జెట్‌ను మంత్రి ప్రవేశపెట్టనున్నారు. శాసనసభలో బుగ్గన, మండలిలో అంజాద్ బాషా.. ►వరుసగా ఐదో దఫా ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా నవరత్నాల పథకాలు అమలు కొనసాగిస్తూ అన్ని వర్గాలకు అండగా నిలిచేలా రాష్ట్ర ప్రభుత్వం 2023–24 వార్షిక బడ్జెట్‌కు రూపకల్పన చేసింది. ఈ ఏడాది కూడా మహిళా సాధికారతకు ప్రాధాన్యత ఇస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం జెండర్ బేస్డ్ బడ్జెట్ సిద్ధం చేసింది. ►రాష్ట్ర సొంత ఆదాయం, కేంద్రం నుంచి పన్నుల వాటా రూపంలో వచ్చే నిధులను వాస్తవ రూపంలో బేరీజు వేస్తూ వార్షిక బడ్జెట్ రూపొందించారు. కేంద్రం నుంచి పన్నుల వాటా రూపంలో రూ.41,388 కోట్లు రానున్నాయి. మొత్తం మీద 2023 – 24 వార్షిక బడ్జెట్ రూ.2.79 లక్షల కోట్లుగా ఉండనుందని అంచనా. నేటి ఉదయం మంత్రిమండలి ఆమోదం వైఎస్సార్ సీపీ ప్రభుత్వం గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న ఐదో బడ్జెట్ జనరంజకంగా ఉండనుంది. ఉదయం 8 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రిమండలి సమావేశమై బడ్జెట్‌కు ఆమోదం తెలపనుంది. అనంతరం ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ 2023–24 వార్షిక బడ్జెట్‌ను ఉదయం 10 గంటలకు అసెంబ్లీకి సమర్పించనున్నారు. ►శాసన మండలిలో డిప్యూటీ ముఖ్యమంత్రి అంజాద్ బాషా బడ్జెట్‌ను చదవనున్నారు. వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టడం పూర్తయిన వెంటనే ప్రత్యేకంగా వ్యవసాయ బడ్జెట్‌ను వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అసెంబ్లీలో చదివి వినిపిస్తారు. మండలిలో వ్యవసాయ బడ్జెట్‌ను పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు చదవనున్నారు. నవరత్నభరితంగా బడ్జెట్.. ►నవరత్నాలను ప్రతిబింబించేలా బడ్జెట్‌ను తీర్చిదిద్దారు. వృథా, దుబారా, ఆర్భాటపు వ్యయాలకు తావు లేకుండా అందరి సంక్షేమం, అన్ని రంగాల అభివృద్ధిని సమ్మిళితం చేస్తూ ఆయా రంగాలకు బడ్జెట్లో కేటాయింపులు చేశారు. అమ్మ ఒడి, వైఎస్సార్ రైతు భరోసా, పేదల గృహాలతో పాటు వ్యవసాయం, సాగునీరు, విద్య, వైద్య రంగాలకు బడ్జెట్లో ప్రాధాన్యత ఇచ్చారు. వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ పథకాలకు తగినన్ని కేటాయింపులు చేయనున్నారు. ►గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థకు బడ్జెట్లో తగిన కేటాయింపులు ఉండనున్నాయి. ప్రధానంగా ప్రభుత్వ విద్యా సంస్థలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయింపులు చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉప ప్రణాళికలను ప్రత్యేకంగా రూపొందించారు. మహిళలు, పిల్లల కోసం ప్రత్యేకంగా కేటాయింపులు చేయనున్నారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరా కోసం సబ్సిడీకి తగినన్ని నిధులు కేటాయించనున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)