Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

TDP attacks on YSRCP workers
దాడులపై పోలీసులు ప్రేక్షక పాత్ర

మచిలీపట్నం టౌన్‌: కృష్ణా జిల్లాలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై టీడీపీ, జనసేన కార్యకర్తలు చేస్తున్న దాడులను నియంత్రించకుండా ప్రేక్షక పాత్ర పోషిస్తున్న పోలీసులపై హైకోర్టులో ప్రైవేటు కేసులు వేస్తామని పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని), మాజీ మంత్రి కొడాలి శ్రీవేంకటేశ్వరరావు (నాని) వెల్లడించారు. శనివారం వారు కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. పేర్ని నాని మాట్లా­డుతూ ఓట్ల లెక్కింపు రోజు నుంచి జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై టీడీపీ, జనసేన రౌడీ మూకలు ఉద్దేశ పూర్వకంగా, అధికార మదంతో మారణహోమం సాగిస్తున్నా, విధ్వంసం సృష్టిస్తున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నార­న్నారు. చంద్రబాబునాయుడు, జిల్లాలో గెలుపొందిన ఎమ్మెల్యేలు.. వారి కార్యకర్తలు చేస్తున్న దాడు­లపై ప్రేక్షకపాత్ర వహించేలా పోలీసులకు ఆదేశాలు ఇచ్చారని చెప్పారు. ఆ ఆదేశాలను పోలీసులు తూ­చా తప్పకుండా పాటిస్తుండటం విచారకరం అన్నారు. గతంలో బీహార్, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఉన్న పరిస్థి­తిని చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్‌లు ఆంధ్రప్రదేశ్‌లోనూ తీసుకొచ్చారని విమర్శించారు. రౌడీ­షీటర్లు స్థానికంగా ఉన్న డీఎస్పీ, సీఐ, ఎస్సైలను ఏరా.. ఉద్యోగం చేయాలని లేదా.. నువ్వు ఇక్కడే ఉంటావా.. లేక వీఆర్‌కు వెళతావా.. అని మాట్లాడు­తున్నా పోలీసులు మిన్నకుండి పోవడం విచారకరం అన్నారు. ఈ ఘటనలకు సంబంధించిన వీడియో­లతో కోర్టుకు వెళతామని స్పష్టం చేశారు. కళ్లెదుటే దాడులు.. అచేతనంగా పోలీసులు‘బందరు గొడుగుపేటలోని ఎంకులు బంకులు ఎదురుగా ఉన్న సందులో ఒక యాదవ కుటుంబం ఇంట్లో సామగ్రి, టీవీని ధ్వంసం చేస్తే, కేసు పెట్టినా ఇనుగుదురుపేట పోలీసులు పట్టించుకోలేదు. బాధి­తు­లను వైఎస్సార్‌సీపీ నాయకులు పరామర్శించి సామగ్రి కొనుగోలుకు ఆర్థిక సాయం చేస్తే మళ్లీ సామగ్రి కొంటే ఇలాగే ధ్వంసం చేస్తామని టీడీపీ నాయకులు, కార్యకర్తలు హెచ్చరిస్తున్నా పోలీసులు పట్టించుకోకపోవడం దారుణం. స్థానిక చిలకలపూడి గోడౌన్స్‌ ఎదురుగా ఉన్న ఎన్టీఆర్‌ కాలనీలో కూలీ పనులు చేసుకునే భార్యాభర్తలు వైఎస్సార్‌సీపీకి పని చేశారనే కారణంతో వారి ఇంటిపై దాడి చేసి సామగ్రి ధ్వంసం చేశారు. అడ్డుపడిన వీరిద్దరినీ తీవ్రంగా గాయపరిచారు. ఆ దంపతులను ఆసు­పత్రిలో చేర్చుకోకుండా అడ్డుకున్నారు. వైఎస్సార్‌­సీపీ కార్పొరేటర్లు వారిని ఆసుపత్రిలో చేర్చారు. ఆ సమయంలో 25కు పైగా కేసులు ఉన్న రౌడీషీటర్‌ నవీన్‌.. ఆసుపత్రికి వెళ్లి నెలల పిల్లాడిని ఎత్తుకున్న ఆ మహిళను అసభ్య పదజాలంతో దూషించాడు. ఇదంతా పోలీసుల కళ్లెదుటే జరిగింది. అయినా రౌడీ షీటర్‌పై కేసు పెట్టకపోగా, బాధితులపైనే ఎదురు కేసు పెట్టారు. మర్డర్‌ కేసు ముద్దాయిలు, రౌడీలే డీఎస్పీలు, సీఐలుగా భావించేలా చంద్రబాబు తయారు చేశారు. మహేష్‌ అనే వ్యక్తి విచ్చలవిడిగా బరితెగించి కుర్చీలతో ఎస్‌ఐ పైనే దాడి చేశాడు. కార్లు ధ్వంసం చేశాడు. అయినా ఇంత వరకు కేసు నమోదు చేయలేదు. ఇంత జరు­గుతున్నా జిల్లా ఎస్పీ స్పందించకపోవటం విచారక­రం. మాజీ ఎమ్మెల్యేలు అందరం ఎస్పీని కలిసి విన్నవించాలని నిర్ణయం తీసుకున్నాం. విజయవాడ నుంచి బయలుదేరిన వల్లభనేని వంశీ, కైలే అనిల్‌­కుమార్‌లను పోలీసులు రానివ్వకుండా నిర్బంధించారు. రేపో, ఎల్లుండో డీజీపీ, ఎస్పీలను కలిసి దాడుల ఘటనలపై ఆధారాలతో ఫిర్యాదు చేస్తాం. ఈ దాడుల ఘటనలపై వీడియో ఆధారాలతో హైకోర్టులో ప్రైవేటు కేసు వేస్తున్నాం’ అని పేర్ని నాని తెలిపారు.మేం వస్తున్నాం.. ధైర్యంగా ఉండండి...మాజీ మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ ఎన్నికల ఫలితాల అనంతరం వైఎస్సార్‌సీపీ శ్రేణులను నిర్వీ­ర్యం చేయాలనే ఉద్దేశంతో టీడీపీ, జనసేన నాయ­కులు, కార్యకర్తలు భౌతిక దాడులకు దిగుతూ చేతులు, కాళ్లు విరగ్గొట్టడంతో పాటు గ్రామాల్లో ఉండొద్దని హెచ్చరిస్తున్నార­­న్నారు. ఈ ఘటనలకు పోలీసులే ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నారని తెలిపారు. ‘దాడులు జరుగుతుంటే పోలీసులు నిలబడి చూస్తూ ఎంజాయ్‌ చేస్తుండటం దారుణం.స్థానికంగా దాడులు జరుగుతున్న సమయంలో ఆయా ప్రాంతాల పోలీసులకు సమాచారం అందించినా, స్పందించడం లేదు. వచ్చినా ప్రేక్షక పాత్ర వహిస్తు­న్నారు. ఈ ఘటనలపై కేసులు కట్టడం లేదు. దాడులు చేస్తున్న వారే కాకుండా దాడు­లను చూస్తూ మిన్నకుండిపోయిన పోలీసులపై కూడా కేసులు వేస్తాం. వైఎస్సార్‌సీపీ నాయ­కులు, కార్యకర్తలు ఎలాంటి భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదు. రెండు రోజుల్లో జిల్లాలోని ముఖ్య నాయకు­లందరం ప్రతి నియోజకవర్గానికి వెళ్లి దాడులకు గురైన వారి ఇళ్లకు వెళ్లి ధైర్యం చెబుతాం. ఇకనైనా దాడులు ఆగకుంటే వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్య­కర్తలు రోడ్డు పైకి వస్తారు. లా అండ్‌ ఆర్డర్‌ సమస్య ఎదురైతే దానికి పోలీస్‌ వ్యవస్థే బాధ్యత వహించాలి’ అని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌­బాబు, మచిలీపట్నం, పెడన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు పేర్ని కృష్ణమూర్తి (కిట్టు), ఉప్పాల రమేష్‌ (రాము) పాల్గొన్నారు.పేర్ని కిట్టు, నాయకులను అడ్డుకున్న పోలీసులుటీడీపీ శ్రేణుల దాడిలో గాయపడిన బాబి దంపతులను పరామర్శించేందుకు బయలుదేరిన వైఎస్సార్‌సీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. బందరు పట్టణంలోని చిలకలపూడి ఎన్టీఆర్‌ కాలనీలో నివాసం ఉండే బాబి దంపతులు వైఎస్సార్‌సీపీ పక్షాన నిలిచారనే నెపంతో కూటమి శ్రేణులు వారి నివాసంపై దాడికి పాల్పడ్డారు. సామగ్రి ధ్వంసం చేశారు.ఈ సందర్భంగా శనివారం బాధితులను పరామర్శించేందుకు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి (కిట్టు) తన నివాసం నుంచి నగర మేయర్‌ చిటికిన వెంకటేశ్వరమ్మ, మునిసిపల్‌ మాజీ చైర్మన్‌ షేక్‌ సలార్‌దాదా, కార్పొరేటర్లతో కలిసి బయలుదేరారు. విషయం తెలుసుకున్న పోలీసులు వారి పరామర్శకు వెళ్లేందుకు అనుమతి లేదని అడ్డుకున్నారు.అదనపు బలగాలను రప్పించి దారికి అడ్డంగా బారికేడ్లు ఏర్పాటు చేశారు. పరామర్శకు అనుమతి ఏమిటని పేర్ని కిట్టు, తదితరులు పోలీసులను దాటుకుని వెళ్లి బాబి దంపతుల ఇంటికి వెళ్లి పరామర్శించారు. పరామర్శించిన వారిలో కార్పొరేటర్లు మేకల సుబ్బన్న, జోగి చిరంజీవి, ఐనం తాతారావు, మాచవరపు రాంప్రసాద్, పల్లి శేఖర్, పర్ణం సతీష్, శ్రీరాం చిన్నా ఉన్నారు.

30 Ministers To Take Oath As Modi 3.0 To Be Sworn In 9 june 2024
కేబినెట్లో ఎవరెవరో...!

న్యూఢిల్లీ: మోదీ 3.0 మంత్రివర్గంలో చోటు దక్కించుకునేది ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. బీజేపీకి సొంతగా మెజారిటీ రాని నేపథ్యంలో ఈసారి మంత్రివర్గ కూర్పులో ఎన్డీఏ మిత్రపక్షాలకు పెద్దపీట వేయడం తప్పనిసరిగా మారింది. ఈ నేపథ్యంలో మంత్రులుగా పార్టీలవారీగా పలువురి పేర్లు విని్పస్తున్నాయి... బీజేపీ అమిత్‌ షా మళ్లీ హోం, రాజ్‌నాథ్‌సింగ్‌ రక్షణ శాఖల బాధ్యతలు చేపట్టవచ్చంటున్నారు. నితిన్‌ గడ్కరీ, పీయూష్‌ గోయల్, ప్రహ్లాద్‌ జోషీ, జ్యోతిరాదిత్య సింధియా, జితిన్‌ ప్రసాద, నిత్యానంద రాయ్, రాజీవ్‌ ప్రతాప్‌ రూడీ, కిరెన్‌ రిజిజు కూడా మంత్రులుగా కొనసాగే వీలుంది. మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌కు పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఇవ్వకుంటే మంత్రిగా చాన్సున్నట్టు చెబుతున్నారు. వీరితో పాటు కిషన్‌రెడ్డి, ఈటల రాజేందర్, డీకే అరుణ, ధర్మపురి అరవింద్, బండి సంజయ్‌ (తెలంగాణ), పురందేశ్వరి (ఏపీ), ధర్మేంద్ర ప్రధాన్, గజేంద్రసింగ్‌ షెకావత్, బస్వరాజ్‌ బొమ్మై, పీసీ మోహన్, గోవింద్‌ కర్జోల్, దుష్యంత్‌ సింగ్, సురేశ్‌గోపీ, శాంతను ఠాకూర్, జితేంద్ర సింగ్, జుగల్‌ కిశోర్‌ శర్మ, శర్బానంద సోనోవాల్, బైజులీ కలితా మేధి, బిప్లవ్‌ దేబ్‌ తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి.జనసేన వల్లభనేని బాలÔౌరి పేరు విని్పస్తోంది.జేడీ(యూ) మూడు కేబినెట్, ఒకట్రెండు సహాయ బెర్తుల కోసం పార్టీ అధ్యక్షుడు, బిహార్‌ సీఎం పట్టుబడుతున్నట్టు సమాచారం. రెండు కేబినెట్‌ పదవులు దక్కవచ్చని జాతీయ మీడియా అభిప్రాయపడుతోంది. పార్టీ మాజీ చీఫ్‌ లలన్‌సింగ్‌తో పాటు భారతరత్న కర్పూరీ ఠాకూర్‌ కుమారుడు రామ్‌నాథ్‌ ఠాకూర్‌ పేర్లు ఇప్పటికే ఖరారైనట్టు తెలుస్తోంది.టీడీపీ కనీసం నాలుగు కేబినెట్‌ పదవులు కోరుతోంది. శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ నాయుడు ఆదివారం మోదీతో పాటు ప్రమాణం చేయడం ఖాయమని చెబుతున్నారు. రూ.5,705 కోట్ల ఆస్తులతో ఈ లోక్‌సభ ఎన్నికల్లో పోటీపడ్డ అభ్యర్థుల్లో అత్యంత సంపన్నుడిగా రికార్డు సృష్టించిన పెమ్మసాని చంద్రశేఖర్‌తో పాటు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, డి.ప్రసాదరావు, టి.కృష్ణప్రసాద్‌ పేర్లు కూడా విని్పస్తున్నాయి.ఆరెల్డీ పార్టీ చీఫ్‌ జయంత్‌ చౌదరికి బెర్తు ఖాయమంటున్నారు.శివసేన రెండు బెర్తులు అడుగుతోంది. పార్టీ చీఫ్, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిండే కుమారుడు శ్రీకాంత్‌ షిండే పేరు గట్టిగా విని్పస్తోంది. ఆయన మాత్రం తన బదులు పార్టీ కోసం ఏళ్ల తరబడి కష్టించిన ఇతరులకు అవకాశం దక్కాలంటున్నారు. ఎల్జేపీ కనీసం ఒక్క బెర్తు ఖాయంగా కని్పస్తోంది. పార్టీ చీఫ్‌ చిరాగ్‌ పాస్వాన్‌ మోదీతో పాటు ప్రమాణస్వీకారం చేయవచ్చని చెబుతున్నారు. జేడీ(ఎస్‌) హెచ్‌.డి.కుమారస్వామికి వ్యవసాయ శాఖ కోరుతోంది.అప్నాదళ్‌ (ఎస్‌) అనుప్రియా పటేల్‌కు మళ్లీ స్థానం దక్కేలా ఉంది.

Israel-Hamas war: Israel rescues 4 hostages, 210 Palestinians reported killed
Israel-Hamas war: గాజాలో భీకర పోరు.. 210 మంది మృతి

జెరూసలెం/గాజా: సెంట్రల్‌ గాజాలో నుసెయిరత్‌లో హమాస్‌ మిలిటెంట్లు, ఇజ్రాయెల్‌ సైన్యం మధ్య పోరు భీకరంగా సాగుతోంది. శనివారం నుసెయిరత్, పరిసర ప్రాంతాల్లో ఇజ్రాయెల్‌ దాడుల్లో 210 మంది చనిపోయినట్టు సమాచారం! 400 మంది దాకా గాయపడినట్లు హమాస్‌ను ఉటంకిస్తూ అల్‌జజీరా పేర్కొంది. మృతుల్లో పలువురు చిన్నారులున్నట్లు తెలిపింది. డెయిర్‌ అల్‌ బలాహ్‌లోని అల్‌–హక్సా ఆస్పత్రి మొత్తం రక్తంతో తడిచి వధశాలగా మారిపోయిందని డాక్టర్స్‌ వితౌట్‌ బోర్డర్స్‌ పేర్కొంది.నలుగురు బందీలకు విముక్తి..ఇలా ఉండగా, హమాస్‌ మిలిటెంట్ల చెర నుంచి బందీలను విడిపించుకునేందుకు గాజాపై యుద్ధం ప్రారంభించిన ఇజ్రాయెల్‌ ఆర్మీ పెద్ద విజయం నమోదు చేసుకుంది. నుసెయిరత్‌లో ఓ భవన సముదాయంపై శనివారం పట్టపగలే ప్రత్యేక ఆపరేషన్‌ చేపట్టిన ఆర్మీ రెండు వేర్వేరు ప్రాంతాల్లో దాచి ఉంచిన నోవా అర్గామని(25), అల్మోగ్‌ మెయిర్‌ జాన్‌(21), ఆండ్రీ కొజ్లోవ్‌(27), ష్లోమి జివ్‌(40) అనే నలుగురు బందీలను సురక్షితంగా తీసుకొచ్చినట్లు తెలిపింది. తాజాగా రక్షించిన నలుగురితో కలిపి ఇజ్రాయెల్‌ ఆర్మీ ఇప్పటి వరకు కాపాడిన బందీల సంఖ్య ఏడుకు చేరుకుంది. అమెరికా అందించిన సమాచారంతోనే బందీలను ఇజ్రాయెల్‌ ఆర్మీ గుర్తించి, రక్షించిందని బైడెన్‌ ప్రభుత్వంలోని ఓ అధికారి వెల్లడించారు. గురు, శుక్రవారాల్లోనూ ఇజ్రాయెల్‌ దాడుల్లో డజన్ల మంది మరణించారు.ఆమె వీడియో వైరల్‌.. శనివారం ఐడీఎఫ్‌ రక్షించిన వారిలో అర్గామని అనే మహిళ ఉన్నారు. మిలిటెంట్లకు చిక్కిన బందీల్లో అర్గామనికి చెందిన వీడియోనే మొదటిసారిగా బయటకు వచి్చంది. ఇద్దరు మిలిటెంట్లు బైక్‌పై తీసుకెళ్తుండగా ‘నన్ను చంపకండి’అని ఆమె రోదిస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరలయ్యాయి. బ్రెయిన్‌ కేన్సర్‌ ముదిరి మృత్యుశయ్యపై ఉన్న తనకు కూతురిని చూడాలని ఉందంటూ అర్గామని తల్లి లియోరా ఏప్రిల్‌లో ఒక వీడియో విడుదల చేశారు. చెర నుంచి విడుదలైన అర్గామనితో ప్రధాని నెతన్యాహు ఫోన్‌లో మాట్లాడారు. బందీలందరినీ విడిపించేదాకా యుద్ధం ఆపబోమని స్పష్టం చేశారు.

All Most In All Matches Sensational Wins Happening In T20 World Cup 2024
సంచలనాల వరల్డ్‌ కప్‌.. పెద్ద జట్లకు ముచ్చెమటలు పట్టిస్తున్న పసికూనలు

ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌ సంచలనాలకు కేంద్ర బిందువుగా మారింది. దాదాపుగా ప్రతి మ్యాచ్‌లో బడా జట్లకు పసికూనలు షాకిస్తున్నాయి. ఇప్పటివరకు జరిగిన 15 మ్యాచ్‌ల్లో పెద్ద జట్లపై చిన్న జట్లు హవా చూపాయి.ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌లపై ఓ లుక్కేద్దాం..టోర్నీ ఆరంభ మ్యాచ్‌లోనే ఓ మోస్తరు సంచలనం నమోదైంది. తమకంటే పటిష్టమైన కెనడాకు తొలిసారి ప్రపంచకప్‌ ఆడుతున్న యూఎస్‌ఏ ఊహించని షాకిచ్చింది. రెండో మ్యాచ్‌లో మరో పసికూన పపువా న్యూ గినియా.. రెండు సార్లు ప్రపంచ ఛాంపియన్‌ అయిన వెస్టిండీస్‌ను దాదాపుగా ఓడించినంత పని చేసింది. ఈ మ్యాచ్‌లో విండీస్‌ బతుకు జీవుడా అన్నట్లు చివరి ఓవర్‌లో విజయం సాధించింది.పసికూనల మధ్య జరిగిన మూడో మ్యాచ్‌ సైతం నరాలు తెగే ఉత్కంఠ నడుమ సాగింది. ఈ లో స్కోరింగ్‌ మ్యాచ్‌లో ఒమన్‌పై నమీబియా సూపర్‌ ఓవర్‌లో విజయం సాధించింది.శ్రీలంక-సౌతాఫ్రికా మధ్య జరిగిన నాలుగో మ్యాచ్‌.. ఆఫ్ఘనిస్తాన్‌-ఉగాండ మధ్య జరిగిన ఐదో మ్యాచ్‌ అందరూ ఊహించినట్లుగానే జరిగాయి. ఈ రెండు మ్యాచ్‌ల్లో ఎలాంటి సంచలనాలు నమోదు కాలేదు. స్కాట్లాండ్‌-ఇంగ్లండ్‌ మధ్య జరగాల్సిన ఆతర్వాతి మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దైంది. ఈ మ్యాచ్‌ రద్దు కాకుండా ఉండి ఉంటే ఇందులోనూ సంచలనానికి ఆస్కారం ఉండేది.నేపాల్‌-నెదర్లాండ్స్‌ మధ్య జరిగిన ఏడో మ్యాచ్‌.. భారత్‌-ఐర్లాండ్‌ మధ్య జరిగిన ఎనిమిదో మ్యాచ్‌.. ఆస్ట్రేలియా-ఒమన్‌ మధ్య జరిగిన తొమ్మిదో మ్యాచ్‌ అందరూ ఊహించినట్లుగానే ఏకపక్షంగా సాగాయి.అనంతరం పపువా న్యూ గినియా-ఉగాండ మధ్య జరిగిన పదో మ్యాచ్‌లో ఓ మోస్తరు సంచలనం నమోదైంది. తొలిసారి ప్రపంచకప్‌ ఆడుతున్న ఉగాండ.. పొట్టి ప్రపంచకప్‌లో తమ తొలి విజయాన్ని నమోదు చేసింది.పదకొండో మ్యాచ్‌ నుంచి పొట్టి ప్రపంచకప్‌ మరింత రసవత్తరంగా మారింది. తొలిసారి ప్రపంచకప్‌ ఆడుతున్న యూఎస్‌ఏ.. తమకంటే చాలా రెట్లు మెరుగైన పాకిస్తాన్‌కు ఊహించని షాకిచ్చింది. ఈ మ్యాచ్‌ను ఐసీసీ పొట్టి ప్రపంచకప్‌ టోర్నీల్లో ఘోరమైన అప్‌సెట్‌గా అభివర్ణించింది.నమీబియా-స్కాట్లాండ్‌ మధ్య జరిగిన 12వ మ్యాచ్‌ ఏ హడావుడి లేకుండా సజావుగా సాగగా.. కెనడా-ఐర్లాండ్‌ మధ్య జరిగిన 13వ మ్యాచ్‌లో మరో సంచలనం నమోదైంది. కెనడా.. తమకంటే పటిష్టమైన ఐర్లాండ్‌కు ఊహించని షాకిచ్చి ప్రస్తుత ప్రపంచకప్‌లో తొలి విజయం నమోదు చేసుకుంది.నిన్న జరిగిన 14వ మ్యాచ్‌లో మరోసారి సంచలనం నమోదైంది. ఓ సారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన శ్రీలంకను ఇప్పటివరకు ఒక్కసారి ‍కూడా టైటిల్‌ గెలవని బంగ్లాదేశ్‌ మట్టికరిపించింది. నిన్ననే జరిగిన మరో మ్యాచ్‌లో క్రికెట్‌ ప్రపంచం ఊహించని మరో పెను సంచలనం నమోదైంది. ఆఫ్ఘనిస్తాన్‌.. తమకంటే చాలా రెట్లు పటిష్టమైన న్యూజిలాండ్‌కు ఊహించని షాకిచ్చింది.ఇలా ఇప్పటివరకు జరిగిన 15 మ్యాచ్‌ల్లో ఒకటి అరా మినహా దాదాపుగా అన్ని మ్యాచ్‌ల్లో సంచలనాలు నమోదయ్యాయి. గతంలో ఎన్నడూ లేనట్లుగా ఈ ప్రపంచకప్‌లో సంచలనాలు నమోదవుతున్నాయి. మెగా టోర్నీ ఇలాగే కొనసాగాలని క్రికెట్‌ అభిమానులు కోరుకుంటున్నారు.

NDA Alliance Government May Give Bigger Number Of Portfolios To Telugu State MPs
కేంద్ర కేబినెట్‌లో తెలుగు రాష్ట్రాలకే పెద్దపీట!

ఢిల్లీ: కేంద్రంలో కొలువుదీరబోయే ఎన్డీయే ప్రభుత్వ మంత్రివర్గంలో తెలుగు రాష్ట్రాలకు పెద్దపీట దక్కనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో బీజేపీ తన స్థానాల్ని డబుల్‌ చేసుకోగా.. ఏపీలోనూ కూటమి ద్వారా మంచి ఫలితాన్నే రాబట్టుకోగలిగింది. దీంతో తెలంగాణ నుంచి ఇద్దరు లేదా ముగ్గురికి, అలాగే ఏపీ నుంచి ఐదారుగురికి కేబినెట్‌లో చోటు దక్కవచ్చనే సంకేతాలు అందుతున్నాయి.తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా కొనసాగే అవకాశం కనిపిస్తోంది. అయితే బీసీ కోటాలో కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌కు మంత్రి పదవి దక్కవచ్చనే ప్రచారం ఊపందుకుంది. ఇక.. మహిళా కోటాలో మహబూబ్‌నగర్‌ ఎంపీ డీకే అరుణకు కేంద్ర సహాయ మంత్రి పదవి దక్కే అవకాశాలున్నాయి. ఇక.. కేంద్ర కేబినెట్‌లో బెర్త్‌ ఆశిస్తున్న ఈటల రాజేందర్‌కు.. తెలంగాణ బీజేపీ పగ్గాలు అప్పగించవచ్చనే చర్చ ఆ పార్టీలో నడుస్తోంది.ఏపీ బీజేపీ నుంచి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరికి, సీఎం రమేష్‌కు మంత్రివర్గంలో చాన్స్ దక్కనున్నట్లు తెలుస్తోంది. జనసేన నుంచి బాలశౌరికి సహయ మంత్రి పదవి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా కూటమిలో కీలకంగా మారిన టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌కు, రాయలసీమ నుంచి పార్థసారధికి మంత్రివర్గంలో ఛాన్స్ దక్కనున్నట్లు తెలుస్తోంది.మంత్రివర్గ కూర్పుపై కొనసాగుతున్న కసరత్తు..ఎన్డీయే భాగస్వామి పక్షాల అధినేతలతో విడివిడిగా శుక్రవారం జేపీ నడ్డా, అమిత్ షా, రాజ్‌నాథ్‌ సింగ్ సమావేశమయ్యారు. మంత్రివర్గంలో కోరుకుంటున్న పదవులు, స్థానాలపై నేతలు చర్చించారు. ఇవాళ కూడా మంతివర్గ కూర్పుపై కసరత్తు కొనసాగుతోంది. టీడీపీ, జేడీ(యూ)కు అధిక ప్రాధాన్యం కలిగిన శాఖలు దక్కే అవకాశం కనిపిస్తోంది. టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌కు కేబినెట్‌లో ఛాన్స్ లభించనుంది. మరో ఇద్దరికి సహాయ మంత్రి పదవులు లభించే అవకాశం ఉన్నట్లు సమాచారం. మంత్రివర్గం రేసులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు ఉన్నారు.రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడే మంత్రిత్వ శాఖలు తీసుకుంటామని టీడీపీ నేత రామ్మోహన్ నాయుడు అన్నారు. పట్టణాభివృద్ధి, జలవనరుల శాఖ, పరిశ్రమల శాఖలను టీడీపీ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక.. జనసేన నుంచి బాలశౌరికి సహాయ మంత్రి అవకాశం లభించనున్నట్లు సమాచారం. ఏపీ బీజేపీ కోటాలో పురందేశ్వరికి మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉంది. మంత్రి పదవి కోసం ముమ్మరంగా సీఎం రమేష్ లాబీయింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రివర్గంలో ఎన్డీయే పక్ష పార్టీలు భాగస్వామ్యం కానున్నాయి. కీలకమైన హోమ్, ఆర్థిక, రక్షణ విదేశాంగ శాఖలు బీజేపీకే కేటాయించనున్నట్లు సమాచారం. మూడు మంత్రి పదవులు, రెండు సహాయ మంత్రి పదవులను టీడీపీ కోరుతున్నట్లు తెలుస్తోంది.టీడీపీకి లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ పదవి దక్కే అవకాశం ఉ‍న్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. జేడీ(యూ) మూడు మంత్రి పదవులు కోరుతున్నట్లు తెలుస్తోంది. శివసేన, ఎన్సీపీ, ఆర్ఎల్డీకి ఒక్కొక్క మంత్రి పదవి కేటాయించనున్నట్లు సమాచారం. దీంతో పాటు బీహార్ ప్రత్యేక హోదా ప్రకటించాలని సీఎం నితీశ్ కుమార్ కోరుతున్నారు.

JDU leader KC Tyagi claims Nitish Kumar was offered PM post by INDIA bloc
నితీశ్‌కు ప్రధాని పదవి ఆఫర్‌ చేసిన ఇండియా కూటమి!

పట్నా: ఎన్డీయే సంకీర్ణ కూటమి ప్రభుత్వ ఏర్పాటులో బిహార్‌లోని నితీష్‌కుమార్‌ జేడీ(యూ) కీలకంగా మారింది. బీజేపీ సొంతంగా మెజార్టి సీట్లు దక్కించుకోని విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇండియా కూటమి నితీష్‌ కుమార్‌కి డిప్యూటీ పీఎం పదవి ఆఫర్‌ చేసి.. తమకు మద్దతు ఇవ్వాలని కోరినట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా జేడి(యూ) నేత కేసీ త్యాగి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. ‘‘ జేడీ(యూ) చీఫ్‌ నితీష్‌ కుమార్‌కి ఇండియా కూటమి నుంచి ఏకంగా ప్రధాన మంత్రి పదవి ఆఫర్‌ వచ్చింది. ఇండియా కూటమికి కన్వీనర్‌గా అంగీకరించని వాళ్లు.. ఏకంగా నితీష్‌కు ప్రధానమంత్రి పదవి ఆఫర్‌ చేశారు. అందుకే నితీష్‌ వాళ్ల ఆఫర్‌ను తిరస్కరిచారు. తాము ఎన్డీయేతోనే ఉన్నాం. మళ్లీ ఇండియా కూటమిలోకి వెళ్లే ప్రసక్తే లేదు. మా మద్దలు ఎన్డీయే ఉంటుంది’’ అని అన్నారు. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసే మెజార్టి సొంతంగా బీజేపీ, కాంగ్రెస్‌ కూటమికి లేకపోవటంతో నితీష్‌ కుమార్‌పై మద్దతును కీలకంగా మారింది. ఈ క్రమంలోనే ఇండియా కూటమి ఆయన మద్దతు కోరినట్లు త్యాగి తెలిపారు. తరచూ కూటములు మారుతారనే పేరు నితీష్‌ కుమార్‌ ఉ‍న్న విషయం తెలిసిందే. ఇండియా కూటమి ఏర్పాటులో మొదటిగా నితీష్‌ కుమారే కీలకంగా వ్యవహరించారు. పట్నాలో జరిగిన మొదటి సమావేశానికి సైతం అధ్యక్షత వహించారు. అయితే.. ఎన్నికల ముందు ఈ ఏడాది జనవరిలో సీఎం పదవి రాజీనామా చేసి మరీ ఎన్డీయే కూటమిలో చేరిపోయారు. ఇక.. లోక్‌సభ ఎ‍న్నికల్లో నితీష్‌ కుమార్‌ జేడీ(యూ) 12 ఎంపీ స్థానాలను గెలుచుకొని ఎన్డీయే కూటమిలో మూడో స్థానంలో ఉంది. శుక్రవారం భాగస్వామ్య పార్టీలు ఎన్డీయే పక్ష నేతగా నరేంద్ర మోదీని ఎన్నుకున్న విషయం తెలిసిందే. కేంద్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం కోలువుదీరనుంది. రేపు (ఆదివారం) 7.15 గంటలకు ప్రధానిగా నరేంద్ రమోదీ ముచ్చటగా మూడోసారి ప్రమాణస్వీకారం చేయనున్నారు.స్పందించిన కాంగ్రెస్‌తమ పార్టీ చీఫ్‌కు నితీశ్‌కుమార్‌కు ఇండియా కూటమి ప్రధానమంత్రి పదవి అఫర్ చేసిందని జేడీ(యూ) నేత త్యాగి వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ పార్టీ స్పందించింది. ‘‘ జేడీ(యూ) నేత త్యాగి చెప్పినటువంటి సమాచారం మా వద్ద లేదు’’ అని కాంగ్రెస్‌ పార్టీ జనరల్‌ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌ అన్నారు. త్యాగి చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు.

Sofia Firdous, Odisha's First-Ever Woman Muslim MLA
సెన్సేషన్‌ సోఫియా.. తండ్రిపై అవినీతి కేసు, ఇంట్రెస్టింగ్‌ బ్యాక్‌గ్రౌండ్‌

ఒడిశా రాజకీయాల్లో సంచలనం చోటు చేసుకుంది. ఆ రాష్ట్ర శాసనసభకు తొలిసారిగా ముస్లిం మైనారిటీకి చెందిన మహిళ ఎన్నికైంది. ఆమె పేరు సోఫియా ఫిర్దౌస్‌.. వయసు 32 ఏళ్లు. కాంగ్రెస్‌ అభ్యర్థిగా బారాబతి-కటక్‌ స్థానం నుంచి పోటీ చేసి తన ప్రత్యర్థి బీజేపికి చెందిన పూర్ణ చంద్ర మహాపాత్రను ఎనిమిది వేల మెజార్టీ ఓట్ల తేడాతో ఓడించారు. ఇంతకీ ఈ సోఫియాకున్న ఆసక్తికర నేపథ్యాన్ని పరిశీలిస్తే.. ఫిర్దౌస్‌ ఒడిశా సీనియర్‌ కాంగ్రెస్‌ నేత మహమ్మద్‌ మోకిమ్‌ కుమార్తె. తండ్రిపై అవినీతి ఆరోపణలు ఉండడంతో ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు పడింది. దీంతో ఆయన స్థానంలో కూతురు ఫిర్దౌస్‌ ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే తండ్రి అవినీతి మరక.. ఈ యువ నేత గెలుపును ఆపలేకపోయింది. అంతేగాదు స్వాతంత్యం వచ్చిన తర్వాత ఒడిశాలో ఎమ్మెల్యేగా ఎన్నికైన తొలి ముస్లిం మహిళగా ఆమె విజయం ఒడిషా రాజకీయ పుటల్లోకి ఎక్కింది.కెరీర్‌..ఫిర్దౌస్‌ కళింగ ఇన్స్‌టిట్యూట్‌ ఆఫ్‌ ఇండస్ట్రియల్‌ టెక్నాలజీ నుంచి సివిల్‌ ఇంజనీరింగ్‌ డిగ్రీని పూర్తి చూశారు. ఆ తర్వాత 2022లో బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌(ఐఐఎంబీ) నుంచి ఎగ్జిక్యూటిబవ్‌ జనరల్‌ మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రాంను కూడా పూర్తి చేశారు.2023లో కాన్ఫెడరేషన్‌ ఆప్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ అసోసీయేషిన్‌ ఆఫ్‌ ఇండియా(సీఆర్‌ఈడీఏఐ) అధ్యక్షురాలిగా ఫిర్దౌస్‌ ఎన్నికయ్యారు. అలాగే సీఆర్‌ఈడీఏఐ మహిళా విభాగానికి ఈస్ట్‌ జోన్‌ కో ఆర్డినేటర్‌గా కూడా పనిచేశారు. ఆ తర్వాత ఆమె ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌(ఐజీబీసీ)కి కో చైర్మన్‌గా కూడా చేశారు. అంతేగాదు మహిళా పారిశ్రామికవేత్తలకు సంబంధించిన ఐఎన్‌డబ్ల్యూఈసీ సభ్యురాలు కూడా. ఆమె ప్రముఖ పారిశ్రామికవేత్త షేక్‌ మెరాజ్‌ ఉల్‌ హక్‌ను వివాహం చేసుకున్నారు. రాజకీయాల్లో ఒడిషా తొలి మహిళా ముఖ్యమంత్రి నందిని సత్పతి, ఫిర్దౌస్‌కు ఆదర్శమట. విశేషం ఏంటంటే.. 1972లో బారాబతి-కటక్‌ నియోజకవర్గం నుంచే నందిని సత్పతి గెలుపొందారు. కాగా, ఈ 2024 ఒడిశా అసెంబ్లీ ఎన్నికలు గణనీయమైన రాజకీయ మార్పును చవిచూశాయి. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 147 సీట్లలో 78 స్థానాలను గెలుచుకోని విజయం సాధించింది. దీంతో 24 ఏళ్ల పాటు ఏకధాటిగా పాలించిన బిజూ జనతాదళ్ (బీజేడీ) పార్టీ నాయకుడు నవీన్‌ పట్నాయక్‌ పాలనకు తెరపడింది. (చదవండి: మచ్చల జింక, దెయ్యం అంటూ అవహేళనలు..! ఐనా..)

7,000 zombie companies face collapse worldwide
ప్రపంచంలో 7000 ‘జాంబీ కంపెనీలు’.. ఏంటివి?

అప్పుల ఊబిలో కూరుకుపోయి మనుగడ అంచున కొట్టుమిట్టాడుతూ రుణాలపై వడ్డీని కూడా చెల్లించలేని స్థితిలో ఉన్న కంపెనీలను జాంబీ కంపెనీలుగా వ్యవహరిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి జాంబీ కంపెనీల సంఖ్య గత పదేళ్లలో గణనీయంగా పెరిగింది.అసోసియేటెడ్ ప్రెస్ విశ్లేషణలో జాంబీ కంపెనీల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా దాదాపు 7,000 పబ్లిక్ ట్రేడెడ్ కంపెనీలకు పెరిగింది. ఒక్క యునైటెడ్ స్టేట్స్‌లోనే ఇలాంటి కంపెనీలు 2,000 లకు చేరాయి. ఏళ్ల తరబడి చౌక రుణాలు పేరుకుపోవడం, మొండి ద్రవ్యోల్బణం రుణ వ్యయాలను దశాబ్ద గరిష్టాలకు నెట్టింది.వీటిలో అనేక చిన్న, మధ్య తరహా కంపెనీలు త్వరలోనే తమ లెక్కల రోజును ఎదుర్కోవలసి రావచ్చు. వందల బిలియన్ డాలర్ల రుణాలను వారు తిరిగి చెల్లించలేకపోవచ్చు. గత మూడేళ్లలో కార్యకలాపాల ద్వారా తమ రుణాలపై వడ్డీని కూడా చెల్లించడానికి తగినంత డబ్బు సంపాదించడంలో విఫలమైన కంపెనీలను సాధారణంగా జాంబీలుగా నిర్వచిస్తారు.కార్నివాల్ క్రూయిజ్ లైన్, జెట్ బ్లూ ఎయిర్ వేస్, వేఫేర్, పెలోటన్, ఇటలీకి చెందిన టెలికాం ఇటాలియా, బ్రిటిష్ సాకర్ దిగ్గజం మాంచెస్టర్ యునైటెడ్ లను నడుపుతున్న కంపెనీలతో సహా ఆస్ట్రేలియా, కెనడా, జపాన్, దక్షిణ కొరియా, యునైటెడ్ కింగ్‌డమ్, యూఎస్‌లలో గత దశాబ్దంలో ఇలాంటి కంపెనీల సంఖ్య 30 శాతం పెరిగిందని అసోసియేటెడ్‌ ప్రెస్‌ విశ్లేషణలో తేలింది.మార్చిలో ఫెడరల్ రిజర్వ్ కోత ప్రారంభిస్తుందనే అంచనాతో రుణదాతలు తమ వాలెట్లను తెరవడంతో ఈ ఏడాది మొదటి కొన్ని నెలల్లో వందలాది జాంబీ కంపెనీలు తమ రుణాలను రీఫైనాన్స్ చేసుకున్నాయి. దీంతో గత ఆరు నెలల్లో 1,000 కి పైగా జాంబీ కంపెనీల స్టాక్స్ 20 శాతానికి పైగా పెరగడానికి సహాయపడింది. కానీ చాలా కంపెనీలు రీఫైనాన్స్ పొందలేకపోయాయి. ఇప్పుడు ఈ సంవత్సరం మొదటి, ఏకైక ఫెడ్ కోతను ఆశిస్తున్న నేపథ్యంలో జాంబీ కంపెనీలు 1.1 ట్రిలియన్ డాలర్ల రుణాలను చెల్లించాల్సి ఉంది.

South Indian Actresses Making Bollywood Debut
బాలీవుడ్‌ కాలింగ్‌

ప్రతి ఏడాది బాలీవుడ్‌ తారలు కొంతమంది టాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తుంటారు. అలాగే దక్షిణాది హీరోయిన్లు కూడా బాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తుంటారు. ఈ ఏడాది కొందరు సౌత్‌ హీరోయిన్లను బాలీవుడ్‌ పిలిచింది. బాలీవుడ్‌ నుంచి కాల్‌ అందుకుని, ప్రస్తుతం అక్కడ సినిమాలు చేస్తున్న దక్షిణాది కథానాయికల గురించి తెలుసుకుందాం. కెరీర్‌లో యాభైకి పైగా సినిమాల్లో నటించి, దక్షిణాదిన స్టార్‌ హీరోయిన్‌ జాబితాలో చేరిపోయారు సమంత. హిందీలో ‘ఫ్యామిలీ మేన్‌’ సీజన్‌ 2 వెబ్‌ సిరీస్‌లో చేసిన రాజ్యలక్ష్మి పాత్రతో ఉత్తరాదిన కూడా పాపులారిటీ సంపాదించుకున్నారు. ఇదే జోష్‌లో ఇండియన్‌ వెర్షన్‌ ‘సిటాడెల్‌’ వెబ్‌ సిరీస్‌ను కూడా పూర్తి చేశారామె. వరుణ్‌ ధావన్‌ హీరోగా నటించిన ఈ హిందీ సిరీస్‌ త్వరలోనే స్ట్రీమింగ్‌కు రెడీ అవుతోంది.ఇలా హిందీలో రెండు వెబ్‌ సిరీస్‌లు చేసిన సమంత ఇంకా అక్కడ ఒక్క సినిమా కూడా చేయలేదు. గతంలో రణ్‌వీర్‌ సింగ్, విక్కీ కౌశల్, రాజ్‌కుమార్‌ రావుల సినిమాల్లో సమంత హీరోయిన్‌గా నటిస్తారనే ప్రచారం సాగింది. కానీ అప్పట్లో ఆమె అనారోగ్య పరిస్థితుల కారణంగా కుదర్లేదట. ఇప్పుడు ఆ సమయం వచ్చిందట. ఓ హిందీ చిత్రం కోసం సమంత ఇటీవల కథ విన్నారని బాలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి. సో... హిందీలో సమంత నటించే తొలి చిత్రంపై స్పష్టత రావడానికి కొన్ని రోజులు ఎదురుచూడక తప్పదు.కాస్త ఆలస్యంగా... దక్షిణాదిలో అగ్ర కథానాయికల్లో కీర్తీ సురేష్‌ ఒకరు. నటిగా సౌత్‌లో తన సత్తా ఏంటో సిల్వర్‌ స్క్రీన్‌పై చూపించిన కీర్తీ సురేష్‌ బాలీవుడ్‌లోనూ టాప్‌ హీరోయిన్ల జాబితాలో చోటు సంపాదించుకోవాలని నిర్ణయించుకున్నట్లున్నారు. ఈ క్రమంలోనే హిందీ చిత్రం ‘బేబీ జాన్‌’కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. వరుణ్‌ ధావన్‌ హీరోగా నటించిన ఈ సినిమాలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటించారు. హిందీలో కీర్తీకి ఇది తొలి చిత్రం కాగా ఈ చిత్రదర్శకుడు కాలీస్‌ (తమిళ డైరెక్టర్‌)కు కూడా హిందీలో ఇదే తొలి చిత్రం. తమిళంలో అట్లీ దర్శకత్వం వహించిన ‘తేరీ’ సినిమాకు హిందీ రీమేక్‌గా ‘బేబీ జాన్‌’ తెరకెక్కింది.జ్యోతిదేశ్‌ పాండే, మురాద్‌ ఖేతనీ, అట్లీ, ప్రియా అట్లీ ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాను మే 31న రిలీజ్‌ చేయాలనుకున్నారు. కానీ వాయిదా పడింది. కొత్త తేదీ పై స్పష్టత రావాల్సి ఉంది. అలాగే కీర్తీ సురేష్, రాధికా ఆప్టే లీడ్‌ రోల్స్‌లో హిందీలో ఓ యాక్షన్‌ వెబ్‌ సిరీస్‌ కూడా రూపొందుతోంది. ఇదిలా ఉంటే... ‘బేబీ జాన్‌’ చిత్రానికన్నా ముందే కీర్తీకి బాలీవుడ్‌ ఆఫర్‌ వచ్చింది. అజయ్‌ దేవగన్‌ హీరోగా నటించిన హిందీ చిత్రం ‘మైదాన్‌’లో ముందు హీరో యిన్‌గా కీర్తీ సురేష్‌ను తీసుకున్నారు ఈ చిత్రదర్శకుడు అమిత్‌ శర్మ. కానీ ఆ తర్వాత కీర్తీ సురేష్‌ ఈ ్రపాజెక్ట్‌ నుంచి తప్పుకోగా, ప్రియమణి నటించారు. ‘మైదాన్‌’ ఈ ఏడాది ఏప్రిల్‌ 10న రిలీజైంది. ఇలా కీర్తీ సురేష్‌ బాలీవుడ్‌ ఎంట్రీ కాస్త ఆలస్యమైంది. ఏక్‌ దిన్‌ హీరోయిన్‌ సాయి పల్లవికి సౌత్‌లో మంచి క్రేజ్‌ ఉంది. ఈ క్రేజ్‌ను బాలీవుడ్‌లోనూ రిపీట్‌ చేయాలనుకుంటున్నారీ బ్యూటీ. బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ ఆమిర్‌ ఖాన్‌ తనయుడు జునైద్‌ ఖాన్‌ నటించిన చిత్రం ‘ఏక్‌ దిన్‌’ (ప్రచారంలో ఉన్న టైటిల్‌)లో నటించారు సాయి పల్లవి. హిందీలో సాయి పల్లవి నటించిన తొలి చిత్రం ఇదే. ఈ సినిమా మేజర్‌ షూటింగ్‌ జపాన్‌లో జరిగింది. ఆమిర్‌ ఖాన్‌ ఓ నిర్మాతగా ఉన్న ఈ ‘ఏక్‌ దిన్‌’ సినిమా చిత్రీకరణ పూర్తయింది.ఈ ఏడాదే విడుదల చేయాలనుకుంటున్నారు. దక్షిణాది భాషల్లో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట ఆమిర్‌ ఖాన్‌. మరోవైపు మరో హిందీ చిత్రం ‘రామాయణ్‌’లో సాయి పల్లవి నటిస్తున్నారు. రణ్‌బీర్‌ కపూర్‌ హీరోగా నటిస్తున్నారు. సీతారాములుగా సాయి పల్లవి, రణ్‌బీర్‌ నటిస్తున్న ఈ భారీ చిత్రానికి నితీష్‌ తివారి దర్శకత్వం వహిస్తున్నారు. యశ్, నమిత్‌ మల్హోత్రా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 2025 చివర్లో ఈ సినిమా తొలి భాగాన్ని విడుదల చేయాలని మేకర్స్‌ భావిస్తున్నారని బాలీవుడ్‌ టాక్‌. కబురొచ్చింది ప్రస్తుతం తెలుగులో ట్రెండింగ్‌ హీరోయిన్లలో శ్రీలీల ఒకరు. నటన పరంగా ఈ బ్యూటీకి ప్రేక్షకులు మంచి మార్కులే వేశారు. అందువల్లే రవితేజ ‘ధమాకా’, మహేశ్‌బాబు ‘గుంటూరు కారం’ వంటి సినిమాల్లో హీరోయిన్‌గా నటించగలిగారు. తాజాగా శ్రీలీలకు బాలీవుడ్‌ నుంచి కబురొచ్చిందని టాక్‌. బాలీవుడ్‌ స్టార్‌ హీరో సైఫ్‌ అలీఖాన్‌ తనయుడు ఇబ్రహీం ఆలీఖాన్‌ హీరోగా ‘దిలేర్‌’ అనే సినిమా రూపొందుతోంది. కృణాల్‌ దేశ్‌ముఖ్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌ ఫిల్మ్‌లో ఇద్దరు హీరోయిన్లకు చోటు ఉందట. ఓ హీరోయిన్‌ పాత్ర కోసం మేకర్స్‌ శ్రీలీలను సంప్రదించారని సమాచారం. కథ నచ్చడంతో శ్రీలీల కూడా ఓకే చెప్పారని వినికిడి. అదే నిజమైతే శ్రీలీలకు ఇదే తొలి హిందీ చిత్రం అవుతుంది. కేరాఫ్‌ మహారాజ్ఞి ‘బింబిసార, సార్, విరూపాక్ష, డెవిల్‌’ వంటి తెలుగు సినిమాల్లో హీరోయిన్‌గా నటించారు సంయుక్తా మీనన్‌. అలాగే మలయాళ, తమిళ, కన్నడ చిత్రాల్లోనూ హీరోయిన్‌గా నటించి పాపులర్‌ అయ్యారామె. ఇప్పుడు బాలీవుడ్‌ ఎంట్రీకీ రెడీ అయ్యారు. కానీ హీరోయిన్‌గా కాదు... ఓ లీడ్‌ రోల్‌లో... కాజోల్, ప్రభుదేవా లీడ్‌ రోల్స్‌లో ‘మహారాజ్ఞి: క్వీన్‌ ఆఫ్‌ క్వీన్స్‌’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. చరణ్‌తేజ్‌ ఉప్పలపాటి ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీకి దర్శకుడు.ఈ సినిమాలో సంయుక్తా మీనన్‌ ఓ లీడ్‌ రోల్‌లో నటిస్తున్నారు. ఈ సినిమాలో కాజోల్‌కు చెల్లి పాత్రలో కనిపిస్తారట సంయుక్త. నసీరుద్దీన్‌ షా, ఆదిత్య సీల్, చాయా కదమ్‌ వంటివారు ఈ సినిమాలోని ఇతర లీడ్‌ రోల్స్‌లో నటిస్తున్నారు. వెంకట అనీష్, హర్మాన్‌ బవేజా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇలా బాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తున్న దక్షిణాది కథానాయికల జాబితాలో మరికొంతమంది ఉన్నారు.

India and Pakistan match in World Cup today
దాయాది సమరానికి ‘సై’

అక్టోబర్‌ 23, 2022...మెల్‌బోర్న్‌ మైదానంలో భారత్, పాకిస్తాన్‌ మ్యాచ్‌...రవూఫ్‌ బౌలింగ్‌లో కోహ్లి రెండు అద్భుత సిక్సర్లతో టీమిండియాను గెలిపించిన తీరును మన అభిమానులెవరూ మరచిపోలేరు. ‘గ్రేటెస్ట్‌ మూమెంట్‌ ఇన్‌ టి20 వరల్డ్‌ కప్‌ హిస్టరీ’ అంటూ తొలి సిక్స్‌కు కితాబిచ్చింది. ఇప్పుడు మళ్లీ టి20 వరల్డ్‌ కప్‌లో అలాంటి అద్భుత క్షణాల కోసం ఇరు జట్ల మధ్య మరో మ్యాచ్‌కు సమయం ఆసన్నమైంది. నాటి పోరు తర్వాత టి20 ఫార్మాట్‌లో ఇరు జట్లు తలపడనుండటం ఇదే తొలిసారి. న్యూయార్క్‌: టి20 వరల్డ్‌ కప్‌లో మాజీ చాంపియన్లు, దాయాది జట్లు భారత్, పాకిస్తాన్‌ మధ్య పోరుకు రంగం సిద్ధమైంది. గ్రూప్‌ ‘ఎ’లో భాగంగా నాసా కౌంటీ క్రికెట్‌ గ్రౌండ్‌లో జరిగే మ్యాచ్‌లో పాక్‌ను టీమిండియా ఎదుర్కొంటుంది. తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై సునాయాసంగా నెగ్గిన భారత్‌ ఉత్సాహంగా కనిపిస్తుండగా... చిన్న జట్టు అమెరికా చేతిలో ఓడిన పాక్‌పై తీవ్ర ఒత్తిడి ఉంది. అమెరికాలో క్రికెట్‌కు ప్రాచుర్యం కల్పించడంలో భాగంగా ఐసీసీ ఈ మ్యాచ్‌కు భారీ స్థాయిలో ప్రచారం నిర్వహించింది. న్యూయార్క్‌ అభిమానుల కోసం తక్కువ సమయంలో 34 వేల సామర్థ్యం గల స్టేడియాన్ని నిరి్మంచింది. పిచ్‌పై ఇప్పటికే చాలా విమర్శలు వస్తున్నాయి. అక్షర్‌ స్థానంలో కుల్దీప్‌! ఐర్లాండ్‌పై సునాయాసంగా గెలిచిన భారత జట్టులో ఎలాంటి ఆందోళన లేదు. టాపార్డర్‌లో రోహిత్, కోహ్లి, పంత్‌ ఖాయం కాగా...సూర్యకుమార్, దూబే, పాండ్యాలతో బ్యాటింగ్‌ పటిష్టంగా ఉంది. గత మ్యాచ్‌లో విఫలమైనా...అసలు సమయంలో ఎలా చెలరేగాలో కోహ్లికి బాగా తెలుసు. పాండ్యా, జడేజా బ్యాటింగ్‌ అవసరం లేకుండా టీమ్‌ విజయాన్ని పూర్తి చేసుకుంది.టాప్‌–7 వరకు బ్యాటింగ్‌ సామర్థ్యం ఉంది కాబట్టి జట్టు ఒక మార్పు చేయవచ్చు. అక్షర్‌ పటేల్‌ స్థానంలో కుల్దీప్‌ యాదవ్‌ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. గత కొంత కాలంగా కుల్దీప్‌ మంచి ఫామ్‌లో ఉండటంతో పాటు పాక్‌పై మంచి రికార్డు కూడా ఉంది. పిచ్‌ స్పిన్‌కు అనుకూలించే అవకాశం ఉంటే మాత్రం ముగ్గురు పేసర్లు బుమ్రా, సిరాజ్, అర్‌‡్షదీప్‌లలో ఒకరిని తప్పించి కుల్దీప్‌ను ఎంపిక చేస్తారు. గందరగోళంలో... మరో వైపు పాకిస్తాన్‌ పరిస్థితి మాత్రం ఇబ్బందికరంగా ఉంది. యూఎస్‌ చేతిలో అనూహ్యంగా ఓడిపోవడంతో అన్ని వైపులనుంచి విమర్శలు వస్తున్నాయి. ఓటమికంటే ఆ మ్యాచ్‌లో పేలవ ఆటతీరు చూస్తే జట్టులో సమస్య ఏమిటో అర్థమవుతుంది. ఓపెనర్లుగా రిజ్వాన్, బాబర్‌ ఏమాత్రం ప్రభావం చూపలేకపోతున్నారు. అటు కెప్టెన్సీ లో కూడా లోపాలతో బాబర్‌ తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడు. మిడిలార్డర్‌ కూడా బలహీనంగా కనిపిస్తోంది. యూఎస్‌తో కేవలం 159 పరుగులకే పరిమితమైంది. సుదీర్ఘకాలంగా ఈ ఫార్మాట్‌లో ఆడుతున్నా బౌలర్లు షాహిన్‌ అఫ్రిది, రవూఫ్, నసీమ్‌ కనీస స్థాయి ప్రదర్శన ఇవ్వడం లేదు. 2021 వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లో మినహాయిస్తే ప్రతీ సారి భారత్‌ చేతిలో భంగపడిన టీమ్‌ ఈ సారి ఏం చేస్తుందనేది చూడాలి. టి20 ప్రపంచకప్‌లో నేడువెస్టిండీస్‌ X ఉగాండావేదిక: ప్రొవిడెన్స్‌; ఉదయం గం. 6 నుంచిఒమన్‌ X స్కాట్లాండ్‌ వేదిక: నార్త్‌ సౌండ్‌; రాత్రి గం. 10:30 నుంచిస్టార్‌ స్పోర్ట్స్, హాట్‌ స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement