మేడిగడ్డలో మరో గేటు ఎత్తారు | 22 Gates Lifted At Medigadda Barrage | Sakshi
Sakshi News home page

మేడిగడ్డలో మరో గేటు ఎత్తారు

Jun 9 2024 5:51 AM | Updated on Jun 9 2024 5:51 AM

22 Gates Lifted At Medigadda Barrage

కాళేశ్వరం(జయశంకర్‌భూపాలపల్లి): కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ బ్యారేజీలో మరో గేటును ఇంజనీరింగ్‌ అధికారులు శనివారం పైకి ఎత్తారు. గతేడాది అక్టోబర్‌లో మేడిగడ్డ బ్యారేజీలో 7వ బ్లాక్‌లోని 19, 20, 21 పియర్లు, వంతెన కుంగిన విషయం తెలిసిందే. దీనిపై ఎన్‌డీఎస్‌ఏ సూచించిన మేరకు గత నెల 17న 15వ గేటును పైకి ఎత్తినప్పుడు 7వ బ్లాక్‌లో 20వ పియర్‌ ముందు గొయ్యి ఏర్పడి భారీ శబ్దాలు వచ్చాయి.

దీంతో జియోఫిజికల్, జియోటెక్నికల్‌ పరీక్షలు జరిపి బొరియల్లో సిమెంట్, ఇసుకతో గ్రౌటింగ్‌ చేస్తున్నారు. వర్షాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈనెల శుక్రవారం 7వ బ్లాక్‌లోని 16, 17 గేట్లను పైకి ఎత్తారు. శనివారం అదే బ్లాక్‌లోని 22వ గేటును  పైకి ఎత్తినట్లు ఇంజనీరింగ్‌ అధికారులు తెలిపారు.  19, 20, 21 గేట్లను ఎత్తే పరిస్థితి లేకపోవడంతో కట్‌ చేసి తొలగించే పనులు జరుగుతున్నాయి.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement