తుపాకితో ఆడుకుంటూ.. చిన్నారి మృతి | us toddler dies while playing with mother's gun | Sakshi
Sakshi News home page

తుపాకితో ఆడుకుంటూ.. చిన్నారి మృతి

Jun 13 2015 3:11 PM | Updated on Apr 4 2019 5:12 PM

తుపాకితో ఆడుకుంటూ.. చిన్నారి మృతి - Sakshi

తుపాకితో ఆడుకుంటూ.. చిన్నారి మృతి

అమెరికాలో గన్ కల్చర్ పిల్లల ప్రాణాలు తీసేస్తోంది. తాజాగా సిన్సినాటి నగరంలో మూడేళ్ల చిన్నారి తన తల్లి బ్యాగ్లోంచి హ్యాండ్ గన్ తీసి దాంతో ఆడుకుంటుండగా పొరపాటున అది పేలి ప్రాణాలు కోల్పోయాడు.

అమెరికాలో గన్ కల్చర్ పిల్లల ప్రాణాలు తీసేస్తోంది. తాజాగా సిన్సినాటి నగరంలో మూడేళ్ల చిన్నారి తన తల్లి బ్యాగ్లోంచి హ్యాండ్ గన్ తీసి దాంతో ఆడుకుంటుండగా పొరపాటున అది పేలి ప్రాణాలు కోల్పోయాడు. పిల్లాడు సరిగ్గా ఛాతీలోకి కాల్చుకోవడంతో తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయాడు. పిల్లాడి తల్లి ఎలిజబెత్ గ్రీన్ ఈ ఘటనపై  పోలీసులకు ఫిర్యాదు చేసింది.

తన కొడుకు కాల్చేసుకున్నాడని, అతడి నాడి అందడంలేదని ఆమె గగ్గోలు పెడుతున్నట్లు వినిపించింది. దీంతో ఆమెపై కేసు పెట్టాలా లేదా అన్న విషయాన్ని ఇంకా తేల్చలేదు. తుపాకి తనదేనని, దాన్ని తన ఇంట్లో పర్సులో పెట్టుకుంటానని ఆమె తెలిపారు. పిల్లాడి పేరు మార్క్స్ గ్రీన్ అని గుర్తించారు. ప్రతియేటా అమెరికాలో ఇలా ప్రమాదవశాత్తు జరుగుతున్న తుపాకి కాల్పుల్లో సుమారు వంద మంది వరకు మరణిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement