నార్త్‌ను సైతం షేక్‌ చేస్తున్న బన్నీ! | Sarrainodu Hindi version creates record | Sakshi
Sakshi News home page

నార్త్‌ను సైతం షేక్‌ చేస్తున్న బన్నీ!

May 31 2017 12:30 PM | Updated on Sep 5 2017 12:28 PM

నార్త్‌ను సైతం షేక్‌ చేస్తున్న బన్నీ!

నార్త్‌ను సైతం షేక్‌ చేస్తున్న బన్నీ!

స్టైలిష్‌ స్టార్‌ హీరో అల్లు అర్జున్‌కు సౌత్‌లోనే కాదు నార్త్‌లోనూ అభిమానులు ఉన్నారు.

స్టైలిష్‌ స్టార్‌ హీరో అల్లు అర్జున్‌కు సౌత్‌లోనే కాదు నార్త్‌లోనూ అభిమానులు ఉన్నారు. స్ట్రయిట్‌గా తెలుగు సినిమాలే చేస్తున్నప్పటికీ, తన స్టైలిష్‌ లుక్‌తో, డ్యాన్సులతో దేశవ్యాప్తంగా అభిమానులు సంపాదించుకున్నాడు బన్నీ. తాజాగా ఉత్తరాదిలో బన్నీ అభిమానుల బలం పెరుగుతున్నట్టు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే బన్నీ తాజా చిత్రం ’దువ్వాడ జగన్నాథం’ సినిమా హిందీ డబ్బింగ్‌ హక్కులు రికార్డుస్థాయి ధరకు అమ్ముడుపోయాయి. టాలీవుడ్‌ సినిమాల డబ్బింగ్‌కు ఇంత ధర పలుకడం ఎప్పడూ లేదని అంటున్నారు.

ఇక విషయానికొస్తే.. బన్నీ సూపర్‌ హిట్‌ చిత్రం ‘సరైనోడు’  హిందీ డబ్బింగ్‌ వెర్షన్‌ ఉత్తరాదిలో ప్రకంపనలు రేపుతోంది. ఓ పాపులర్‌ వీడియో షేరింగ్‌ షైట్‌లో విడుదల చేసిన ఈ సినిమాకు తక్కువ సమయంలోనే 64లక్షలకుపైగా హిట్స్‌ వచ్చాయి. తాజా జోరు చూస్తుంటే ఉత్తరాదిలో బాగా పాపులర్‌ అయిన సౌతిండియన్‌ స్టార్‌గా బన్నీ నిలిచాడంటే అతిశయోక్తి కాదంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement