లుపిన్కు యూఎస్‌ఎఫ్‌డీఏ క్లియరెన్స్ | Lupin shares rally on USFDA clearance for Goa unit | Sakshi
Sakshi News home page

లుపిన్కు యూఎస్‌ఎఫ్‌డీఏ క్లియరెన్స్

Nov 7 2016 11:12 AM | Updated on Sep 4 2017 7:28 PM

దేశీయ ఫార్మా దిగ్గంజ లుపిన్ లిమిటెడ్ సోమవారం నాటి మార్కెట్లో భారీగా లాభపడుతోంది. గోవా ప్లాంటు తనిఖీల్లో సంస్థకు అమెరికా యూఎస్‌ఎఫ్‌డీఏ నుంచి క్లీన్ చిట్ లభించడంతో మదుపర్లు ఈ కౌంటర్లో కొనుగోళ్లకు దిగారు.

ముంబై:  దేశీయ ఫార్మా దిగ్గంజ లుపిన్ లిమిటెడ్ సోమవారం నాటి మార్కెట్లో భారీగా లాభపడుతోంది.  గోవా ప్లాంటు తనిఖీల్లో సంస్థకు  అమెరికా యూఎస్‌ఎఫ్‌డీఏ నుంచి  క్లీన్ చిట్ లభించడంతో మదుపర్లు ఈ కౌంటర్లో కొనుగోళ్లకు దిగారు. దీంతో ఈ షేరు ఇంట్రాడేలో  రికార్డ్ స్థాయిని నమోదు చేసింది. గతజులై 7 తరువాత భారీగా లాభపడి గరిష్టాన్ని తాకింది. ఈ ఏడాది ఫార్మా కౌంటర్ 6 శాతం బలహీనపడగా   లుపిన్ మాత్రం 23 శాతం ఎగిసింది.  మరోవైపు  ఈఐఆర్ నుంచి తమకు ఆమోదం లభించిందన్న సంస్థ ప్రకనటతో గత శుక్రవారం11 శాతం క్షీణించిన లుపిన్ కు  నేడు సెంటిమెంట్ బలంగా ఉంది.  
ఈ ఏడాది మార్చిలో నిర్వహించిన తనిఖీల్లో గోవా యూనిట్ కు (ఈఐఆర్‌) యూఎస్‌ఎఫ్‌డీఏ  క్లియరెన్స్ ‌ ల భించడంతో  కౌంటర్‌కు భారీ డిమాండ్‌ పుట్టింది.  ప్రస్తుతం 8 శాతానికిపైగా లాభాలతో మార్కెట్లో టాప్ విన్నర్ గా  ట్రేడవుతోంది.
కాగా లుపిన్‌..  గుండెజబ్బులు, డయాబెటిస్‌, ఆస్త్మా వంటి పలువ్యాధుల చికిత్సలో జనరిక్‌ ఫార్ములేషన్లు, బయోటెక్నాలజీ ఔషధాలను తయారీలో పేరుగడించిన సంగతి తెలిసిందే.
 

Advertisement
 
Advertisement
Advertisement