ఐఎస్ స్థావరాలపై ఫ్రాన్స్ వైమానిక దాడి | France launches Syria anti-IS strikes | Sakshi
Sakshi News home page

ఐఎస్ స్థావరాలపై ఫ్రాన్స్ వైమానిక దాడి

Sep 27 2015 1:56 PM | Updated on Sep 3 2017 10:05 AM

ఐఎస్ స్థావరాలపై ఫ్రాన్స్ వైమానిక దాడి

ఐఎస్ స్థావరాలపై ఫ్రాన్స్ వైమానిక దాడి

ఐఎస్ఎస్ ఉగ్రవాదులను తుదముట్టించేందుకు ఫ్రాన్స్ సమరం మొదలు పెట్టింది.

పారిస్: ఐఎస్ఎస్ ఉగ్రవాదులను తుదముట్టించేందుకు ఫ్రాన్స్ సమరం మొదలు పెట్టింది. సిరియాలోని ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని తొలిసారిగా వైమానిక దాడులు ప్రారంభించింది. గత 15 రోజులుగా ఐఎస్ఎస్ ఉగ్రవాదుల స్థావరాలను గుర్తించిన ఫ్రాన్స్ దళాలు వైమానిక దాడులకు దిగాయి. ఈ విషయాన్ని ఫ్రాన్స్ ప్రధానమంత్రి కార్యాలయం ధ్రువీకరించింది. స్థానిక భాగస్వాములతో కలిసి ఫ్రాన్స్ ఈ ఆపరేషన్ కొనసాగిస్తోంది.

అంతకుముందు ఫ్రాన్స్ బలగాలు ఇరాక్ లోని ఐఎస్ఎస్ ఉగ్రవాద తండాలపై దాడులు జరిపాయి. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తమ పోరాటం కొనసాగుతుందని ఫ్రాన్స్ అధ్యక్ష కార్యాలయం ప్రకటించింది. తమ దేశభద్రతకు ముప్పు వాటిల్లిన ప్రతిసారి దాడులు దిగుతున్నామని తెలిపింది.

Advertisement
 
Advertisement
Advertisement