బుజ్జి రాకుమారుడిపై విమర్శలు! | British Council worker criticised Prince George | Sakshi
Sakshi News home page

బుజ్జి రాకుమారుడిపై విమర్శలు!

Jul 26 2016 2:32 PM | Updated on Jul 26 2018 5:23 PM

బుజ్జి రాకుమారుడిపై విమర్శలు! - Sakshi

బుజ్జి రాకుమారుడిపై విమర్శలు!

బ్రిటన్ రాజవంశానికి చెందిన బుజ్జీరాకుమారుడు జార్జ్‌పై ఫేస్‌బుక్‌లో బ్రిటిష్‌ కౌన్సిల్‌ సీనియర్‌ ఉద్యోగిని చేసిన విమర్శలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.

బ్రిటన్ రాజవంశానికి చెందిన బుజ్జి రాకుమారుడు జార్జ్‌పై ఫేస్‌బుక్‌లో బ్రిటిష్‌ కౌన్సిల్‌ సీనియర్‌ ఉద్యోగిని చేసిన విమర్శలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. రాజవంశానికి చెందినవాడు కావడంతో ఏ కాయకష్టం చేయకుండా ప్రజలసొమ్ముపై ఆధారపడి ప్రిన్స్‌ జార్జ్‌ బతుకుతున్నాడని బ్రిటిష్‌ కౌన్సిల్‌ గ్లోబల్ చారిటీ హెడ్‌ ఏంజెలా గిబన్స్‌ తన ఫేస్‌బుక్‌ పేజీలో పేర్కొన్నారు. ఆ చిన్నారి గురించి కొన్ని అనుచితమైన దూషణలు చేశారు. జార్జ్‌లో ఇప్పటికే తాను రాజవంశానికి చెందిన సంపన్నుడినన్న గర్వం కనిపిస్తున్నదని, అదే మూడేళ్ల సిరియా శరణార్ధి పిల్లాడు జార్జ్‌లా గర్వంగా ఎదగగలడా అని ఆమె ప్రశ్నించారు.

అయితే, ఈ వ్యాఖ్యలతో తమకు ఎలాంటి సంబంధం లేదని బ్రిటిష్‌ కౌన్సిల్‌ స్పష్టం చేసింది. తమ ఉద్యోగి తన వ్యక్తిగత ఫేస్‌బుక్‌ అకౌంట్‌లో చేసిన ఈ వ్యాఖ్యలపై విచారణ జరుపుతామని తెలిపింది. బ్రిటిష్‌ కౌన్సిల్‌ దాదాపు వందదేశాల్లో ఇంగ్లిష్‌ భాష కోర్సులను అందజేస్తున్నది.

Advertisement
 
Advertisement
Advertisement