బీజేపీ అలా... మోడీ ఇలా..! | BJP for small states, Modi's comment was in context of Maharashtra | Sakshi
Sakshi News home page

బీజేపీ అలా... మోడీ ఇలా..!

Oct 8 2014 11:50 AM | Updated on Mar 29 2019 9:24 PM

బీజేపీ అలా... మోడీ ఇలా..! - Sakshi

బీజేపీ అలా... మోడీ ఇలా..!

చిన్న రాష్ట్రాల విషయంలో బీజేపీ విధానానికి భిన్నంగా వెళుతున్నారు ప్రధాని నరేంద్ర మోడీ.

న్యూఢిల్లీ: చిన్న రాష్ట్రాల విషయంలో బీజేపీ విధానానికి భిన్నంగా వెళుతున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. తాను ప్రధానిగా ఉండగా మహారాష్ట్రను విడదీయడం జరగదని మోడీ చేసిన వ్యాఖ్యలు కమలనాథుల్లో కలవరం రేపాయి. చిన్న రాష్టాలకు అనుకూలమన్న బీజేపీ విధానానికి వ్యతిరేకంగా మోడీ వ్యాఖ్యలు చేయడంతో ఆ పార్టీ ఇరుకున పడింది.

అయితే చిన్నరాష్ట్రాలే త్వరగా అభివృద్ధి సాధిస్తాయన్న తమ వైఖరిలో ఎటువంటి మార్పు లేదని బీజేపీ అంటోంది. మోడీ వ్యాఖ్యలు మహారాష్ట్రకు మాత్రమే పరిమితమంటూ వివరణయిచ్చింది. మహారాష్టను విభజించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోదంటూ శివసేన ఆరోపించిన నేపథ్యంలో మోడీ ఈ వ్యాఖ్యలు చేశారని తెలిపింది. ఆంధ్రప్రదేశ్ విభజనకు బీజేపీ మద్దతు ఇచ్చిన విషయం ఇక్కడ ప్రస్తావనార్హం.

Advertisement
 
Advertisement
Advertisement