ఇండియన్ ఎయిర్ఫోర్స్కు సెల్యూట్ | 84th anniversary wishes to Indian Air Force | Sakshi
Sakshi News home page

ఇండియన్ ఎయిర్ఫోర్స్కు సెల్యూట్

Oct 8 2016 9:48 AM | Updated on Sep 4 2017 4:40 PM

ఇండియన్ ఎయిర్ఫోర్స్కు సెల్యూట్

ఇండియన్ ఎయిర్ఫోర్స్కు సెల్యూట్

84వ వసంతాల్లోకి అడుగుపెట్టిన భారత వైమానిక దళానికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

న్యూఢిల్లీ :  84వ వసంతాల్లోకి అడుగుపెట్టిన భారత వైమానిక దళానికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. భారత వైమానిక దళం(ఐఏఎఫ్) భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనేందుకు మరింత శక్తివంతంగా రూపుదిద్దుకోనుందని, ఆధునికతను అందిపుచ్చుకోనుందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తెలిపారు. ఐఏఎఫ్ శక్తి సామర్థ్యాలపై దేశం గర్విస్తుందని, గడిచిన ఎనిమిది దశాబ్దాల్లో వారు అందించిన సేవలు మరువలేవని 84వ వార్షికోత్సవం సందర్భంగా ప్రణబ్ కొనియాడారు. భారత వైమానిక దళానికి, వారి కుటుంబాలకు శుభాకాంక్షలు తెలిపారు.
 
వైమానికదళ యోధులకు, వారి కుటుంబాలకు ఎయిర్ఫోర్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నట్టు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. మీ ధైర్య సాహసాలు భారత్కు గర్వించదగ్గవని పేర్కొన్నారు. భారత భద్రతను పెంచడంలో ఎయిర్ఫోర్స్ కీలక పాత్ర పోషిస్తున్నట్టు రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ తెలిపారు. వైమానిక దళ సభ్యులకు, వారి కుటుంబాలకు ఎయిర్ఫోర్స్ డే సందర్భంగా సెల్యూట్ చేస్తున్నట్టు చెప్పారు. 
 
మరోవైపు ఘజియాబాద్లోని హిండన్ బేస్లో వైమానిక దళ వేడుకలు అంబురాన్నంటాయి. ఈ వేడుకల్లో వైమానిక దళ చీఫ్ అరుఫ్ రహా పాల్గొన్నారు. భారత తేజాస్ బృంద వైమానిక విన్యాసాలు అదరగొట్టాయి. శాంతి భద్రతల పరిరక్షణలో కీలక పాత్ర వహించే ర్యాపిడి యాక్షన్ ఫోర్స్(ఆర్ఏఎఫ్) కవాతులు ప్రదర్శన కూడా ఆకట్టుకుంది.  వైమానిక దళ సిబ్బందిని వాయు సేన మెడల్స్, శౌర్య వాయు సేన మెడల్స్, విశిష్ట సేవ మెడల్స్తో అరుఫ్ రహా సత్కరించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement