తాగి డ్రైవింగ్ చేస్తూ.. 6 సార్లు పట్టుబడ్డాడు | 6 times arrested by drunk and drive case | Sakshi
Sakshi News home page

తాగి డ్రైవింగ్ చేస్తూ.. 6 సార్లు పట్టుబడ్డాడు

Aug 20 2015 10:08 PM | Updated on May 25 2018 2:06 PM

మద్యం సేవించి బైక్ నడుపుతూ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో ఆరుసార్లు పట్టుబడిన సైదాబాద్ ప్రాంతానికి చెందిన ప్రైవేటు ఉద్యోగి బలరామ్‌రాజు (42)కు 3నెలల జైలు శిక్షతో పాటు రూ.2వేల జరిమానాను...

కాచిగూడ: మద్యం సేవించి బైక్ నడుపుతూ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో ఆరుసార్లు పట్టుబడిన సైదాబాద్ ప్రాంతానికి చెందిన ప్రైవేటు ఉద్యోగి బలరామ్‌రాజు (42)కు 3నెలల జైలు శిక్షతో పాటు రూ.2వేల జరిమానాను కోర్టు విధించిందని కాచిగూడ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ పిజి రెడ్డి తెలిపారు. 2012నుంచి ఇప్పటి వరకు మీర్‌చౌక్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, సుల్తాన్‌బజార్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, బహదూర్‌పుర ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, మలక్‌పేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, అబిడ్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డారని తెలిపారు.

ఇప్పటికే రెండు సార్లు జైలు శిక్ష అనుభవించిన బాలరామ్ రాజు మూడు సార్లు జరిమాన కూడా కట్టారని తెలిపారు. ఇన్నిసార్లు జరిమానాలు, జైలు కెళ్లివచ్చినా అతనిలో ఏమాత్రం మార్పు రాలేదని తెలిపారు. ఇలాంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ పీజీ రెడ్డి తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement