ఫిలిప్పీన్స్లో హయాన్ తుఫాన్: 10 వేల మంది మృతి | 10,000 feared dead in Philippines by typhoon 'Haiyan' | Sakshi
Sakshi News home page

ఫిలిప్పీన్స్లో హయాన్ తుఫాన్: 10 వేల మంది మృతి

Nov 10 2013 11:00 AM | Updated on Sep 2 2017 12:30 AM

ఫిలిప్పీన్స్లో హయాన్ తుఫాన్: 10 వేల మంది మృతి

ఫిలిప్పీన్స్లో హయాన్ తుఫాన్: 10 వేల మంది మృతి

హయాన్ తుఫాన్ తాకిడితో ఫిలిప్పీన్స్ అతలాకుతలమైంది. ఆ తుఫాన్ వల్ల దాదాపు 10 వేల మందికిపైగా మరణించారని ఉన్నతాధికారులు అంచనావేస్తున్నారని స్థానిక మీడియా ఆదివారం వెల్లడించింది.

హయాన్ తుఫాన్ తాకిడితో ఫిలిప్పీన్స్ అతలాకుతలమైంది. ఆ తుపాన్ వల్ల దాదాపు 10 వేల మందికిపైగా మరణించారని ఉన్నతాధికారులు అంచనావేస్తున్నారని స్థానిక మీడియా ఆదివారం వెల్లడించింది.  'హయాన్' వల్ల లెటి ప్రావెన్స్ మృతుల దిబ్బగా మారిందని పేర్కొంది. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని ఫిలిప్పీన్స్ ప్రభుత్వ విభాగాలతోపాటు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థలు అభిప్రాయపడ్డాయి.

 

ఆ తుపాన్ సృష్టించిన బీభత్సంతో టాక్లొబన్ నగరం మొత్తం అంధకారం అలుముకుందని పేర్కొంది. అయితే స్థానికంగా సహాయక చర్యలు చేపట్టేందుకు పోలీసుల బృందాలను తరలించినట్లు అధికారులు పేర్కొన్నారని తెలిపింది. హయాన్ వల్ల ఏర్పడిన పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు వెల్లడించింది.



అయితే తుఫాన్ వల్ల నిరాశ్రయులైన వారిని రక్షించేందుకు సహాయక చర్యలు యుద్ద ప్రాతిపదిక చేపట్టాలని ఆ దేశాధ్యక్షుడు అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే. హయాన్ తుఫాన్ కారణంగా వీచిన బలమైన గాలుల వల్ల భారీగా కొండ చరియలు విరుచుకుపడ్డాయి. భారీ వృక్షాలు కూడా నెలమట్టంమైనాయి.

 

దాంతో రవాణ వ్యవస్థతోపాటు విద్యుత్ వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నమైందని అధికారులు వెల్లడించారు. దాదాపు 8 లక్షల మందిని బలవంతంగా సురక్షిత ప్రాంతాలకు తరలించించినట్లు జాతీయ విపత్తు నిర్వహణ సంస్త వెల్లడించింది. నాలుగు మిలియన్ల మంది హయాన్ తుఫాన్ వల్ల నిరాశ్రయులైయ్యారని వివరించారు. హయాన్ తుఫాన్ వల్ల 1200 మంది మరణించారని రెడ్ క్రాస్ సంస్థ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement